పేజీలు

13.3.23

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

 
 యెషయా 60:1-6, ఎఫెసీ 3:2-3,5-6, మత్తయి 2:1-12                                                                                                 క్రీస్తు నాధుని యందు ప్రియమైన సహోదరి సహోదారులారా, హెరోదు రాజు  యూదయా ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37 వ సంవత్సరం నుండి  4 వ సంవత్సరం వరకు పాలించాడు. యేసు ప్రభువు  5 లేక 6 వ సంవత్సరం  క్రీస్తు పూర్వం జన్మించాడు. మీకా గ్రంధం 5:1-3 ప్రకారం బెత్లేహేము రక్షకుని యొక్క  జన్మ స్థలం. మరియు అది దావీదు  రాజు యొక్క జన్మ స్థలం కూడా. ఈ ముగ్గురు రాజులు హేరేడేటాస్ ప్రకారం మెదియన్ తెగకు  చెందినవారు. మెదియా అనేది  పర్షియా రాజ్యంలో ఒక భాగం వారు. వారు పర్షియన్ల పాలను దించి వారు పరిపాలనను చేయాలనుకున్నారు. కానీ అది సాద్యం కాలేదు. కనుక వీరు పరిపాలన వ్యవహారాలను వదలివేసి  ఆధికార వ్యామోహం వదలి యాజకులుగా స్థిరపడ్డారు. పర్షియా దేశంలో వీరిని జ్ఞానులుగా  మరియు పవిత్రులుగా చూసేవారు. వీరు ప్రవచనాలు చెప్పడంలో , వైద్య శాస్త్రంలో  మరియు అంతరిక్ష శాస్త్రాలలో ప్రసిద్దులు. అంతరిక్షం లో జరిగే మార్పులను బట్టి వీరు ఏమి జరుగుతున్నదో చెప్పేవారు. వీరు యూద ప్రజలు కాదు. వీరు కూడా అన్య ప్రజలే కానీ పరిస్థితులను అవగాహన చేసుకోగలిగిన వారు. మంచి చెడులు తెలిసినవారు. 

ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే ఎందుకు అంటే ఆది కాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులు, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవుని అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు మరియు ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. 

ఈ ముగ్గురు రాజులు ఒక నక్షత్రం చూసి వారు ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారు, అని తెలుసుకున్నారు. వారు నిజానికి ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. వారి అన్ని ఆశలకు సమాధానం ఈ నక్షత్రం తెలియచేస్తుంది అని నమ్మారు, లేకపోతే   వారు అంత దూరం వచ్చే వారు కాదు.  వీరు జ్ఞానులు , గొప్పవారు వీరు తెలివిగలవారు. ఏమి చూసారు వారు అక్కడ? కేవలం చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను, మరి ఎందుకు వారు ఆయనను ఆరాధించారు.  అక్కడ వారు దేవుని మహిమను చూసారు , వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ వారు ఎదో చూస్తున్నారు , వారు ఆ చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉన్నారు.  దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

అందుకే మనము ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఆయనను వారికి తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. నీవు ఆయన చేసిన పనులు గురించి వినివున్నావు కనుక ఆయనను తెలుసుకొని ఆయనను వారు ఆరాధించినటులా నీవు కూడా ఆరాధించాలి. 

ఈ జ్ఞానులు ఏమి అర్పిస్తున్నారు  యేసు ప్రభువుకి ఆయనను ఆరాధించిన తరువాత అని మనము చూసినప్పుడు మనము ఇక్కడ చూసేది బంగారం వారు అర్పిస్తున్నారు. ఎందుకు బంగారం అంటే బంగారాన్ని రాజులకు అర్పిస్తూ ఉంటారు, అంటే వారు  ఆయనను రాజుగా వారి అధిపతిగా అంగీకరిస్తున్నారు. పరిమళ ద్రవ్యాలను ఇస్తున్నారు. అవి ఆయన శ్రమలు మరియు మరణాన్ని గుర్తు చేస్తున్నాయి.  ఆయన ఏ విధంగా ప్రజలను రక్షించబోతున్నారు అని తెలియ చేస్తున్నాయి. తరువాత వారు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. ఇది దేవుని ఆరాధనకు  అర్పించేది ఎందుకంటే ఆయన తమ యాజకునిగా, దేవునిగా వారు  గుర్తించారు. వారు కూడా యాజకులుగా స్థిరపడినవారే అయినా కానీ నిత్య యాజకునిగా ఆయనను వారు గుర్తిస్తున్నారు. 

ప్రియా సహోదరులారా మనము ఇక్కడ రాజులను చూస్తున్నాం వీరు యేసు ప్రభువుని తెలుసుకొని రాజుగా , యాజకునిగా మరి ముఖ్యముగా దేవునిగా తెలుసుకుంటున్నారు. అయన దగ్గరకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక్కడ హేరోదు రాజు ఉన్నాడు ఆయన యూదుల రాజు పుట్టాడు మేము ఆయన్ను చూడటానికి వచ్చాము అని చెప్పగానే ఆయన ఆందోళన చెందుతున్నాడు. యేసు ప్రభువును తన ఆధికారముకి అడ్డంగా ఉంటాడు అని ఆయనను చంపాలని అనుకుంటున్నాడు. అనేక మంది చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. హేరోదు రాజు  యూదయ పెద్దలను అందరిని పిలుస్తున్నాడు ఎక్కడ యేసు ప్రభువు పుట్టాడో తెలుసు కోవడానికి వారికి ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు వారి శాస్త్రాల ప్రకారం కానీ వారు ఎవరు  ఆయన్ను తెలుసుకొని ఆరాధించాలి అని అనుకోలేదు. కానీ ఈ అన్యులే ఈ ముగ్గురు జ్ఞానులే ఆయన్ను తెలుసుకొని ఆరాధిస్తున్నారు మనము వీరిని ఆదర్శముగా తీసుకోవాలి, ఆ విధంగా జీవించాలి. 

 Rev. Fr . Amruth 


పాస్క కాలపు నాలుగవ ఆదివారం (మంచి కాపరి)

 

పాస్క కాలపు నాలుగవ ఆదివారం (మంచి కాపరి)

  యోహను 10:1-10 

సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగ , దోపిడికాడునై  ఉన్నాడు. ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. కావలి వాడు వానికి తలుపు తీయును: గొర్రెలు వాని స్వరమును  గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, బయటకు తొలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటిని బయటకు తొలుకొని వచ్చిన పిదప, వాడు వానికి ముందుగ నడచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక, అవి  వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు. కనుక, అవి వాని  వెంట వెళ్ళక  దూరముగ పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కాని, ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేక పోయిరి. అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను: "గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నాకు ముందుగ వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి ఆలకింపలేదు. నేనే  ద్వారమును! ఎవడేని నా ద్వార ప్రవేశించిన యెడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగ వాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవము నిచ్చుటకు, దానిని సమృద్దిగ ఇచ్చుటకు వచ్చి యున్నాను. 

యోహను  9 వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక గ్రుడ్డి వానిని యేసు ప్రభువు స్వస్థత పరుస్తున్నాడు. కొంత మంది ఇంకా ఆయనను సాతానుచే ఈ అధ్భుతాలు చేస్తున్నాడు అని అంటున్నారు, పరిసయ్యులు ఆయన మీద కోపంగా ఉన్నారు. పదవ అధ్యాయంలో యేసు ప్రభువు యూద నాయకులను దొంగలు దోపిడి వారు అని అన్నారు. 9 వ అధ్యాయం లో  యేసు ప్రభువు నేనే లోకానికి వెలుగు అని చెబుతున్నారు. మరల ఒక గ్రుడ్డి వానికి చూపును ఇవ్వడం ద్వారా ఆయన ఈ లోకానికి వెలుగు అని చాటుతున్నారు. ఈ రెండు ఆధ్యాయాలలో యేసు ప్రభువు లోకానికి వెలుగు అవ్వడం ద్వార ఆయన చెంత ఉంటే మనకు ఏమి జరుగుతూంది అని తెలుస్తుంది. వెలుగు లోనే మనకు అంతయు స్పష్టముగా కనపడుతుంది. ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. మనం నడిచే మార్గంలో ఉన్న అన్నీ మనం చూసి అటువంటి అపాయంకు గురికాకుండా వుంటాము అని ఈనాటి సువిశేషం తెలియ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగైన ప్రభువే మనకు కాపరి అని 10 వ అధ్యాయం తెలియచేస్తుంది. 

 10 వ అధ్యాయంలో కాపరి గురించి వింటున్నాం.  ఇక్కడ నేను మంచి కాపరి అని చెపుతున్నారు. దీని ద్వారా మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. ఆయన వెలుగు నుండి మనం మన మార్గాన్ని చూడ గలిగి, ఆయన కాపుదలలో, గ్రుడ్డి వాని వలె తప్పి పోకుండా , సురక్షితమైన మార్గంలో, పచ్చికలలో ఉంటాము అని తెలియజేస్తున్నారు. 

 ప్రియ మిత్రులారా గ్రుడ్డి వానిని సరిగా చూడకుండా పరిసయ్యులు అతన్ని బయట పడవేశారు. నిజానికి పరిసయ్యులు అతనిని కాపరి వలె ఆయన బాగోగులు చూడాలి. కానీ వారు అదేమీ పట్టించుకోవడం లేదు.  యోహను 9:34. కానీ యేసు ప్రభువు మంచి కాపరి వలె ఆయనకు చూపును ఇస్తున్నాడు. ఇక్కడ మనం యేసు ప్రభువు మరియు పరిసయ్యులు మధ్య వ్యత్యాసం చూడవచ్చు. 

యేసు ప్రభువు ఒక మంచి కాపరి వలె అతని బాధను చూసి , తనకు అవసరాన్ని తీరుస్తున్నారు, కానీ పరిసయ్యులు కాపరులం, లేక మత పెద్దలం అని చెప్పుకుంటున్నారు కానీ తన కష్టాన్ని తీర్చడానికి ఏమి చేయడం లేదు. పరిసయ్యులు మంచి కాపరులు కాదు అని తెలుస్తుంది. పేరు చెప్పుకోవడానికి మాత్రమే వారు ఉన్నారు. 

ఆ గ్రుడ్డి వాడు యేసు ప్రభువుని మాటలు వింటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల మాటలు కాదు ఎందుకంటే ఆ గ్రుడ్డి వానికి యేసు ప్రభువు మాత్రమే చూపును ఇవ్వగలడు అని తెలుసు.  పరిసయ్యులు ఆ స్వస్థత పొందిన వ్యక్తిని  అక్కడ నుండి బయటకు పంపుతున్నారు. ఆ వ్యక్తి  యేసు ప్రభువు వద్ద ఉన్నాడు. ఆయనను ఎవరు ఏమి చేయలేరు. పరిసయ్యుల ఒత్తిడి పని చేయలేదు. ఆయన వారి మాట వినలేదు. కానీ యేసు ప్రభువు మాట వింటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అని యేసు ప్రభువు చెబుతున్నాడు. 

ఇక్కడ గొర్రెలు అంటే కేవలం మాట వినేవి  లేక విశ్వాసించేవి అనేవి మాత్రమే కాదు. ఆయనకు చెందిన వారము. ఆయనకు చెందిన వారము, ఆయనను అనుభవించిన వారము కనుక ఆయన గురించి తెలిసిన వారము కనుక ఆయనను విశ్వసిస్తున్నాం.  కానీ కొంత మంది ఆయనను  విశ్వసించుట లేదు. అందుకే యేసు ప్రభువు అంటున్నారు , మీరు నా మందలోని వారు కారు కాబట్టి మీరు నమ్మరు అని అంటున్నారు. 

మనం ఎలాగ ఆయనకు చెందిన వారము అవుతాము అంటే  ఆయన మాట వినుట ద్వారా మరియు ఆయనను అనుసరించుట ద్వారా. అంటే నీవు ఆయన మాట వింటే , ఆయనను అనుసరిస్తే, నీవు ఆయనకు చెందిన వాడివి.   యోహను 8:47. లో యేసు ప్రభువు "దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించినవారు కారు. కనుక , మీరు వాటిని ఆలకింపరు" అని పరిసయ్యులతో అంటున్నారు.  నీవు వినుటలేదు అంటే ఆయనకు చెందిన వారు కాదు అని అర్ధం. 

ఆయన స్వరమును ఆలకించు వారికి ఆయన ఏమి ఇస్తాడు? 

నేను వారికి నిత్య జీవము ప్రసాదింతును  , ఎవరు వానిని నాశనం చేయలేరు, అని ప్రభువు పలుకుచున్నారు. ఆయనకి చెందిన వారికి ఆయన ఇచ్చే బహుమానం ఏమిటి అంటే నిత్య జీవం. ఇది మనం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మూడవ అధ్యాయం 16  వచనం. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి , తన ఏకైక కుమారుని ప్రసాదించేను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను." యోహను 6: 40"కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును. "  ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది. 

నా గొర్రెలు నా స్వరమను వినును,  నేను వానిని ఎరుగుదును.  ఈ మాటలను యేసు ప్రభువు  ఎవరు అయితే అతనిని నమ్మటం లేదో వారికి చెబుతున్నారు.  పరిసయ్యులకు చెబుతున్నారు. అంతకు ముందు యేసు ప్రభువు ఒక అద్భుతం చేశారు. వారు యేసు ప్రభువును నమ్మక వారి అపనమ్మకం వెల్లడి చేసి ఉన్నారు.  యేసు ప్రభువు చేసిన పనుల బట్టి వారు ఆయనను నమ్మాలి. కానీ ఇక్కడ పరిసయ్యులు నమ్ముట లేదు ఎందుకు అంటే వారు వారే నాయకులు , కాపరులు అనుకుంటున్నారు, వారికి ఇతరులను నడిపే శక్తి, జ్ఞానం లేకుండానే. ఒక రకమైన అహం వారిని పీడిస్తుంది. దాని నుండి వారు బయటకు రావడం లేదు. ప్రజల సమస్యల ఎడల వారికి అవగాహన కూడా లేదు. అవగాహన లేకుండా ఏవిధంగా వారు ప్రజలను నడిపించగలరు? 

యేసు ప్రభువును ప్రజలు నమ్ముతున్నారు, నిజానికి పరిసయ్యులు నాయకులే,  కానీ వారిని ప్రజలు నమ్మడం లేదు అని తెలుస్తుంది. పరిసయ్యులు వారిని వారు కాపరులుగా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారిని కపట కాపరులుగా చెప్తున్నారు. అందుకే, నాకంటే ముందు ఉన్న వారు అందరు దొంగలు ,  దోపిడి చేసేవారు అని చెపుతున్నారు. వీరు కాపరులుగా నటించారు. నిజమైన కాపరులుగా వారు ప్రవర్తించలేదు. అనేక సార్లు స్వార్ధ కొరికలతో జీవించారు. యోహను 10: 8 "నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు." వీరు ఇటువంటి వారు కాబట్టే ప్రజలు వారిని అనుసరించలేదు. 

మనుష్య కుమారుడు ఎటువంటి కాపరి 

యేసు ప్రభువు తన పాలన లేక ఏ విధముగా వారిని చూస్తారో చెప్తున్నారు, యేసు ప్రభువు ఈ ప్రజలు నా వారు అని చెబుతున్నారు. నేను వారిని ఎరుగుదును అని అంటున్నారు.  వీరు నా వారు అంటున్నారు.  ఎందుకంటే తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, కానీ పరిసయ్యులు ఆ విధంగా చెప్పలేక పోయారు. కేవలం మేము ఎలా ఉండాలో మాత్రమే చెబుతాము అన్నట్లు ఉన్నారు. ఏమి తెలుసు యేసు ప్రభువుకి ఈ ప్రజల గురించి అంటే మనకు వాక్యం, ఆయనకు అంతా తెలిసే మన కోసం మరణించడానికి సిద్దపడ్డాడు అని చెబుతుంది. నీ సమస్యలు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ తప్పులు తెలుసు, నీ ఒప్పులు తెలుసు, నీవు బయట పెట్టని అన్నీ విషయాలు తెలుసు, నీవు ఆయన నుండి ఏమి దాచి ఉంచలేవు కానీ వానిని బట్టి నిన్ను శిక్షించక, రక్షించడం ఎలానో తెలుసు. 

పరిసయ్యులకు నిజముగా తమ ప్రజలు ఎవరో తెలియదు, యేసు ప్రభువు నా ప్రజలు నాకు తెలుసు అని  చెబుతున్నారు.  యేసు ప్రభువుకు పరిసయ్యులకు ఉన్న తేడా ఏమిటి అంటే అంతకు ముందు ఒక గ్రుడ్డి వానిని స్వస్థ పరిచారు. ఆయనకు ఏమి కావాలో యేసు ప్రభువుకి తెలుసు. 

వారు  నన్ను అనుసరించును, ఎవరు వానిని నా నుండి అపహరింపలేరు. అని ప్రభువు పలుకుతున్నారు. నిజమైన క్రైస్తవుడు తండ్రి స్వరము తెలుసుకుంటాడు. వారు ఇతరులను అనుసరించరు. ఎలా మనకు తండ్రి స్వరం తెలుసు. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. నీకు ఆయన  ఎటువంటి కాపరి అని తెలుసుకుంటే నీవు ఆయన స్వరమును తెలుసుకోవచ్చు. ఈ రోజు ప్రతిదీ వినుటకు మంచిగా ఉన్నది, దేవుని నుండి అని పలుకుతున్నారు, ఇతరులును ఇబ్బంది పెట్టకుండా, జీవిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇతరులకు మంచి చేయడం, ఇబ్బంది పెట్టకపోవడమేకాదు, తప్పును ఖండిచడం కూడా , సౌలుకు దేవుడు చెబుతున్నారు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? అప్పుడు ఆయన అడుగుతున్నాడు ప్రభూ, నీవు ఎవరు? నీవు హింసించే యేసును. ఆ స్వరమును వినిన సౌలు మారిపోతున్నాడు. 

ఎందుకు ఆయన స్వరాన్ని మనం వినాలి? నీవు ఎవరు, ఏమి చేస్తున్నావు,ఏమి చేయాలి అని తెలుసుకోవడానికి నీవు ప్రభువుని స్వరం వినాలి. లేక పోతే నీవు చేసేది మొత్తం మంచిది అని మనం అనుకుంటూవుంటాం. నిజం తెలుసుకోవడానికి నీవు ప్రభూని స్వరం వినాలి. 

ఇంకా ఎందుకు మనం ఆయన స్వరం వినాలి?  యేసు ప్రభువు చెబుతున్నారు నా గొర్రెలు నా స్వరమును వింటాయి అంటున్నారు, ఆయన స్వరము మనము వినకపోతే ఆయనను మనము తెలుసుకోలేము. నా గొర్రెలు నా స్వరమును వింటూనే వుంటాయి. ఆయన స్వరం వినకపోతే నీకు క్రైస్తవుడవు కాదు. ఆయన స్వరాన్ని వినకపోతే నీకు రోజు వచ్చే సాతాను శోధనలు నీవు జయించలేవు. సాతాను స్వరాన్ని కేవలం మనం ఎదుర్కొనేది తండ్రి స్వరము ద్వారానే. నీవు ఆయన స్వరం వినకపోతే నీవు ఆయనకు చెందిన వాడివి కాదు. ప్రభువు చెబుతున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నారు. 

 దావీదు సాతనును ఎలా ఎదుర్కొన్నాడు అని కీర్తనలలో వింటాము.  కీర్తన 143:2-3 . చాల సార్లు నేను దేవుని వాక్కు మీద ఆదరపడి ఎదుర్కొన్నాను అని దావీదు 5 వ వచనం లో చెబుతున్నాడు. ఆయన స్వరమును నీవు వినకపోతే నీ పాపమును నీవు విడిచి పెట్టవు , ఆయన స్వరమును వినకపోతే నీకు ఆయన వాగ్ధానములు కోల్పోతావు. ఇంకా ప్రభువు వారు నాశనం చెందక జీవింతురు అని చెబుతున్నారు. 

ఆయన స్వరమును వింటే ఆయన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవితాన్ని ఇస్తాడు, అంతే కాదు ఎవరు వారిని నా నుండి తీసుకొని వెళ్లలేరు. అందుకంటే ఆయన లోనే  వారికి రక్షణ , ఆశ్రయం ఉంది. ఆయన ఎవరిని ఆయన వద్ద వుండమని బలవంతం చేయలేదు. నీవు నన్ను అనుసరిస్తావా ? నీవు దేనికి బయపడనవసరం లేదు. కనుక ఆ విధంగా జీవిద్దాం. 


క్రీస్తు పునరుత్థాన మహోత్సవం

 

 క్రీస్తు పునరుత్థాన మహోత్సవం 


ప్రియమైన మిత్రులారా!అందరికి క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. మానవ రక్షణ చరిత్రలో అంత్యంత ముఖ్యమైన పండుగ ఇది. ఇది మరణం మీద యేసు ప్రభువు యొక్క విజయం. సృష్టి ఆరంభం నుండి ఒకే ఒక సమాధి తెరువబడి ఖాళీగా ఉండి,  అక్కడ సమాధి చేయబడిన వ్యక్తిని ఆ సమాధి  బందించి అక్కడ ఉంచలేక పోయింది అని తెలుపుతుంది . ఆ సమాధి ఆయనను భందించలేక పోయింది. అందుకే పునీత పౌలు గారు మరణాన్ని అడుగుతున్నారు, మరణమా నీ విజయం ఎక్కడ ? భాదించగల నీ ముల్లు ఎక్కడ ? 1 కోరింథీ15 :55  అందరు నీకు దాసులే అని విర్ర వీగినా నీ గర్వం ఎక్కడ? అని అడుగుతున్నారు. 

ఈ రోజు మనందరికీ ఆనందించే రోజు? ఎందుకంటే యేసు ప్రభువు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదు, అని నిరూపించాడు. అంతే కాదు ఆయన వలె మనం కూడా, ఒక రోజు మరణం నుండి లేవవచ్చు అని నిరూపించాడు. తన శ్రమలు, మరియు మరణం యొక్క  ఫలితం ఈ రోజు మనకు చూపించాడు. 

ఈ పునరుత్థానం ఆయన కొరకు కాదు మన కొరకు ఆయన దేవుడై ఇన్ని బాధలు , కష్టలు ఎందుకు అనుభవిస్తున్నారు? దాని ఉపయోగం ఏమిటి ? అని మనం ప్రశ్నిస్తే ? మనకు వచ్చే జవాబు యేసు ప్రభువుని పునరుత్థానం. యేసు ప్రభువు మాత్రమే మరణాన్ని జయించినవాడు, మనకు కూడా అటువంటి స్థితిని తీసుకురాగలడు , అందుకే యేసు ప్రభువు నా ప్రాణమును ధారపోయగలను మరియు మరల  నేను దానిని తీసుకోగలను అని అంటున్నాడు. యోహను 10: 18 . మరణానికి ఆయన మీద ఎటువంటి శక్తి లేదు. ఆయనను అది బందించలేక పోయింది. మరణానికి తలవంచి కాదు ఆయన మరణించినది, అది తనని ఏమి చేయలేదు అని నిరూపించడానికి. 

గొప్ప గొప్ప వారు పుట్టారు, కొన్ని మత స్థాపకులు కూడా పుట్టారు, దేవునిగా కోనియాడబడ్డారు. కానీ సమాధిని గెలవలేక పోయారు, మరణాన్ని గెలవలేక పోయారు, అందరు మరణానకి దాసులుగా మిగిలిపోయారు.  యేసు క్రీస్తు మాత్రమే మరణాన్ని గెలిచాడు నిజానికి క్రైస్తవులకు మిగలినవారికి ప్రధానమైన వ్యత్యాసం ఇక్కడే వుంది. మరణంతో జీవితం ముగుస్తుంది ,ఇతరుల తత్వాలలో, కానీ మనకు యేసు క్రీస్తు మరణాన్ని జయించి మనం అమరులం కావచ్చు అని  చూపించారు. ఆయన తన శిష్యులకు ఎప్పుడు చెబుతూనే ఉన్నాడు, నేను శ్రమలుపొంది, మరణించి అటుతరువాత పునరుత్థానం అవుతాను అని, కానీ వారికి అంతగా అర్ధం కాలేదు. శిష్యులు ఆ మాటలకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు , కానీ క్రీస్తు పునరుత్థానం లేకపోతే అంతా వ్యర్ధమే, ఆయన భోద , ఆయన మాటలు, ఆయన స్వస్థతలు ఇవి అన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇచ్చేవిగా మిగిలిపోయేవి, అందుకే క్రీస్తు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. పునీత పౌలు గారు యేసు ప్రభువు యొక్క పునరుత్థానం గురించి అంతరూఢిగా ఉన్నారు కాబట్టి అంటున్నారు, యేసు క్రీస్తు మరణాన్ని జయించకపోయి ఉన్నట్లయితే మన విశ్వాసం వ్యర్ధం అంటున్నారు. 1 కోరింథీ 15:17  . ఆయనను శిష్యులు మాత్రమే కాదు పౌలు గారు కూడ ఆయన అనుభూతిని పొందారు. 

క్రీస్తు పునరుత్థానము శిష్యులకు ఆనందాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరు ఈ శిష్యులు? చాల పిరికివారు, ఒక చిన్న పిల్లకు కూడా భయపడి అబద్దం చెప్పే ఆంతటి పిరికివారు, అంతేకాదు, ప్రతి విషయానికి భయ పడేవారు ,ఆయన సముద్ర అలలు చూసి భయ పడేవారు పకృతిని చూసి బయ పడేవారు, మనుషులను చూసి భయ పడే వారు అటువంటి వారు , హఠాత్తుగా ధైర్య వంతులు అవుతున్నారు. ఈ ధైర్యం క్రీస్తు విజయం ఇస్తుంది. అందుకే పేతురు గారు అంటున్నారు, చిన్న పిల్లలకు కూడా భయ పడే పేతురు గారు యూదయ పెద్దల ముందు యేసు ప్రభువు కోసం మేము మరణించడానికి కూడా సిద్ధం అని అంటున్నారు. కారణం ఒక్కటే నేను నమ్మే క్రీస్తు మృత్యుంజయుడు, మరణం ఆయనను ఏమి చేయలేదు, నాకు వీరు ఇవ్వగలిగే అతి పెద్ద శిక్ష మరణం, కానీ దాని మీద నేను కూడా విజయం పొందుతాను, ఎందుకంటే యేసు ప్రభువు నాకు దానికి సాదించి పెట్టాడు. 

ఈ లోకంలో  ఎవరు చనిపోవాలని కోరుకోరు. ప్రతి ఒక్కరు జీవించాలనే కోరుకుంటారు. కానీ అందరు చనిపోవాలి. ఎవరు మరల జీవంతో రాలేదు. ఎల్లప్పుడు జీవించాలనే ఈ కోరిక నేరవేరదు. కానీ ఈ రోజు  క్రీస్తు పునరుత్థానం  మనకు నిత్య జీవం మీద నమ్మకం కలుగ జేస్తుంది. యేసు ప్రభువు యోహను సువిశేషంలో అనేక సార్లు దీని గురించే భోదించారు. యోహను సువిశేషం ముఖ్య సారంశం ఎవరైతే  యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి ఆయన ఇచ్చే భాగ్యం నిత్య జీవితం. కనుక ఆయనను నమ్మే మనం మరణాన్ని జయించగలం. 

ఈరోజు యేసు ప్రభువు కేవలం మరణం మీద మాత్రమే విజయం సాధించలేదు, పాపం మీద కూడా విజయం సాధించారు. ఎందుకంటే దేవుని వాక్యంచెబుతుంది.  పాప ఫలితం మరణం అని చెబుతుంది. పాపాన్ని ఆయన మరణంతో తీసివేశాడు. 

ఇది సాతాను మీద కూడా విజయము. సాతాను మనలను ఎప్పుడు కూడా నరకంలోనే ఉండాలను కుంటుంది. అటువంటి సాతానుకు ఈ రోజు అపజయం. ఆవిధేయత వలన వచ్చిన పాపాన్ని యేసు ప్రభువు విధేయత వలన సాతానును ఓడించాడు. 

మృతులనుండి యేసు ప్రభువు లేవడం మనము కూడా ఒక రోజు మరణం నుండి  లేస్తామనే  ఒక నమ్మకం ఇస్తుంది. దీనిని ప్రతి సారి మనం విశ్వాస ప్రమాణంలో చెబుతూనే ఉన్నాం. కనుక ఆయనను విశ్వసిద్దాం నిత్య జీవితానికి సిద్ధ పడుదాం. ఆమెన్ 

Fr. Amruth 

మ్రాని కొమ్మల ఆదివారము (ప్రజల ఆకాంక్ష - యేసు ప్రభుని కర్తవ్య నిర్వహణ )

 

ప్రజల ఆకాంక్ష - యేసు ప్రభుని కర్తవ్య నిర్వహణ 

క్రీస్తు నాధుని యందు ప్రియమైన మిత్రులారా ! పవిత్ర ఆదివారము రోజున హోసన్న అనే నినాధాలతో ప్రజలు యేసు ప్రభువును యెరుషలేము నగరానికి ఆహ్వానిస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువును వీరు అంతగా ఆహ్వానిస్తున్నారు? ఎందుకు ఈ జయ జయ నినాధాలు చేస్తున్నారు? ఏ విజయం వారు పొందారు? ఈ ప్రశ్నలను మనం అడిగినట్లయితే మనకు వారి జీవితాలలో వారు ఆశించినవి యేసు క్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతాయి అని వారి అర్ధం చేసుకొని చేసినటువంటి జయజయ నినాధాలు ఇవి అని అర్ధం అవుతాయి. 

ఇది కేవలం జయ జయ నినాదం మాత్రమే కాదు మరి ఏమిటి అంటే ఒక రకమైన వేడుకోలు. హోసన్న అంటే కూడా అర్ధం అదే. మమ్ములను ఇప్పుడు రక్షించు అని అర్ధం. 

యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన  చివరి వారము అంత్యంత ముఖ్యమైనటువంటి వారము. మానవ రక్షణ కార్యాన్ని పూర్తి చేసినటువంటి రోజులు.   అందుకే దీనిని మనము పవిత్ర వారము అంటున్నాము. క్రైస్తవులైన మనకు ఇది చాల ముఖ్యమైన వారము. 

యేసు ప్రభువులో వారు ఏమి చూశారు 

మొదటి శతాబ్దము 30 వ సంవత్సరములో జెరూసలెములో  రెండు  ఊరేగింపులు జరిగాయి. ఒకటి అలనాటి కూలీలా ఊరేగింపు , రెండవది సామ్రాజ్య అధికారుల ఊరేగింపు. తూర్పు నుండి యేసు ప్రభువు గాడిద మీద ఊరేగింపుగా జకర్యా ప్రవక్త ప్రవచించిన విధముగా శాంతియుతమైన రాజుగా వస్తున్నాడు.   రెండవ ప్రక్క  పడమర నుండి పిలాతు తన మంది మార్బలంతో,సైన్యంతో  యెరుషలేము లోనికి వచ్చాడు. యేసు ప్రభువు రాక దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తుంది. పిలాతు రాక సామ్రాజ్య అధికారాన్ని సూచిస్తుంది. పిలాతు రాక రోమా సామ్రాజ్య అధికారము మరియు తాను ఎటువంటి అధికారము కల వాడు అన్నది, తన సైన్యము ద్వారా తెలియ పరుస్తున్నాడు. యేసు ప్రభువుని ఆహ్వానించేవారు కూలీలు, రాజకీయ, ఆర్థిక సామజిక అసమానతలతో తమ జీవితాలలో ఎటువంటి మంచి జరగలేని సమయములో యేసు ప్రభువుని ఒక రాజుగా, వారి సమస్యలకు సమాధానము ఇచ్చే వానిగా చూసారు. వారి జీవితాలలోని మరియు వారి పట్టణములోనికి ఆహ్వానించారు.  దావీదు మహారాజుని విజయము తరువాత ఆహ్వానించినట్లు యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నారు.  మనము కూడా యేసు ప్రభువుని మన రాజుగా , రక్షకునిగా తెలుసుకొని ఆహ్వానించుదాము. 


రాజకీయ అణచివేత

యెరూషలేము కేవలము ఒక పట్టణము మాత్రమే  కాదు , మొదటి శతాబ్దములోనే అది ఖగోళిక పవిత్ర కేద్రంగా ఉన్నది.    యూదులకు గొప్ప నగరము కావటము వలన అందరి చూపు ఆ నగరము మీదనే ఉన్నది. ఆధిపత్య వ్యవస్థకు స్థానము అయ్యింది.  రాజకీయ అణచివేతకు అనుకూలముగా గవర్నరు కూడా అక్కడే ఉంటున్నాడు. అటువంటి సమాజములో పెక్కుమంది, తక్కువ మంది చేత పరిపాలించబడుతారు. గొప్పవారు అనుకునే వారికి మాత్రమే స్థానము ఉంటుంది,సాధారణ వ్యక్తులకు అక్కడ స్థానము లేదు. 

ఆర్థిక దోపిడీ 

యెరూషలేము లో మనము చుసేటువంటి ఇంకొక ప్రధానమైన సమస్య ఏమిటి అంటే ఆర్థిక దోపిడీ.  సమాజములో ఉన్నటువంటి సంపద మొత్తము కూడా కొద్దిమంది ధనవంతులు, అధికారము కలవారి దగ్గరనే ఉంది. వారు అక్కడ ఉన్నటువంటి నియమాలను చట్టాలను ఆధారము చేసుకొని ఆ విధముగా చేసుకున్నారు. భూమీ మీద హక్కు , పన్ను విధానము,  పెద వారితో కొన్ని ఒప్పందాలను చేసుకొని  ఆర్థికంగా వారిని దోచుకున్నారు. 

దోపిడీకి మతపరమైన చట్టబద్దత 

సమాజములో ఇటువంటి వ్యవస్థలను మతపరమైన చట్టాలతో వ్యవస్తీకృతము చేసారు. ప్రజలకు  రాజు దేవుని ఆదికారముతో పాలించాడు అని చెప్పారు. రాజు దేవుని కుమారుడు అని, ఇటువంటి వ్యవస్థ దేవుని ప్రణాళిక అని , అధికారులకు దేవుని నుండి అధికారము వచ్చింది అని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు ఏవిధముగా ఉన్నవి అక్కడ అంటే, దేవాలయ అధికారులు, యాజకులు భూస్వాములుగా ఉన్నారు, వారు యెరూషలేములో ఉంటూ వారి  పొలాలకు దూరముగా ఉన్నారు. భూమి లేని వారికి కూలీలకు భూమిని కౌలుకు ఇచ్చేవారు,  కూలీలకు ,పేదవారికి  ఎటువంటి అవకాశమలేదు. కేవలము, దినసరి కూలి , లేక పట్టణానికి వలసపోవడము, లేక అడుక్కోవడము మాత్రమే వారు చేయగలిగినది. దేవాలయము స్థానిక మరియు సామ్రాజ్య పన్ను విధించే వ్యవస్థ అయ్యింది, స్థానిక పన్నులను దశమ భాగం అనేవారు . ఇది వ్యవసాయ  ఉత్పత్తు ల మీద విధించేవారు.  యేసు ప్రభువు మరియు యోహాను లు పాపక్షమాపణను దేవాలయానికి సంభందం లేకుండా ప్రకటించారు, అంటే దేవాలయము పాప క్షమాపణకు, దేవుని చేరుటకు ప్రధానమైన మధ్యవర్తి అనే  సిద్ధాంతాన్ని తిరస్కరించారు. 

ఇటువంటి  బాధలతో ఉన్నటువంటి ప్రజలు యేసుప్రభువుని వారి మధ్యకు ఆహ్వానిస్తూ హోసన్నా జయ జయ  నినాదాలు చేస్తున్నారు. ఎందుకు అంటే వారి కష్టాలు భాదలు మొత్తము కూడా ఆయనకు తెలుసు, వారి గురించి ఆయన మాట్లాడారు. ప్రభు హిత సంవత్సరాన్ని ప్రకటించియున్నాడు. అంటే వారి భూమి వారికి వస్తుంది, వారు ఇక నుండి వడ్డీలు కట్టనవసరము లేదు. అందుకే వారు చెపుతున్నారు హోసన్నా అని .  అంటే మమ్ములను ఇప్పుడే  రక్షించు అని ఆర్డము. ప్రియా సహోదరులారా నిజానికి వారు తెలియకుండానే ఆయన్ను రక్షకునిగా గుర్తించారు. యేసు ప్రభువు నుండి రక్షణను పొందుతున్నారు. ఈనాటి క్రైస్తవులమైన మనము కూడా అలానే ఆయనను మన కష్టాలను బాధలను వీక్షించమని  విన్నవిద్దాము మన రక్షకునిగా ఒప్పుకుందాము. ఆయనను అనుసరిద్దాము. 

ఎటువంటి ఊరేగింపుతో యేసు ప్రభువును వారు ఆహ్వానిస్తున్నారు 

ఇక్కడ యేసు ప్రభువు ఒక యుద్దంలో విజయం పొందిన రాజు వలె యెరుషలేము లోనికి వస్తున్నారు. వీరు ఒక విజయోత్సవం జరుపుకుంటూ వస్తున్నట్లు ఉన్నారు. ఆయనను రాజు వలె ఆహ్వానిస్తున్నారు. పచ్చని కొమ్మలు వూపుతూ వారి ఆనందాన్ని తెలుపుచున్నారు. హోసన్న అని నినాదాలు ఇవ్వడం కూడా దానిలో భాగమే. ఇవన్నీ చెప్పేది ఒక విజయం పొంది తన సొంత రాజ్యానికి విజయోత్సహంతో వచ్చే రాజుకి ఇచ్చే ఆహ్వానం. దీనిని మనం సౌలు విజయం పొందిన తరువాత సౌలుకి దావీదుకి ఇటువంటి ఆహ్వానం లభించినది. 

వారు సౌలు , దావీదునకు పొందిన ఆహ్వానం లాంటిదే కాని ఇక్కడ ఒక విషయంలో భిన్నంగా ఉన్నది, అది ఏమిటి అంటే ఇక్కడ హోసన్న అని వారు అంటున్నారు. వీరిలో ఒక నమ్మకం ఇక్కడ ఉంది.  ఇతని మీద ఒక ఆశ పెట్టుకొని వారు ఉన్నారు. అదే వారిని రక్షించాలని. దావీదు కుమారుడు మా రక్షకుడు అని వారు గ్రహించారు. 

ఎటువంటి రక్షణ వారు కోరుకున్నారు 

యేసు ప్రభువును ఆహ్వానించినవారు, పేదలు, అభాగ్యులు, అవసరాలలో ఉన్నవారు, అణచివేయ బడినవారు, అనారోగ్యంతో ఉన్నవారు వీరు ఆయన వారికి ఉన్న సమస్యలకు విముక్తి ఇస్తారు అని కోరుకున్నారు, ఎందుకంటే ఆయన పరిచర్య మొత్తం వీరికోసమే సాగింది. వీరికి కావలసినది బానిసత్వం నుండి విముక్తి,  ఇతరుల అధికారం నుండి విముక్తి, అనారోగ్యం నుండి విముక్తి, వారికి స్వేచ్ఛ కావాలి, ఎవరు ఇది ఇవ్వగలరు? దేవుడు మాత్రమే ఇది చేయగలడు. ఇక్కడ మనకు  సమూవేలు ప్రవక్తను గుర్తుకు వస్తారు. ఆయనే దేవుడే మీకు రాజు అని చెప్పింది. మెలెక్ యావే అంటే యావే మా రాజు. ఇది ఈరోజు వారు అడుగుతున్నారు, ఇంతకాలం వారు దేవుడిని తమ రాజుగా ఉండమని అడగలేదు. ఆయన వారి రాజు అవుతున్నారు. కానీ ఏ విధంగా ఆయన వారి కోరికలను తీరుస్తారు? ఎలా వారికి స్వేచ్ఛ ఇస్తారు? ఎలా వారిని అన్యుల నుండి రక్షిస్తారు? ఎలా పాపమునుండి రక్షిస్తారు? 

యోషయా గ్రంధంలో బాధమయా సేవకునిగా ఆయన ఈ పనిని చేయడం మనం చూస్తాము. బాధమయా సేవకుని వ్యక్తిత్వం ఇది మనకు తెలియ చేస్తుంది. ఆయన దేవునిచేత పంపబడినవాడు. ఆయనకు ఒక కర్తవ్యం ఉంది. అది శ్రమలు, కష్టాలు పొందటంతో జరుగుతుంది. చివరకు తన ప్రాణంను ధరపోసి తన ప్రజలకు రక్షణను ఇస్తున్నాడు. ఇది శ్రమలు, కష్టాలు నుండి వెనకకు పోవడం లేదు. వాటిని ఎదుర్కొంటున్నాడు. యోష 50:7. 

పునీత పౌలు గారు పిలిప్పీయులకు రాసిన లేఖలో  యేసు ప్రభువు ఎలా దేవుని కుమారునిగా తన కర్తవ్యం నెరవేర్చాడు అని తెలుపుతున్నారు. ఆయన తనను తాను రిక్తుని చేసుకొని మనలను రక్షించారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు యోహను 15 వ అధ్యాయం 13 వ వచనంలో "తన స్నేహితుని కోరకు  తన ప్రాణంను ధారపోయువాని కంటే ప్రేమ కలవాడు ఎవడును లేడు"  అని చెప్తున్నారు. అంటే మన కోసం తనను తాను పూర్తిగా అర్పించారు యేసు ప్రభువు . ఆయన దేవుడైనప్పటికి తన దైవత్వంను వీడి మానవ రూపం దాల్చి మనలను రక్షించారు, తనను తాను తగ్గించ్చుకున్నారు.  ఈ విధంగా ఆయన మనలను రక్షించారు. ఆయనను కోరుకున్న కొరికలన్నింటిని తీరుస్తున్నారు. 

యెరుషలేములోనికి యేసుప్రభుని విజయోత్సవ రాక కూడా  మనకు ఆయన ఎటువంటి రాజు అని తెలుపుతుంది. ఆయన అహంతో కూడిన రాజు కాదు. అందుకే జెకర్యా ప్రవక్త "సియోను కుమారీ! నీవు మిగుల సంతసింపుము. యెరుషలేము కుమారీ నీవు ఆనందనాదాము చేయుము . అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు , జయాశీలుడై విజయము చేయును కానీ వినయాత్ముడై గాడిదపై వచ్చును " అని చెబుతున్నారు 9:9.  ఆయన్ను ప్రజలు రాజుగా చూసిన , ఆయనలో రక్షకుడిని చూసిన , ఆయనకు తెలుసు వారు అడిగేది తాత్కలికమైనటువంటి వాటిని అని ఎందుకంటే ఆయన వారు ఆకలితో ఉన్నప్పుడు ఆహారం ఇచ్చాడు, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చారు. చనిపోయినవారిని బ్రతికించాడు ఇవి చూసి ఈయన మాతో ఉంటే మాకు ఎటువంటి సమస్య ఉండదు అనే ఉద్దేశం తో వారు ఉన్నారు  కాని, ఆయన మనకు శాశ్వతమైనటువంటి వాటిని ఇవ్వాలనుకుంటున్నారు.  అది ఏమిటి అంటే నిత్య జీవం , మరణం నుండి రక్షణ , పాపం నుండి రక్షించాలనుకుంటున్నారు. ఇది తన ప్రాణాన్ని ధార పోయడం ద్వార ఆయన చేస్తున్నారు. 

ఈ మ్రాని కొమ్మల ఆదివారం మనకు మనం ఎటువంటి కోరికలు కలిగి ఉన్నాము, ఎవరు వాటిని తీర్చగలరు అని తెలుపుతుంది. మనకు కావలసినది ఏమిటి అని తెలుసుకోవడానికి అవకాశం ఇస్తుంది అది యేసు ప్రభువు మాత్రమే తీరుస్తారు అని తెలియజేస్తుంది. 


పవిత్ర గురువారం

 

పవిత్ర గురువారం 

ప్రియ మిత్రులారా  పవిత్ర వారంలోని 5 వ రోజు పవిత్ర గురువారం. ఈ రోజుకు అనేక పేర్లు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. ఈరోజు దివ్య సత్ప్రసాద స్థాపన జరుగుతుంది. మరల ఈరోజు గురుత్వ స్థాపన జరుగుతుంది.  ఇవి మూడు కూడా యేసు ప్రభువు మరణ పునరుత్థానముల తరువాత యేసు ప్రభువును ఈలోకంలో మనం కలుసుకోవడానినికి, ఆయన సన్నీది పొందడానికి ఇవి మూడు కూడా సాధనాలు.  దీనిని పవిత్ర ఆజ్ఞ గురువారం అని అంటారు. ఈ రోజు యేసు ప్రభువు శిష్యులకు ప్రేమ ఆజ్ఞ ఇస్తున్నారు.   నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి . దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఇది యేసు ప్రభుని చివరి భోధ. దీని తరువాత ఆయన భోదించలేదు. 

నూతన ఆజ్ఞ - ప్రేమ ఆజ్ఞ  

దీనిని నుండి మనము ఏమి నేర్చుకోవాలని యేసు ప్రభువు కోరుతున్నారు?   యేసు ప్రభువు తన  శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా మనం ఏ విధంగా ఉండాలో  ఒక సంకేతం ఇస్తున్నారు.  ఇది యేసు ప్రభువుని ప్రేమను వ్యక్త పరచిన సంఘటన. ఈ సంఘటన వినయంతో కూడిన ఒక పని. ఎందుకంటే ఇది శిష్యుల అపవిత్రతను పోగొట్టి ప్రవిత్రతను వారికి ప్రసాదించే ఒక పని. ఇది ఇంకొక విషయాన్ని తెలియ జేస్తుంది. అది ఏమిటి అంటే  యేసు ప్రభువుని మరణం మరియు పునరుత్థానం మానవుని పాపం మరియు దాని పర్యావసానలను అనగా మరణంను తొలగిస్తుంది. మనలను దేవునితో కలిసి జీవించే అర్హతను తెస్తుంది. 

ప్రేమ ఆజ్ఞను పాటించడం అంటే   యేసు ప్రభుని సాన్నిధ్యాన్ని ఈ లోకంలో కొనసాగించాడం, ఇది  శిష్యుల యొక్క బాధ్యత. ఇది ఈ ప్రేమ ఆజ్ఞను పాటించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో ఉన్నంత కాలం యేసు ప్రభువును ఈ లోకం చూడవచ్చు. ఈ ప్రేమ ఆజ్ఞ క్రొత్తది, ఎందుకంటే శిష్యులను యేసు ప్రభువు ఒకరిని ఒకరు తాను వారిని ప్రేమించిన విధమున  ప్రేమించమని అన్నారు.  అంటే యేసు ప్రభువులానే వారు ప్రేమించాలి. రూపాతంతరికరణ చెందాలి ప్రభువులా. 

 కానీ కోరింథీలో ఉన్న క్రైస్తవులు ఒకరిని ఒకరు ప్రేమించుటలో విఫలం అయ్యారు. కనుక పునీత పౌలుగారు  ప్రభుని కడరా భోజనం గురించి, ఏ విధంగా ప్రభువు మన అందరికి ఒక మాతృక ఇచ్చాడో అని  మాటలాడుతున్నారు. కోరింథీలో క్రైస్తవులు వారి ప్రార్ధన తరువాత వారు కలిసి తినడం లేదు. వారు విడిపోయి పేదవారు ఒక చోట , ధనికులు ఒక చోట భుజిస్తున్నారు. వారిలో ఐక్యత లేదు.  ఏసు ప్రభువు   ప్రేమఆజ్ఞ ఇచ్చిన ఈరోజు , యేసు ప్రభువు శిష్యులకోసం ప్రార్దన చేయడం  మనం చూస్తాము.

శిష్యుల ఐక్యత 

 యేసు ప్రభువు చేసిన ఈ ప్రార్ధనను ప్రధాన యాజకుని ప్రార్దన. ఇక్కడ యేసు ప్రభువు లోకం కోసం ప్రార్ధన చేయలేదు. కానీ తన శిష్యుల కోసం మరియు ఈ శిష్యుల ద్వార శిష్యులు అయ్యే వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తన శిష్యుల ఐక్యత కోసం ప్రార్దన చేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రి దేవుడు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో, ఆ విధంగా ఐక్యంగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నారు. ఈ ఐక్యత ఒక సాక్షీలా ఉంది. ఎందుకంటే శిష్యులు తమ ఐక్యత ద్వారా యేసు ప్రభువును ప్రపంచానికి తెలియచేయాలి. యోహను 17: 9-19 లో యేసు ప్రభువు తన శిష్యుల కోసం ప్రార్ధన చేయడం మనం చూస్తున్నాం. శిష్యులు ఈ లోకానికి సంభందించిన వారు కాదు.  యేసు ప్రభువును తిరస్కరించినట్లుగా ఈలోకం ఆయన శిష్యులను కూడా తీరస్కరిస్తుంది. ఆయన వారిని లోకము లోనికి పంపిస్తున్నారు, ఆయనకు సాక్షులుగా ఉండటానికి కనుక ఆయన వలె జీవించవలసిన బాధ్యత వీరి మీద ఉంది. అంతే కాదు శిష్యుల ద్వార యేసు ప్రభువును నమ్మే వారికోసం కూడా యేసు ప్రభువు ప్రార్ధిస్తున్నారు. యోహను 17:20-26. 

కడరా భోజనానికి మత పరమైన మరియు రాజకీయ పరమైన ప్రాముఖ్యత ఉంది. మత పరమైన ప్రాముఖ్యత ఎందుకంటే అది పాస్క ను గుర్తు చేసేటువంటిది, దేవుని మహిమను చాటె ఒక విందు. రాజకీయ ప్రాముఖ్యత ఎందుకంటే ఇక్కడ ఒక నూతన సమాజాన్ని చూసిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూదయ ప్రజలు పిలువని వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. వారే సుంకరులు. అంటే నూతన సమాజానికి ఇది నాంది పలుకుతుంది. 

దివ్య సత్ప్రసాద మరియు గురుత్వ స్థాపన 

ఈరోజు మనం దివ్య సత్ప్రసాద స్థాపనను  మహోత్సవాన్ని మరియు గురుత్వ స్థాపన  జరుపుకుంటున్నాం. ఇది  ప్రజల మీద దేవుని ప్రేమను తెలియజేస్తుంది. యేసు ప్రభువుకు తన ప్రజలతో ఉండాలి అనే కోరికను ఇది తెలియ జేస్తుంది.  కడరా భోజన సమయంలో ప్రభువు దీనిని   నా జ్ఞాపకార్దముగా చేయుడి అని అంటున్నారు. ఇది దేవుని ప్రేమను గుర్తుచేసుకునే రోజు. గురువుల ద్వార, దివ్య బలి ద్వార మరల యేసు ప్రభువుతో ఉండుట లేక ఆయన సాన్నిధ్యం పొందటం జరుగుతుంది. ప్రభువు మనతో లేడు అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే గురువుల ద్వారా వారు అందించే దివ్య సంస్కారముల ద్వారా ప్రభువును పొందటం, అయన సాన్నిధ్యం పొందడం జరుగుతుంది.  గురుత్వ మరియు దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువును మనం కలిసే విధంగా చేస్తున్నయి. కనుక ఇది కూడా దేవుని ప్రేమను సూచిస్తుంది. 

ఈరోజు మనం మనలను ఒక ప్రశ్న అడగాలి అది ఏమిటి అంటే నా ప్రవర్తన ద్వార, నా ప్రేమ చూపించడం ద్వారా, ఇతరులు యేసుక్రీస్తును చూసే విధంగా, వినే విధంగా చేయగలుగుతున్నానా? లేక నేను కోరింథీ సంఘంలోని శిష్యుల వలె, లేక యేసు క్రీస్తును తెలియదు అని చెప్పిన శిష్యుల వలె, లేక ఆయనను పట్టించిన శిష్యుల వలె విఫలం అవుతున్నామా ?

ఈ ప్రశ్నకు జవాబు  యేసు ప్రభువుతో ఒక వ్యక్తికి  ఉన్న వ్యక్తిగత  సంభందం మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువు అన్ని  భరించ గలిగాడు, ఎందుకంటే  తండ్రి తోటి ఆయనకు ఉన్నటువంటి బంధం  అంత గొప్పది. ఆయన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమైన బంధం. అందరు నిద్ర పోతున్నా యేసు ప్రభువు మాత్రం ప్రార్ధన చేస్తున్నారు. ఈ రోజు యేసు ప్రభువు వలె మనం కూడా ఆయనతో మన సంభందం అంతే ధృడంగా ఉండాలని ప్రార్ధన చేద్దాం. 



క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

   క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము

క్రిస్తునాదునియందు ప్రియ సహోదరులారా ఈ రోజు మనం క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము జరుపుకుంటున్నాం . ఇది   దివ్యసత్ప్రసాధ  దైవ సంస్కారానికి సంభందిచ్చినది . ఈ పండుగ  యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాలి, ఆయనను నేను నా లోనికి ఆహ్వానించి, నాలో ఉండేలా  చేయాలనే కోరికతో  ఈ పండుగను చేసుకోవడము  జరిగినది.

ఈ పండుగలో మనము  ముఖ్య ఉద్దేశం  క్రీస్తుని  అనుభవ పూర్వకంగా దివ్య సంస్కరము ద్వారా అనుభవించుడమే. కడర భోజన సమ యాన యేసు ప్రభువు రొట్టెను తీసుకోని  ఇది నా శరీరము  మీరందరు దీనిని తీసుకోని  భుజించండీ అని చెపుతున్నారు. ఒకరకంగా ఆయన తన శిష్యులను దేవుని స్వీకరించడానికి అర్హులుగా చేసున్నాడు.  కేవలము వారిని అర్హులుగా మాత్రమే కాక వారిని దేవున్నీ ఇతరులకు ఆందిచేవారిగా కూడా చేస్తున్నాడు. యేసు ప్రభువు వారి మద్య ఉండవలసీన  అవసరం ఉంది,  ఎందుకంటే  వారు ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్రభావితం చేయగలవారో అని కాదు కానీ వారు చాలా బలహీనులు అని మాత్రమే. ఆయన వారితో ఉన్నట్లైయితే వారు మంచి వారీగా , చేడుకు దూరముగా అదే విధముగా దైవ నిబంధనలకు అనుకూలమైన వారీగా జీవిస్తారు. ఎప్పుడైతే  యేసు ప్రభువు వారి  మద్య లేకపోతారో ,అప్పుడు  వారు ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. వారు అందరు భయ భ్రాంతులకీ గురి అవుతున్నారు.  పారిపోతున్నారు. అందుకే ఆయన వారి మద్యనే ఉండాలి. తన మరణము పునరుత్తనము తరువాత కూడా ఆయన వారి మద్యనే ఉండాలి దానిని సాద్యం చేస్తున్నారు. యేసు ప్రభువు దివ్య పూజ బలి ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడము ద్వారా ఈ పనిచేస్తున్నారు. అందుకే తన శిష్యులు ఇప్పటికి తన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు . ఎమ్మావు  మార్గాన పోయే శిష్యుల అనుభవం మనకు ఒక ఉదాహరణ యేసు ప్రభువు సాన్నిధ్యము  వారి మధ్యనే ఉంది అని  ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఆయనను కనుగొన్నారు.


 క్రీస్తు పునరుత్తాణము తరువాత దైవ వాక్కు బొదిస్తూ,  శిష్యులు  కలిసి రొట్టె విరవడం మొదలు పెట్టారు, కనుకనే మొదటి క్రైస్తవులు ఒకే హృదయము మనసు కలిగి కలిసి ప్రార్దన చేసి ,భుజించి ఒకరిని  ఒకరు మంచి మనసు కలిగి, వారిలోని పెదవారిని అనారోగ్యులును ,అనాథలను విదవరాళ్లను    ఆదరణతో చూసేరు. 


శిష్యులు అనేక ప్రదేశాలకు వెళ్ళి వారు క్రొత్త క్రైస్తవ సమూహాలను ఏర్పాటు చేసేరు. వారు ఒంటరిగా వెళ్ళక వారితోపాటు  యేసు ప్రభువును తీసుకొనివేళ్లారు. వారు ఆదిమ క్రైస్తవుల వలె చేశారు. ఎందుకు అంటే వారు యేసు ప్రభువు లేకుండా ఏమి చేయలేరు అని. యేసు ప్రభువును తీసుకెళ్ళడమూ అంటే ఈ కలిసి రొట్టెను విరుస్తూ ప్రార్థించటమే. 

 తీరుసభ పెరిగేకొద్ది దానితోపాటు దివ్యసత్ప్రసాధమునకు  ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నది . దివ్యసత్రపసాదము యేసు క్రీస్తుతోటి మనము ఏర్పాటుచేసుకునే  వ్యక్తిగత సంబంధానికి పునాది.  అంతే కాదు తిరుసభ కూడా యేసు క్రీస్తు శరీరం మనము తిరుసభ సభ్యులం . తిరుసభ సభ్యులుగా క్రీస్తు శరీర అంగాలుగా మనము జీవించాలి అంటే మనము ఈ దివ్యసత్ప్రసాధము  లో ఉన్న యేసు ప్రభువుతో సంభదము  కలిగి జీవించాలి.  ఎందుకు యేసు ప్రభువు ఇక్కడ ఈ అప్పము ద్రాక్ష రసములో ఆయన ఉండాలి అని  అంటే ఆయన నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని వాగ్దానము చేశాడు.  అందుకే మనతో ఉండాలి అని మన కష్టాలు బాదలు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అంటే మనవునితో కలిసి ఉండాలి అని దేవుడు ఈ అప్ప ద్రాక్ష రూపములో యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన ఎందుకు మనతో ఉండాలి కేవలము మనతో వసించి మన బాదలు కష్టలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు వాటినుండి మనలను బయటకు తీసుకురావడానికి .ఎందుకు ఆయన మన దగ్గరకు వచ్చి మన బాదాలను తెలుసుకొని మనలను వాటినుండి  బయటకు తీసుకువచ్చేది అంటే ఆయన మనలను  ప్రేమిస్తున్నాడు. ఎవరైతే నా శరీర రక్తాలను స్వీకరిస్తారో వారితో నేను జీవిస్తాను అని చెపుతున్నాడు. 

      కాథోలిక దేవాలయాలలో మనము దివ్యసత్ప్రసాధ  ఆరాధనా , సహజముగా మనకు తెలిసినది. దానికి కారణము ఈ పండుగ. అక్కడ మనకు ఒక వెలుగుతున్న ఒక లైట్ ఉంటుంది. అది యేసు ప్రభువుని సాన్నిధ్యానికి గుర్తు గా ఉంది. 

   సు విశేషములో ఈ రోజు ఇది నా శరీరము దీనిని తీసుకోని  భుజించండి అని చెపుతున్నారు.  అంటే నేను ఆయనను  స్వీకరించే వాడిని. అంటే నేను ఆయనను స్వకరించడానికి ఆర్హుడను.   మనము ఎవరో తెలియ చేస్తుంది.  అంటే మనము  దేవుని  మనలోకి ఆహ్యానించడానికి ,శక్తి కలిగి ఉన్నాము. 

  ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటి అంటే  దేవుణ్ణి స్వీకరించడము.     దేవుని  స్వీకరించే శక్తి నాకు  ఉంది, ఆ శక్తిని నేను వాడుకోకపోతే నేను ఆయనను కోల్పోతాను అని పునీత అవిలా తెరాజమ్మ చెపుతారు. ఒకవేళ నేను ఆయనను స్వీకరించడానికి సిద్దపడకపోతే నేను ఆయనను కోల్పోతాను. ఆయన్ను ఎప్పుడు కోల్పోకుండా ఉండడానికి నేను సాధన చేయాలి. ఆ సాధన ఆయనను కోరుకోవడము.   దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను కూడా ఆయనను కోరుకోవాలి.  నేను  ఆయనను కోరుకోకపోతే నాకు ఆయనలో స్థానము లేదు. ఈ  పండుగ మనము ఎవరో చెపుతుంది. కనుక ఆయనను స్వీకరించి ఆయన వలే జీవిద్దాము.  ఆమెన్ 

25 వ సామాన్య ఆదివారం


 సొలొమోను జ్ఞానగ్రంధము 2 :12,17 -20) (యాకోబు 3 :16 -4 :3.) (మార్కు 9 :30 -37) 

ఈనాటి మొదటి పఠనముద్వారా  క్రైస్తవుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఏ విధముగా హింసను ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు. దేవుని వ్యతిరేకులు ఏ విధముగా  మాటలాడుతారు అనేది మనము తెలుసుకుంటున్నాం.    పూర్వం  క్రైస్తవులను ప్రభుత్వాలు, పెద్దలు హింసించడము మొదలు పెట్టినప్పుడు  కొంతమంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని వీడి జీవించారు మనము మొదటి పఠనములో యూదుల గురించి వింటున్నాము కానీ మొదటి రెండు ,మూడు  శతాబ్ద క్రైస్తవులకు ఇటవంటి  హింసలకు కూడిన జీవితం ఎక్కువుగా  అనుభవించారు. కొంతమందిని అడవి మృగాలకు ఆహారముగా ఇచ్చారు, మరి కొంతమందిని ఘోరముగా హింసించి అగ్నికి ఆహుతి చేశారు, కొంతమందిని హింసించి చంపించారు.  కానీ చాలా మంది వారి విశ్వాసములో గట్టిగా నిలబడ్డారు. ఈరోజు మనకు ఉన్న సవాలు ఏమిటి అంటే  నేను క్రీస్తు విశ్వసిగా  హింసకు గురి అయినట్లయితే, హింసను తట్టుకొని   క్రీస్తు కోసము నిలబడగలనా ? అంత గొప్ప విశ్వాసము నాకు ఉన్నదా ? అని  ఆలోచించాలి. 

మనుషులు  ఏవిధముగా  ఒకరిమీద పుకార్లు పుట్టిస్తారు,  ఏమి చేయని వారిమీద, ఎటువంటి  చెడు చేయకపోయినా కొన్ని సార్లు ఈ పుకార్లు చాలా భయంకరముగా ,  ప్రమాధకరముగా తయారవుతాయి. అమాయకులు ఇటువంటి విష కాటులకు గురి అవుతుంటారు. విశ్వసిగా  జీవించేవారు   ఆవిశ్వాసుల చేతులలో శ్రమలను అనభవించవలసి వస్తుంది. సొలోమోను జ్ఞాన గ్రంధములో మనము చెడ్డ వాని స్వభావాన్ని చూస్తున్నాము. వాడు మంచి వాని  మీద అకారణముగా పగ తీర్చుకుంటున్నాడు. ఇక్కడ నీతిమంతుడు  అంటే దేవుని చిత్తాన్ని పాటించి మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించిన వాడు. ఎటువంటి చెడును చేయనివాడు.  దుష్టులు ఇటువంటి మంచి జీవితమును జీవించే వాని మీద కుట్రలు పన్నుతున్నారు..మొదటి పఠనానికి మరియు మత్తయి 27: 41-44 కి మధ్య సంభంధాన్ని మనము చూడవచ్చు.  ఇక్కడ వారు యేసుప్రభువును ,నీతిమంతుడు అన్నట్లుగానే అంటున్నారు. నీవు దేవుని కుమారుడవైనచో దిగిరమ్ము అని పలుకుచున్నారు. ఇతడు కేవలము దేవుని కృప వల్లే గెలుస్తాడు. దేవుని మీద నమ్మకానికి విలువ వుంది. నీవు దేవుని నమ్మితే కొన్ని సార్లు దుష్టుల కుట్రల వల్ల నీ పేరు పోవచ్చు,  మన సంభందాలు దెబ్బతినవచ్చు,కొన్ని సార్లు ప్రాణాలు పోవచ్చు. నమ్మకము అంటే చివరికి దేవుడే గెలుస్తాడు, తనను నమ్మిన వారిని కాపాడుకుంటాడు.  కాబట్టి వీటన్నిటిని పోగొట్టుకున్న పరవాలేదు. దేవుని మీద నమ్మకంతో నీతీమంతమైన జీవితము జీవించడానికి ప్రయత్నించాలి. 

రెండవ పఠనం లో యాకోబు గారు మన పాప ఫలితాలను వివరిస్తున్నారు. అసూయ స్వార్ధపూరిత కోరికలు మనలో ఉన్నాయి, ప్రతి చెడు పని సాధనలో స్వార్థముంది, అసూయ ఉంది. మనకు ఉన్న సవాలు ఏమిటీ అంటే మన అసూయ, స్వార్ధ బుద్దికి వ్యతిరేకముగా వ్యతిరేకముగా సదా యుద్ధము చేయడమే.  యాకోబు గారు చెప్పినట్లు ఎక్కడ అసూయ స్వార్ధ బుద్ది ఉంటుందో అక్కడ సకల చెడు గుణాలు ఉంటాయి. ఒక సారి మన సంఘాలను, సమాజాన్ని చూసినట్లయితే మనకు ఇది ఇట్టే తెలుస్తుంది. ఒక నెల క్రితమే వార్తా పత్రికలో చూసాము . నెల్లూరులో అనుకుంటా ఒక వ్యక్తి  తన బాబాయిని మద్యపాన షాపు వద్దకు ప్రేమగా తాగుదామని తీసుకొని వచ్చాడు. తాగిన వెంటనే తన బాబాయిని కత్తితో చంపుతున్నాడు. అందరూ చూస్తుండగానే అతనిని హత్య చేశాడు, కారణం ఏమిటి అంటే వారికి ఆస్తి తగాదా ఉన్నది మొత్తము మాకే కావాలి అనే  స్వార్ధం, తన సొంత అన్న లేక తమ్ముడు కుటుంబాలు ఎదుగుతున్న తట్టుకోలేని అసూయ మనలో ఉంటుంది.  ప్రియ మిత్రులారా మనము క్రీస్తు అనుచరులము   అయన మాటలను మనము మరిచిపోకూడదు, అయన మొదటి అనుచరుల వలె జీవించాలి. పునీత యాకోబు గారు ఆంతరంగిక యుద్దము గురించి మాటలాడుతున్నారు, మనము చెడు మీద ఎప్పుడు యుద్దము చేస్తూనే ఉండాలి.   అంత నాకే కావాలనే స్వార్ధబుద్ది కూడా మనకి ఉంది దీని నుండి ఎలా బయటకు రావాలి. మన స్వార్ధ బుద్దిని  విడిచి పెట్టడానికి, మనము ఉదారతను అలవరచుకోవాలి.  యేసు ప్రభువు ఏ విధముగా తన ప్రేమను  మనకు చూపించినది మనము తెలుసుకొని ఆ విధముగా జీవించడానికి సిద్ద పడాలి. ఆయన ఉదారత్వము, మరియు  ప్రేమ మనకు మార్గ చూపరిలా మారి మనము  స్వార్ధ , అసూయ బుద్దిని వీడునట్లు చేస్తుంది. 

ఈనాటి సువిశేషములో మరల ఒకసారి యేసు ప్రభువు తన శ్రమలు, మరణము, పునరుత్తమును గురించి చెప్పుతున్నారు. కానీ  యేసు ప్రభువు చెప్పే మాటలను శిష్యులు ఎవరు అర్దము చేసుకోలేకపోతున్నారు. కఫర్నాముకు వచ్చిన తరువాత యేసు ప్రభువు వారికి ఒక  ఒక  గొప్ప సత్యాన్ని తెలియచేస్తున్నాడు. తన శిష్యులు తన మాటలు అర్దము చేసుకొని వారి జీవితాలు మార్చుకోవాలి  అని అనుకున్నాడు. వారి ద్వార ఈ లోకానికి తన మార్గాన్ని   బోధిస్తున్నాడు. వారు అక్కడ కూర్చొని  ఉన్నప్పుడు వారిని మీరు మార్గ మధ్యలో దేని గురించి వాదించుకుంటున్నారు  అని  వారిని అడుగుతున్నారు. 

వారు  తాము చేసినది  తప్పని తెలిసి సిగ్గుతోటి చెప్పడానికి  ఇష్టపడకపోయినప్పటికి అయిష్టముగానే మాలో ఎవరు గొప్ప వారు అను విషయాన్ని వాదించుకుంటున్నామని  ఒప్పుకుంటున్నారు. వారి వాదనలకు యేసుప్రభువు ఇచ్చిన సమాదానము వారికి మాత్రమే కాక ప్రతి ఒక్కరికి, ప్రతి కాలనికి, నిన్న రేపటికి కూడా ఒక మంచి ఔషదము లాంటిది. ఒక మంచి పాఠము అవుతుంది. ఎవరైతే మొదటి వారు కాగోరుతున్నారో వారు కడపటి వారిగా ఉండాలని బోధిస్తున్నారు.  

 యేసు ప్రభువు  ఒక చిన్న బిడ్డను వారి మద్య ఉంచి చిన్న పిల్లల వలె ఉండాలని చెప్పుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఒక చిన్న బిడ్డను  వారి మధ్య ఉంచాడు. ఇంతకు ముందు యేసు ప్రభువు తన శిష్యులకు శ్రమలు , మరణము గురించి చెప్పడం జరిగినది. కానీ శిష్యులు దానిని అర్దము చేసుకోలేదు. మార్కు 9:32. వారు ఆయన మాటలు విని కూడా   ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నారు.   చిన్న పిల్లలు నిర్మల హృదయులు , కొన్నిసార్లు మారం చేసిన కానీ వారికి వారి తల్లి తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకముతోనే చేస్తారు. చిన్న పిల్లలు ఇతరులను సహాజముగానే ప్రేమిస్తారు. ఎదుటివారిని లేదా అందరినీ ఎటువంటి తర్కము లేకుండా నమ్ముతారు, ప్రేమిస్తారు. అందుకే కొత్తవారి దగ్గరకు వెళ్లకూడదని తల్లిదండ్రులు పిల్లలకు  చెప్పుతారు. పిల్లలు చాలా తేలికగా ఎవరినైన  క్షమిస్తారు. చిన్న పిల్లలకు  ఎటువంటి  అధికారాలు  ఏమి ఉండవు. వారికి ఏమి శక్తి లేదు, వారికి  మత పరమైన విలువ ఉండదు. అది  యూదుల ఆచరము.  కానీ యేసు ప్రభువు వారిని ఎలా చూస్తున్నారు అని మనము నేర్చుకోవాలి.  యేసు ప్రభువుకి పిల్లలు కేవలము దేవుని అనుగ్రహము మాత్రమే కాదు.  దేవుని రాజ్యములో వారికి ప్రాముఖ్యత ఉంది. చిన్న పిల్లలను నా వద్దకు రానివ్వండి అని యేసు ప్రభువు అంటున్నారు. చిన్న బిడ్డలను నా పేరున స్వీకరించువారు నన్ను స్వీకరించినట్లే అని అంటున్నారు.   మార్కు 10: 14-15,  మార్కు 9: 37. వారిది కేవలం అమాయకత్వము కాదు, వారిలో మనము చూడవలసినది వారి నిర్మలత్వము. నిర్మలత్వము అనేది దేవుని గుణము.  ఎటువంటి చెడు ఆలోచనలు వారులో ఉండవు. 

యేసు ప్రభువు చెప్పినట్లుగా మనము ఇక్కడ ఉన్నది, సేవ చేయడానికె  కానీ సేవ చేయించుకోవడానికి కాదు. యేసు ప్రభువు తన శిష్యులకు సేవకులుగా ఉండాలని చెప్పుతున్నారు. మీరు సేవ చేయునప్పుడు మీరు మీ పూర్తి శక్తిని ఊపయోగించి చేయమని చెప్పుతున్నారు. మీ సేవకు ప్రతి ఫలాన్ని ఆశించవద్దు అంటున్నారు. ప్రతిఫలాన్ని ఎందుకు ఆశించవద్దు అంటున్నారంటే ఆయన వలె మనము జీవించాలని, ఆయన గుణ గణాలు మన ద్వార వెల్లడి కావాలని.  యేసు ప్రభువు అందరికీ కావలసిన అవసరాలను తీరుస్తున్నారు, వారికి ఆరోగ్యం ఇస్తున్నారు, వారి అనారోగ్యాన్ని తీసివేస్తున్నారు. వారిని అపవిత్ర శక్తులనుంచి కాపాడుతున్నారు, కానీ వారినుండి ఏమి ఆశించలేదు. ఈ జీవితము  మనకు కావాల్సినవాటిని సాధించుకోవడానికి మాత్రమే కాదు , లేక ఇతరులతో పోటీ పడటానికి వారి కంటే మనము గొప్ప వారము అనిపించుకోవడానికి మాత్రమే కాదు.  మనము ఇటువంటి వాటికి మాత్రమే  ప్రాముఖ్యతను ఇస్తే నిజమయిన  మానవీయ విలువలు కోల్పోయిన వారిగా ఉంటాము. ఎందుకంటే ఇతరులతో పోల్చుకొని , ఇతరులకంటే గొప్పగా ఉండాలని అనేక తప్పులను చేస్తున్నాము. మనకు ఇష్టమైన వాటిని సాధించుకోవడానికి ఎంతటి ఘోరమైన పనిని అయిన చేయడానికి సిద్దపడుచున్నాము. మానవ విలువలు కోల్పోతున్నాము.  మానవీయ విలువలు కోల్పోయినవాడు మనిషి అని ఏ విధముగా అనిపించుకోగలడు? అందుకే  యేసు ప్రభువునుండి ఈ మానవీయ విలువలు నేర్చుకోవాలి.  

ఈ లోకాన్ని మార్చే విధానము కేవలం ఇవ్వడము ద్వార మాత్రమే. ప్రతి ఒక్కరూ క్రీస్తు వలె  చుట్టూ ఉన్న వారి భాదలు కష్టాలలో పాలుపంచుకుంటే ఖచ్ఛితముగా లోకము మారుతుంది. యేసు ప్రభుని సందేశము ఇక్కడ చాలా ముఖ్యమైనది. మనము అందరము  దేవుని బిడ్డలము మనం సోదరి సోదరులని తెలియచేస్తుంది.  క్రీస్తు శిష్యులుగా మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, సహాయం చేస్తూ  జీవించాలని బోధిస్తుంది. మనము యేసు ప్రభువు శిష్యులు అయ్యే ముందే మనము ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన జీవించి ఉండగా కూడా ఆయనను విశ్వసించడము, ఆయనను అనుసరించడం  అంత సులువు కాదు. అది అందరికీ సాధ్యపడదు. నిజమైన క్రైస్తవ జీవితము కేవలము మానవీయ విలువలు పాటించడమే కాక ఇంకా ముందుకు పోవడము. ఇతరుల కోసం మనలను మనం త్యజించు కోవడం. ఇది సాధ్య పడేది కేవలము నీవు క్రీస్తుని మరియు నీ సోదరుని పూర్తిగా ప్రేమించినప్పుడు కనుక ఆ విధముగా జీవించడానికి ప్రయత్నిద్దాం. 


26 వ సామాన్య ఆదివారం

 26 వ సామాన్య ఆదివారం 

(సంఖ్యా  11:25-29) (యాకోబు  5:1-6) (మార్కు 9:38-43,45, 47-48)

  ఈనాటి సువిశేషము సహనము, దేవుని అనుగ్రహాలు పొందటము, పాప హేతువు కాకుండా ఉండాలని   బోధిస్తుంది. సహనము అంటే  మనకు సంబంధం లేని వేరే వ్యక్తులను కూడా  భరించడమని   మనము అనుకుంటాము. మనము  వారికి ఎటువంటి హాని చేయకుండా వారి విశ్వాసాలను వారు పాటించుటకు ఆటంకం కలిగించకుండా , ఇతరులను సమస్యగా చూపక  ఉండటము అనుకుంటాము.   యేసు ప్రభువు సహనం గురించి చెబుతున్నప్పుడు అది  మనము అనుకుంటున్నట్లు  కాదని అర్దము అవుతుంది.  ఆయన దృష్టిలో సహనము అంటే ఒక వ్యక్తి పట్ల  సంపూర్ణమైన సానుభూతి  కలిగి ఉండటము. మరియు ఆ వ్యక్తిని పూర్తిగా  అర్దము చేసుకొని అంగీకరించడము మనలో ఒకరిగా   చేసుకోవటము. 

 

దేవుని సహనము ఎలా ఉంటుంది


దేవుని సహనము చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే, పూర్వ నిబంధనలో  నినేవే ప్రజలు చాలా పాపాలు చేసి  దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. అనేక సార్లు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తున్నారు. వారి పాపలు ఘోరమైనవి . వాటిని వినినవారు వారిని శిక్షించాలని కోరుకుంటారు. చివరకు ప్రవక్త కూడా వారిని శిక్షించాలని కోరుకున్నాడు. దేవుని మంచితనము, క్షమ గుణము తెలిసిన ప్రవక్త ఎక్కడ దేవుడు  వారిని  శిక్షించకుండా క్షమిస్తా డో అనే టువంటి  వారికి మరు మనస్సు  పొందండని చెప్పకుండా పారిపోతున్నాడు. ఆ ప్రవక్తే యోనా గారు. మనకు  పౌలు గారి గురించి తెలుసు పౌలు గారు క్రైస్తవులను అనేక శ్రమలకు, బాధలకు, హింసలకు గురిచేశారు. కానీ దేవుడు ఆయన  పట్ల  ఎంతో సహనం కలిగి ఉన్నాడు. ఆయనను క్షమిస్తున్నాడు.  ఆయనను తన సేవకు వాడుకుంటున్నాను. కానీ ఈనాటి మొదటి పఠనములో మరియు సు విశేషములో యోహోషువ మరియు యోహను  దేవుని పేరు మీద మంచి చేసేవారిని కూడా సహించలేకపోతున్నారు. ఎందుకంటే మంచి చేస్తే మేమే చేయాలి అనుకుంటున్నారు.

 

సహనము లేకపోతే  మనము ఎలా ఉంటాము.

 సహనము మనలో లేకపోతే  ఏమి జరుగుతుంది అనేది  మనము ఈనాటి మొదటి పఠనము మరియు సు విశేషం లో చూస్తున్నాము.  సహనము లేనప్పుడు దేవుడు ఎలా ప్రవర్తించాలని కూడా మనమే   చెప్పుతుంటాము. ఈనాటి  మొదటి పఠనము మోషే జీవితములో జరిగిన ఒక ముఖ్యమైన  సంఘటన గురించి తెలియ చేస్తుంది. ఇక్కడ దేవుని ప్రేమను ,గుణ గణాలను అర్దము చేసుకున్న వారు, దేవుని  అర్దం  చేసుకొని వారి మద్య వ్యత్యాసము మనము చూస్తున్నాము.  మోషేకు తాను  చేసే పని తనకు చాలా భారముగా ఉన్నప్పుడు దేవుడు అతనికి కొంతమంది సహయకులను ఏర్పాటు చేయడానికి సిద్దపడ్డాడు. దేవుడు ఒసగిన  70  మందిలో ఇద్దరు ఏల్డాదు , మెదాద్  దేవుని ఆత్మ చేత గుడారము లో ఉన్న వారిలా  ప్రవచిస్తుంటే యోహోషువా భరించలేక పోయాడు.  ఈనాటి సువిషములో కూడా యోహను , యోహోషువా  వలె సంకట స్థితిలో ఉన్నాడు. శిష్యులు  యేసు ప్రభువు తో వారికి జరిగిన ఒక సంఘటన గురించి చెపుతున్నారు. మీ పేరును  ఉపయోగించి ఒకడు  పిశాచములను పారద్రోలుతున్నాడు, మేము వాడిని అలా చేయవద్దు అని వారించామని  అంటున్నారు. అంటే కొన్ని సార్లు దేవుడు ఏమీ చేయాలో కూడా మనమే నిర్ణయించాలి అనుకుంటాము.  దేవుడిని మన ఇష్టమైన రీతిగా ఉండాలని కోరుకుంటాము. నిజానికి  దేవుడిని మనము ఆయన ఏమీ చేయాలో నిర్ణయించలేము. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, విలువలను కాపాడాలని మనమే దేవుని సంకల్పానికి అడ్డుపడుతూ ఉంటాము. దేవుని విధానాలు మనకు పూర్తిగా ఎప్పటికీ అవగతం కావు.  వాటిని అవగతం చేసుకోనప్పుడు మనము కొన్ని సార్లు యోహోషువ, యోహను వలె మాటలాడుతుంటాము. దేవుని విధానాలు తెలియక మనము అనేక సార్లు ఆయన ఇచ్చిన అవకాశాలను వరాలను పాడు చేసుకుంటుంటాము.

యేసు ప్రభువును శిష్యులు  ఏవిధముగా అర్దము చేసుకున్నారు

 ఎందుకంటే ఇంతకుముందే  వారు యేసు ప్రభువుని మెస్సీయ అని ప్రకటించారు. అంటే వారు యేసు ప్రభువును ఒక రక్షకుని గా భావించారు. వారి దృష్టిలో రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా పోరాడి వారికి రాజకీయ  స్వాతంత్ర్యం ఇచ్చే వానిగా భావించారు.  అంటే వీరు ఆయన ప్రతినిధులుగా , దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉన్నారు పెత్తనము చేయవచ్చు అనుకున్నారు. మాకు వచ్చే ప్రత్యేక వసతులు, గౌరవాలు తగ్గుతాయని  అనుకుంటున్నారు.  యేసు ప్రభువుకి ఇటువంటి వాటిని ఆలోచిందడానికి సమయము లేదు. ఎందుకంటే ఆయన గాయ పడిన లోకాన్ని నయం  చేయడానికి వచ్చాడు. మరి కొంతమంది అసహన పరులను తయారు చేయడము వలన అది సాధ్య పడేది కాదు, ఈ లోకము దేవునికి చెందినది. జనులందరూ  ఆయనకు చెందిన వారే అనే  విషయాన్ని వారు మర్చిపోయారు. మనము ఇక్కడ అసూయ , భయం చూస్తున్నాము. వారి స్థానాలు ఎక్కడ పోతాయో అని వారు అసూయ తో భయపడుతున్నారు.


  దేవుని అర్ధము చేసుకున్నవారు ఏ విధముగా ఉంటారు అని చెబుతుంది


 యేసు ప్రభువు తన శిష్యులకు ఎవరిని  దేవుని గురించి  బోధించడంలో   వారించ వద్దు అంటున్నారు, వారిని వారించటము మన పని కాదు. మనము దైవ వాక్యాన్ని ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశ్యము దేవుని  ప్రేమ , ఈ దైవ ప్రేమను అర్దము చేసుకోవడానికి  మనము వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. దేవుని ప్రేమను ఇతరులకు చెప్పడానికి మరియు పంచడానికి వాక్యము ఉపయోగపడుతుంది. దేవుని ప్రేమలో సహనము ఉంది.   దేవుని అర్దము చేసుకొని ఆయన లో ఐక్యమైన వానికి  ఎటువంటి  భేదము ఉండదు. అందరినీ సమ దృష్టితో చూడగలుగుతాడు. మోషే మరియు యేసు ప్రభువు కూడా శిష్యుల కోరికను తిరస్కరిస్తున్నారు, ఎందుకంటే అందరూ దేవుని ఆత్మను పొందాలి అందరూ మంచి పనులు చేయాలను దేవుడు కోరుతున్నారు. అందుకే మోషే చెపుతున్నారు. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు   అయిన ఎంత బావుండును అంటున్నారు.   మనము వేరే వారి  మీద ప్రేమతో నో , లేక అభిమానముతో నో మంచి  చేసే వారిని  లేక చెప్పే వారిని   ఆపుతున్నామా ? ఒకసారి పరిశీలించుకోవాలి.

 

దేవుని అనుగ్రహము పొందడానికి కారణాలు మనకు తెలియవసరము లేదు

 

 పౌలు గారు, నినేవే ప్రజలు దేవుని అనుగ్రహము పొందుతున్నారు.  ఈనాటి  పఠనాలలో దేవుని ఆత్మ  తన సేవకుల మీద కు రావడము వారు ప్రవచించడము మనము చూస్తున్నాము. దేవుని  ఆత్మను పొందడానికి ఏటువంటి ఆంక్షలు లేవు, ఏ జాతి , వర్గ భేదాలు లేవు అని నేర్చుకుంటున్నాము. పౌలు గారు క్రైస్తవ వ్యతిరేకిగా జీవించారు, కానీ దేవుని ఆత్మను పొందారు. నినేవే ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించారు, కానీ దేవుని అనుగ్రహము పొందారు.

ఈనాటి  మొదటి పఠనానికి సువిశేషానికి చాలా పోలీకలున్నాయి. దేవునికి కొంతమంది మాత్రమే ఇష్టులు , ప్రత్యేకమైనవారు అంటూ ఏమి ఉండరు. ఆపో. కార్య 10 :34 తనకు కావలసిన వారిని తన పనికి ఎంచుకుంటాడు. దేవుని ఆత్మ మంచిని చేయడానికి వారికి సహాయ పడుతుంది.

 

మనలో ఒకడు కాదు కానీ మంచి చేసేవాడనితో మనము ఎలా ఉండాలి


యేసు ప్రభువు ఆలోచన ప్రకారము ఒకనిలో ఉన్న మంచితనాన్ని మనము గుర్తించాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనలను ఏకము చేయడానికి, మనల్ని విభజించడానికి కాదు. మనల్ని  విభజించే వాటిని , ఇతరులను చెడు మార్గములోనికి తీసుకెళ్ళేవాటిని మన నుంచి దూరము చేయాలి. అందుకే నీ చేయి నీవు పాపము చేయడానికి కారణమైతే దానిని తీసివేయమని చెపుతున్నాడు.

మతము కూడా ఒక వ్యసనము అవుతుంది కొంతమంది జీవితాలలో. యేసు ప్రభువు మనల్ని  గొప్ప వారిణిగా పరిగని చేది  మనము చేసే ప్రేమ పూర్వకమైన సేవ ద్వార మాత్రమే కానీ మత ఆదరముగా మనము చేసే విభజనను బట్టి కాదు.

మోషే ఇటువంటి అసూయ అవసరము లేదు అని  అర్దం చేసుకున్నాడు. మనం అందరం  దేవుని అనుగ్రహాలను కోరుకుంటున్నాము. ఆయన తనకు నచ్చిన వారికి వీటిని ఇవ్వవచ్చు. కొన్ని సార్లు మనము అంగీకరించలేని వ్యక్తులకు దేవుని అనుగ్రహాలు ఎక్కువగా రావచ్చు. ఎంతో మంది క్రైస్తవులను హింసించిన పౌలు గారిని దేవుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నాడు.

 కొన్ని అ భద్రతలు మనల్ని  మాత్రమే దేవుడు ప్రేమించాలి అన్నట్లుగా చేస్తున్నాయి.  అసూయ మరియు పాప  కారకమైన పని చేయకూడదని నెరపుతున్నాయి.  నిజమైన యేసు ప్రభువు  శిష్యులు  చిన్న పిల్లలు లాంటి వారు . యేసు ప్రభువు యేసు ప్రభువు వారిని ఎంతగానో రక్షించుకుంటున్నాడు.  అందుకే వారిని చెడు మార్గమునకు  వెళ్ళకుండా చూడాలి.   ఎవడైతే వారిని తప్పుడు మార్గమునకు తీసుకుపోతాడో వారిని నరకమునకు వెలుతారు అని చెపుతున్నారు మనకున్న అ భద్రతా , కోరిక , ఆశలు,  గర్వం వలన ఇతరులను మనము దూరముగా ఉంచుతాము. వారిని పట్టించుకొము.  నరకము అంటే  దేవునినుండి దూరముగా ఉండటమే. పర లోకము అంటే   దేవుని సాన్నిధ్యములో  నివసించడము.  


లూకా 14:25-33

  23 వ సామాన్య ఆదివారం 

లూకా 14:25-33  

అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: నన్ను వెంబడింపగోరి ,తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్ట దలచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి, దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా, లేదా అని పర్యాలోచన చేయడా?అటుల కాక, పునాది వేసిన పిదప, నిర్మాణము పూర్తి చేయజాలని యెడల చూచు వారు, ఇతడు ఆరంభశూరుడే కాని కార్య సాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్దమునకు వెళ్ళుటకు ముందు, ఇరువది వేల సేనతో తన పై దండెత్తి వచ్చు శత్రురాజును తన పదివేల సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని యెడల, శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. 

"అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను." యేసు ప్రభువు చేసే పనులను చూసి ఆయన అద్భుతములను చూసి, ఆయన వారికి సమకూర్చుతున్న ఆహారం చూసి అనేక మంది ఆయనను ప్రవక్తగా, రక్షకునిగా భావించి  ఆయనను వెంబడిస్తున్నారు. ఎక్కువ మంది ఆయన నుండి ఏదో ఒకటి ఆశించి ఆయనను అనుసరిస్తున్నారు. అది తప్పు కాదు. కాని నిజానికి ఆయన ఇవన్నీ ఇస్తున్నప్పటికి, వీటికంటే ఆయన వాగ్ధానం చేసేది గొప్పది. నిజానికి ప్రజలకు దాని గురించి అవగాహన లేదు.  ఆయనతో ఉన్న వారు అందరు ఆయన అనుచరులం అని అనుకుంటున్నారు. ఆయన అనుచరులు కావాలి అని అనుకునేవారు ఏమి చేయాలో, ఎలా ఉండాలో యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో తెలియ పరుస్తున్నారు. 

యేసు ప్రభువును వెంబడించాలి అనుకునేవారు ఏమి చేయాలి? యేసు ప్రభువు చెబుతున్న షరతులు ఏమిటి అంటే "తన తల్లిదండ్రులను, భార్యను,బిడ్డలను అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు." అని ప్రభువు చెబుతున్నాడు.  తల్లి దండ్రులను గౌరవించాలి అనేది ధర్మ శాస్త్రం లో ఉన్నది, కుటుంబాన్ని కాపాడుతూ, వారిని మంచిగా తీర్చి దిద్దటం, బాధ్యత గల ప్రతి యూదుని కర్తవ్యం. దానిని దేవుడు కూడా ఎంతో హర్షిస్తాడు, మరి యేసు ప్రభువు ఎందుకు ఇలా మాటాడుతున్నారు? ఒక సారి యేసు ప్రభువు దేవాలయంలో తప్పి పోయినప్పడు ఏమి అంటున్నారో చదివితే మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. లూకా 2: 48 "అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసితివి ? నీ తండ్రియు ,నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఏల వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా? అని ఆయన బదులు పలికెను." యేసు ప్రభువు జీవితంలో తండ్రి పని చేయడం, లేక దేవుని చిత్తం నెరవేర్చడం అనేది  అత్యంత ముఖ్యమైనది, దాని తరువాతనే ఏ పని అయిన , అందుకే ఆయన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా అహరం అని అంటున్నారు. కనుక ఇక్కడ  , నాకు ఇష్టమైన , లేక నా కుటుంబ సభ్యులైన లేక ఇతర ఏ విషయము కూడా తండ్రి చిత్తముతో పోల్చినచో తక్కువదిగానే ఉండాలి, ఇది మనం తెలుసుకోవలసినది యేసు ప్రభువు జీవితం ద్వారా. 

యేసు ప్రభువును అనుసరించుట వలన ఏమి జరుగుతుంది. యేసు ప్రభువు తన తల్లిని ద్వేషించలేదు. కనుక అది ఖచ్చితముగా తల్లిని, తండ్రిని, తోబుట్టువులను  అసహ్యించుకోవడం కాదు. కాని తాను దేవుని పని చేయడానికి   ఎటువంటి ఆటంకం ఉండకూడదు. అదే విషయాన్ని యేసు ప్రభువు తాను దేవాలయంలో తప్పి పోయినప్పుడు చెబుతున్నారు. 

కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభువు జీవితంలో ఇదే సంధర్భన్ని మనం చూస్తున్నాం. తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి తన ప్రాణమును కూడా తృణప్రాయముగా త్యజించడానికి వెనుకాడలేదు, ఇప్పుడు ఆయనను అనుసరించాలి అని అనుకునేవారు, ఆయన కోసం, ఆ విధంగా తమ ప్రాణమును కూడా త్యజించడానికి సిద్దపడాలి.  అని ప్రభువు చెబుతున్నారు. ఒక వేళ మనం  ఆయన శిష్యుడు కాగోరి, దానికి మనం జీవితాన్ని త్యజించిన యెడల మనకు ఏమి వస్తుంది? మనం ఆయన శిష్యులు అవుతాం. మనం జీవం పొందుతాము, ఎందుకంటే నాకోసం తన ప్రాణమును కోల్పోవు వాడు దానిని నిలుపుకొనును అని ప్రభువు వాగ్ధానం ఇస్తున్నాడు. నిజానికి ఆయన కోసం మనం ఏమి కోల్పోతున్నామో అది సమృద్దిగా దొరకుతుంది. దేవుడు ఇచ్చేదీ సమృద్దిగా ఇస్తాడు. 

తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. యేసు ప్రభువును అనుసరించేది ఏదో ఒక రోజు లేక సమయంలో మాత్రమే కాదు. ప్రతి నిత్యం అది జరుగాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అని ప్రభువు కోరుచున్నాడు.  ఏమిటి ఇక్కడ సిలువ అంటే రోజు వారి జీవితంలో యేసు ప్రభువును అనుసరిస్తున్న సమయంలో  ఎదురయ్యే సమస్యలను అదికమిస్తూ ఆయనను అనుసరించుటలో ముందుకు సాగటమే. 

ఈరోజు యేసు ప్రభువు సువిశేషంలో చెప్పే మాటలు చాలా కఠినముగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కొన్ని సార్లు ఈ మాటలు యేసు ప్రభువు నుండి వస్తున్నాయా? అని ఆశ్చర్య పడుతుంటాం. ఈ రోజు సువిశేషంలోనే కాక వేరె సంధర్బంలో కూడా యేసు ప్రభువు ఇటువంటి మాటలు చెప్పారు. అవి  , యేసు ప్రభువు దేవాలయాన్ని శుభ్ర  పరిచే సమయంలో, తన శరీరం భుజించాలి అని అన్నప్పుడు, తనను అనుసరించమని యువకుడను అడిగిన సమయంలో  ఆయన మాటలు అర్ధం చేసుకోవడం కష్టం అని అనుకుంటాం. ఇవి ఏమిటి నిజానికి అంటే 1. ఆయనతో ఉండటం, దేవాలయాన్ని శుభ్ర పరిచే సమయం. 2. ఆయన శరీరం భుజించడం, 3, ఆయనను అనుసరించడం. నిజానికి మూడు ఒకటే అదే ఆయనతో ఎలా ఉండగలం అనే ఒకే ఒక విషయం చెబుతున్నాయి. 

మనం  ఏమి చేయాలి? ఆయనను అనుసరిస్తే ఆయన వాగ్ధానం చేసే నిత్య జీవితం మనకు వస్తుంది. కాని దానికి తగిన జీవితం మనం జీవించగలమా? మనలను మనం పరిశీలన చేసుకొని దానికి తగిన ఆయుధాలను మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చాలా గొప్పది దానిని కోల్పోకుండా తగిన ఆయుధ సంపత్తిని మనం ఏర్పాటు చేసుకోవాలి. యేసు ప్రభువు ఇక్కడ చెప్పిన రెండు ఉపమానల్లో కూడా సంధి చేసుకొనే సమయంలో మనం చాలా కోల్పోతాము ఎందుకంటే మన కంటే గొప్ప వాడైన రాజు మనతో సంధికి అనేక షరతులు పెట్టవచ్చు మనకు కేవలం కొద్ది వెసులుబాటు మాత్రమే ఇవ్వ వచ్చు, కాని మన ఇష్టాలు , అన్ని కూడా దేవునికోసం ఇస్తే మనకు ఆయననే పొందే భాగ్యం వస్తుంది. ఆమెన్ 

28 వ సామాన్య ఆదివారం

 28 వ సామాన్య ఆదివారం 

సిరా 7:7-11, హెబ్రీ 4:12-13, మార్కు 10:17-30

ప్రియ మిత్రులారా గత ఆదివారం పరిసయ్యులు యేసు ప్రభువును విడాకుల గురించి ప్రశ్నించారు. ఈ రోజు ఒక యువకుడు యేసు ప్రభువును నిత్య జీవం పొందుటకు ఏమీ చేయాలి అని అడుగుతున్నాడు. యేసు ప్రభువు దైవ ఆజ్ఞలు పాటించమని చెప్పారు. ఆ యువకుడు నేను చిన్నప్పటి నుండి వాటిని పాటిస్తున్నానని   చెప్పుతున్నాడు. యేసు ప్రభువు దానికి నీవు చేయవలసి నది ఇంకొక్కటి ఉంది, నీకు ఉన్నదంతా అమ్మి,  పేదలకు  ఇచ్చి వచ్చి నన్ను అనుసరించు అని చెప్పారు. దానికి ఆ  యువకుడు నిరాశతో వెళ్ళిపోతున్నారు.  ఎందుకంటే అతనికి చాలా  సంపద, ఆస్తులు ఉన్నాయి వాటిని కోల్పోవడానికి సిద్దముగా లేడు. 

ఎందుకు ఆ యువకుడు యేసు ప్రభువును అనుసరించడానికి రాలేదు

పునరుత్థానము మీద ఆనాటి రోజులలో చాలా తక్కువ మందిలో  నమ్మకము ఉండేది.  పరిసయ్యులు పునరుత్థానము ఉంది అని భోదించేవారు. కానీ సద్దుకయ్యులు నమ్మేవారు కాదు.  యేసు ప్రభువు అందరికీ అంతిమ తీర్పు ఉందని విశ్వాసులకు నిత్య జీవం ఉందని బోధించారు. యేసు ప్రభువు బోధనలు  వారిలో నిత్య జీవానికి ఒక ఆశను రేకెత్తించాయి. ఆ కాలములో అందరూ దీనిని నమ్మలేదు, నిత్య జీవం ఉంటే మంచిది , నాకు దేవుడు ఇస్తే దానిని తీసుకోవడానికి సిద్దమే కాని దాని కోసము ఇప్పుడు ఉన్న ఏ ఆనందాన్ని  వదులుకోవడానికి సిద్దముగా లేను.

నిత్య జీవము పొందడానికి నేను ఏమీ చేయాలి అడిగినప్పుడు నీకు ఉన్నదంతయు  వదలి వేయాలనే  సవాలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు. ఈ యువకునికి నిత్య జీవము కావాలని ఉంది కాని  తన ఆస్తిని విడిచి వుండటానికి అతనికి ఇష్టం లేదు, తనకు ఉన్న ఆస్తి ఒక ఆశ్రయం అవుతుంది, బలం అవుతుంది, అనుకుంటున్నాడు.   తనకున్న ఆధారాన్ని వదలివేయడానికి అతనికి ఇష్టం లేదు.

ధర్మ శాస్త్ర బోధనలకు  అనుకూలముగా జీవించిన ఒక యువకుడు యేసు ప్రభువును అనుసరించలేక పోతున్నాడు. ఎందుకు  అంటే మనము పరిశుద్ద గ్రంధములో వినినట్లు , దేవుడే నా ఆశ్రయ  దుర్గము, నా కోట , లేక నా కొండయు ఆయనే అనే మాటలు, అన్నీ ఆపదలనుండి నన్ను కాపాడు వాడు దేవుడే అని మనము చెప్పుతుంటాము.  కానీ నిజానికి మన ఆధారం , ఆశ్రయము అన్నీ డబ్బే అని మనము జీవిస్తున్నాము.  అదే ఈ యువకుడు కూడా చేస్తున్నాడు. నేను అన్నీ చిన్నప్పటి నుండి చేస్తున్నాను అని చెప్పుతున్నప్పటికీ తన ఆశ్రయం, ఆధారం , అన్నీ డబ్బే అన్నట్లుగా జీవిస్తున్నాడు.  

ప్రపంచంలో ప్రజలు   సంపదను వారికి ఆసరా అనుకుంటారు. వారి ముఖ్యమైన పని ఆది సంపాదించడం అదే వారిని రక్షిస్తుంది అని వారు నమ్ముతారు. మనకు తెలుసు ఎంత సంపద ఉన్న మనలను అది కాపాడలేదు అని మనం ఈరోజుల్లో ఎక్కువగా దానిని చూస్తున్నాము. కరోనా సమయములో సంపదలు కాపాడలేకపోయాయి. కానీ ఇంకా దానికోసమే పరుగెడుతుంటాము. నీ ఆశ్రయం, నీ అండ , నీ ఆసరా దేవుడు అయితే యేసు ప్రభువును అనుసరించటము తేలికవుతుంది. లేక పోతే యువకునిలా వెనక్కు వెళ్లిపోతాము.

నిత్య జీవం పొందటము ఎందుకు కష్టము

యేసు ప్రభువు ధనిక యువకుడిని నిత్య జీవం పొందడానికి ఆ యువకుని లో ఉన్న లోపం గుర్తిస్తూ   రెండు షరతులను పెడుతున్నారు, మొదటగా తన ఆస్తులను తనకున్నదంత వదిలివేయాలని అంటున్నారు,  అనేకమంది క్రైస్తవులు ఈ పని చేసి వారికి యేసు మీద ఉన్న ప్రేమ చూపించారు.  రెండవ షరతు నన్ను అనుసరించు అని అంటున్నారు. యేసు ప్రభువు ఆ యువకుడిని  తన శిష్యుడుగా కావాలనుకున్నాడు.  కానీ  ఆ యువకుడు బాధతో, నిరాశతో వెళ్లిపోతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మొత్తము వదలి యేసును అనుసరిస్తారో అప్పుడు అతడు యేసు శిష్యునిగా ఉండటానికి తగిన వాడు  అవుతాడు, తనకు తెలియకుండానే యేసు క్రీస్తు పనిలో పాలుపంచుకుంటాడు.  శిష్యులకు యేసు ప్రభువు దీని గురించి వివరిస్తూ ధనవంతులకు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి ఎదురయ్యే సవాళ్లు గురించి చెప్పారు.  ధనవంతునికి పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము? అని యేసు ప్రభువు అనగానే శిష్యులు అంటున్నారు ఇంకా ఎవరు ప్రవేశించగలరు? అందుకే యేసు ప్రభువు చెప్పుతున్నారు మానవులకు   అది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము ఎందుకంటే అది ఇచ్చేది  దేవుడు. నీ సంపదలతో దానిని నీవు కొనలేవు. మానవుని ప్రయత్నాలు ఏవి కూడా ఆయనకు నిత్య జీవాన్ని  తీసుకురాలేవు. కేవలము  అది దేవుని వరమే. ఎందుకు పర లోక రాజ్యములో ప్రవేశించుట కష్టము అంటే ధనవంతుడు తన సంపద తనకు అన్నీ సమకూరుస్తుంది అని దేవుని ఆజ్ఞలను పాటించక సంపద లోనే తన సర్వాన్ని చూసుకుంటాడు, వాటిని తన ప్రాణా ప్రాయంగా చూసుకుంటాడు, కొన్ని సార్లు వాటి వలనే తనకు విలువ ఉంటుంది అనుకుంటాడు, సంపదల వలన కొన్ని సార్లు ఎవరిని లెక్క చేయడు , దేవునికి దూరమవుతాడు, మనము పవిత్ర గ్రంధములో చూసే, నాబాలు, ధనవంతుడు లాజరు, కథలో ధనవంతుడు  ఈ కోవకు చెందినవారే. కానీ కొంతమంది తనకు దేవుడు ఇచ్చిన సంపదను మంచిగా వాడుకొని దేవుని మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు.

ఆదిమ క్రైస్తవులు ఏ విధముగా సంపదలను ఆస్తులను పరిగణించారు

 ఆదిమ క్రైస్తవులు  సంపదలను ఏ విధముగా చూసేవారో మనము కూడా అలానే సంపదలను చూడగలిగామా ?  ఒకసారి ఆలోచించండి. వారు ఆస్తులు పెంచుకోవాలి అనుకోకుండా పంచుకోవాలి అని అనుకున్నారు అపోస్తుల కార్యాలలో మనము ఇది చూస్తున్నాము. మనము కూడా దీనిని ఆదర్శము గా తీసుకోవాలి.  వారిలో ఒకరు పెద్ద ఒకరు చిన్న ఏమీ లేరు, వారిలో బలహీనులను వారు ఆదరముతో చూసేవారు.

 ఎందుకు మనం సంపదలను కోరుకుంటున్నాము - మానవుని కి ఏమీ కావాలి

ఈనాటి మొదటి పఠనములో సోలోమోను జ్ఞానము కోసము అడుగుతున్నాడు. దేవుడు చాలా సంతోషించాడు, సోలోమోనును చూసి  ఎందుకంటే ఆయన ఆస్తులకోసం అడగక ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు.  విచక్షణ,  జ్ఞానం అనే వరాలను మనము అడగాలి, అంతేకానీ డబ్బు ,సంపద ,పేరు, అధికారం లౌకిక అందలాలను మనము అడగకూడదు, మనకు కావాల్సిన వాటి కోసము మనము దేవుడని అడుగవచ్చు. కానీ ముఖ్యమైనది ఏమిటి అంటే జ్ఞానము, దానిని అడగాలి.


మనసు ఏ విధముగా ఉంది ఎంత నిర్మలముగా ఉంది


రెండవ పఠనములో హెబ్రీయులకి రాయబడిన లేఖలో ఇటువంటి ఒక వాదనను మనము చూస్తున్నాము. దేవుని వాక్కు మన హృదయాంతరంగాలు తెలుసుకోగలదని చెప్పుతుంది. అంటే మన హృదయంలో ఉన్న వాటిని శుద్ది చేసి  మంచి ఆలోచనలు కలిగేలా ఆయన చేయగలడు. ఈనాటి సువిశేషము నిజమైన ధనవంతుడు ఎవడూ అంటే కేవలము దైవ జ్ఞానము కల వాడు అని నేర్పుతుంది, ఈలోక సంపదలు ఈ జ్ఞానాన్ని పొందటానికి అవి  ఆటంకముగా ఉన్నాయి. 


సంపదల మీద గల ప్రేమ వలన ఏమి కోల్పోతున్నాము

ఆ యువకుడు తన సంపదల మీదే ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. అతనికి ఉన్న సమస్య మొత్తము కూడా ఒకటే తన సంపదలు. ఈ లౌకిక  విషయాలు లేక వస్తువులు మనల్ని నిత్య జీవితం నుండి దూరం చేయడాన్ని మనము అంగీకరించకూడదు. ఈ ప్రాపంచక వస్తువులు, ఆస్తులు సంపదల మీద మనకు ఉన్న ప్రేమ మనము యేసు  ప్రభువుని అనుసరించడానికి అనేక సార్లు ఆటంకముగా  ఉంటున్నాయి. సంపదల మీద అమితమైన  ప్రేమ కలిగి ఉంటే అప్పుడు దేవుని నుండి  దూరం కావడానికి మనము సిద్దపడుతున్నాము అని గుర్తుంచుకోవాలి.

యేసు ప్రభువు తన ప్రాణాన్ని అడగలేదు, కేవలము తన ఆస్తిని కోల్పోవడానికి సిద్దపడమన్నాడు. కానీ నేను అమితముగా అభిమానించే ఆస్తిని నేను కోల్పోవడానికి సిద్దముగా లేను. చివరికి అది నాకు నిత్య జీవితమును ఇచ్చినా కానీ, అంటే సంపదల మీద ప్రేమ వలన నిత్య జీవితాన్ని కూడా వదులుకుంటున్నాం. ఇటు వంటి ఆలోచనలు మనలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఆస్తి , సంపద  అనేది ప్రశ్న కాదు. నీవు  క్రీస్తుని అనుసరించడానికి ఏమీ నీకు  అడ్డముగా ఉన్నదో దానిని వదలిపెట్టడానికి  నీవు  సిద్దముగా ఉన్నావా  లేదా అనేది  ముఖ్యం. మనకు కూడా అనేక సార్లు ఈ నిత్య  జీవం కావాలి అని ఉంది కానీ నాకు ఇష్టమైన దానిని ఈ నిత్య  జీవము కోసము కోల్పోవడానికి నేను సిద్దం కావడము లేదు. నిత్య జీవితం కావాలనే కోరిక సన్నగిల్లి పోతుంది.  ప్రయోజనము లేని సంపదను ఉంచుకుంటున్నాము క్రీస్తుని పోగొట్టుకుంటున్నాము మనకు ఇష్టమయిన దాని కోసము. నిరాశ లో బాధలో కుమిలిపోతున్నాము.

సంపద అనేది మానవుని కి ఉన్న ఒక బలహీనత. ఇక్కడ  యేసు ప్రభువు మనలను పేద వారిగా ఉండటానికి పిలవటము లేదు ఆయన అనుచరులుగా ఉండటానికి పిలుస్తున్నాడు, ఆయన శిష్యులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. వచ్చి నన్ను అనుసరించు అంటున్నారు. యువకుడు సంపద యేసు  ప్రభువు కన్నా  గొప్పది కాదు  అనే సత్యాన్ని తెలుసుకోవాలి. పునీత శిలువ యోహను గారు యేసు ప్రభువుని  పొందటం కోసం సమస్తాన్ని నేను కోల్పోవాలి అంటారు. నీవు క్రీస్తుని కలిగి ఉంటే సమస్తం నీకు ఉన్నట్లే కనుక క్రీస్తు కోసము ఏమైనా  ఆనందముగా చేయడానికి సిద్దంగా ఉండాలి. ఆమెన్   

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...