పేజీలు

18.8.23

పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )

పరాగ్వే లిల్లీ పుష్పం – మరియ ఫెలిసియా (చికితుంగ )


మరియ ఫెలిసియా గుగ్గియారి  ఎచేవెరియా  అనే కార్మెల్ సభ పునీతురాలు జనవరి 12 వ తేదీన , 1925 వ సంవత్సరంలో పరాగ్వే  లోని వియారీక దె స్పిరితూ సంతోలో జన్మించింది.   ఈమె కేవలం 34 సంవత్సరాలు మాత్రమే జీవించింది. ఈ 34 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది.  ఆమెను తన తండ్రి చికితుంగ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవాడు. ఆమె తండ్రి పేరు రామోన్ గుగ్గుయారీ మరియు తల్లి పేరు మరియ అర్మీండా ఎచేవెరియా . ఈమె ఏడుగురు సంతానంలో మొదటిగా బిడ్డగా  జన్మించింది.  1929 వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీన అంటే నాలుగు సంవత్సరాల ప్రాయంలో జ్ఞానం స్నానం పొందింది. 1937 వ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన ప్రధమ దివ్య సత్ప్రసాదం స్వీకరించింది.  ఈమె పరాగ్వే నుండి మొదటి పునీతురాలు.

ఈమె బాల్యం  నుండి కూడా పేదలకు సహాయం చేయుటకు ఎంతో శ్రద్ద చూపిస్తూ ఉండేది. వారి ఇంటిలో ఈమె ఆహారం కోసం లేక సహాయం కోసం వచ్చే వారికి కావలసిన వాటిని ఇచ్ఛే బాధ్యతను తీసుకొని ఎవరైనా సహాయం కోసం లేక ఆకలితో వచ్చిన వారికి తగిన వాటిని ఇస్తూ ఉండేది. ఆమె మూడు సంవత్సరాల వయసులో జ్ఞాన స్నానం పొందింది, అది 1928 , ఫెబ్రవరి 8 వ తేదీన. మరియు 1937 లో డిసెంబర్ 8 న మొదటి సారి దివ్య సత్ప్రసాదం స్వీకరించింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. దీని గురించి ఈమె అనేక సంవత్సరాల తరువాత “నా జీవితపు  అత్యంత సంతోషకరమైన రోజు యొక్క జ్ఞాపకం ఎప్పటికి నా మనసు నుండి చెరిగిపోదు, నేను మొదటి సారి నా దేవునితో ఐక్యం అయిన రోజు, ఆ రోజు నుండి రోజు రోజుకి మంచిగా ఉండాలని నిశ్చయించుకున్నాను”  అని చెప్పింది. 1993 లో ఆమె తన ప్రాధమిక విద్యను  ప్రారంభించింది. ఆమె ఒక సాధారణ విద్యార్థి.  ఎప్పుడు సంతోషంగా ఉండేది. ఎప్పుడు ఉల్లాసంగా అందరితో స్నేహ పూర్వంగా ఉండేది. తన  ప్రాధమిక విద్యను అభ్యసించిన తరువాత 1939-1940 వరకు రెండు సంవత్సరాలు ఆమె తన తల్లికి ఇంటి వద్ద సహాయ పడటానికి చదువును ఆపివేసింది.

1941 వ సంవత్సరం 16 సంవత్సరాల ప్రాయంలో కతొలిక  యాక్షన్ ర్యాంకు లో  సభ్యురాలు అయ్యింది.  ఇది తన జీవితంలో చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఈ సంఘం మీద తన ప్రేమ అనేక సమయాలలో తన లేఖలలో వ్యక్త పరిచింది. ఆమె ఉత్సాహం , అభిరుచి , ప్రేమ తన ఆశయం ఈ సంఘం ద్వారా  వ్యక్త పరుస్తూనే వుంది.   తన జీవిత విధానం ఒక మాటలో చెప్పాలి అంటే నీకు నా సమస్తాన్ని  అర్పిస్తాను. నిజముగా తన జీవితం మొత్తం అలానే జీవించింది.

తన చదువును ఆమె 1941 లో కొనసాగిస్తూ 1945 లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఈ సమయంలో ఆమె  తన సమయాన్ని ప్రత్యక్ష సేవకు కేటాయించింది. ఆమెను ధన్యురాలుగా ప్రకటించిన సందర్భంలో ఆమె యొక్క సేవను పొందిన వారు కూడా దానికి సాక్షులుగా ఉన్నారు. తాను ఏ విధంగా పేద వారి పట్ల  అంకిత భావంతో పని చేసింది అందరికి విదితమే. ఆమెను వారు విధులలో చిరునవ్వుతో చూసేవారు. ఆమె జాలితో అలసిపోయిన ఆత్మల కోసం వెతికే  దేవ దూతలా కనపడేది అని , నలిగి విరిగిన శరీరంతో ఉన్న వారికి సానుభూతి చూపే దేవ దూతల ఉండేదని, వారిని ఆమె ప్రేమిస్తున్నానని ఆమె చెప్పేది అని ఆమె గురించి వారు చెప్పేవారు.

తన భక్తి యుత జీవితం దివ్య సత్ప్రసాదం కేంద్రంగా సాగింది. ప్రతి రోజు యేసు ప్రభువును స్వీకరించడం మరియు దివ్య సత్ప్రసాదం ముందు గంటల తరబడి గడిపేది. తాను చేసే సహాయ కార్యక్రమాలకు కావలసిన  శక్తిని మొత్తం దివ్య సత్ప్రసాదం నుండి పొందుతుండేది. తన సహోదరులు ఆమెను గుర్తు చేసుకుంటూ, ఆమెను వారు కొన్ని సార్లు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆమె మోకాళ్ల మీద ఉండి ప్రార్థించడం వారు చూసేవారు, అని చెప్పారు. మరియ మాత యెడల ఆమెకు గల భక్తి కూడా ఆమె రచనలలో మనకు తెలుస్తుంది.  అందుకే కాబోలు ఆమె మరణించే సమయంలో మరియ మాతతో కలవటం గురించి చెప్పింది.

1950 వ సంవత్సరంలో ఆమె తన కుటుంబంతో పాటు అసూన్సన్ వెళ్లారు. పరాగ్వేలో రాజకీయ అనిశ్చితి కారణంగా అది చాలా ఇబ్బందికర సమయం. వియారీక చాలా సున్నితమైన ప్రదేశం కనుక వారు అక్కడ నుండి వెళ్ళడం ఒక మంచి నిర్ణయం. అక్కడ మరల ఆమె కాథలిక్ యాక్షన్ ర్యాంక్ లో తన పేరు నమోదు చేసుకుంది. అంతే కాదు తను  అంతకు ముందు వలె పని చేయడం  మొదలుపెట్టింది. తన చదువును కూడా కొనసాగించింది.

1952 లో ఇక్కడ ఆమె ఏంజల్ సౌవ యణేస్ అనే  కాథలిక్ యాక్షన్ గ్రూపు యువ నాయకుడైన వైద్య విద్యార్ధిని కలిసింది. అతనితో ఆమెకు మంచి స్నేహం కుదిరింది. ఈ సమయంలో చికితుంగ  ఎంతో ఆధ్యాత్మిక మరియు మానవీయ సంపద కలిగి ఉంది. ఆమె ఆయనను ప్రేమించింది. ఆమె ఈ సమయంలో ఏమి చెప్పింది అంటే ప్రేమలో పడటం చాలా గొప్ప అనేది నిజమైన దైవ కృప,  అనేక సార్లు నేను దానిని గ్రహించాను. ప్రభువా ఇది ఒక అద్బుతమైన నిజం. ప్రేమించడం  మరియు  కలసి ఆ ప్రేమను  గొప్ప ఆశయం కోసం ప్రభువుకు త్యాగం చేయడం ఎంత మనోహరం. దైవ చిత్తానికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలనే కోరికతో ఆ యువకుడు ఐరోపా వెళ్ళి సమీనారీలో చేరాడు.  మన చికితుంగ  కూడా దైవ స్వరం విని కార్మెల్లో  చేరాలి అనే కోరికతో ఆమెకు తెలిసిన నిష్పాదుకా కార్మెల్ మఠ పెద్ద దగ్గరకు వెళ్ళింది. కానీ తన కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. తరువాత కుటుంబ చాలా వ్యతిరేకంగా ఉన్నా, కాని ఆమె ఫెబ్రవరి 2న , 1955 లో తన 30 సంవత్సరాల వయసులో కార్మెల్లో చేరింది.  

కార్మెల్లో ఆమె వ్యక్తిగత జీవితం,  ఆనందం మరియు ఇతరులకు సహాయం చేయడంతో గడిపింది. ఆమెను చూసి ఒక సన్యాసిని దేవుడు మనకు మరియ ఫెలిసియాను ఒక ప్రత్యేక ఆనందంకు,  సరదాగా ఉండుటకు పంపాడు అని అన్నది. నిజానికి ఆమె నవ్వు ఒక పుష్పం వలె ఉంటుంది. అందరు ఆమె నవ్వును చూడటానికి  ఇష్టపడేవారు .

కార్మెల్లో తన మొదటి రోజులు చాలా ఆనందంగా గడిచాయి. దేవుడు ఆమెను కార్మెల్కు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు చెబుతూ గడిపింది. తరువాత కొంత కాలానికి తను  కార్మెల్కు పిలవబడటానికి అర్హులను కాను ఏమో? అని అనుకునేది.

మొదటి కొన్ని నెలలు ఆమెకు స్వర్గంలో ఉన్నట్లు ఉన్నది. కాని తరువాత ఆమె ఆధ్యాత్మిక జీవితం పునీత సిలువ యోహను చెప్పిన విధంగా చీకటి రాత్రి లోనికి ప్రవేశించడం జరిగింది. ఈ సమయంలోనే ఆమె తన పిలుపును శంకించడం జరిగింది. తాను వెనక్కి వెళ్ళవలసి వస్తుంది అనుకున్నది. మదర్ తెరెసా మార్గరీటా అప్పుడు కార్మెల్ సుపీరియర్గా ఉన్నారు. ఆగస్ట్ 14 న , 1955 లో తాను కార్మెల్ సభ పవిత్ర వస్త్రాన్ని స్వీకరించడం జరిగింది.  తన ఆధ్యాత్మిక చీకటి రాత్రి అయిపోయింది. అప్పటి నుండి తాను చనిపోయే వరకు నిజమైన సంతోషాన్ని అనుభవించింది. తన మొదటి మాట పట్టు ఆగస్టు 15, 1956 లో తీసుకుంది.

కార్మెల్ స్వర్గానికి

అనేక మంది కార్మెల్ సభ సభ్యులు, వారు కార్మెల్లో ప్రవేశించడం అంటే ఈ లోకంలో ఇది  స్వర్గం ఏమో అన్నట్లుగా కార్మెల్ గురించి  చెప్పేవారు. అటువంటి వారిలో  పునీత మరియ ఫెలిసియా కూడా ఒకరు.  ఈమె కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే కార్మెల్ లో జీవించింది. ఆమె ఇక్కడ నేర్చుకున్నది, పాటించినది  ఏమిటి అంటే తన అనారోగ్యంలో ఓర్పు కలిగి ఉండటం. ఆమె ఎప్పుడు  చాలా చలాకీగా ఉండేది. తనకు అనారోగ్యం దరిచేరదు  అని ఆమె గట్టిగా విశ్వసించేది. కాని భౌతికంగా చాలా నీరసంగా ఉండటం మొదలయింది. ఆమె కాలేయ వ్యాధికి గురయింది. ఇదే వ్యాధితో ఆమె తన ఒక తోబుట్టువును కోల్పోయింది. 1959 జనవరిలో ఆమెను ఒక ప్రత్యేక ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. తన చివరి రోజులలో  ఆమె తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి వదలిపెట్టింది. చివరిగా ఆమె ఆవిలా పురి తెరేసమ్మ గారి యొక్క “నేను మరణిస్తున్నాను ఏలన  నేను మరణించటం లేదు” పధ్యం చదవమని అడిగింది. దాని తరువాత  ఆమె హఠాత్తుగా తన మంచం లో నిలుచొని యేసువా !నేను నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ మధుర కలయిక , కన్య మరియ అని చెప్పింది. దాని తరువాత ఆమెను యేసు ప్రభువు తనతో తీసుకుపోవడం జరిగింది. ఆమె మరణ వార్తా త్వరగా అంతటా వ్యాపించింది.  ఎందుకంటే ఆమె కతొలిక్ యాక్షన్ గ్రూప్ లో చేసిన సేవ అందరికి తెలుసు కనుక అందరు చాలా బాధ పడ్డారు. ఎలా ప్రజలు దేశ నలుమూలల నుండి వచ్చారు అనే విషయాన్ని అక్కడి సన్యాసినులు గుర్తు చేసుకున్నారు, అలా ఎప్పుడు జరుగలేదు అని.  అక్కడకు వచ్చిన వారు అందరు ఒక పునీతురాలు చనిపోయింది అని చెప్పారు.

పునీత రెండవ జాన్ పౌలు పోపుగారు ఆమెను 1997 లో దైవ సేవకురాలిగా ప్రకటించారు. 16 వ బెనెడిక్ట్ పోపుగారు ఆమెను 2010 మార్చి 27 న వెనరబుల్ గా ప్రకటించారు. 2018 జూన్ 23న  ధన్యురాలుగా ప్రకటించబడింది.  

 

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...