గుడ్ ఫ్రైడే ( పవిత్ర శుక్రవారం)
పునీత మార్కు గారు యేసు ప్రభువు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య శిలువ వేయబడ్డాడు అని అంటున్నాడు. బందిపోటు దొంగలు అంటే వారు రోమా సామ్రాజ్య అధికారంను అంగీకరించలేదు. వారి మధ్య యేసు ప్రభువును సిలువ వేయడమంటే ఆయను కూడా ఒక విప్లవ కారునిగా వారు చూసారు. ఇది మనం ఆయనకు తీర్పు ఇచ్చినప్పుడు చూస్తాము. కానీ రోమా సైన్యాధిపతి ఇతను నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మార్కు 15:30. ఇతను దేవుని కుమారుడు అని మొట్ట మొదటిగా ఒక అన్యుడు తెలుపుచున్నాడు. యేసు ప్రభువుని యొక్క శిష్యులుకూడా ఈ విధంగా ఆయన గురించి చెప్పలేదు. వీరు రోమా చక్రవర్తి దేవుని కుమారుడు అని అనుకునేవారు. కానీ యేసు ప్రభువుని దేవుని కుమారునిగా తెలియ చేస్తున్నాడు. వారికి తెలియకుండానే ఆయన తమ అధిపతి అని చెబుతున్నారు.
పునీత మార్కుగారు యేసు ప్రభువు మరణాన్ని అధికార వ్యవస్థ మీద తీరుగుబాటుకు కారణంగా జరుగుతుంది అని తెలియచేస్తున్నారు. యేసు ప్రభువు మీద దేవాలయ అధికారులు చాలా ద్వేషంతో ఉన్నారు. ఆయన వారి అధికారాన్ని ప్రశ్నించాడు. వారి తప్పులను ఎత్తి చూపాడు. అందుకే ఆయన మీద కక్షకట్టారు.
యేసు ప్రభువు మీద జరిగిన విచారణను ఒకసారి మనం పరిశీలిస్తే యేసు ప్రభువు ఎవరు అని మనం తెలుసుకోవచ్చు. విచారణ మొత్తంలో కూడా అక్కడ ఎటువంటి కలవరపాటు లేకుండా ప్రశాంతంగా ఉంది యేసు ప్రభువు మాత్రమే. పిలాతు లోపలకు బయటకు తీరుగుతున్నాడు, హెరోదు నాకు సంభందం లేదు అంటున్నాడు, పిలాతు బయపడుతూ చేతులు కడిగారు. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు గొడవ చేస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ యేసు ప్రభువు ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఎందుకు వచ్చినది, ఏమి చేస్తున్నది, ఏమి జరుగబోతున్నది. అందుకే అంత ప్రశాంతత కలిగి ఉన్నాడు.
మొదటి పేతురు 3: 18వ వచనం మనకు యేసు ప్రభువు మరణానికి ఒక కారణం చెబుతుంది. "ఆయన ఒకే సారి పాపములకై మరణించేను. దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను." ఇది దేవుడు చేసిన ప్రణాళికా అని మనకు తెలుస్తుంది. కాని ఇక్కడ యేసు ప్రభువుని పట్టిస్తున్న యూద తప్పు చేస్తున్నాడు. తన గురువును అమ్ముకుంటున్నాడు, తన స్వార్ధ బుద్ది చూపిస్తున్నాడు. చాలా సార్లు మనం పేతురు , యుదాలను పోల్చుతాం. కానీ వారు ఇద్దరు రెండు వేర్వేరు స్వభావాలు కలవారు. పేతురు గురువును అమ్ముకోలేదు, ఆయన భయంతో అబద్ధం ఆడుతున్నారు. కానీ యూద వేరు. తన మనస్సు మొత్తం ధనం మీదనే ఉంది. మనం ధనం దేవుని కంటే ఏమి గొప్పది కాదు అని తెలుసుకోవాలి.
యూద ఇస్కారియోతు యేసు ప్రభువును పట్టిస్తే నాకు ఏమి ఇస్తారు అని ప్రధాన అర్చకుడును అడుగుతున్నాడు. వారు ఆయనకు 30 వెండి నాణెములను ఇస్తున్నారు. యేసు ప్రభువును పట్టించడం వలన ఒక స్త్రీ యేసు ప్రభువు సిమియోను అనే వ్య్తకి ఇంటిలో విందుకు వెళ్ళినప్పుడు ప్రభువు కాళ్ళకు అభ్యంగనం చేస్తుంది. యేసు ప్రభువుని కాళ్ళకు అభ్యంగనం చేసిన తైలం విలువ తనకు తిరిగి వచ్చిందని యూదా ఆనందపడి ఉండవచ్చు. యేసు ప్రభువుని శిష్యుడై ఉండికూడా ఆయన ధననికి బానిస, అందుకే ఆయన తన గురువును పట్టిస్తున్నాడు. అంతకు ముందు తన గురువును వీడను అని ఇప్పుడు ఆయనను ఇతరులకు ఇస్తున్నాడు.
అంత సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచెను. యోహను 19:30
అది మధ్యాహ్నం 3గంటల సమయం, యేసు ప్రభువు నీటి కోసం అడిగారు వారు చేదు ద్రాక్ష రసాన్ని ఆయనకు ఇచ్చారు. అప్పడు అంతా సమాప్తమైనది అని యేసు ప్రభువు తల వంచి ప్రాణం విడిచాడు.
యేసు ప్రభువు ఏమి సమాప్తం చేశాడు? ఏమి సమాప్తమైనది? యేసు ప్రభువు అంత సమాప్తమైనది అని అన్నప్పుడు ఆయన తన ప్రాణం గురించి కాదు మాటలాడింది. ఆయన అంటున్నది తనకు తన తండ్రి ఇచ్చిన మానవ రక్షణ కార్యం అంత సంపూర్తి చేశాను అని అంటున్నారు.
దేవునితో మానవుని సఖ్యత అనేది పూర్తి అయ్యింది. దేవునితో మానవునికి వున్న అగాధం పూడ్చ బడింది. మన పాపం వలన, ప్రేమ గల దేవునికి దూరంగా ఉన్నాము, ఆ దూరం తీసివేయబడింది.
యేసు ప్రభువు చెప్పిన అంత సమాప్తమైనది అనే ఈ మాట, ఒక విజయ నినాదం. ఎందుకంటే యేసు ప్రభువు చివరి వరకు కూడా తన తండ్రి ఇచ్చిన ఈ కార్యాన్ని నిర్వర్తించాడు. యేసు ప్రభువుని కర్తవ్యం కేవలం రక్షించడం మాత్రమే కాదు, ప్రజల మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించడం కూడా. ఈ పనిని కూడా పరిపూర్ణంగా యేసు ప్రభువు చేశాడు.
వీటన్నింటిని చేయడానికి యేసు ప్రభువు మరణిస్తున్నారు. దానిని మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం, నిజముగా అది గుడ్ ఫైడేనే.
సిలువ మీద యేసు ప్రభువు దాహం అంటున్నారు, ఆయన దాహం నీటి కొరకు కాదు. నీటి కోసం కానప్పుడు మరి ఎందుకు దాహం కలిగి ఉన్నారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం నా ఆహారం అని యేసు ప్రభువు అంటున్నారు. ఆయన దాహం కూడా నీటి కోసం కాదు, భౌతికమైనది కాదు, ఆయన ఆహారం లాంటిది. ఆయన దాహం కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన దాహం తండ్రి చిత్తాన్ని పూర్తి చేయడం.
ఆయన ఈ లోకానికి వచ్చినది తండ్రి దేవునకు మన మీద అపారమైన ప్రేమ కలిగిన తండ్రి అని తెలియజేయడానికి. ఈ పనిని తన మరణంతో పూర్తి జేస్తున్నాడు. యేసు ప్రభువు అంత సమాప్తం అయినది అని అనడం విజయ నినాదం. ఏందుకంటే తండ్రి తనకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసిన విజయ నినాదం. తన జీవితం మొత్తం ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. తాను పూర్తిగా అంటే తన చివరి శ్వాస వరకు ఈ పని చేస్తున్నాడు. చివరిగా అంత పూర్తి అయ్యింది అని చెపుతున్నాడు.
యేసు ప్రభువు తన ఆత్మను వదలివేశాడు. అంటే ఆయన చనిపొతు తన ఆత్మను మన మీదకు వదిలాడు. ఇక్కడ మనం హిస్సోపు గురించి వింటున్నాము. ఐగుప్తు లో గొర్రె పిల్ల రక్తాన్ని హిస్సపో కొలనుతో చిమ్మేవారు. యేసు ప్రభువు పాస్క గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు. ఇదే సమయంలో పాస్క గొర్రె పిల్లలను వధించేవారు. యేసు ప్రభువు లోక పాపములను మోసేటువంటి గొర్రె పిల్ల వలె చనిపోతున్నారు.
ఇంకా ఆయన ఏమి సంపూర్తి చేశారు? దైవ ప్రేమను పూర్తిగా చూపించారు, తెగిపోయిన దైవ - మానవ సంభందంను సరి చేశారు. ఆయన్ను నమ్మి, ఆయన్ను అనుసరించి దేవునితో కలసి జీవించుదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి