పేజీలు

28.1.23

అష్ట భాగ్యాలు

నాలుగవ సామాన్య ఆదివారం 

 మత్తయి 5:1-12 

యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూచేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది.  శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు. దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బాహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహనందపడుడు. 

యేసు ప్రభువు ప్రసంగాలలో చాలా ముఖ్యమైన ప్రసంగం ఈ అష్టభాగ్యాల ప్రసంగం.  అనేక మందిని ప్రభావితం చేసిన ప్రసంగం మరియు అనేక మంది చేత ప్రశంసించబడిన ప్రసంగం కూడా ఇదే. ఈ అష్టభాగ్యాలు ఒకరకముగా క్రైస్తవుని విధులు, లేక ప్రతి క్రైస్తవుని భాధ్యతలు  అని చెప్పవచ్చు.   ధన్యులు అనే మాట ఇక్కడ  అనేక సార్లు వింటున్నాం. ఇక్కడ వాడిన పదం మారికోస్  అనే పదం. ఇది  దేవునికి మాత్రమే వాడే పదం.  ధన్యులు అనే పదం నూతన నిబంధనలో దేవుని రాజ్యంలో పాలుపంచుకొనుటలో వచ్చే ఆనందం వ్యక్తం చేయడానికి వాడటం జరిగింది.  యేసు ప్రభువు చెప్పే ధన్యత ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఇది మానవుని యొక్క పూర్తి ఆనందం గురించి చెబుతుంది.  సంపూర్ణమైన  ఆనందం ఏమిటి అనేది ఇక్కడ మనము చూస్తున్నాము. ఈ ధన్యత ఎనిమిది  విధాలుగా మనం చూస్తున్నాము. ఎనిమిది అనేది స్వర్గీయ సంపూర్ణతను  తెలియచేస్తుంది. 

 ధన్యత అనే పదం మూడు విధాలుగా చెప్పవచ్చు.   మొదటిగా ధన్యత అనేది సంపూర్ణంగా ఆనందంతో  ఉండే స్థితి. రెండవదిగా మానవుని భావాలు, మరియు పరిస్తితులు ఎల్లప్పుడు పవిత్రంగా ఉండే విధం. మూడవదిగా దేవుని పని. కొన్ని దేవుడు భవిష్యత్తులో మానవునికి ఇచ్చే ఒక అనుగ్రహం గురించి తెలియజేస్తుంది. 

దీనాత్ములు ధన్యులు దైవ రాజ్యము వారిది. దీనాత్ముములు అనే  పదం ఆర్ధికంగా ఒక వ్యక్తిని యాచించె విధంగా చేయబడటం గురించి చెప్పేది. వీరు వారి జీవనం కోసం  వేరె వారి మీద ఆదారపడి జీవించేవారు.  పేదవారు అంటే జీవనం కోసం ఇతరుల మీద అదరపడేవారు. పాత నిబంధనలో పేదవారు వినయం కలిగిన వాడు. సహాయం లేనివాడు అనే అనేక అర్ధాలు ఉన్నాయి.  దీనాత్ములు అని అన్నప్పడు దేవుని యందు తమ నమ్మకం ఉంచిన వారు అని అర్ధం. పేదవారిగా ఉన్నకాని వారి నమ్మకమును ఇహలోక వస్తువుల, లేక మనుషుల  మీద ఉంచినట్లయితే వారిని పేదవారు అంటారు కాని దీనాత్ములు అని అనరు. ఎవరు పేదవారు అయిన ధనికులు అయిన దేవుని మీద ఆధారపడి జీవించె వారిని దీనాత్ములు అని అంటారు.  ఇక్కడ  వీరికి దేవుని రాజ్యం ఇవ్వబడుతుంది అని చెప్పడం లేడు. దేవుని రాజ్యం వీరిది అని చెప్పబడుతుంది. అంటే వీరు దేవుని రాజ్యానికి వారసులు అది వారి సొంతం అనే అర్ధం ఇక్కడ మనం చూస్తున్నాం.  ఇహలోక  వ్యక్తులు , వస్తువులు కాకుండా దేవుని మీద ఆదారపడి జీవించడానికి ఇది నాంది పలుకుతుంది. 

శోకార్తూలు ధన్యులు వారు ఓదార్చబడుదురు.  అష్ట భాగ్యాలలో రెండవదిగా మనం చూసేదీ శోకార్తులు ధన్యులు అని వారు ఓదార్చబడుతారు అని మనం వింటున్నాం. ఇక్కడ ఓదార్చేది దేవుడే ఎందుకంటే ఈ శోకం ఎందుకు వస్తుంది అని  మనం అర్ధం చేసుకున్నప్పుడు మనకు ఇది రెండు విషయాలు తెలియజేస్తుంది.  సహజంగా శోకానికి కారణాలు రెండు కారణాలు.  మొదటిది మరణం . ఎప్పుడైతే మనకు చాలా దగ్గరి వారు మరణిస్తారో, అప్పుడు మనం శోకానికి గురి అవుతాము. అది వారికి మనకు మధ్య ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అప్పటినుండి మనకు వారితో ఉన్న సాన్నిహిత్యం తెగిపోతుంది అని గ్రహించినప్పుడు శోకానికి గురి అవుతాము. ఒక వేళ మరణించిన వారితో మనకు ఉన్న సాన్నిహిత్యం గొప్పది అయినచో మన శోకం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవ కారణం పాపం. ఒక వ్యక్తి పాపం చేయడం వలన శోకం  కలుగుతుంది. మరణం లో వలె ఇక్కడ కూడా సంబంధం దెబ్బతింటుంది. ఎవరితో ఈ సంబంధం దెబ్బతింటుంది అని అంటే దేవునితో ఉన్న సంబంధం దెబ్బతింటుంది. దేవునితో ఉన్న ఈ సంబంధం పాపకారణముగా దెబ్బతిన్నప్పుడు, దానిని గ్రహించిన వ్యక్తి బాధ పడుతాడు, పశ్చాత్తాప పడుతాడు, అప్పుడు సహజముగా ఆ వ్యక్తి శోకానికి గురి అవుతాడు. ఇటువంటి పరిస్తితిలో ఉన్న వారిని దేవుడే ఓదారుస్తాడు. దీనినే మనం యోషయా గ్రంధంలో చూస్తాము. పాప కారణముగా దేవునితో వున్న సంబంధాన్ని పోగొట్టుకొనిన వారు శోకానికి గురి అయినచో అది చూసిన దేవుడే వారికి ఓదార్పు ఇస్తారు. 

వినమ్రులు ధన్యులు వారు భూమికి వారాసులగుదురు. వినమ్రతను బైబుల్లో రెండు అర్ధాలు వచ్చే విధంగా వాడటం మనం చూస్తాము. మొదటిగా ఈ పదాన్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఉన్న ఒక సుగుణం వలె వాడటం జరిగింది. రెండవదిగా  సాంఘీక అసమానతలకు  గురిఅయిన వారికి కూడా దీనిని వాడటం చూస్తాము. పాత నిబంధనలో రెండవ దానికి ప్రతీకగా ఈ పదాన్ని వాడటం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల లక్షణం కూడా ఈ వినమ్రత కలిగి ఉండటము మనం గమనించవచ్చు. కేవలం వినమ్రత కలిగిన వ్యక్తి మాత్రమే శక్తి గలవాడు అనేటువంటి సందర్భాలు కనబడుతాయి. మోషే ఇటువంటి వ్యక్తి. సంఖ్యా 12:3 మోషే వినమ్రత కలిగిన నాయకునిగా దేవుడు చేస్తున్నాడు. యేసు ప్రభువు వినమ్రత మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ఆయనే  చెబుతున్నాడు నెను వినమ్ర హృదయుడను అని,  కనుక దాని పర్యావసానం వారి భూమికి వారసులు అవుతారు. దీనినే  మనం 37 వ కీర్తనలో చూస్తున్నాం. 

నీతినిమిత్తము ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు సంతృప్తి పరుపబడుదురు.  నీతి నిమిత్తము ఆకలిదప్పులు కలిగినవారు ధన్యులు అని మనం ఇక్కడ వింటున్నాం. ఒక రకముగా ఈ మాటలు ఆకలి, దాహంల గురించి మాటలాడిన విధముగా ఉన్నాయి. యేసు ప్రభువు నెను నిజమైన ఆహారము , నన్ను భుజించువారు ఎన్నటికిని ఆకలిగొనడు అని , నన్ను విశ్వాసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు అని చెబుతారు. యోహను 4:14. ఎందుకు, ఎవరి కోసం మనం  ఆకలిదప్పులు కలిగిఉండాలి అనే ప్రశ్నకు మనం ఇక్కడ నీతి నిమిత్తము అనే జవాబు చూస్తున్నాము. నీతి నిమిత్తము అన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి బాప్తిస్మ యోహనుగారు. మత్తయి సువార్త 3:15 వ వచనంలో ఈ మాటలు గురించే మనం వింటాము. యోహను చేత జ్ఞాన స్నానం పొందటం దేవుని సంకల్పం అయినట్లయితే ఆ విధంగా జరగనివ్వు అని యేసు ప్రభువు అంటారు. దేవుని సంకల్పం నెరవేర్చడమె నీతి అనే అర్ధం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఎవరు పెద్ద లేక చిన్న అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. దీనినే మత్తయి 21:32 లో చూస్తాము. నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటె దేవుని నిర్ణయాన్ని పాటించుటకు మనం సిద్ధపడి ఉండటం. ఎవరు అయితే ఈవిధంగా చేయడానికి సిద్దముగా ఉంటారో వారు సంతృప్తి పరుపబడుతారు. ఈ ఆకలిదప్పులు అన్నీ తీరిపోతాయి. 

దయామయులు ధన్యులు వారు వారు దయను పొందుదురు. దయామయులు ధన్యులు  అనే మాటను వింటున్నప్పుడు, మనకు యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు గుర్తుకు వస్తాయి, ఎందుకంటే మనం దేవుని దయను పొందుటకు  ఖచ్ఛితముగా ఇతరులకు ఈ దయను మనం చూపించగలగాలి. ఎపుడైతే దేవుని దయను , కృపను పొంది ఆ దయను ఇతరులకు చూపించకుండా ఉన్నప్పుడు మనం దేవుని నుండి దయను పొందుటకు అర్హులము కాము అని మనకు యేసు ప్రభువు తెలుపుతున్నారు. ఇక్కడ మాత్రమే కాదు , పరలోక ప్రార్ధనలో , తన తోటి పని వానిని క్షమించలేనివాని ఉపమానం ద్వారా యేసు ప్రభువు మనకు దీనిని తేటతెల్లం చేస్తున్నారు. దేవుడు ఎంత దయమయుడు అనే విషయం కూడా మనం ఇక్కడ  తెలుసుకోవచ్చు, పాత నిబంధనలో దేవుడు దయమయుడు అని త్వరగా కోపపడు వాడు కాదు అని మనం తెలుసుకుంటాం. నూతన నిబంధంలో యేసు ప్రభువు ఎంత దయమయుడో మనం చూస్తాము. ఈ భాగ్యం దేవుని దయను పొందగోరు వారు ఏ విధంగా  ఇతరులకు  దయను చూపాలో తెలియజేస్తుంది. మరియు దేవుని దయ పొందటం మనం ఇతరులకు చూపించే దయ  మీద ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. 


నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. హృదయం అనేది ప్రేమ అప్యాయతలకు  నిలయం.  మానవ భావాలు అన్నీ ఇక్కడనుండే వస్తాయి. అన్నీ నిర్ణయాలు ఇక్కడ నుండే మనకు ప్రారంభమవుతాయి. పరి వర్తన కూడా ఇక్కడ నుండే వస్తుంది. వీటి అన్నింటికీ కూడా  నిర్మల హృదయ అనేది చాలా ముఖ్యమైనది,  24 కీర్తన మనకు దిని యొక్క ముఖ్యమైన ఫలితాన్ని తెలియజేస్తుంది. ప్రభుని పర్వతము ఎక్కుటకు అర్హుడేవడు ? పవితం హృదయం కలవాడు అని మనకు బైబుల్ నేర్పుతుంది. వీరు ఎవరు అంటే   వీరి జీవితములో ఎటువంటి నాటకీయత ఉండదు. వీరి బాహ్య జీవితం , ఆంతరంగిక జీవితం మధ్య వ్యత్యాసం ఏమి ఉండదు. మొత్తం కూడా ఒకే రకముగా ఉంటుంది. కీర్తన 51:10-11 మనకు ఇది తెలియజేస్తుంది. నిర్మల హృదయం , కళంకం లేని చేతులు గలవారు దేవుని చూచుటకు అర్హులు.  వారు దేవుని చూస్తారు అని మనం వింటున్నాము.  కాని ఇక్కడ పవిత్ర అనేది దేవుని చూడుటకు ఒక షరతులా ఉంది. మరియ మాత, యోసేపు వారు , చిన్ని బిడ్డలు వీరు పవిత్రులు అందుకే వారి సాన్నిధ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దర్శన గ్రంధంలో తెల్లని వస్త్రములు ధరించిన వారు యేసు ప్రభువు ఎక్కడకి వెళ్ళిన అక్కడకు వెళ్లారు. ఎందుకంటె వారు పవిత్రులు కనుక. దేవుని దగ్గర ఉండుటకు, పవిత్రత చాలా ముఖ్యమైనది. పవిత్రులు దేవుణ్ణి దర్శిస్తారు. 


శాంతి స్తాపకులు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు. శాంతి అనే మాటకు అనేక రకాలైన అర్ధాలు ఉన్నాయి. ఇక్కడ ఇది కేవలం ఎటువంటి గొడవలు లేక సమస్యలు , యుద్దాలు లేకపోవడం మాత్రమే కాదు. మానవుడు పూర్తిగా ఆనందమును అనుభవించేలా చేయడం. ఇక్కడ యేసు ప్రభువు ధన్యత ప్రకటిస్తుంది , శాంతిని ప్రేమించెవారికి కాదు, ఎవరు అయితే శాంతిని స్థాపించడానికి ప్రయత్నిస్తారో వారికి ధన్యత చేకూరుతుంది అని తెలియజేస్తున్నాడు. వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెబుతున్నారు. ఈ అష్ట భాగ్యాలలో మనం చూసేదీ ఏమిటి అంటే ఎవరు అయితే ఈ పనులు చేయడానికి సిద్దమవుతారో పూర్తిగా దేవునికి చెందినవారిగా ఉంటున్నారు అని , అంటే ఆయన వారిని తనతో గడిపే విధాముగా లేక తన కుమారులు అయ్యే విధముగా లేక తన రాజ్యంలో పాలుపంచుకొనే వారినిగా చేస్తున్నాడు.   

ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది. ఇక్కడ   దేవుని నిమిత్తము, ఆయన వాక్కు నిమిత్తము హింసించబడే వారు ధన్యులు అని చెప్పబడుతుంది.  అనేక మంది ఈ విధంగా హింసించబడ్డారు. వీరికి పరలోకంలో గొప్ప బహుమానం కలదు అని యేసు ప్రభువు చెబుతున్నాడు. ఈలోకంలో ఉండగా ఆయన నిమిత్తము హింసించబడినప్పుడు మనము ధన్యులమే. హింసించే వానికి ఆయన గురించి తెలియదు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలను పాటిస్తామో మనం నిజమైన యేసు ప్రభువు  అనుచరులం అవుతాము. ఆయన శిష్యులుగా జీవిస్తాము కనుక అటుల జీవించుటకు ప్రయత్నించుదాం. 


7.1.23

క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం

క్రీస్తు  సాక్షాత్కార మహోత్సవం 

 యెషయా 60:1-6, ఎఫెసీ 3:2-3,5-6, మత్తయి 2:1-12   

హెరోదురాజు పరిపాలన కాలములో యూదయ సీమయందలి బెత్లేహేము నందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరుషలేమునకు వచ్చి, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింప వచ్చితిమి" అని అనిరి. ఇది విని, హెరోదు రాజు, యెరుషలేము నగర వాసులందరు కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మ శాస్త్ర బోధకులను సమావేశ పరచి  "క్రీస్తు ఎచట జన్మించును" అని ప్రశ్నించేను. "యూదయ సీమ యందలి బెత్లేహేము నందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమ యందలి బెత్లేహేమా!నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలన నా యిస్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో  నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను." అంతట హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలిసికొనెను. పిమ్మట అతడు వారిని బెత్లేహేమునకు పంపుచు "మీరు వెళ్ళి, జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నెను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను." రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్లిపోయిరి. అదిగో !తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శినియై , ఆ శిశువు వున్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రము చూచినప్పుడేంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి, తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి, సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువుకు బంగారము, సాంబ్రాణి పరిమళ ద్రవ్యములను కానుకలుగ సమర్పించిరి. హెరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు హెచ్చరింపగా, వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. 

హేరోదు రాజు  యూదయ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం  37వ సంవత్సరం నుండి 4వ సంవత్సరం వరకు పాలించాడు. ఈ హేరోదు పాలన కాలంలో యేసు ప్రభువు పాలించాడు. మికా గ్రంధం ప్రకారం ( 5:1-3 ) బేత్లెహేము రక్షకుని జన్మ స్థలం. అంతే కాదు అది దావీదు రాజు జన్మ స్థలం కూడా. 

హేరిడేటస్ ప్రకారం ఈ ముగ్గురు రాజులు మేదియాన్ తెగకు చెందినవారు. మెదియా పర్షియా రాజ్యంలో భాగంగా ఉండేవారు.  వారు పర్షియా పాలనకు ముగింపు పలికి వారు పాలించాలి అని అనుకున్నారు. కాని అది సాధ్యం కాకపోవడంతో పాలన వ్యవహారాలను వదలివేసి అధికార వ్యామోహం లేకుండా యాజకులుగా స్థిరపడ్డారు. పర్షియాలో వారిని జ్ఞానులుగా మరియు పవిత్రులుగా చూసేవారు. వారు ప్రవచనాలు చెప్పడంలో, వైద్య శాస్త్రంలో మరియు అంతరిక్ష శాస్త్రంలో ప్రసిద్ధులు. అంతరిక్షంలో వేర్పడే మార్పులను పట్టి భవిష్యత్తును చెబుతారని అందరు వీరిని నమ్మేవారు. వీరిని మనం మరియు అప్పటి ప్రజలు కూడా జ్ఞానులు అనే చెబుతున్నాం. అసలు జ్ఞాని అంటే ఏమిటి పవిత్ర గ్రంధంలో అని అంటే, మంచి చెడులను తెలుసుకొని, మంచిని మాత్రమే అనుసరించ గలిగిన శక్తి గలిగిన వారు అని అర్ధం. మంచి చెడులను తెలుసుకొనే విచక్షణ ఉండి కూడా మంచిని అనుసరించ లేని వానిని బైబుల్ జ్ఞాని అని చెప్పదు. తెలుసుకోవడం మాత్రమే జ్ఞానానికి కొలమానం కాదు. అది ఆచరణకు సంభందించినది. 

ఈ అన్యుల రాక తూర్పు నుండి వస్తున్నారని మనము వింటున్నాము. యేసు ప్రభువు అబ్రహము కుమారుడు అని అయన ద్వారా అందరు దీవించబడతారు అని తెలియచేస్తుంది. ఆదికాండము 22:18.   .ఈ ముగ్గురు రాజులు లేక జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం దేవుని యొక్క ప్రణాళికే ఎందుకు అంటే ఆది కాండం 22 వ అధ్యాయం 18 వ వచనం లో అబ్రహాము సంతతి ద్వార జాతులన్నీ దీవించ బడుతాయి అని మనం తెలుసుకుంటాం. అది ఈ రోజు ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరకు రావడం ద్వార జరుగుతుంది. యేసు ప్రభువును దేవునిగా మొదట ఆరాధించిన ప్రజలు అన్యులు, యూదులు కాదు. ఈ ముగ్గురు రాజులు దేవుని అర్పించే వాటిని యేసు ప్రభువుకి అర్పించి ఆయనను దేవునిగా గుర్తించి, తెలుసుకొని, ఆయనను  ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 8:11 లో మనం తూర్పు పడమరల నుండి ప్రజలు అబ్రహాము తో కూర్చుంటారు అనే వింటున్నాం. అది ఇక్కడ నెరవేరుతుంది.  

ఈ ముగ్గురు రాజులు ఒక నక్షత్రం చూసి , ఒక గొప్ప వ్యక్తి యిస్రాయేలులో  జన్మించారని తెలుసుకున్నారు. వారు నిజానికి ఆ నక్షత్రం ద్వారా ఎదో ఎదుకుతున్నారు. ఇన్నాళ్ళు వారిని బానిసలుగా చూసిన పర్షియా రాజ్యమ నుండి స్వతత్రం వారు వెదుకుతున్నారు. వారి బానిసత్వాన్ని తీసువేసే రాజు కోసం వారు వెదుకుతున్నారు. అందుకే వారు యేసు ప్రభువును రాజుగా గురించి రాజుకు బాహుమానంగా ఇచ్చే బంగారం వారు ఇస్తున్నారు. వీరు యాజకులు అని మనం చెప్పుకున్నాం. యాజకులు దేవునికి సాంబ్రాణి దూపము వేయాడం వారి కర్తవ్యం. వీరు యేసు ప్రభువుకు సాంబ్రాణిని అర్పిస్తున్నారు. వారి దేవునిగా మరియు వారి ప్రధాన యాజకునిగా వారు యేసు ప్రభువును గుర్తిస్తున్నారు. వారు సుగంధ ద్రవ్యాలను అర్పిస్తున్నారు. ఇవి చనిపోయిన వారికి అభ్యంగణం చేయడానికి వాడేవి. ఎందుకు ఇవి వారు అర్పిస్తున్నారు అంటే యేసు ప్రభువు తన మరణం, శ్రమలు అన్నీ వారి కొరకు అని తెలియజేయుటకు ఇవి వారు ఇస్తున్నారు. 

 వీరి అన్నీ సమస్యలకు సమాధానం యేసు ప్రభువే అని వారు నమ్మారు. ఈ నక్షత్రం వారి సమస్యలను తీర్చే వారిని చూపిస్తుంది అని వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు. కాని వారు అక్కడ ఏమి చూస్తున్నారు. చిన్నారి బాలయేసుని మాత్రమే.  వీరు జ్ఞానులు , గొప్పవారు వీరు తెలివిగలవారు.  చిన్నారి బాల యేసును, సరిగా లేని ఒక పశువుల పాకను, చూసి కూడా వారికి ఎటువంటి అపనమ్మకం కలగలేదు. ఆయనను ఆరాధించారు. అక్కడ వారు దేవుని మహిమను చూసారు , వారు అంత దూరం కేవలం కొన్ని బహుమతులు ఇవ్వడానికి వెళ్ళలేదు. అక్కడ వారు ఎదో చూస్తున్నారు , వారు ఆ చిన్న బిడ్డను ఆరాధిస్తున్నారు. వారి మోకాళ్ల మీద ఉన్నారు.  దేవుడు మానవుని రూపంలో వారు చూసారు. వారు ఆనందముగా కృతఙ్ఞతలు చెప్పి  వెళుతున్నారు. 

అందుకే మనము ఈ పండుగను క్రీస్తు సాక్షాత్కార పండుగగా పిలుస్తాము అంటే దేవుడు తనను తాను తెలియ చేసుకోవడం.  ఒక నక్షత్రం ద్వారా దేవుడు ఆయనను వారికి తెలియ పరుచుకున్నాడు. వారు జ్ఞానులు కనుక  నక్షత్రం ద్వారా యేసు ప్రభువు దేవుడు అని గుర్తించారు. నీవు ఆయన చేసిన పనులు గురించి వినివున్నావు కనుక ఆయనను తెలుసుకొని ఆయనను వారు ఆరాధించినటులా నీవు కూడా ఆరాధించాలి. 

పునీత సిలువ యోహనుగారు ప్రకారం మానవుని విషాదకర పరిస్తితి ఏమిటి అంటే దేవుడు  అనేక విధాలుగా మనకు తనను తాను  తెలియపరుచుకుంటున్న మనం అది గుర్తించలేకపోతున్నాము ఈరోజు. 

ఇక్కడ మనం మరియమాత, యోసేపు వారిని చూస్తున్నాము. ఈ రాజులు ఎక్కడ నుండి వచ్చారు, వారు ఏమి చేయబోతున్నారు. ఏమి అడుగుటలేదు. వారిని రావద్దని వారించడం లేదు. ఇది తీరుసభ ఉండవలసిన తీరు గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు అందరిచేత ఆరాధించబడటానికి, తెలుసుకొనబడటానికి మౌనంగానే సహకరిస్తున్నారు. అది ఒకరకంగా తీరుసభ లేక నివు నేను ఇతరులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు చేయవలసిన పని. 

ఈ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం మనకు దేవున్ని ఎరుకపరచుట మాత్రమే కాక మనం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. ముగ్గురు రాజులు యేసు ప్రభువుని తెలుసుకొని ఆయనకు తమ ఆర్పణలతో పాటు తామని తాము అర్పించుకొని ఆయనకు విధేయత చూపుతున్నారు. ఆయన వారికి ఎటువంటి అనుగ్రహాలు ఇవ్వనప్పటికి వారు ఆయనను గుర్తించి ఆనందంతో దేవుని దర్శించము అని వెళుతున్నారు, మనం దేవుని గుర్తించి ఆయనను ఆరాధించి మన విధేయతను చూపాలి. మరియమాత, యోసేపు వలె అందరికి ఆహ్వానించి ఎవరిని దేవుని దర్శించటానికి మనం ఆటంకం కాకుండా ఉండాలి. హెరోదు వలె దేవుని తన అధికారమునకు ఆటంకం అనుకోకుండా ఆయనతో కలిసి ఉండటానికి ప్రయత్నించాలి. ఆవిధంగా జీవించాడానికి ప్రయత్నించుదాం. 


సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...