తండ్రి ప్రేమ -హృదయ పరివర్తనకు పిలుపు
దేవుని దృష్టిలో పశ్చాత్తాప కన్నీరు ఎంతో అమూల్యమైనవానిగా ఉంటాయి. దేవుడు మన కష్టంను, కన్నీరును చూసి తట్టుకోలేరు. పశ్చాత్తాపం అనేది దేవుడు చూపించిన ప్రేమకు మనం సరిగా బదులు ఇవ్వకుండా ఆయనను బాధకు గురి చేసినందుకు వచ్చేటువంటి అపరాధ భావం, దీనిని గమనించి దేవుని వైపు మరలి, ఆయన మార్గమును అనుసరించుటయే హృదయ పరివర్తన. మనం ఎప్పుడైతే ఇది కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు. సహాజంగా మనం ఎప్పుడు దేవుని నుండి దూరంగా వెళ్ళుతాము అనేది తప్పిపోయిన కుమారుని కథ ద్వార తెలుసుకోవచ్చు.
ఈ కథను మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటిగా, చిన్న కుమారునికి ఏమి జరిగింది. రెండవదిగా, పెద్ద కుమారునికి, తన తమ్ముని పట్లగల కోపం, మరియు తన తండ్రి విందు ఇస్తున్నందుకు అతని మీద వున్న వ్యతిరేకత. మూడవదిగా తండ్రికి కుమారుల మీద గల ప్రేమ.
ఈ కథ చెప్పడానికి గల కారణాలను మనం ఈ అధ్యాయం మొదటి మూడు వచనాలలో చూస్తాము. పాపులు, సుంకరులు యేసు ప్రభువు దగ్గరకు, ఆయన మాటలు వినాలని వస్తున్నారు. ఆయన తో కలిసి భుజిస్తున్నారు. అది నచ్చని పరిసయ్యులు మరియు ధర్మ శాస్త్ర భోధకులు, సణుగుకొనుచుండగా చెప్పిన కథ ఇది. వారి దృష్టిలో ఒక దైవ జనుడు పాపులతో కలిసి ఉండటం, మాటలాడటం మంచిది కాదు అని భావించారు. యేసు ప్రభువు వారిని,వారి ఆలోచనలు,వారి భావాలు మార్చుకోవాలని , తాను ఈ లోకానికి వచ్చినది, దేవునికి దూరంగా వెళ్ళి పోయిన వారిని, వెదకి రక్షించడానికి అని, తెలియజేయడానికి అని చెప్పిన కధ ఇది.
ఈ కథలో చిన్న కుమారుడు, తనకు ఉన్న అన్నీంటిని, అంటే తన ఆస్తిని, సంపదను వృధ చేసిన వాడు. అతనిని పిలిచే పదం కూడా అదే, ప్రోడిగల్ అని, తప్పిపోయిన అయిన దీని అర్ధం,దీని వేరు మాత్రం కన్ను మిన్ను తెలియక మొత్తం వృధా చేసిన వాడిగా పేరు పొందిన వాడు అని అర్దం.
యూద సమాజంలో పిత్రార్జితంను ఎలా పంచుకోవాలి అని శాసనాలు ఉన్నాయి. పెద్దవానికి రెండు భాగాలు ఆస్తి వస్తుంది. మిగిలినవారికి ఒక్కో భాగం వస్తుంది. ద్వితీ 21:17. అంటే చిన్న కుమారుడుకి తనతండ్రి చనిపోయిన , తరువాత వారు భాగించుకునే మూడు భాగాలలో తనకుఒక భాగం వస్తుంది. తనకు తండ్రి చనిపోయిన తరువాత, వచ్చే భాగాన్ని ఇప్పుడే ఇవ్వమని, తండ్రి బ్రతికి ఉండగానే అడుగుతున్నాడు.ఇది తండ్రికి అవమానం. తండ్రి మరణాన్ని కోరుకోవడం లాంటిది. నీవు మరణించే వరకు నేను వేచి ఉండలేను అని అంటున్నాడు అని అర్ధం వస్తుంది. .
చిన్న కుమారుడు తన ఇష్ట ప్రకారముగా తాను జీవించాలి అని అనుకుంటున్నాడు. మనం కూడా అనేక పర్యాయాలు తప్పు చేసేది ఇక్కడే, మన ఇష్ట ప్రకారం మనం జీవించాలి అని అనుకుంటాం. దేవుని ఇష్ట ప్రకారముగా మనం జీవించాలి అని అనుకొము. మన ఇష్ట పూర్తిగా జీవించాలి అని అనుకున్న, అప్పుడు కూడా దేవుడు మనకు ఇచ్చిన వాటినే అనేక చెడు పనులకు వాడుతాము. చిన్న కుమారుడు కూడా తన తండ్రి ఇచ్చిన మంచి వాటిని, తన స్వార్ధ, లోకాశలకు వాడుతున్నాడు. అంతటినీ పాడు చేసుకుంటున్నాడు. నా ఇష్ట ప్రకారం జీవించాలి అనే ఆశ, లేక కోరిక మనలను దేవుని నుండి, మనల్ని ప్రేమించే వారి నుండి దూరం చేస్తుంది.
ఎప్పుడైతే మనం మన ఇష్ట ప్రకారంగా జీవించాలనుకుంటామో అప్పడు మనం మన కర్తవ్యాన్ని మరచిపోతం. ఎలా అంటే దేవుని ఆజ్ఞలలో తల్లి దండ్రులను గౌరవించడం అనేది చాల ముఖ్యమైనది, కాని చిన్న కుమారుడు అది మరచిపోతున్నాడు. ఈరోజు ఎవరైనాకూడా నా ఇష్ట ప్రకారం, నేను జీవిస్తాను అంటే, దాని అర్ధం, నేను చేయవలసిన నా కర్తవ్యాలను, నేను పాటించను అని అర్ధం. ఇక్కడ చిన్న కుమారుడు, తన తండ్రిని ఆదరించడం,గౌరవించడం అనే తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు.
15:13-16 వచనాలలో ఆస్తిని సొమ్ముచేసుకొని, దూరదేశము వెళ్ళి, అక్కడ దానిని దుర్వినియోగం చేసి, అక్కడ కరువు రావడంతో, ఇబ్బందులకు గురి అయ్యాడు. ఆ దేశములో ఒకనికి పందులు మేపు, పనికి వెళ్ళాడు.పందులు తిను పొట్టుతో, కడుపు నింపుకొనుటకు ఆశ పడేను. ఇది మనకు, మనం దేవుని నుండి దూరం అవుతున్న కొద్ది, ఎంత దిగజారిపోతామో తెలియ జేస్తుంది. తండ్రితో కలిసి జీవించిన వ్యక్తి, అనేక మందితో సఫర్యాలు చేయించుకున్న వ్యక్తి , మొదట, తన ఇష్ట ప్రకారం జీవిస్తా అన్నాడు, ఆస్తిని మొత్తం సొమ్ము చేసుకున్నాడు,దూరంగా వెళ్ళాడు, అంతా పాడు చేశాడు, నైతికంగా దిగజారాడు, బానిసగా బ్రతకాడానికి సిద్ద పడ్డాడు, అంతటితో ఆగలేదు, పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. అంటే వాటిలో ఒకనిగా ఉండ సిద్దపడ్డాడు, దేవునికి దూరమయ్యే కొద్ది, మనం ఇంతటి దీన స్థితికి చేరుతాము. ఇష్టమైన కుమారుని నుండి దూరమై, బానిసగా బ్రతికి జంతువు స్థాయికి చేరుకుంటున్నాం.
తరువాత చిన్నవాడు కనువిప్పు కలిగి, నా తండ్రి దగ్గర, ఎంత మంది పనివారికీ పుష్టిగా భోజనం దొరకడంలేదు? నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, అని తలంచాడు. తనకు కనువిప్పు కలగడం, పరివర్తన ఏమి కాదు. కాని తన నిజ స్థితిని తెలుసుకుంటున్నాడు. తాను అధ్వాన్న స్థితికి చేరుకున్నాను, అని తెలుసుకుంటున్నారు. తన ఇంటిలో ఉన్న సేవకుల కంటే,తక్కువ స్థితి కలిగిన వాడిని అని తెలుసుకుంటున్నాడు. యూదాయ కుటుంబాలలో మూడు రకాల సేవకులు ఉండేవారు. మొదటిగా కుటుంబసేవకులు 2. కుటుంబ సేవకులకు సహాయం చేసే సేవకులు 3. దినసరి సేవకులు. చిన్న కుమారుడు అనుకున్నది దినసరి సేవకులలో, తనని కూడా ఒకనిగా ఒప్పుకోమని, తండ్రిని అడగాలని నిశ్చయించుకొని, తండ్రి దగ్గరకు బయలు దేరుతున్నాడు.
మనం ఎప్పుడైతే, దేవుని నుండి దూరంగా వెళ్ళి, తప్పు చేశామని తెలుసుకుంటామో, ఆయనతో ఉండటం, మనకు ఇష్టమే అని అనుకుంటామో, అప్పుడే మనలను దేవుడు మాన్నిస్తాడు. ఎందుకంటే దేవునికి కావలసినది తన బిడ్డలు తనతో ఉండటం. మనం అందుకు అర్హులము కాకపోయినా, మన పాపములను క్షమించి, మనలను పవిత్రులను చేసి, అర్హులను చేసి, అక్కున చేర్చుకుంటాడు, మన పరలోక తండ్రి.
తండ్రి ప్రేమ
లూకా 15:20 అక్కడ నుండి లేచి తన తండ్రి దగ్గరకు వెళుతున్నాడు. కుమారుడుని దూరంగానే చూసి, జాలితో ఎదురెల్లి కౌగలించుకుంటున్నారు. తండ్రికి తెలుసు, ఆ కుమారుడు చేసిన పనికి, అందరు ఆయనను పరిహాసమాడుతారని, తన ఆస్తిని మొత్తం పాడుచేసుకొని వచ్చాడని గేలి చేస్తారు, అని తెలుసు, అందుకే ఆయనే వెళ్ళి రక్షించుకుంటున్నారు. ఇతను వచ్చాడని ఎవరు గెలిచేయకుండా రక్షిస్తున్నాడు. ఎదురెళ్ళి కాపాడుతున్నారు. పునీత ఆవిలపూరీ తెరేసమ్మ గారు "దేవుడు మన పాపాలు బయట పడకుండా, మనలను కాపాడుతారు, ఎందుకంటే అవి బయటపడితే మనలను ఇతరులు గౌరవించరేమోఅని" అంటూ వుంటారు. ఇందుకేనేమో.
తండ్రి తన ప్రేమ, జాలి చూపించడంలో, తాను పెద్దవాడిని అని కూడా మర్చిపోతున్నారు. అంతే కాదు తనకుమారుడు చేసిన, తప్పును కూడా పట్టించుకోవడం లేదు. కేవలం తన కుమారున్నీ చూడటం కోసం మాత్రమే కాదు, కుమారుని, దీన స్థితిని ఎవరికి కనిపించకుండా చేస్తున్నారు. అందరు చూస్తుండగానే, తన కుమారున్నీ కౌగలించుకుంటున్నాడు.తన కుమారున్నీ అంగీకరిస్తున్నాడు. తండ్రితో కుమారుడు తండ్రి నేను నీకును దేవునికిని వ్యతిరేకముగా పాపము చేసితిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకోజాలను అని చెబుతున్నారు. ఆయన ఏమి అయితే చెప్పాలని అనుకున్నాడో, అవి అన్నీ చెప్పకుండానే, అంటే తనను, అక్కడ ఉన్నటువంటి దినసరి కూలీలా, చూడ మని చెప్పకుండానే, తండ్రి తనను కౌగిలించుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడు. ఇది మొత్తం చిన్న కుమారుడు చేసింది, తాను తండ్రి గొప్పతనం తెలుసుకొని కాదు, కేవలం తనకు కడుపు నిండ తిండి దొరుకుతుంది అని మాత్రమే. అందుకు తాను వచ్చే ముందుగా తండ్రికి ఏమి చెప్పాలో ముందే ప్రణాళిక వేసుకొని వచ్చాడు. కాని తండ్రికి కావలసినది తన కుమారుడు తన దగ్గర ఉండటం, అందుకే కుమారుడు తాను చెప్పాలి అనుకున్నది కూడా , మొత్తం చెప్పనివ్వడం లేదు. తన కుమారుడు తన దగ్గరకు, మారు మనస్సు పొంది వచ్చాడా? లేదా ? అని కూడా చూడటం లేదు. వచ్చిన వెంటనే కౌగలించుకుంటున్నారు. అంతే కాదు కోల్పోయిన స్వేచ్ఛను మరల ఇస్తున్నాడు. ఉంగరం తొడగడం వలన, క్రొత్త బట్టల ద్వార, చెప్పులు ద్వార తాను బానిస కాదు అని చెబుతున్నాడు.
పెద్ద కుమారుడు
లూకా 15: 25 ఇప్పుడు పెద్ద కుమారుడు పొలం నుండి వస్తున్నాడు. ఇంటికి రాగానే సంగీతం వినపడుతుంది, నృత్యం చేస్తున్నారు. ఒక సేవకుడను పిలిచి ఏమి జరుగుతూంది, అని అడుగగా తన తమ్ముడు వచ్చిన విషయం, అతనికి చెప్పారు, క్రోవ్విన గొర్రే తో వారు విందు చేసుకోవడం, చెబుతున్నారు. కోప పడిన పెద్ద కుమారుడు ఇంటిలోనికి రావడానికి సిద్ధపడటం లేదు. తండ్రి బయటకు వచ్చి, అతనిని బ్రతిమలాడుతున్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుని కంటే తక్కువ ఏమికాదు. తమ్ముడు తన వాట అడుగుతున్నప్పుడు, అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆస్తి మొత్తం సొమ్ము చేసుకొని వెళ్తున్నప్పుడు ఆపలేదు. తండ్రిని అగౌరపరిచినప్పుడు, తప్పు పట్టలేదు. తాను కూడా స్వార్ధంగానే ఆలోచించాడు. తమ్ముడు పోతే నాకేమీలే అనుకున్నాడు. తమ్ముడు తిరిగి వచ్చినప్పుడు తట్టుకోలేక పోతున్నాడు. పరిసయ్యులు ధర్మ శాస్త్ర భోదకులు కూడా ఇలానే ఉన్నారు. పాపులు , సుంకరులు యేసు ప్రభువు దగ్గరికి వస్తే తట్టుకోలేక పోతున్నారు.
మనం కూడా కొన్ని సందర్బాలలో ఇలానే ఉంటున్నాము. ఒకసారి ఆలోచించండి. మీ అన్నదమ్ములు, అక్క, చెల్లెలు లేక మీ బిడ్డలు తమ తప్పు తెలుసుకొని వస్తే, ఆదరిస్తున్నమా? లేక మేము క్షమించలేము అంటున్నమా? మనం తండ్రి మనస్సు కలిగి ఉండాలి.
యూదయా కుటుంబలలో, పెద్ద కుమారుడు అతిధులను ఆహ్వానిస్తాడు, వారి యోగా క్షేమాలు కనుగొంటాడు. అంతే కాదు ప్రధాన ఆహ్వానితుడును, గౌరవించాలసినది కూడా పెద్ద కుమారుడే. అంటే చిన్న కుమారుడను ఆహ్వానించాలసినది, పెద్ద కుమారుడే. చిన్న కుమారుని వలె, పెద్ద కుమారుడు కూడా, తన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. తనకు తనతమ్ముడి మీదఉన్న అభిప్రాయం, అందరు వెళ్ళిన తరువాత చెప్పవచ్చు, కాని తన తండ్రిని అందరి ముందు, పెద్దకుమారుడు అగౌరపరుస్తున్నాడు. తన కోపాన్ని తండ్రి మీద చూపిస్తున్నాడు, తండ్రి పక్షపాతి అని అంటున్నాడు. కొన్నిసార్లు మనంకూడా , దేవుడు ఇతరులకు చూపించే దయ, కనికరం గురించి, ఆయనకు ఫిర్యాదు చేస్తుంటాం. దేవున్ని పక్షపాతి అని నిందిస్తుంటం.
అంత మంది సేవకుల ముందు, తండ్రిని కించ పరిచినా, తండ్రి తన కుమారున్నీ బ్రతిమాలు తున్నాడు. కుమారున్నీ తిట్టడంలేదు. తండ్రి , తన పెద్ద కుమారుడు ,తమ్ముడిని అంగీకరించడం లేదు అని, ఆయనను శిక్షించి ఉండవచ్చు. కాని తండ్రి అవి ఏమి చేయకుండా తన కుమారున్నీ వెదకుకొంటూ, కుమారుని దగ్గరకు, బయటకు వచ్చి, లోనికి రమ్మని, మంచి మాటలతో అడుగుతున్నాడు. తన కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నాడు. మనము విందు చేసుకొనుట సముచితం అని చెబుతున్నాడు.
లూకా 15:29 లో తన తండ్రికి, పెద్ద కుమారుడు తగని జవాబు ఇస్తున్నాడు. ఇదగో ! ఇన్ని సంవత్సరాలు నేను నీకు ఊడిగం చేశాను, ఎప్పుడు నీ మాట జవాదాట లేదు. అయినప్పటికీ నీవు నాకు చిన్న గొర్రె పిల్లను కూడా, నా స్నేహితులతో విందు చేసుకోవడానికి ఇవ్వలేదు.కానీ నీ సంపదను వేశ్యలతో, వినోదలతో పాడు చేసిన, ఈ నీ కుమారుడు రాగానే,నీవు వాడి కోసం క్రోవ్విన గొర్రెను వధించావు అంటున్నాడు. తండ్రిని, నీవు అని అంటున్నాడు. తమ్ముడుని, నీ కుమారుడు అంటున్నాడు. కానీ తండ్రి మాత్రం కుమారా! అని అంటున్నారు. చిన్న కుమారున్నీ నీ తమ్ముడు అని అంటున్నాడు. తండ్రి తన మాటల ద్వార, తెగిపోయిన తండ్రి కుమారుల బందాన్ని, చిగురించే విధంగా ప్రయత్నిస్తున్నాడు. పెద్ద కుమారుడు, తన మాట, ప్రవర్తన ద్వార, తాను బానిస అనుకుంటున్నాడు. కాని కుమారునిగా మాటలాడటంలేదు. తన ప్రవర్తన ద్వార తండ్రికి తగిన వాడను కాదు అనిపించుకుంటున్నాడు. మనం కూడా, ఈ విధంగా ప్రవర్తిస్తే తండ్రికి తగిన బిడ్డలము కాము. ఒక సారి మనం దేవునికి తగిన బిడ్డలమా ? కాదా? అని పరిశీలించుకుందాం.
నీవు నీ సోదరుని అంగీకరించినంత మాత్రాన, నీకు ఏమి నష్టం రాదు, నీకు వచ్చేది ఏమి పోదు. తండ్రి పెద్ద కుమారునికి, నాకు ఉన్నదంతయు నీదే అని అంటున్నాడు. పెద్ద కుమారుడు తాను ఎప్పుడు, తండ్రి మాట జవాదాటలేదు అని చెబుతున్నాడు. నిజానికి తండ్రిని అగౌరపరచాడు. తన తమ్ముని మీద అసూయ ఉంది, అని స్పష్టముగా తెలుస్తున్నది. పెద్ద కుమారుని ప్రకారం ఆనందం అనేది వేరె వారితో పంచుకోవడం. కాని తండ్రీకి తప్పిపోయిన దానిని తీరిగి చేర్చి, దానితో కలిసి ఆనందించడం.
పెద్ద కుమారుడు , తన తమ్మున్ని చెడ్డవానిగా చెబుతున్న, తన నిజమైన స్థితి ఒక బానిసదే. తండ్రి మాత్రం తనకు వ్యతిరేకంగా ఉన్నా,కుమారున్నీ శిక్షించక, నాకు ఉన్నదంతయు నీదే అని తనని కుమారునిగానే చూస్తున్నాడు. ఈ విందు లేక తమ్ముని రాక వలన అతనికి ఏమి పోవడం లేదు. పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు, యేసు ప్రభువు దగ్గరకు పాపులు, సుంకరులు రావడం వలన, వారి ప్రాముఖ్యత తగ్గుతుంది అని అనుకుంటున్నారు. నీవు జీవించే జీవితం బట్టి , నీ ప్రాముఖ్యత ఉంటుంది. ఇతరులు రావడం లేక పోవడం వలన కాదు.
మనం విందు జరుపుకొనుట యుక్తము, ఎందుకంటే చనిపోయిన నీసోదరుడు మరల బ్రతికెను, తప్పిపోయిన వాడు మరల దొరికెను అని చెబుతున్నారు. మనం ఏమి చేశాము, తండ్రిని ఎంత బాధ పెట్టము, అని తండ్రి లెక్కించాడు, తనకు తన కుమారుడు వచ్చాడు. అది ఆనందించే సమయం.
ఇక్కడ ముఖ్యమైనది తండ్రి యొక్క ప్రవర్తన. తన ప్రేమ జాలి దయ, కృప మనం అడగకనే చూపిస్తూ ఉన్నాడు. కుమారుడు వచ్చినందుకు చేసిన విందు కూడా మన పట్ల దేవుని ప్రేమ, ఎటువంటిది అని తెలియచేస్తుంది. ఏప్పుడైతే ఒక వ్యక్తి మారి, దేవుని సన్నిదికి రావడానికి సిద్దపడుతాడో, అప్పుడు దేవుడు ఎంత ఆనంద పడుతాడో ఇది తెలియచేస్తుంది.
తప్పిపోయిన కుమారుని జీవితం, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మనం సరిగా వాడుకోక పోతే మనం ఎటువంటి, ధుర్భర పరిస్థితిలోనికి నెట్టబడతామో తెలియచేస్తుంది. ఆ పరిస్తితిలోనే ఉండక, పశ్చత్తాపం ద్వారం తండ్రి దగ్గరకు రావాలని తెలియజేస్తుంది. మనలను అంగీకరించడంలో, క్షమించడం లో దేవుడు ఎప్పుడు అలసట చెందరు, ప్రతినిత్యం సిద్దంగానే ఉంటారు. దేవుని ప్రేమ ఎటువంటి షరతులు లేనిది, ఎల్లప్పుడు నీకోసం పరితపిస్తుంది, నీకోసం ఎదురుచూస్తుంది. కనుక ఎప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళుటకు వెనుకడుగువేయక ముందుకు పోదాం. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి