పేజీలు

12.5.23

ఈసాకు జీవిత చరిత్ర

 ఈసాకు జీవిత చరిత్ర 

వాగ్ధాన ఫలం 

అబ్రహాము సారాలు అనేక సంవత్సరాలు సంతానం కోసం ఎదురుచూశారు. అబ్రహాము సారాలను  దేవుడు ఆశీర్వాదించి వారికి ఒక బిడ్డను వారి వృద్ధాప్యంలో ప్రసాదించాడు. ముసలితనంలో సారాకు  ఈసాకు జన్మించాడు. ఈసాకు జన్మించినప్పుడు అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. ఈసాకు అను పేరును ఆయన పుట్టక పూర్వమే దేవుడు వారికి సూచించాడు. ఈసాకు  అంటే  "ఆయన నవ్వాడు" అని అర్ధం. సారా  జీవితంలో జరిగిన ఈ సంఘటన తనకు కూడా ఒక వింతలా ఉన్నది. అసంభవం అయినటువంటి సంఘటనకు ఆమెకే నవ్వు వచ్చింది. ఈ వయసులో  నేను గర్భం దాల్చడం ఏమిటో అనే ఆలోచనతో ఆమె నవ్వుకుంది.  పుట్టుకతోనే తల్లిని ఈసాకు నవ్వించినవాడు. ఈసాకు ఒడంబడిక పుత్రుడు మరియు దైవ వాగ్ధాన ఫలం.  సారా తన కుమారుడే అన్నింటికీ వారసుడు కావాలి అని అనుకున్నది అందుకే, ఆమె యిష్మాయేలును అక్కడ నుండి పంపించమని చెప్పినందుకు, అబ్రహము దానికి ఇష్ట పడకపోయిన దేవుడు ఆయనకు సారా చెప్పినట్లు చేయమని చెప్పారు. 

తండ్రి మాటకు కట్టుబడే  కుమారుడు 

అబ్రహము  బలి అర్పించటానికి మోరియా వెళుతున్నప్పుడు, అక్కడకు చేరిన తరువాత కొండ మీదకు అక్కడ సేవకులను, గాడిదను అక్కడ వదలి పైకి వెళుతున్నారు, మార్గ మధ్యలో ఈసాకు తన తండ్రిని బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఎక్కడ అని అడుగగా ఆయన దేవుడే ఇస్తాడు అని చెబుతున్నాడు.  ఈసాకు కొండ మీదికి వెళ్ళిన తరువాత బలికి సిద్ధం చేసిన తరువాత ఈసాకు ఆ పీఠం మీద బలి వస్తువుగా పడుకుంటున్నాడు. బలికి సిద్ధమవుతున్నాడు. తన తండ్రి చిత్తానికి తన జీవితాన్ని అర్పిస్తున్నాడు. ఈసాకు యేసు ప్రభువు వలె తన తండ్రి ఏమి చెప్పిన చేయడానికి సిద్ధం అవుతున్నాడు. 

ఈసాకుకు 8వ రోజున సున్నతి చేశారు. అబ్రహాము తన కుమారున్ని, దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొని పోయినప్పుడు, ఈసాకు  మారు మాట్లాడకుండా తండ్రి చెప్పినట్లు ఆ బలి పీఠం మీద బలిగా అర్పించబడటానికి సిద్ధపడ్డాడు. ఈయన తన తండ్రి మీద విశ్వాసం వుంచి తండ్రి మాట జవదాటని వానిగా తన జీవితం మొత్తం కూడా ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభువు వలె, బలి కావడానికి సిద్ధమైన వాడు, తండ్రి ఇష్టమునకు తన జీవితమును అర్పించడానికి  సిద్దమైన వాడు. తన తండ్రి చిత్తమునకు తన జీవితమును అర్పించడానికి సిద్ధమైనప్పటి నుండి ఈసాకు దేవునికి అంకితమైనటువంటి వానిగా జీవించాడు.

 అబ్రహాము ఇష్టప్రకారం తన పెండ్లిని కూడా నిర్ణయించే అధికారం మాత్రం తండ్రికే వదలి పెట్టాడు ఈసాకు.ఈసాకు మాత్రమే తన భార్య ఎవరు కావాలనేది దేవుని చిత్తమునకు వదలిపెట్టాడు.  అబ్రహాము తన జీవిత ముగింపులో ఉన్నాడు. తాను స్వయంగా ఈసాకుకు పెండ్లి కుమార్తెను చూడుటకు తన సేవకుడిని పిలిచి హారాను వెళ్ళి తన చుట్టాలలో ఒకరిని చూడమని చెప్పారు. ఆయనకు తన కుమారునికి అక్కడ వారు ఐగుప్తు వారిలో కాకుండా తన సొంత వారి దగ్గర నుండి మాత్రమే  చేసుకోవాలి అనుకున్నాడు. కనుక తన సేవకుడు హారాను వెళ్ళి రెబ్కాను తీసుకొని వచ్చారు.

తల్లి మరణము - స్త్రీకి ఈసాకు ఇచ్చిన గౌరవం - ఆధ్యాత్మిక చింతన 

సారా మరణించిన తరువాత ఈసాకు చాలా క్రుంగిపోయాడు. తన తల్లి చనిపోయే నాటికి ఇస్సాకు మూప్పై ఆరు సంవత్సరాలు వయసులో ఉన్నాడు.  ఈ కృంగుబాటు నుండి తన పెండ్లి తరువాత మాత్రమే బయట పడుతున్నాడు. తన తల్లి చనిపోయినందుకు ఈసాకు చాలా దుఃఖించాడు. తనకు పెళ్లి అయినంత వరకు తనకు తల్లి లేని లోటు, ఆ బాధ నుండి బయటపడలేక పోయాడు. విశ్వాస పితరులలో కేవలం ఒక్క ఈసాకు మాత్రమే ఒకే భార్య కలిగి ఉన్నాడు. తన జీవితంలో మరొక స్త్రీ కి స్థానం కలిగించలేదు. ఈసాకు మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించాడు. అబ్రహాము సేవకుడు రెబ్కాను ఈసాకుకు  భార్యగా చేయడానికి హారను నుండి తీసుకొని వస్తున్నప్పుడు ఆయన పొలంలో ధ్యానిస్తున్నాడు. ఆమెను తీసుకొని వస్తున్నప్పుడు నెగెబు వద్ద ధ్యానించుకొనేందుకు ఈసాకు పొలమునకు వెళ్ళిన తావునే వారు రాగా రెబ్కా అక్కడ కనపడుతున్న ఈసాకు గురించి వాకాబు చేయగా సేవకుడు ఆయనే ఈసాకు అని ఆమెకు చెప్పగా ఈసాకు ఆమెను తీసుకొని పోయి భార్యగా చేసుకొన్నాడు. తరువాత వారు అక్కడకు రాగ, ఆమెను తీసుకు వెళ్ళి తన భార్యగా చేసుకొనుచున్నాడు. ఈసాకు తన తల్లి లేని లోటును తన భార్య ద్వారా తీర్చుకున్నాడు అంటే అంతగా ఆమె మీద ఆధారపడ్డాడు, మరియు ఆమెను అంతగా ప్రేమించాడు. ఇక్కడ మనం ఈసాకు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అని చూస్తున్నాం. 

ఈసాకు తండ్రి ఆగుట 

ఈసాకు నలువది సంవత్సరాల ప్రాయంలో పెండ్లి చేసుకున్నాడు. చాలా సంవత్సరాల వరకు వీరికి బిడ్డలు కలుగలేదు. తరువాత దేవుని కృప వలన రెబ్కా ఇద్దరి కవలలకు జన్మనించింది. ఏసావు మరియు యకొబు ఇద్దరు బిడ్డలు  పుట్టారు. రిబ్కా తండ్రి పేరు బెతూవెలు, ఆమెకు లాబాను అను ఒక సోదరుడు కలడు. ఆమె గొడ్రాలు అవుటవలన ఆమె కొరకు ఈసాకు దేవుని వెదుకొనగా ఆమె గర్భవతి అయ్యింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టిరి. వారు గర్భమున ఉండగానే ఒకరిని ఒకరు నెట్టుకొనిరి. మొదట పుట్టిన బిడ్డ ఎర్రగా ఉండెను. రోమవస్త్రము వలె అతని ఒడలియందంతట వెంట్రుకలు ఉండెను. అతనికి ఏసావు అని పేరు పెట్టిరి. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే అతని మడమ పట్టుకొని రెండవ బిడ్డ కూడా పుట్టాడు. అప్పడు ఈసాకు వయసు అరువై. 

వలస జీవితం - దేవుని తోడ్పాటు - ఈసాకు వృద్దిచెందుట

అబ్రహాము కాలములో  కరువు వచ్చిన సమయంలో ఈసాకు పిలిస్తీయుల రాజు అబీమెలెకు  దగ్గరకు వెళ్లారు. ఆ కాలంలో అబిమెలెకు గెరారులో ఉన్నారు. దేవుడు ఈసాకుకు ప్రత్యక్షమై ఐగుప్తు వెల్లవద్దని, ఆ దేశమునే ఉండమని చెప్పగా, ఈసాకు దేవుడు చెప్పినట్లుగానే గెరారులో జీవించాడు. అక్కడ ఈసాకు భయపది  రిబ్కాను తన సోదరి అని చెప్పి జీవించుచున్నాడు. ఆమె తన భార్య అని చెప్పుటకు ఆయన భయ పడ్డాడు. అబీమెలెకు రాజు , ఈసాకు తన భార్యతో సరసమాడుచు ఉండగా చూశాడు. అతడు ఈసాకును నిజము చెప్పమని అడుగుగా అతను తన భార్య అని ఒప్పుకున్నాడు. అప్పుడు అబీమెలెకు ఈసాకును గాని రిబ్కాని కాని ముట్టుకొన్న వారికి చావుముడుతుంది అని తన ప్రజలను హెచ్చరించాడు.

 ఈసాకు అక్కడ పొలములో విత్తనములు విత్తగా అది వందరెట్లు పంట ఇచ్చింది. ఆ విధంగా మహా సంపన్నుడు అయ్యాడు. దినదినాభివృద్ది చెందుతూ వచ్చాడు. గొర్రెలు, గొడ్లు సేవకులు ఇంకా అనేక సంపదలు సంపాదించాడు. అది చూసి పిలిస్తియులు ఆయన మీద అసూయ పడ్డారు. వారు అబ్రహాము కాలమున తవ్విన బావులను మట్టితో పూడ్చివేశారు. అబీమెలెకు  కూడా నీవు మాకంటే సంపన్నుడవు అయ్యావు ఇక్కడి నుండి వెళ్లిపో అని చెప్పాడు, అపుడు ఈసాకు  అక్కడనుండి గెరారు లోయలో, గూడారములు వేసుకొని అక్కడే నివసించాడు. ఈసాకు అబ్రహాము కాలము నాటి బావులను మరల త్రవ్వించి, వాటికి అబ్రహాము పెట్టిన పేర్లు పెట్టించాడు. ఈసాకు  బానిసలు ఆ స్థలంలో త్రవ్వగా  అన్ని చోట  నీరు పడ్డాయి. కాని గెరారు కాపరులు వచ్చి ఆ నీళ్ళు మావని వాదనకు దిగారు. కనుక ఆ బావికి ఎసెకు అని పెట్టారు, దాని అర్ధం  జగడము. తరువాత ఈసాకు పనివారు మరియొక బావిని త్రవ్వగా దాని కొరకు వారు పోట్లాడిరి, కనుక దానికి సిత్నా అను పేరు పెట్టిరి, అనగా పగ అని అర్ధం. అక్కడ నుండి పోయి ఈసాకు మరియొక బావి త్రవ్వించెను దానికి రెహోబోతు అని పేరు పెట్టి ఈనాటికి దేవుడు మాకు కావలసినంత చోటు చూపించేను, ఇక మేము ఇక్కడ అభివృద్ది చెందగలము అని అనెను. ఆ రాత్రి ఈసాకు బేర్షేబాకు వెళ్ళగా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అతనితో నేను నీ తండ్రి అబ్రహాము కొలిచిన దేవుడను భయపడకుము, నీకు చేదోడుగా ఉందును, నీ తండ్రిని బట్టి నిన్ను దీవింతును, నీ సంతతిని విస్తరిల్లచేయుదును అని చెప్పగా, ఈసాకు అక్కడ ఒక బలిపీఠము నిర్మించి, దేవుని అక్కడ ఆరాధించి అక్కడే గుడారము వేసికొనేను. అతని బానిసలు అక్కడ కూడా ఒక బావిని తవ్విరి. 

అబిమెలెకు తో వడంబడిక 

అబిమెలెకు తన సలహాదారుడు ఆహుసతు, సేనాధిపతి ఫీకోలుతో గెరారు నుండి ఈసాకు కడకు వచ్చి దేవుడు ఆయనకు తోడుగా ఉండుట చూచి, దేవుడు నీకు చేదోడుగా ఉండుట మేము కన్నులారా చూచితిమి, మేము నీకు ఎన్నడూ కీడు చేయలేదు. కనుక మేము నీకు కీడు చేయనట్టే నీవు మాకు ఏ కీడు చేయనని మాట ఇవ్వమని అడిగిరి, అందుకు ఈసాకు వారికి విందు తయారు చేయగా, విందు చేసి ఉదయాన్నే ప్రమాణములు చేసుకొనిరి. తరువాత వారు మిత్ర భావంతో వెళ్లారు. ఆరోజే ఈసాకు పనివారు ఒక బావిని త్రవ్వగా అక్కడ  నీరు పడెను. ఆ బావికి షేబా అను పేరు పెట్టెను. అందుకే ఇప్పటికి కూడా ఆ నగరము బేర్షేబా అను పేరిట ఉంది.  అంటే ప్రమాణము చేసిన బావి అని అర్ధం. 

యాకోబు ఈసాకు దీవెనలు పొందుట 

ఏసావు యూదితును, బాసెమతును వివాహం చేసుకొన్నారు, వారు  హిత్తుయులగు బీరీ మరియు ఏలోను కుమార్తెలు , వీరి వలన ఈసాకు మరియు రిబ్కాకు తీవ్ర మనస్తాపము కలిగింది. ఈసాకు పండు ముసలి వాడు అయిన తరువాత అతని కనులు కనపడనంతగా మసకపడెను. సుమారు 50 సంవత్సరాలు ఆయన గుడ్డివానిగానే జీవించాడు.  అతడు పెద్ద కుమారుడు ఏసావును పిలిచి జింక మాంసం తీసుకొనివచ్చి తనకు వడ్డించమని, తరువాత తను తృప్తిగా భుజించి తనను దీవించి కన్నుమూసెదను అని చెప్పాడు. 

అది వినిన రిబ్కా యాకోబుతో రెండు మేకలను  తీసుకొని రమ్మని చెప్పి దానిని రుచికరముగా వండి మీ తండ్రికి వడ్డించి నీవు దీవెనలు పొందమని చెప్పింది. అందుకు యాకోబు తన అన్న శరీరం అంత వెంట్రుకలతో వున్నది గదా, తండ్రి నన్ను తడిమి చూచిన తెలుసుకొనును గదా ,అప్పుడు నాకు తండ్రి కోపము  శాపము అవునేమో అని  చెప్పగా , దానికి ఆమె ఆ శాపమేదో నాకే తగలనిమ్ము, నీవు మాత్రము వెళ్ళి చెప్పినట్లు చేయని చెప్పగా యాకోబు అట్లే చేసెను. అప్పుడు తల్లి భోజనం తయారు చేసి ఏసావు కట్టుకొనే మేలి ఉడుపులు ఇంటిలో ఉండగా రిబ్కా వాటిని తీసుకొని యాకోబుకి ఇచ్చి, మేక పిల్ల తోళ్ళతో యాకోబు చేతులను, నున్ననిమెడను కప్పి, ఆమె సిద్దము చేసిన భోజనము  యాకోబుకు ఇచ్చి తండ్రి వద్దకు పంపెను.  యాకోబు తండ్రి వద్దకు రాగ, ఈసాకు ఇంత తొందరగా ఎలా మాంసం దొరికినది అని అడగ్గా నీ దేవుడైన యావే దానిని నా వద్దకు పంపెను అని చెప్పాడు. 

ఈసాకు యాకోబుతో తన దగ్గరకు రమ్మని పిలిచి తనను తడిమి చూసి గొంతు యాకోబు గొంతు వలె ఉన్నను, చేతులు ఏసావు చేతులే అనెను. అతనిని దీవింపనేంచి నీవు నిజముగా నా కుమారుడు ఏసావువేనా అడుగగా,  దానికి యాకోబు అవును అని సమాధానం ఇచ్చాడు. అపుడు ఆ మాంసము తిని, ద్రాక్ష సారాయమును ఇవ్వగా అది త్రాగి, యాకోబుతో తన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోమని చెప్పగా, యాకోబు అట్లే చేయగా, యాకోబు ధరించిన వస్త్రముల వాసన చూచి ఆయనను దీవించాడు. నీవు నీ సోదరులను పాలింతువు, అన్ని జాతులు నీకు తలొగ్గును అని, నిన్ను దీవించు వారు దీవించబడుదురు అని దీవించేను. ఈసాకు దీవించుట ముగించిన త వెంటనే ఏసావు వచ్చి భోజనము సిద్దము చేసి తండ్రికి ఇచ్చి,  లేచి భుజించి తనను దీవింపమని అడుగగా ఈసాకు నాయన నీవు ఎవరవు అని ప్రశ్నించాడు. నేను ఏసావును నీ  పెద్ద కుమారుడను  అని చెప్పగా ఈసాకు ఒళ్ళు కంపించింది. అప్పుడు జరిగినది చెప్పగా, ఏసావు తండ్రి నన్ను కూడా దీవింపుము అని అడిగెను. ఆ దీవెనకు తిరుగులేదు అని ఆయన సమాధానం చెప్పెను. ఆ మాటకు ఏసావు పెద్దగా ఏడ్చి , తన సోదరుని గురించి అతనికి యాకోబు అని సార్ధకమైన పేరే పెట్టితిరి, అతడు నన్ను మోసము చేయుట రెండవ సారి అని అన్నాడు. తండ్రి నాకు ఏ దీవెనయు మిగులలేదా అని అడుగగా, అందుకు ఈసాకు, నీవు భూసారము కొరవడిన చోట నివసింతువు, నీవు ఖడ్గము చేపట్టి బ్రతుకుదువు, నీ తమ్ముని సేవింతువు కాని నీవు తిరుగుబాటు చేసిన రోజు నీ మెడ మీద నుండి అతని కాడి విరిచేదవు అని చెప్పాడు. 

ఈసాకు యాకోబును లాబాను వద్దకు పంపుట 

రిబ్కా ఈసాకుతో ఏసావు వివాహమాడిన హిత్తియుల పిల్లలు నా ప్రాణాలు తీసివేస్తున్నారు. యాకోబు కూడా ఈ జాతి పిల్లను వివాహమాడిన నేను చచ్చిన, బ్రతికిన సమానమే అని చెప్పగా, ఈసాకు యాకోబును పిలిపించి, దీవించి అతనికి బుద్దులు చెప్పి, కనానీయులలో ఎవరని పెండ్లి చేసుకోవద్దని, యాకోబు మేనమామ అయిన లాబాను కూతురులలో ఒకరిని వివాహమాడమని చెప్పి, దేవుని ఆశీర్వాదములు పలికి అక్కడ నుండి పద్దనారములోని లాబాను ఇంటికి పంపెను. లాబాను అరమీయుడయిన బెతూవెలు కుమారుడు మరియు రిబ్కా సోదరుడు. 

ఈసాకు మరణం - గొప్ప వ్యక్తిత్వం

యాకోబు మమ్రేలో ఉన్న తన తండ్రి దగ్గరకు వచ్చిన తరువాత, నూటయెనుబది సంవత్సరాల వయసులో మరణించగా యాకోబు, ఏసావులు తమ తండ్రిని సమాది చేశారు. ఈసాకు వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది, తన కుటుంబ జీవితం ఎంతో ఉన్నతమైనది, నైతికంగా అయన జీవితాన్ని ఎవరితో పోల్చలేము అంత గోప్య నైతిక జీవితాన్ని జీవించాడు. తన తండ్రి వలె ఈయన కూడా తన భార్యను కూడా తన చెల్లి అని చెప్పడం జరిగింది. ఒక రకముగా ఈయన జీవితంలో అది మాత్రమే ఒక మచ్చ అంతకుమిచ్చి ఇతని జీవితంలో ఎటువంటి పొరపాటు జరుగలేదు. ఈయన మంచి భోజన ప్రియుడు , తన పెద్ద కుమారుడు అనిన ఇతనికి చాలా ఇష్టం అని మనకు తెలుస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...