మత్తయి 24:37-44
నోవా దినములయందు ఎట్లుండెనో, అటులనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు, త్రాగుచు, వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొనిపోవువరకు వారు ఎట్లు ఎరుగకుండిరో, అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండ ఒకడు కొనిపోబడును, మరియొకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండగా, ఒకతె కొనిపోబడును, మరియొకతె విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై యుండుడు. ఏలయన, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మేల్కొనియుండి, తన ఇంటికి కన్నము వేయనీయుడు. కనుక, మీరును సిద్ధముగా ఉండుడు. ఏలయన, మనుష్యకుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును.
పునీత సిలువ యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ మార్గ మధ్యములో ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది.
ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు.
ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము. నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి. ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు. కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి. నీ జీవితములో ఆయన లేకుంటే జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం పరిపూర్ణత సంతరించుకుంటుంది.
ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.
దేవుని రాకడ లేక ఆగమానం - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము. ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు, ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు. దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.
తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత, మక్కబియుల గ్రంధంలో వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది.
ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '
యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి నిత్య రక్షణ ద్వారము మరల తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి.
క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న మనలను ఆనందంతో నింపుతున్నాడు. అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి. అంటే మనం దేవుని వాక్కు అవతరంగా మారిపోగలగాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి