పేజీలు

31.12.22

మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం

 మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవం 

ఈ రోజు మనం మూడు ముఖ్యమైన పండుగలు చేసుకుంటున్నాము. మొదటిది మరియ మాత దివ్య మాతృత్వ పండగ. ఏమిటి మరియమాత మాతృత్వం, ఆ మాతృత్వ గొప్పతనం ఏమిటి అంటే ఇది సాధారణ మాతృత్వం కాదు. దేవునికి తల్లి అవ్వడం. దేవునికి తల్లి అవ్వడం అంటే  ఏమిటి ? రెండవది యేసు ప్రభువుకు సున్నతి చేసి పేరు పుట్టిన రోజు. మూడవదిగా ఈరోజు మనము నూతన సంవత్సరములోనికి అడుగుపెడుతున్నాము. 

ఈ యొక్క పదాన్ని 431వ సంవత్సరంలో ఎఫెసుస్ కౌన్సిల్ లో మొదటిగా మరియమాత దేవుని తల్లి అని అనడం జరిగింది. దానిమీద అనేక వాదనలు జరిగాయి.  వీటన్నింటి సారాంశం ముఖ్యముగా  దేవుని గురించే. అది యేసు ప్రభువు ఈలోకమునకు మానవునిగా రావడం వలన ఈ మానవ రూపంలో దైవత్వాన్ని పూర్తిగా చూపించడం ప్రధాన అంశం యేసు ప్రభునియొక్క మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని పూర్తిగా మనము పూర్తిగా అంగీకరించినప్పుడు మరియమాత యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాము. మరియమాతకు ఉన్న పేరులలో చాలా ముఖ్యమైనది దేవుని తల్లి. ఆమె దేవునికి మానవునిగా జన్మనిచ్చిన తల్లి. ఈ పేరుకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇది యేసు ప్రభువు పూర్తిగా మానవుడు మరియు దేవుడు అని చెప్పే సందర్భంలో ఈ పేరుతో మరియమాతను సంబోధించడం జరిగినది. ఇది  ఇప్పటినుండే కాదు అంతియోకియకు చెందిన ఇగ్నేషియస్ అనే పునీతుడు నూట ఏడవ సంవత్సరంలో మన ప్రభువును  మరియమాత తన గర్భంలో దేవుని రక్షణ మార్గానికి సహకరించింది అని చెప్పేవారు. ఆమె దేవుని తల్లి అని ఆరిజిన్ గారు రెండవ శతాబ్దంలోనే చెప్పారు. కాపాడొసియాన్ పితరులు అయిన పునీత  గ్రెగరీ గారు మరియమాతను దేవుని తల్లిగా అంగీకరించకపోతే అయన ఇచ్చే దైవత్వం నుండి మనం వైదొలుగుతున్నాం అని అంటారు. ఎందుకు అంటే  యేసు ప్రభువు మీరు దేవుని వాక్కును పాటించినట్లయితే మీరు నా సహోదరి సహోదరులు అవుతారు, నా తల్లి అవుతారు అని చెబుతారు. అటువంటి అప్పుడు తన గర్భం నందు మోసి , దేవుడు చెప్పినట్లుగా మీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను నీ దాసురాలును అని చెప్పేరు, ఇంకా అంతకన్నా దేవుని వాక్కును పాటించిన వారు ఎవరు  ఉన్నారు. 

 అయితే నాలుగవ శతాబ్దంలో మరియమాత దేవుని తల్లి అని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు నెస్టోరియాన్ అనే బిషప్ గారు. ఆయన చెప్పిన కారణం ఆమె కేవలం మానవ యేసుకి మాత్రమే జన్మనిచ్చినది అని చెప్పారు. కానీ ఆయన తన మానవ స్వభావం మరియు దైవ స్వభావం రెండు కూడా మిళితమైఉన్నవి. 

యేసు ప్రభువు మనకు దివ్య సత్ప్రసాదం స్థాపించి మనకు ఒక బహుమతిని ప్రసాదించాడు. యేసు ప్రభువు మనకు మరియొక బహుమతి ఇచ్చాడు అది యేసు ప్రభువు తన ప్రాణమును విడిచే ముందు ఈ బహుమానం మనకు ప్రకటించాడు. అది ఏమిటి అంటే మరియమాతను తన ప్రియమైన శిష్యుడుకు ఇచ్చాడు. ఇన్నాళ్ళూ యేసు ప్రభువుకు మాత్రమే ఆమె  తల్లి కాని ఇప్పటి నుండి ఆమె తన శిష్యుడుకు మాత్రమే తల్లి కాకుండా మన అందరికి కూడా తల్లి అవుతుంది. 

ఇప్పటి నుండి మరియ మాత అందరికి ప్రతి ఒక్కరికీ కూడా ఆమె తల్లి అవుతుంది. ఎప్పుడైతే దేవదూత నీవు కుమారున్నీ ప్రసవించబోతున్నావు అని అప్పటినుండి ఆమె యేసు ప్రభువు తల్లిగానే మనము చూస్తాము. ఎందుకంటే  ఎలిజబెతమ్మ మరియతల్లి తన వద్దకు రాగానే నా ప్రభువుని తల్లి నావద్దకు రావడం నాకు ఎలాగు ప్రాప్తించేను అని అంటున్నది, ఆమె పవిత్రాత్మ ప్రభావం చేత ఈ మాటలు అంటున్నది కనుక మనం ఆమెను పవిత్రాత్మే దేవుని తల్లి అని చెబుతున్నది అని అర్ధం అవుతుంది. 

ఈమె దేవుని తల్లి అయితే మనకు ఏమిటి అని మనం అనుకోవచ్చు, ఈమె దేవునికి మాత్రమే కాదు మనకు కూడా తల్లి ఎందుకంటే యేసు ప్రభువు మానవునికి ఇచ్చిన చివరి రెండు బహుమతులు ఏమిటి అంటే మొదటిది తాను ఎల్లప్పుడు మనతో ఉండటానికి దివ్య సత్ప్రసాదం ఒసగడం మరియొకటి మరియమాతను తన ప్రియ శిష్యునిగా ఇవ్వడం వలన మన అందరికి ఆమెను తల్లిగా ఇస్తున్నాడు. ఆమెను తల్లిగా యోహను తన ఇంటికి తీసుకొని వెళుతున్నాడు. మనం ఆమెను మన తల్లిగా తీసుకొని వెళ్ళాలి. 

మరియమాతకు  దెవదూత మంగళ వార్తను ప్రకటించినప్పుడు నీవు దేవుని కుమారునికి జన్మ ఇస్తావు అని అన్నపుడు  మరియమాత  విశ్వాసంతో తన విధేయతను చూపించింది. నేను దేవుని దాసురాలను అని మరియమాత చెప్పింది. మరియమాత  యేసు ప్రభువుకు తల్లి అవుతుంది.  

ఈనాటి సువిశేషంలో మారియమతను యేసు ప్రభువుతో చూస్తాము, ఇక్కడ చాలా గొప్ప మాటలు మనకు వినపడుతున్నాయి. ఆమె ఈ విషయాలను అన్నింటినీ తన మనసున పదిలం చేసుకొని మననం చేసుకొని జీవిస్తుంది అని చెబుతుంది. ఇది మనకు అత్యున్నత మార్గాన్ని మనకు చూపిస్తుంది. మనం మన జీవితంలో ఎలా ఎల్లప్పుడు మంచి ఆలోచనలతో ఉండాలో చెబుతుంది. మరియమాత జీవితంలో అనేక దుర్ఘటనలు ఉన్నాయి,  యేసు ప్రభువు తనకు దూరం అవుతారు, యేసు ప్రభువు తనతో ఉండటంలేదు. కాని ఈ బాల యేసుకు సంబంధించిన అన్నీ విషయాలను తన మదిలో నిపుకొని తన జీవితంలో ఎటువంటి చెడు భావాలకు లోనుకాకుండా ఆమె జీవిస్తుంది. మనకు కూడా ఇది ఒక మంచి మార్గమును చూపిస్తుంది. 

 మరియమాత నేను మీ దాసురాలను అని చెప్పినప్పుడు ఆమె అవ్వ చేసిన పని అయిన అవిధేయతను  తన తన విధేయత ద్వారా దేవునికి ఇష్ట పుత్రికగా అయ్యింది. 

మనలను రక్షించడానికి వచ్చిన దేవుడు మన మధ్యనే ఉన్నాడు. తన ఆహ్వానాన్ని తీసుకొని మరియమాత వలె తమ జీవితాలను దేవుని ప్రణాళికకు అనుకూలముగా మారితే మనం ఎప్పుడు ఆమె వాలే ఉంటాం. 

 మానవుని స్వేచ్ఛను ఎప్పుడు కూడా దేవుడు గౌరవిస్తాడు. మరియమాతకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశం మరియమాత వినియోగించుకున్నది. ఇది మనందరికీ కూడా వ్యక్తిగతముగా,   ఆహ్వానముగా వుంది, ఆ కుటుంబంలో భాగం అవుదాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...