హృదయ పరివర్తనా ? లేక నాశనమా? లూకా 13:1-9
మన రక్షణకు అవసరమైనది హృదయ పరి వర్తన. ఈనాటి సువిశేషం ద్వార దీనిని ప్రభువు వెల్లడి చేస్తున్నారు. మనం మారు మనస్సు పొందక పోతే మనం నాశనం అవుతాము అని యేసు ప్రభువు వెల్లడిచేస్తున్నారు. నేను చాలా పాపములు చేసెను ఇంకా నన్ను దేవుడు నన్ను క్షమించడులే అని మనం బాధకు గురికానవసరం లేదు. కాని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనలను శిక్షించకుండా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటే నీవు శిక్షకు గురికావు. నివివే ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొందినందుకు వారిని శిక్షించడం లేదు.
దేవుని యందు నీకు అభయం ఉంది అది ఏమిటి అంటే నీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్దాముగా ఉన్నాడు. సాతాను నీకు రక్షణ లేదు అని చెబుతుంది, కానీ యేసు ప్రభువు కోసం ఆ అవకాశం తీసుకొస్తాడు. మొదటి తిమోతి రెండవ అధ్యాయం 5 వ వచనం మనకు ఇది చెపుతుంది. "దేవుడు ఒక్కడే,దేవుని ,మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయ ధనముగా ఆయన తనను తాను అర్పించుకొనేను."
"ఆ సమయమున కొందరు, గలీలియ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి." యేసు ప్రభువు దీని గురించి ఏమి చెప్పడం లేదు వారికి, అక్కడ పిలాతు తప్పు చేశాడు అని కానీ వారు అలా చేసి ఉండకూడదు అని కానీ ఏమి మాటలాడటం లేదు. ఆ విషాదాన్ని గురించి మాటలాడటం లేదు. ఎందుకు పిలాతు వారిని చంపించి ఉండవచ్చు అంటే ఆనాటి రోజులలో ఎక్కువగా గలీలియ నుండే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ఎక్కువగా వస్తుండేది. రోమా సామ్రాజ్యం ఎటువంటి విప్లవాలను సహించదు అని చెప్పడానికి చేసి ఉండవచ్చు. ఇక్కడ వారు ఘోరంగా అవమానింప బడ్డారు ఎందుకంటే వారు బలులను అర్పించుచున్నప్పుడు వారిని చంపిస్తున్నాడు పిలాతు. ఇది మనిషి కావాలని చేసిన మారణహోమం.
అందుకు యేసు, "అటుల చంపబడిన ఈ గలీలియ వాసులు తక్కిన గలీలియ వాసులకంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? అని అడుగుతున్నారు? ఇటువంటి సమయంలో మనం చనిపోయిన వారు ఎవరు? వారు ఏమి చేశారు? అని చర్చించుకుంటాం. కానీ యేసు ప్రభువు దాని గురించి మాటలాడటంలేదు. నీకు ఇటువంటిది జరిగితే అన్నట్లు మాటలాడుతున్నారు?
దేవాలయానికి ఇద్దరు ప్రార్ధన చేసుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకడు సుంకరి మరియొకడు పరిసయ్యుడు, పరిసయ్యుడు తాను చేసే పనుల బట్టి నేను మంచి వాడిని అని అనుకుంటున్నాడు. నిజానికి కాదు ఎంతో కపటం అతనిలో ఉంది. నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి పోతున్నది సుంకరియే. నీ జీవితం ఎలా ఉంది ఇక సారు ఆలోచించు. నా జీవితంలో కొన్ని సార్లు ఇతరుల కంటే నేను మంచి వాడిని అనుకుంటాము. కానీ దాని గురించి నీవు ఆలోచించనవసరం లేదు.
యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు ఆయనే జవాబు ఇస్తున్నాడు. కాదు అని. మరల "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను." హృదయ పరివర్తనం అనేది నీవు రక్షణ పొందడానికి దేవుడు పెట్టిన షరతు ఇది. నేను ఏమి చేయాలి ఈ హృదయ పరివర్తన పొందడానికి. పునీత పౌలు గారి జీవితం మనకు నేర్పుతుంది, హృదయ పరివర్తన ఎలా ఉంటుంది అని. ఆయన క్రీస్తుని తెలుసుకున్న తరువాత ఆయన జీవితం మొత్తం యేసుతోనే. అందుకే ఆయన అంటున్నాడు.ఇక క్రీస్తే నాకు జీవము.
యేసు ప్రభువు వారితో శిలోయము అను బురుజు కూలి, దాని క్రిందపడి మరణించిన పదునెనిమిదిమంది,తక్కినయెరుషలేము నివాసులకంటే ఎక్కువ అపరాధులు ఎంచుచున్నారా? ఇక్కడ మరల యేసు ప్రభువు మరియొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న మరల జవాబు ఆయనే ఇస్తున్నారు. కానీ అక్కడ మనిషి చేసిన మరణ హోమం ఇక్కడ ప్రకృతి ద్వార జరిగిన విషాదం. కానీ ప్రశ్న మాత్రం ఒకటే. ఎందుకంటే అనేక సార్లు మన ఇటువంటి విషయాలే వింటువుంటాం. అది ప్రకృతి వల్ల జరిగిన మనిషి వల్ల జరిగిన కొంత మంది నాశనం అయ్యారు. ఇది కేవలం వారి భౌతిక నాశనమే. వారు మంచి వారు అయితే వారికి రక్షణ ఉంటుంది. కానీ యేసు ప్రభువు అడిగేది, నీవు వీటి గురించి కాక నీ గురించి ఆలోచించమని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నకు కూడా కాదు అని యేసు ప్రభువే సమాదధానం ఇస్తున్నాడు. అంటే కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలుకుతున్నారు. అంటే మరలా మరలా యేసు ప్రభువు హృదయ పరివర్తన గురించి చెబుతున్నారు. ఒక వేళ హృదయ పరివర్తన చెందక పోతే నాశనం కొని తెచ్చుకున్నవారి వలె మనం మారిపోతాం. దేవుడు హెచ్చరించిన సమయంలో కొంత మంది హృదయ పరివర్తన చెందారు వారు ఎవరు అంటే నినీవే ప్రజలు, యేస్సీయారాజు, అదే హెచ్చరిక నోవా కాలంలో వచ్చింది. సొదొమో గోమొర్రోకు వచ్చింది కానీ వారు దేవుని మాట వినలేదు. పర్యవసానం మనం చూస్తున్నాం. మన రక్షణకు పూజలు, బలులు ముఖ్యం కాదు. ఏమిటి అంటేహృదయ పరివర్తన. హృదయ పరివర్తన లేక నాశనమా ? నిర్ణయం మనదే.
యేసుప్రభువు వారికి అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు. . దేవుడు మన నుండి ఎప్పుడు కూడా పండ్లను కోరుకుంటున్నారు. ఈ చెట్టు తన యొక్క ప్రజలు. యాజమాని దేవుడు, తోటమాలి, యేసు ప్రభువు.
తోటమాలితో ఇదిగో! నేను మూడేండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్లకోరకు వచ్చుచున్నాను. కానీ నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికి వేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?అనెను. ఇక్కడ దేవుడు అన్నీ ఇచ్చాడు. మొత్తం ఇచ్చిన తరువాత మన నుండి దేవుడు ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఏమి ఇవ్వకుండా కాదు. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అని నీవు ఎప్పుడైనా అనుకున్నావా? కానీ దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఒకసారి లెక్కించుకో?
అందులకు తోట మాలి అయ్యా ! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదుచేసి ఎరువు వేసేదను. ఎవరు ఈ తోటమాలి? యేసు క్రీస్తు నీకోసం నాకోసం దేవుని ముందు మొరపెట్టుచున్నారు. అబ్రహాము అడిగినప్పుడు దేవుడు క్షమిస్తున్నారు. మోషే అడిగినప్పుడు క్షమిస్తున్నారు. ఖచ్ఛితముగా మనం ప్రధాన యాజకుడు, తన కుమారుడు మన కోసం అడిగినప్పుడు దేవుడు ఓర్పు తో ఒప్పుకుంటున్నారు. దేవుడు మన మీద ఉన్న ప్రేమతో ఒప్పు కుంటున్నారు. న్యాయముగా అయితే ఇది జరుగకూడదు. ఎందుకు అంటే న్యాయముగా మనం శిక్షకు గురి కావాలి. కానీ కలకాలం ఇలానే ఉండదు. మనకు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి.
ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు, అని పలికెను. యేసు ప్రభువు ద్వారా మనకు మరియొక అవకాశం వచ్చింది. ఇది చివరిది ఎందుకంటే అంతకు ముందు మనకు చాలా అవకాశాలు వచ్చినవి. మోషే ద్వార ధర్మ శాస్త్రం ఇచ్చి నీవు ఈ విధంగా జీవించమని దేవుడు చెప్పాడు. అప్పుడే మోషే చెప్పారు, యొహ్ో షువా చెప్పారు , మీరు దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించిన జీవిస్తారు లేదా మరణిస్తారు అని చెప్పారు. న్యాయాధిపతులు ద్వారా ప్రభువు వారికి మంచి జీవితం జీవించమని చెప్పారు, ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. యేసు ప్రభువుతో వచ్చినది చవరి అవకాశం కనుక హృదయ పరివర్తన పొంది మంచి ఫలాలను ఇవ్వడానికి ఎప్పుడు సిద్దాముగా ఉందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి