పేజీలు

13.3.23

సామాన్య 6 వ ఆదివారం

 లోకమును కాక  దేవున్ని నమ్ముము 

యిర్మియా 17:5-8 1 కోరింథీ 15:12, 16-20, లూకా 6:17,20-26 

ఈనాటి మొదటి పఠనంలో యిర్మియా ప్రవక్త ద్వార మనం ఎవరిని నమ్మలో చెపుతున్నారు. నీవు ఈ లోకం కానీ దానిలోని వ్యక్తులను లేక వస్తువులను , ఆస్తులను నమ్మితే ఏమి జరుగుతుంది. నీవు మోసపోతావు. ఒకసారి యోసేపును గుర్తుకు చేసుకోండి. ఆయన తన అన్నలను నమ్మాడు, నా అన్నలే కాదా! నన్నుఏమిచెయ్యరు అనుకున్నాడు.తనఅన్నలుఆయననుఅమ్ముకున్నారు. సాంసోను ను చూడండి. తన ప్రేయసి తనను మోసం చేయదు అనుకున్నాడు. తన ప్రేయసి తనను పట్టించిది. అది తన మరణానికి దారితీసింది. ఏసావును తన తమ్ముడు మోసం చేశాడు. యేసు ప్రభువును తన శిష్యుడే డబ్బులు కోసం అమ్ముకున్నాడు. నాబాలు తన సంపదను నమ్ముకున్నాడు అది ఆయనను కాపాడలేక పోయింది. నీవు ఈలోకాన్ని కానీ దానిలో ఉన్న వాటిని కాని  వ్యక్తులనుకానీనమ్మితే నీవు మోసానికి గురి అవుతావు. మరి దేనిని నమ్మాలి? నీ నమ్మకమును దేవుని యందు ఉంచినట్లయితే నీవు అవమానమునకు గురికావు, ఎవరు నిన్ను ఏమి చేయలేరు. 

ఎందుకు యిర్మియా ప్రవక్త వారికి ఈ మాటలను చెపుతున్నారు. కారణం ఏమిటిఅంటే వారికి చాలా సంపదలు వస్తున్నాయి.   వీరు ఆనందంగానే వున్నారు. వారికి కష్టలు ,బాధలు ఏమి లేవు.  ఇంకా సమస్య ఏమిటి అంటే వారు దేవునిని మరిచిపోయారు. ఎప్పుడైతే బాబిలోనియా దేశము వారి మీదకు దండెత్తి వస్తున్నారో అప్పుడు వారు ఈజిప్టు వారిని కాపాడుతుంది అని దానితో ఒక కూటమిలా ఏర్పడాలి అని, వారి దగ్గరకు వెళుతున్నారు. వీరు ఎంత అమాయకులు అంటే, వీరి పూర్వీకులను ఈజిప్టు వారు ఎంత ఇబ్బంది పెట్టింది, బానిసలుగా చేసింది ఇవన్నీ  మర్చి పోయారు.  రాజకీయ, సామాజిక కూటముల మీద, అక్కడ ఉన్న వేరె వారి విశ్వాసాల మీద ఆధారపడుతున్నారు. వారిని  కాపాడిన దేవుని దగ్గరకు రావడం మర్చిపోయారు. అందుకే యిర్మియా చెపుతున్నారు. ఇతర దేవుళ్ళను, మనుషులను, లోకాన్ని, వస్తువులను, ఆస్తులను నమ్మి మోసపోవద్దు. వారు అందరు మిమ్ములను మోసం చేసారు, మీ బిడ్డలను మీరు వారికి బలిగా ఇచ్చారు, వారు మిమ్మలను కాపాడారా? మీ నాయకులు ఈజిప్ట్ మీద నమ్మకం పెట్టుకుంటున్నారు, వారు మిమ్ములను బానిసలుగా చేయలేదా? మొదట మిమ్ములను ఆదరించారు, కానీ మీకు ఎల్లప్పుడు మంచి చేయారు వారు. దేవుడిని నమ్మండి. ఆయన తప్ప ఎవరిమీద నమ్మకం ఉంచిన మీరు అవమానమునకు గురి అవుతారు అని చెబుతున్నారు.  

దేవుడు ఎందుకు వీరిని కాపాడుతారు? ఎందుకంటే వీరు ఒప్పందపు ప్రజలు. నేను మీ దేవుడను మీరు నా ప్రజలు అని దేవుడు వారికీ చెప్పారు. దేవుడు వారికి దగ్గర ఉన్నప్పడు వారికి ఉన్న స్వార్ధ , ద్వేష , అసూయ, పగలుతో ఉండటం కుదరడం లేదు కనుక వారి స్వార్ధ ప్రయోజనాల కోసం వారు దేవుడిని నుండి దూరంగా వెళ్ళి పోతున్నారు. ఎప్పుడైతే వారు ఇతర వ్యక్తులను, దేవరలను, రాజులను ఆశ్రయిస్తున్నారో ఇది మొదట సంతోషంగా ఉంటుంది. కానీ తరువాత కొంత కాలానికి వారిని మరల బానిసలుగా చూస్తారు. ఇది వారికి తరచుగా జరుగుతూనే ఉంది.  ఇవన్నీ మీకు తెలిసి ఇంకా ఎందుకు మీరు దేవుడి దగ్గరకు కాకుండా ఇతరుల వద్దకు వెళుతున్నారు? అని  యిర్మియా ప్రవక్త వారిని అడుగుతున్నారు. నిజానికి వీరు ఇతరుల దగ్గరకు సహాయం కోసం వెళ్ళేది, తెలియక కాదు,  వీరు అంత తెలిసే చేస్తున్నారు. అంతకు ముందుకగానే దేవుడు వీరిని హెచ్చరించారు. మీరు మీ మనసున అన్య దైవతములను ఆరాధించి ప్రభువు నుండి వైదొలుగుతారేమో జగ్రత్త" అని ద్వితీయోపదేశ కాండము 11 వ అధ్యాయం 16 వ వచనంలో చూస్తున్నాం, ఇది ఒక విధమైన తిరుగుబాటు దేవుని మీద కనుకనే వారు బానిసలుగా మారుతున్నారు. మనం ఎలా ఉన్నామో?ఒక సారి ఆలోచించుకోవాలి. ఆయనను ఆపదలో సహాయం చేయమని అర్ధించాలి. 

దేవుడిని వీరు నమ్మి , నిభందన ప్రకారం వీరు జీవిస్తే ఏమి జరుగుతుంది?  దానిని గురించి ఈనాటి మొదటి యిర్మియా 17: 8 వ వచనం మనకు తెలియచేస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచి , ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే వారిని దీవిస్తాను అని చెపుతున్నారు. అంతేకాదు దేవునిమీద నమ్మకము ఉంచిన వారు "ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలెనుండును. అది ఎదుగుచు వ్రేళ్ళు జోన్పించును. అది బెట్టుకు భయపడదు. అంతే కాదు 

 దానిఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడు పండ్లు కాయుచుండును." ఒక సారి ఈ మాటలను మనం అర్దం చేసుకుంటే దేవుడు ఆయన మీద నమ్మకం కలిగి జీవించినట్లయితే నీకు ఏ చింత అవసరం లేదు అని చెపుతున్నారు. వారు ఎటువంటి సమస్యలకు కానీ, హింసలకు గాని బెణకరు. వారికి ఇంకా ఎవరి తోడ్పాటు అవసరం లేదు. వానలు కురియకున్న వారి ఎదుగుదల లోపించదు. అందుకే యిర్మియా వారితో ఎందుకు మీరు ఇతరుల వద్దకు సహాయం కోరుతూ పోతున్నారు.  ఆ పరిస్థితి   మీకు దేవుని విడచి ఇతరుల దగ్గరకు పోయినందుకే కదా ? అని తెలియ చేస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 28-29 ఆధ్యాయాలలో దేవుని నిభందనకు అనుకూలంగా జీవిస్తే ఏమి జరుగుతుందో దేవుడు తెలియచేస్తున్నారు. కానీ కొన్నాళ్ళ తరువాత ఆశీర్వాదం పొందిన తరువాత వీరు మారిపోతున్నారు. 

ఈనాటి  సువిశేషంలో యేసు ప్రభువు  పేదలు , ఆకలిగొన్నవారు , హింసలకు గురి అయిన వారు ధన్యులు అని తెలియ చేస్తున్నారు. పేద వానికి తెలుసు లేమితనం ఏమిటో, నీకు ఎప్పుడు పేదరికం లేక పోతే నీకు కలిమితో ఉన్నప్పుడు దాని గొప్పతనం తెలియదు. కష్టం లేకుండా మనం ఏమి నేర్చుకోలేము. కష్టం మనకు చాలా నేర్పుతుంది. 

పేదరికం ఇక్కడవారి సాంఘిక,సమాజక జీవితం గురించి తెలియచేస్తుంది.వారి పేదరికం, ఆకలి , విలాపం, ద్వేషంనికి సంభందించినవి. ఎందుకంటే వీరు వీటన్నటికి గురవుతున్నారు. లూకా 6:20-22. మీరు ఆనందించండి  అని చెపుతున్నారు. ఆనందం భౌతిక కారణాల వలన వచ్చేది కాదు. అది ఆంతరంగికమైనది.  వీరు వేరె వారిని ఎట్టి పరిస్థితులలో కూడా ఇబ్బందికి గురి చెయ్యరు ఎందుకంటే వీరికి అంత శక్తి లేదు, కానీ ఇతరులు వీరిని ఇబ్బందులు  కలిగించారు.  ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1. పేదరికం 2. ఆకలి 3. దుఃఖితులు వీరు ముగ్గురు ధన్యులు. యేసు ప్రభువు ఈ మాటలు వీరికి ఊరట ఇవ్వడానికి చెప్పడంలేదు.  మనం ఎప్పుడు తినడనికి కొరత లేక పోయినట్లయితే, మనకు ఉన్న సమృద్దిని లెక్క చేయం, అది ఇచ్చిన దేవునికి  కృతజ్ఞత చూపం. మనకు పేదరికం తెలియకపోతే మనకు ఉన్న కలిమికి విలువఇవ్వం, అది ఇచ్చిన దేవుని లెక్క చేయం. మనకు ఎప్పుడు బాధలు లేకపోతే సంతోషం విలువ తెలియదు ఆ సంతోషంకు  విలువఇవ్వం అదే ఈనాటి సువిశేషంలో జరుగుతుంది. 

ఆకలిగొనియున్న మీరు ధన్యులు మీరు సంత్రుప్తి పరుపబడుదురు యేసుప్రభువును నమ్మినవారు తెలుసుకున్నవారు జీవితాలను మార్చుకుంటున్నారు,ఇతరులకు విలువ ఇస్తున్నారు. పేదలను అభాగ్యులను అక్కున చేర్చుకుంటున్నారు. వారు జీవితంలో ఎన్నడూ పొందని శాంతి సమాదానం పొందుతున్నారు.  యేసును నమ్మిన వారు ఆశీర్వదించబడి, రక్షణపొందుతారు. యేసును నమ్మిన వెంటనే అన్నీ మార్పులు జరుగవు. యెరుషలేము లో ఉన్న క్రైస్తవులు పేదవారు అందుకే పౌలు గారు వేరె వారి దగ్గర నుండి వారికి సహాయం ఇప్పించాడు. అంత ఒకేసారి మారిపొదు. ముందుగా ఒకరి మనస్సు,వారివిధానం, వారి నమ్మకం మారుతుంది.తదుపరి సమృద్ది సమకూరుతుంది.   

మనుష్య కుమారుని నిమిత్తం, మనుష్యులు మిమ్ము ద్వేషించి, వెలివేసి నిందించి, మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభువును అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. మత్తయి 5:10-11. ఇది మిగిలిన వాటి కంటే  వేరు ఎందుకంటే  దానిలో వీరు అనేక  విధాలుగా  హింసించ బడతారు. అ.కా 14:22.  ఇవి జరుగుతున్నప్పుడు మీరు ఆనందముగా ఉండమని చెపుతున్నారు. దేవుని నమ్ముకున్న వారిని హింసించడం కొత్త కాదు.  ఈ విధంగా చేయడాన్ని దేవునికి సేవ చేస్తున్నాం అని  కూడా అనుకుంటారు. యోహను 16:2. యూదులు చాలా మందిని ఇలా హింసించారు. హెబ్రీ 11:36-40. ప్రవక్తలను ఇలనే చంపారు. క్రీస్తు అనుచరులు నూతన ప్రవక్తలు లేక దేవుని వాక్కుని బోధించువారు. లూకా  సువిశేషం మాత్రమే అక్కడ  జరిగే అనర్థాలు గురించి వివరిస్తుంది.6:24-26. ధనవంతులు వారికి ఉన్న ధనం వలన వారు అనేకమైన మయాలలో విహరిస్తూ వుంటారు. ఇది కేవలం తాత్కలితమైనది అని గుర్తింపకపోతే అనర్ధమే.1తిమోతి3:7.ధనం కానీ ఇంకా ఏది కూడా మనలను ఆ ప్రభువు నుండి వేరు చేయకుండె విధంగా మనం ఆయనను నమ్మి, పేద సాదలను గుర్తిస్తూ జీవిస్తే ఎప్పుడు ఆయనతోనే సంతోషంగా జీవిస్తాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...