26 వ సామాన్య ఆదివారం
(సంఖ్యా 11:25-29) (యాకోబు 5:1-6) (మార్కు 9:38-43,45, 47-48)
ఈనాటి సువిశేషము సహనము, దేవుని అనుగ్రహాలు పొందటము, పాప హేతువు కాకుండా ఉండాలని బోధిస్తుంది. సహనము అంటే మనకు సంబంధం లేని వేరే వ్యక్తులను కూడా భరించడమని మనము అనుకుంటాము. మనము వారికి ఎటువంటి హాని చేయకుండా వారి విశ్వాసాలను వారు పాటించుటకు ఆటంకం కలిగించకుండా , ఇతరులను సమస్యగా చూపక ఉండటము అనుకుంటాము. యేసు ప్రభువు సహనం గురించి చెబుతున్నప్పుడు అది మనము అనుకుంటున్నట్లు కాదని అర్దము అవుతుంది. ఆయన దృష్టిలో సహనము అంటే ఒక వ్యక్తి పట్ల సంపూర్ణమైన సానుభూతి కలిగి ఉండటము. మరియు ఆ వ్యక్తిని పూర్తిగా అర్దము చేసుకొని అంగీకరించడము మనలో ఒకరిగా చేసుకోవటము.
దేవుని సహనము ఎలా ఉంటుంది
దేవుని సహనము చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే, పూర్వ నిబంధనలో నినేవే ప్రజలు చాలా పాపాలు చేసి దేవునికి విరోధముగా జీవిస్తున్నారు. అనేక సార్లు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తున్నారు. వారి పాపలు ఘోరమైనవి . వాటిని వినినవారు వారిని శిక్షించాలని కోరుకుంటారు. చివరకు ప్రవక్త కూడా వారిని శిక్షించాలని కోరుకున్నాడు. దేవుని మంచితనము, క్షమ గుణము తెలిసిన ప్రవక్త ఎక్కడ దేవుడు వారిని శిక్షించకుండా క్షమిస్తా డో అనే టువంటి వారికి మరు మనస్సు పొందండని చెప్పకుండా పారిపోతున్నాడు. ఆ ప్రవక్తే యోనా గారు. మనకు పౌలు గారి గురించి తెలుసు పౌలు గారు క్రైస్తవులను అనేక శ్రమలకు, బాధలకు, హింసలకు గురిచేశారు. కానీ దేవుడు ఆయన పట్ల ఎంతో సహనం కలిగి ఉన్నాడు. ఆయనను క్షమిస్తున్నాడు. ఆయనను తన సేవకు వాడుకుంటున్నాను. కానీ ఈనాటి మొదటి పఠనములో మరియు సు విశేషములో యోహోషువ మరియు యోహను దేవుని పేరు మీద మంచి చేసేవారిని కూడా సహించలేకపోతున్నారు. ఎందుకంటే మంచి చేస్తే మేమే చేయాలి అనుకుంటున్నారు.
సహనము లేకపోతే మనము ఎలా ఉంటాము.
సహనము మనలో లేకపోతే ఏమి జరుగుతుంది అనేది మనము ఈనాటి మొదటి పఠనము మరియు సు విశేషం లో చూస్తున్నాము. సహనము లేనప్పుడు దేవుడు ఎలా ప్రవర్తించాలని కూడా మనమే చెప్పుతుంటాము. ఈనాటి మొదటి పఠనము మోషే జీవితములో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి తెలియ చేస్తుంది. ఇక్కడ దేవుని ప్రేమను ,గుణ గణాలను అర్దము చేసుకున్న వారు, దేవుని అర్దం చేసుకొని వారి మద్య వ్యత్యాసము మనము చూస్తున్నాము. మోషేకు తాను చేసే పని తనకు చాలా భారముగా ఉన్నప్పుడు దేవుడు అతనికి కొంతమంది సహయకులను ఏర్పాటు చేయడానికి సిద్దపడ్డాడు. దేవుడు ఒసగిన 70 మందిలో ఇద్దరు ఏల్డాదు , మెదాద్ దేవుని ఆత్మ చేత గుడారము లో ఉన్న వారిలా ప్రవచిస్తుంటే యోహోషువా భరించలేక పోయాడు. ఈనాటి సువిషములో కూడా యోహను , యోహోషువా వలె సంకట స్థితిలో ఉన్నాడు. శిష్యులు యేసు ప్రభువు తో వారికి జరిగిన ఒక సంఘటన గురించి చెపుతున్నారు. మీ పేరును ఉపయోగించి ఒకడు పిశాచములను పారద్రోలుతున్నాడు, మేము వాడిని అలా చేయవద్దు అని వారించామని అంటున్నారు. అంటే కొన్ని సార్లు దేవుడు ఏమీ చేయాలో కూడా మనమే నిర్ణయించాలి అనుకుంటాము. దేవుడిని మన ఇష్టమైన రీతిగా ఉండాలని కోరుకుంటాము. నిజానికి దేవుడిని మనము ఆయన ఏమీ చేయాలో నిర్ణయించలేము. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, విలువలను కాపాడాలని మనమే దేవుని సంకల్పానికి అడ్డుపడుతూ ఉంటాము. దేవుని విధానాలు మనకు పూర్తిగా ఎప్పటికీ అవగతం కావు. వాటిని అవగతం చేసుకోనప్పుడు మనము కొన్ని సార్లు యోహోషువ, యోహను వలె మాటలాడుతుంటాము. దేవుని విధానాలు తెలియక మనము అనేక సార్లు ఆయన ఇచ్చిన అవకాశాలను వరాలను పాడు చేసుకుంటుంటాము.
యేసు ప్రభువును శిష్యులు ఏవిధముగా అర్దము చేసుకున్నారు
ఎందుకంటే ఇంతకుముందే వారు యేసు ప్రభువుని మెస్సీయ అని ప్రకటించారు. అంటే వారు యేసు ప్రభువును ఒక రక్షకుని గా భావించారు. వారి దృష్టిలో రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా పోరాడి వారికి రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చే వానిగా భావించారు. అంటే వీరు ఆయన ప్రతినిధులుగా , దేవుని ప్రత్యేక ప్రజలుగా ఉన్నారు పెత్తనము చేయవచ్చు అనుకున్నారు. మాకు వచ్చే ప్రత్యేక వసతులు, గౌరవాలు తగ్గుతాయని అనుకుంటున్నారు. యేసు ప్రభువుకి ఇటువంటి వాటిని ఆలోచిందడానికి సమయము లేదు. ఎందుకంటే ఆయన గాయ పడిన లోకాన్ని నయం చేయడానికి వచ్చాడు. మరి కొంతమంది అసహన పరులను తయారు చేయడము వలన అది సాధ్య పడేది కాదు, ఈ లోకము దేవునికి చెందినది. జనులందరూ ఆయనకు చెందిన వారే అనే విషయాన్ని వారు మర్చిపోయారు. మనము ఇక్కడ అసూయ , భయం చూస్తున్నాము. వారి స్థానాలు ఎక్కడ పోతాయో అని వారు అసూయ తో భయపడుతున్నారు.
దేవుని అర్ధము చేసుకున్నవారు ఏ విధముగా ఉంటారు అని చెబుతుంది
యేసు ప్రభువు తన శిష్యులకు ఎవరిని దేవుని గురించి బోధించడంలో వారించ వద్దు అంటున్నారు, వారిని వారించటము మన పని కాదు. మనము దైవ వాక్యాన్ని ప్రకటించడానికి ముఖ్య ఉద్దేశ్యము దేవుని ప్రేమ , ఈ దైవ ప్రేమను అర్దము చేసుకోవడానికి మనము వాక్యాన్ని ప్రకటిస్తున్నాము. దేవుని ప్రేమను ఇతరులకు చెప్పడానికి మరియు పంచడానికి వాక్యము ఉపయోగపడుతుంది. దేవుని ప్రేమలో సహనము ఉంది. దేవుని అర్దము చేసుకొని ఆయన లో ఐక్యమైన వానికి ఎటువంటి భేదము ఉండదు. అందరినీ సమ దృష్టితో చూడగలుగుతాడు. మోషే మరియు యేసు ప్రభువు కూడా శిష్యుల కోరికను తిరస్కరిస్తున్నారు, ఎందుకంటే అందరూ దేవుని ఆత్మను పొందాలి అందరూ మంచి పనులు చేయాలను దేవుడు కోరుతున్నారు. అందుకే మోషే చెపుతున్నారు. దేవుని ప్రజలందరూ ప్రవక్తలు అయిన ఎంత బావుండును అంటున్నారు. మనము వేరే వారి మీద ప్రేమతో నో , లేక అభిమానముతో నో మంచి చేసే వారిని లేక చెప్పే వారిని ఆపుతున్నామా ? ఒకసారి పరిశీలించుకోవాలి.
దేవుని అనుగ్రహము పొందడానికి కారణాలు మనకు తెలియవసరము లేదు
పౌలు గారు, నినేవే ప్రజలు దేవుని అనుగ్రహము పొందుతున్నారు. ఈనాటి పఠనాలలో దేవుని ఆత్మ తన సేవకుల మీద కు రావడము వారు ప్రవచించడము మనము చూస్తున్నాము. దేవుని ఆత్మను పొందడానికి ఏటువంటి ఆంక్షలు లేవు, ఏ జాతి , వర్గ భేదాలు లేవు అని నేర్చుకుంటున్నాము. పౌలు గారు క్రైస్తవ వ్యతిరేకిగా జీవించారు, కానీ దేవుని ఆత్మను పొందారు. నినేవే ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించారు, కానీ దేవుని అనుగ్రహము పొందారు.
ఈనాటి మొదటి పఠనానికి సువిశేషానికి చాలా పోలీకలున్నాయి. దేవునికి కొంతమంది మాత్రమే ఇష్టులు , ప్రత్యేకమైనవారు అంటూ ఏమి ఉండరు. ఆపో. కార్య 10 :34 తనకు కావలసిన వారిని తన పనికి ఎంచుకుంటాడు. దేవుని ఆత్మ మంచిని చేయడానికి వారికి సహాయ పడుతుంది.
మనలో ఒకడు కాదు కానీ మంచి చేసేవాడనితో మనము ఎలా ఉండాలి
యేసు ప్రభువు ఆలోచన ప్రకారము ఒకనిలో ఉన్న మంచితనాన్ని మనము గుర్తించాలి. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనలను ఏకము చేయడానికి, మనల్ని విభజించడానికి కాదు. మనల్ని విభజించే వాటిని , ఇతరులను చెడు మార్గములోనికి తీసుకెళ్ళేవాటిని మన నుంచి దూరము చేయాలి. అందుకే నీ చేయి నీవు పాపము చేయడానికి కారణమైతే దానిని తీసివేయమని చెపుతున్నాడు.
మతము కూడా ఒక వ్యసనము అవుతుంది కొంతమంది జీవితాలలో. యేసు ప్రభువు మనల్ని గొప్ప వారిణిగా పరిగని చేది మనము చేసే ప్రేమ పూర్వకమైన సేవ ద్వార మాత్రమే కానీ మత ఆదరముగా మనము చేసే విభజనను బట్టి కాదు.
మోషే ఇటువంటి అసూయ అవసరము లేదు అని అర్దం చేసుకున్నాడు. మనం అందరం దేవుని అనుగ్రహాలను కోరుకుంటున్నాము. ఆయన తనకు నచ్చిన వారికి వీటిని ఇవ్వవచ్చు. కొన్ని సార్లు మనము అంగీకరించలేని వ్యక్తులకు దేవుని అనుగ్రహాలు ఎక్కువగా రావచ్చు. ఎంతో మంది క్రైస్తవులను హింసించిన పౌలు గారిని దేవుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నాడు.
కొన్ని అ భద్రతలు మనల్ని మాత్రమే దేవుడు ప్రేమించాలి అన్నట్లుగా చేస్తున్నాయి. అసూయ మరియు పాప కారకమైన పని చేయకూడదని నెరపుతున్నాయి. నిజమైన యేసు ప్రభువు శిష్యులు చిన్న పిల్లలు లాంటి వారు . యేసు ప్రభువు యేసు ప్రభువు వారిని ఎంతగానో రక్షించుకుంటున్నాడు. అందుకే వారిని చెడు మార్గమునకు వెళ్ళకుండా చూడాలి. ఎవడైతే వారిని తప్పుడు మార్గమునకు తీసుకుపోతాడో వారిని నరకమునకు వెలుతారు అని చెపుతున్నారు మనకున్న అ భద్రతా , కోరిక , ఆశలు, గర్వం వలన ఇతరులను మనము దూరముగా ఉంచుతాము. వారిని పట్టించుకొము. నరకము అంటే దేవునినుండి దూరముగా ఉండటమే. పర లోకము అంటే దేవుని సాన్నిధ్యములో నివసించడము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి