గొప్పతనానికి మార్గం
(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )
ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి . ఈ లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాం. మొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని తెలియచేస్తుంది.
ప్రవక్తలు ఎందుకు కష్టాలను అనుభవించారు
ప్రవక్తల జీవితాలు ఏ విధముగా యిస్రాయేలు ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు తెలుసు. మోషే ఎన్నో కష్టాలు అనుభవించారు , దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,. అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారు. యెషయా ప్రవక్త అనేక కష్టాలు పడుతున్నారు. . యిర్మీయా ప్రవక్త నేను నా ముఖమును చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు, ఈ కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదు, మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు. మొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన, మరల తమ ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలని. ఆమోసు ప్రవక్త నేను పొట్ట కూటి కోసం దేవుని వాక్కు ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారు, ఎందుకంటే వారు దేవునికి తగిన విధముగా జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు.. ఈ ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాం. వీరు కష్టాలు, బాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయి. ప్రజలు అంత తెలివి గల వారు కారు, చాలా సార్లు అనేక మోసాలకు, స్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారు. ఇది ప్రవక్తల గొప్పతనం, వారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదు, పొందనూ లేదు.
గొప్పవారు ఎలా ఉంటారు
ఈ లోకములో గొప్పవారికి, దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి యేసు ప్రభువు ఈ విధంగా అంటున్నారు. అన్య జనుల రాజులు వారిపై అధికారం చెలాయింతురు. వారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారు. కానీ మీరు అటుల చేయవలదు. మీలో గొప్పవాడు చిన్న వానివలెను, నాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారు. లూకా 22:25,26. యేసు ప్రభువు, మనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు ప్రాముఖ్యతను ఇస్తారు. మనకు ఉన్న బహుమానాలు, అవార్డులు, డబ్బులు, ఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో గొప్పతనం మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనము ఎంత సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.
శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు
యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు. యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారు. వారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అని. మత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారు. కానీ శిష్యులు దానిని ఈ లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారు. అందుకే ప్రభువు పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు. ఈ లోకములో ఉన్న పాలకులు, వేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారు. అది అర్దము కానీ శిష్యులు పరలోకం కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారు. వారికి కావలసినది, ఈ లోక సింహాసనాలు, అంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేది. త్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.
యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు
యోహను యాకోబులు అడిగిన దానికి, మీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రమునుండి మీరు పానము చేయగలరా? నేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరా? అంటున్నారు. ఏమిటి ఆ పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితము. యెషయా 51:17 నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారు. కొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది. ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రం. వారి గమ్యం కష్టాలతో కూడుకొని ఉంటుంది. ఇది వారు పొందిన బాధలు తెలియచేస్తుంది. దేవుని కోపాన్ని తెలియచేస్తుంది. అంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలి. ప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే. యేసు ప్రభువు, మత్తయి 26 లో ఈ పాత్రను, నానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా కష్టాలతో కుడినది. దానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలి. యేసు ప్రభువు బాప్తిస్మము గురించి చెప్పుతున్నారు. ఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము గురించి కాదు, కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో తీసుకునే బాప్తిస్మము గురించి చెప్పుతున్నారు. యేసు ప్రభువు జ్ఞానస్నానం యొర్ధాను నదిలో మొదలై గెత్సమని తోటలో ముగుస్తుంది. తన తండ్రి చిత్తానికి తలవంచి , శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.
క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి తనను తాను రిక్తుని చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడు. అన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారు. దేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.
మనము ఏ విధముగా ఉన్నాం
మనము ఎలా ఉన్నాము? కేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవటము ? ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండా, క్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయి. ఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త వలె , క్రీస్తు వలె కష్టపడటానికి సిద్దముగా ఉన్నమా? మిగిలిన పది మంది శిష్యులు ఈ మాటలను విన్నప్పుడు ఆ ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారు. వారికి కూడా మొదటి స్థానాలు కావాలి అనుకున్నారు యేసు ప్రభువు ఇటువంటి వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారు. అందుకే వారికి ముందుగానే చెబుతున్నారు. తన రాజ్యంలో ఎలా ఉంటుంది అని. ఈ లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారు. ఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారు. ఎందుకంటే శిష్యులకు వారి వారి స్వలాభాలు , కోరికలు ఉన్నాయి. యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారు. మన ఆలోచనలు ఈ విధంగానే ఉన్నాయి.
క్రీస్తు వలె జీవించాలి
శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదు. మార్కు 10:43 వ వచనములో యేసు ప్రభువు చెబుతున్నారు, శిష్యులు ఎంచుకోవాల్సిన మార్గం , సేవా మార్గం. తనను తాను త్యజించుకోవాల్సిన మార్గం. యోహను 18: 36 లో యేసు ప్రభువు అంటున్నారు , తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పారు. ఎవరైతే గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9. ఏ విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదు. మార్కు 10:43 వ వచనములో యేసు ప్రభువు చెబుతున్నారు, శిష్యులు ఎంచుకోవాల్సిన మార్గం , సేవా మార్గం. తనను తాను త్యజించుకోవాల్సిన మార్గం. యోహను 18: 36 లో యేసు ప్రభువు అంటున్నారు , తన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పారు. ఎవరైతే గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9. ఏ విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు 10: 45 వ వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.
యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త వెల గా వచ్చాడు. మన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారు. మనలను మనం సేవకునిగా చేసుకోవటం. క్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని.
యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా ఉంది. యెషయా ప్రవక్త బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు అని చెప్పారు . ప్రభువు తన కష్టాల ద్వార ఈ లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు . మానవుడు శ్రమలను ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి రక్షణ విలువ ఉంటుంది. దేవుని అధికారం వేరే వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు. అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియు, సేవించడము. ఆవిధముగా జీవించుదాం.
10: 45 వ వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.
యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త వెల గా వచ్చాడు. మన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారు. మనలను మనం సేవకునిగా చేసుకోవటం. క్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని.
యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా ఉంది. యెషయా ప్రవక్త బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు అని చెప్పారు . ప్రభువు తన కష్టాల ద్వార ఈ లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు . మానవుడు శ్రమలను ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి రక్షణ విలువ ఉంటుంది. దేవుని అధికారం వేరే వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు. అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియు, సేవించడము. ఆవిధముగా జీవించుదాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి