యేసు తో సమృద్ది
లూకా 5: 1-11
క్రీస్తు నాధుని యందు ప్రియ మిత్రులారా ,ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకోవడం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభువు వీరిని ఎన్నుకున్నారు. వారికి ఉన్న లక్షణాలు ఏమిటి? వారు గొప్ప వారా ? లేక వారు ఎప్పుడు దేవుని మాటను ఖచ్చితముగా పట్టించేవారా ? వారు తెలివిగాలవారా? జ్ఞానవంతులా? అనేటువంటి ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం కాదు అనే , అయిన యేసు ప్రభువు వారిని ఎన్నుకుంటున్నారు.ఈ లోకం దేనికి పనికి రారు అని చెప్పేవారిని దేవుడు ఎంనుకొంటున్నారు. వారి ద్వార గొప్ప కార్యాలు చేస్తున్నారు. 1 కోరింథీ 1:27 మనం చూస్తున్న. "వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు, లోకముచే అవివేకులుగాభావింపబడువారిని దేవుడు ఎన్నుకొనేను." యేసు ప్రభువు మొదటి శిష్యులు సంపూర్ణులు కారు వారిలో అనేక లోపాలు ఉన్నాయి. మొదటి పఠనంలో యోషయా తన అయోగ్యత వెల్లడి చేస్తున్నారు. కానీ దేవుని మాటలను చెప్పడానికి తాను సిద్దము అని చెబుతున్నారు. పేతురు కూడా తన అయోగ్యతను వెల్లడి చేస్తున్నారు, అది తెలియచేసి దేవుని అనుసరించదానికి సిద్దపడుతున్నాడు.
యేసు ప్రభువు అనేక మందికి స్వస్థత ఇచ్చిన తరువాత ఇక్కడికి వస్తున్నారు. అందుకే అక్కడ చాలా మంది ఉంటున్నారు. ఆయన మాటలు వినాలని, స్వస్థత పొందాలని వస్తున్నారు. అక్కడ ఉన్న పడవలలో యేసు ప్రభువు కూర్చొని దేవుని వాక్కుని వినిపించారు. అక్కడ జాలరులు చేపలు పట్టుకున్న తరువాత ఏమి దొరకక వారి వలలను శుభ్రం చేసుకున్నారు. అంతకు ముందే యేసు ప్రభువు సిమోను పేతురు అత్త గారిని స్వస్థ పరిచారు, కనుక కృతజ్ఞత భావంతో వారి పడవను ఇచ్చి ఉండవచ్చు.
పేతురుకి యేసు ప్రభువు లోతుకి వెళ్ళి వల వేయమని అంటున్నారు. పేతురు చెబుతున్నారు. రాత్రి అంత కష్ట పడిన ఉపయోగం లేదు కానీ నీవు చెప్పినట్లయితే చేస్తాను అని వల వేస్తున్నారు. పేతురుకి చాలా ఇబ్బందిగా ఉండవచ్చు, దేవుని వాక్కు విన్నా కానీ తనకు రాత్రి మొత్తం పని చేసిన వారికి ఏమి దొరకలేదు.
దేవుని పిలుపు చాలా విచిత్రముగా ఉంటుంది , ఎందుకంటే యేసు ప్రభువు జాలరి కాదు. పేతురు జాలరి చిన్నప్పటి నుండి చేపలు పడుతున్నాడు. రాత్రి మొత్తం కష్ట పడ్డారు కాని ఏమి దొరకలేదు. అక్కడ చేపలు లేవు అని అనిపించవచ్చు. అయిన యేసు ప్రభువు అడుగుతున్నారు వల వేయమని, నేను జాలరిని , అదికాకుండా రాత్రి మొత్తం పని చేశాను అక్కడ లేవు అని నాకు తెలుసు. నీవు దేవుని గురించి గొప్పగా చెప్పావు ఎందుకంటే నీవు బోధకుడవు కనుక నీకు దేవుని గురించి బాగా చెప్పావు అని అనుకోని ఉండవచ్చు. చేపలు గురించి నీకు తెలియదులే అని అనుకోని ఉండవచ్చు కానీ యేసు ప్రభువు చెప్పినట్లు మాత్రం చేస్తున్నాడు. ఎందుకంటే నా కంటే నీవు గొప్ప వాడవు అని గ్రహించి. పేతురు గారికి ఇష్టం ఉండక పోవచ్చు. కాని పేతరు దేవుని మాటను విధేయించారు.
పేతురు అంటున్నారు ప్రభువా రాత్రి మొత్తం మేము పని చేశాము కానీ ఏమి దొరకలేదు. అక్కడ ఏమి ఉండకపోవచ్చు కానీ మీ మాట తీసువేయలేక మేము వల వేస్తాము, అని వల వేస్తున్నారు. పేతురు, యేసు ప్రభువు చెప్పినట్లు చేయక పోతే ఏమి జరుగుతుంది. వారికి దొరికే సమృద్ది దొరికేది కాదు. సమృద్ది ఉండేది కాదు, యేసు ప్రభువు మాటలలో అటువంటి శక్తి ఉంది. నీకు సమృద్ది దొరుకుతుంది, నీకు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న వారికి అది ఉంటుంది. మరలా పేతురుని ఆయన ఎన్నుకుంటున్నారు. అంత కంటే గొప్ప పనికి. దేవుని వాక్కును ప్రజలకు తీసుకువెళ్లాడానికి. దైవ రాజ్యనికి అందరిని సిద్దంచేయడానికి ఎన్నుకుంటున్నారు.
నీవు గొప్ప దైవ జనుడవు నీవు చెప్పిన మాటలు బాగున్నాయి, కానీ నేను జాలరీని నాకు తెలుసు అక్కడ చేపలు ఉన్నాయో , లేవో. నీ మాట మీద నమ్మకముంచి కాదు కానీ నీ మాట కాదనలేక వల వేస్తున్నాను అనుకోని వుండవచ్చు, అక్కడ జరిగిన దానికి అంటే వారికి వలలు చీనుగునన్ని చేపలు పడటం చూసి అనుకుంటున్నారు, ఈయన సాధారణ భోదకుడు కాదు. ఈయన అసాధారణమైన వ్యక్తి అని అర్ధమై , మోకరించి నన్ను వదలి వెళ్ళు ప్రభువా నేను అపవిత్రుడను అని చెపుతున్నారు, తన నిజ స్వరూపం ఆయనకు తెలుస్తుంది. నిజానికి నీవు ఎటువంటి వాడవు అని నీకు తెలిసేది యేసు ప్రభువు సమక్షంలోనే. ఇదే మొదటి పఠనంలో జరుగుతుంది. . నీవు అహం తో వున్నట్లయితే దాని అర్ధం నీవు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. మనం మన ప్రక్క వారి గురించి లేక చెడ్డ వారి గురించి పోల్చుకొని నేను మంచి వాడినే అని అనుకుంటున్నాము.
వారి సొంత బలం మీద ఆదారపడినప్పుడు వారికి ఏమి దొరకలేదు, ఎప్పుడు అయితే వారు యేసు ప్రభువు మాట వింటున్నారో వారికి ఎప్పుడు దొరకనంత చేపలు దొరుకుతున్నాయి. ఎప్పుడైతే నీవు ఆయన మాటకు కట్టుబడుతావో నీ శక్తిని ,నీ ప్రతిభను నీవు పూర్తిగా వినియోగించవచ్చు, దేవుడు నిన్ను పూర్తిగా తనకు అనుకూలముగా ఉపయోగించుకుంటారు. ఇది విశ్వాసంతో కూడిన విధేయత ఎందుకంటే అక్కడ చేపలు లేవని నా అనుభవం చెపుతుంది కానీ నేను వల వేస్తాను నీవు చెప్పావు కాబట్టి , ఆయన విధేయత యొక్క ఫలితం అన్నీ చేపలు పడటం, పేతురు గారు ఎన్నడూ పట్టుకోలేనాన్ని చేపలు , ఇది పేతరు గారికి యేసు ప్రభువుని గొప్పతనం చూడటానికి ఉపయోగపడింది.
యేసు ప్రభువుని వినడానికి ప్రతి ఒక్కరు వచ్చారు, కష్టాలలో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, బాదలలో ఉన్నవారు, మానసిక రొగులు, దేవుని వాక్కు కోసం వచ్చిన వారు ఇలా అన్నీ రకాల ప్రజలు ఉన్నారు. కానీ వారి మద్య మరియొక వర్గం వారు కూడా ఉన్నారు వారే రాత్రి మొత్తం పని చేసి కూడా ఏమి లేకుండా ఉన్నవారు, వారి పని ఉంది కానీ చేసిన తరువాత ఫలితం మాత్రం శూన్యం. ఈ కోవలోని వారు పేతురు, మరియు మిగిలిన జాలరులు. ఒకరకమైన భాద ఇంటికి ఏమి తీసుకోపోవాలి అని , అంత శ్రమ వృధా అయ్యింది అని, వారు కూడా యేసు ప్రభువు మాటలు విన్నారు. యేసు ప్రభువు భోదన తరువాత వారితో మాటలాడుతున్నారు. మనలో అనేక మంది ఈ కోవలోని వారే. ఈ శూన్యత నుండి బయట పడాలి అంటే మనం ఆయనతో ఉండాలి. అప్పుడు మనం సమృద్దిని పొందుతాము.
ఈ అద్భుతం తరువాత ,ఆశ్చర్యం , భయం , వారి అయోగ్యత మొత్తం వారి ముందు కనపడుతున్నాయి, ఇతను ఎవరూ ? స్వస్థత ఇస్తున్నారు, సాతానును వెడలగొడుతున్నారు, చేయమన్నది చేయగానే లెక్కకు మిక్కుటముగా ఆ పని ఫలితం ఉంటుంది. ఇంతటి దైవ జనుడి వద్ద నేను ఉండవలసిన వాడిని కాదు అని తన అయోగ్యతను వ్యక్త పరుస్తున్నారు, నా నుండి వెళ్ళమని చెబుతున్నారు.
ప్రభు ! నా నుంచి వెళ్లిపో , నేను పాపాత్ముడను - ఎందుకు ఇలా అంటున్నారు, యేసు ప్రభువును గొప్ప తనం చూసిన తరువాత పేతురు తన స్వరూపాన్ని చూసుకుంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే దేవున్ని చూస్తామో అప్పుడు మన నిజ స్వరూపం మనకు తెలుస్తుంది. లేకపోతే మనం మనలను గొప్ప వారిగా చూసుకుంటాం. ప్రభు ! నేను పాపిని నన్ను విడిచి పెట్టుము. అని అంటున్నాడు. మొదటి పఠనములో యోషయా ప్రవక్త ఒక దర్శనము చూస్తున్నారు. ఆ దర్శనం ద్వార ఒక విషయం తెలుసుకుంటున్నారు, పాపి దగ్గరకు కూడా దేవుడు వస్తారు అని తెలియ చేస్తున్నారు. అంటే దేవుడు నేను పాపిని అని నన్ను దూరం చెయ్యరు అని తెలుస్తుంది. ఇక్కడ పేతరు గారు మొదటి సారి యేసు ప్రభువుని కలుస్తున్నప్పుడు తనను తాను కలుసుకుంటున్నారు, తన గురించి తెలుసుకుంటున్నాడు. నన్ను గురించి నేను పూర్తిగా తెలుసుకునేది యేసు ప్రభువుని సమక్షంలోనే , ఆయన సమక్షంలో నేను ఏమిటో నాకు పూర్తిగా అవగతమవుతుంది. ఇక్కడ పేతురు గారికీ దేవునికి తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అంటే నేను ఈ విధంగా ఉన్న నన్ను ఆయన దూరం పెట్టారు అని ఆయన్ను అభిమానించడం, ప్రేమించడం మొదలు పెడుతున్నారు.
నిన్ను చేపలు పట్టువానిగా కాక మనుషులను పట్టు వానిగా చేయుట అంటే ఏమిటి? ఇది ఏవిధముగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి? పునీత పేతురుగారు ద్వార అనేకమంది జ్ఞాన స్నానం పొందుతున్నారు. అపోస్తుల కార్యాలు 2 వ అధ్యాయం 41 వ వచనం మనం చదువుతాం. ఆయన భోధన విని రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొందారు. 4 వ అధ్యాయం లో 5000 మంది అవుతున్నారు. ఆయన దైవ రాజ్యమునకు మనుషులను పట్టే వానిగా మారుతున్నారు. అంతే కాదు దానిలో సమృద్దిని సాధిస్తున్నారు. ప్రియ మిత్రులారా ఈ సువిశేషం ద్వార మనం దేవునితో ఉంటే మనకు సమృద్దిగా ఆయన అన్నీ ప్రసాదిస్తారు అని తెలుసుకుంటున్నాం కనుక ఆవిధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి