పేజీలు

13.3.23

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం

 

యేసు ప్రభువు బాప్తిస్మ ఆదివారం 

యెషయా 40:1-5, 9-11, తీతు 2:11-14,3:4-7, లూకా 3:15-16,21-22

యేసు ప్రభువు బప్తిస్మము చాలా ప్రాముఖ్యత కలిగినది మన రక్షణ చరిత్రలో అందుకనే సువార్తికులందరు దీని గురించి రాసారు. మత్తయి 3:14-15 యేసు ప్రభుని బప్తిస్మము ఆయన పాపం చేసినందుకు కాదు దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా స్వీకరించాడు అని తెలియచేస్తుంది. యోహాను , యేసు ప్రభువుల మధ్య సంభాషణ ద్వారా ఇది తెలుసుకుంటున్నాము. యోహాను బప్తిస్మము పాప జీవితానికి ముగింపును పలికి నూతన జీవితాన్ని సాగించడానికి కానీ యేసు ప్రభువు స్వీకరించిన బాప్తిస్మము ఒక నూతన కార్యాన్ని స్వీకరించడానికి, అంటే తన పెంపుడు తండ్రి అయినా యేసేపు గారి పని అయిన వడ్రంగి పనిని వదలి ఒక నూతన కార్యాన్ని స్వీకరిస్తున్నారు లేక మొదలు పెడుతున్నారు. ఆ నూతన కార్యం ఏమిటి అంటే మానవ రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యం మొదలు పెట్టడానికే యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు. 

యేసు ప్రభువు బప్తిస్మము తీసుకున్నప్పుడు జరిగిన విషయాలు మనము గురించి ఈ రోజు మనము వింటున్నాము. అవి ఏమిటి అంటే 1. పరలోకం తెరవబడుతుంది. పరలోకం తెరవబడటం అనే మాట దర్శన గ్రంధం లోని భాషలా ఉంది. పరలోకం తెరవ బడటం అంటే  యుదయా ప్రజలు పరలోకానికి భూలోకానికి మధ్య ఒక విభజన ఉంది అని, అవి ఇప్పుడు వేరు చేయ బడినవి  అని నమ్మారు.  అంటే ఇప్పుడు పరలోకానికి , భూలోకానికి ఒక అడ్డు ఉందని అది కొన్ని ప్రత్యేక సంధర్భాలలో తొలగించబడుతుంది అని వారి నమ్మకం. ఎప్పుడు  ఈ ప్రత్యేక సంధర్భం లేక ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే పాత నిబంధనలో ప్రవక్తలు , దీర్ఘ దర్శులు దేవ రహస్యాలను చూస్తారు కాబట్టి వారి దృష్టిలో పరలోకం భూలోకం ఏకమవుతాయి. అంటే దేవుడు భూలోకానికి వస్తున్నాడు అని అర్థం. పరలోకం మరియు భూలోకం మధ్య సంగమం ఏర్పడుతుంది. 

ఇది చాలా కాలం తరువాత యేసు ప్రభువు బాప్తిస్మము రోజున జరుగుతుంది. మనం యెషయా  64:1 లో చూసినట్లయితే యెషయా ప్రవక్త "ఓ దేవా ! నీవు పరలోకం చీల్చి క్రిందికి దిగి రమ్ము" అని అంటున్నారు. ఈ ప్రార్ధన అర్ధం దేవుడు ఆయన్ను పూర్వ కాలంలో వలే తెలియ పరచాలి అని, నిర్గమ 19:16-19 , ఇక్కడ దేవుడు పర్వతము నుండి వస్తారు. అంటే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వస్తూంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే దేవుడు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియ చేసే సమయంలో లేక కొన్ని గొప్ప కార్యాలు ప్రారంభించే సమయములో జరుగుతుంది.  

యేసు ప్రభువు బాప్తిస్మము లో జరుగుతుంది కూడా ఇదే. ఇక్కడ సంభాషణ  జరుగుతుంది యేసు ప్రభువుకి మరియు దేవునికి మద్యలో, అందుకే యేసు ప్రభువు ప్రారంభించే పని, సరి అయినది అని దేవుని ఆమోదం పరలోక వాణి ద్వార మరియు పవిత్రాత్మ  యేసు ప్రభువు  మీద పావుర రూపమున దిగి రావడం ద్వార తెలుస్తుంది. రక్షణ కార్యాన్ని ప్రారంభించడానికి  దేవుని అనుగ్రహం ఇక్కడ జరుగుతుంది. పవిత్రాత్మ ఈ కార్యానికి తోడ్పాటు అందిస్తుంది. 

 పరలోక వాణి  : బాప్తిస్మము జరుగుతున్న సమయములో పరలోకము నుండి ఒక వాణి  వినబడుతుంది.  ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో మిగిలిన వారు నిజముగా అక్కడ ఉన్న వారందరికీ వినబడింది లేనిది మనకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభువు పౌలుకు  డమాస్కస్ (అ. చ 9:7,22:9) దర్శన మిచ్చిన సమయములో పౌలుతో ఉన్న ప్రజలు వెలుగును మాత్రమే చూసారు, శబ్దం విన్నారు కానీ ఆ మాటలను గుర్తు పట్టలేదు. యేసు ప్రభువుకు మాత్రము ఇక్కడ తండ్రి మాటలు ఊరటను బలాన్ని ఇస్తున్నాయి. 

దేవుడు ప్రజలతో మాట్లాడటం మనం పాత నిబంధనలో కూడా  చూస్తాం. ద్వితీ 4:10-12, నిర్గమ 3:4 కనుక పరలోక వాణి అనేది యిస్రాయేలు ప్రజలకు తెలుసు. నీవు నా ప్రియమైన కుమారుడవు పరలోక వాణి పలుకుతుంది  అని వింటున్నాము.  అంటే ఈ మాటలు యేసు ప్రభువు కొరకు వచ్చినవి. ఈయన దేవుని కుమారుడు అని అదే విధముగా ఈయన చేసే పని దేవుని కార్యము అని తెలియచేస్తుంది. అంటే ఈయన చేయబోయే పనికి తండ్రి ఆమోదం ఉంది అని తెలియచేస్తుంది. 

ఈ క్రీస్తు బాప్తిస్మము మనకు ఏమి తెలియ చేస్తుంది? అని అంటే మొదటిగా దేవుని ప్రణాళిక అమలు చేయడానికి నేను సిద్దముగా ఉండాలి అని తెలియ చేస్తుంది. ఎందుకంటే పునీత బాప్తిస్మ యోహను గారు యేసు ప్రభువు బాప్తిస్మము స్వీకరించడానికి వచ్చినప్పుడు, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడానికి అర్హుడను కాను నేనే నీ వద్ద బాప్తిస్మము స్వీకరించ వలసిన వాడను అని అంటున్నారు. కాని యేసు ప్రభువు ఇప్పడు నిర్ణయించబడిన విధముగా జరగనివ్వమని చెబుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక చేయడానికి ఆయన తన గొప్పతనం  లేక దేనినైనా కూడా వదులు కోవడానికి సిద్దముగా ఉన్నాడు అని తెలియచేస్తున్నారు. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ రోజుతో తన రక్షణ కార్యాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన పరిచర్య , స్వస్థత చేయటం, క్షమించడం, దేవుని నుండి దూరముగా వెళ్ళిన వారిని వెదకి  తీసుకురావడం మొదలు పెట్టబోవుచున్నారు. వానికి ముందుగా  బాప్తిస్మ యోహను దగ్గరకు వస్తున్నారు. యోహను పాప క్షమాపణ పొందడానికి పశ్చాతాపం కలిగి జీవించమని పిలుపు ఇచ్చారు, వారికి బాప్తిస్మము ఇస్తున్నారు. 

ఎందుకు యేసు ప్రభువు బాప్తిస్మము తీసుకుంటున్నారు?  యోహను ఇచ్చే బాప్తిస్మము పాప క్షమాపణకు మరి యేసు ప్రభవులో ఎటువంటి పాపం లేదు కదా ! యేసు ప్రభువుకి ఈ బాప్తిస్మము అవసరం లేదు, అందుకే యోహను యేసు ప్రభవుతో  నేనే నీ వద్ద బాప్తిస్మము తీసుకోవలసిన వాడిని, నేను నీకు బాప్తిస్మము ఇవ్వడమా ? అని అంటున్నారు. కానీ యేసు ప్రభువు ఇప్పటికీ ఇటులనే కానిమ్ము, సంకల్పమును మనము ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని చెపుతున్నారు.  దాని అర్దము దేవుని సంకల్పమును నెరవేర్చుటకు నేను ఏమి చేయడానికి అయిన సిద్దమే అని తెలుపుతున్నారు. యేసు ప్రభువు జీవితము మొత్తము కూడా తండ్రి దేవుని సంకల్పమును నెరవేర్చడమే. అది చేయడము కోసము యేసు ప్రభువు ఎంత వరకు అయిన వెళతారు. తన కంటే తక్కువ వాడైన యోహను దగ్గర పాప క్షమాపణకు ఇచ్చే బాప్తిస్మము తీసుకుంటున్నారు. తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నారు, తన ప్రాణాన్ని ఇస్తున్నారు.  దేవునితో తన సమానత్వాన్ని వదలి మానవునిగా మన మధ్యకి వస్తున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని సంకల్పం నెరవేరాలి. యేసు ప్రభువు ఒక అనమకునిగా ఎందుకు జన్మించాలి, ఎందుకు మరణించాలి, పాపుల చేత ఎందుకు నిందించబడాలి, ఎందుకు వారి చేత శిక్షించబడాలి , అన్నిటికీ సమాదానం యోహానుకు యేసు ప్రభువు ఇస్తున్నారు. దేవుని సంకల్పం నెరవేరుటకు ఈ విధముగా జరుగనివ్వు అని అంటున్నారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఏమైనా చేస్తాను అని చెబుతున్నారు. 

ఈ రోజు యేసు ప్రభువు బాప్తిస్మము ద్వార ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి నేను ఏమి చేయడానికైనా సిద్దముగా ఉండాలి. మనము కూడా ఆ విధంగా జీవించడానికి సిద్దముగా ఉందాం. ఆమెన్ 

Fr. Amruth 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...