పవిత్ర గురువారం
ప్రియ మిత్రులారా పవిత్ర వారంలోని 5 వ రోజు పవిత్ర గురువారం. ఈ రోజుకు అనేక పేర్లు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. ఈరోజు దివ్య సత్ప్రసాద స్థాపన జరుగుతుంది. మరల ఈరోజు గురుత్వ స్థాపన జరుగుతుంది. ఇవి మూడు కూడా యేసు ప్రభువు మరణ పునరుత్థానముల తరువాత యేసు ప్రభువును ఈలోకంలో మనం కలుసుకోవడానినికి, ఆయన సన్నీది పొందడానికి ఇవి మూడు కూడా సాధనాలు. దీనిని పవిత్ర ఆజ్ఞ గురువారం అని అంటారు. ఈ రోజు యేసు ప్రభువు శిష్యులకు ప్రేమ ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి . దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఇది యేసు ప్రభుని చివరి భోధ. దీని తరువాత ఆయన భోదించలేదు.
నూతన ఆజ్ఞ - ప్రేమ ఆజ్ఞ
దీనిని నుండి మనము ఏమి నేర్చుకోవాలని యేసు ప్రభువు కోరుతున్నారు? యేసు ప్రభువు తన శిష్యుల కాళ్ళు కడగడం ద్వారా మనం ఏ విధంగా ఉండాలో ఒక సంకేతం ఇస్తున్నారు. ఇది యేసు ప్రభువుని ప్రేమను వ్యక్త పరచిన సంఘటన. ఈ సంఘటన వినయంతో కూడిన ఒక పని. ఎందుకంటే ఇది శిష్యుల అపవిత్రతను పోగొట్టి ప్రవిత్రతను వారికి ప్రసాదించే ఒక పని. ఇది ఇంకొక విషయాన్ని తెలియ జేస్తుంది. అది ఏమిటి అంటే యేసు ప్రభువుని మరణం మరియు పునరుత్థానం మానవుని పాపం మరియు దాని పర్యావసానలను అనగా మరణంను తొలగిస్తుంది. మనలను దేవునితో కలిసి జీవించే అర్హతను తెస్తుంది.
ప్రేమ ఆజ్ఞను పాటించడం అంటే యేసు ప్రభుని సాన్నిధ్యాన్ని ఈ లోకంలో కొనసాగించాడం, ఇది శిష్యుల యొక్క బాధ్యత. ఇది ఈ ప్రేమ ఆజ్ఞను పాటించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. క్రైస్తవ ప్రేమ అనేది ఈ లోకంలో ఉన్నంత కాలం యేసు ప్రభువును ఈ లోకం చూడవచ్చు. ఈ ప్రేమ ఆజ్ఞ క్రొత్తది, ఎందుకంటే శిష్యులను యేసు ప్రభువు ఒకరిని ఒకరు తాను వారిని ప్రేమించిన విధమున ప్రేమించమని అన్నారు. అంటే యేసు ప్రభువులానే వారు ప్రేమించాలి. రూపాతంతరికరణ చెందాలి ప్రభువులా.
కానీ కోరింథీలో ఉన్న క్రైస్తవులు ఒకరిని ఒకరు ప్రేమించుటలో విఫలం అయ్యారు. కనుక పునీత పౌలుగారు ప్రభుని కడరా భోజనం గురించి, ఏ విధంగా ప్రభువు మన అందరికి ఒక మాతృక ఇచ్చాడో అని మాటలాడుతున్నారు. కోరింథీలో క్రైస్తవులు వారి ప్రార్ధన తరువాత వారు కలిసి తినడం లేదు. వారు విడిపోయి పేదవారు ఒక చోట , ధనికులు ఒక చోట భుజిస్తున్నారు. వారిలో ఐక్యత లేదు. ఏసు ప్రభువు ప్రేమఆజ్ఞ ఇచ్చిన ఈరోజు , యేసు ప్రభువు శిష్యులకోసం ప్రార్దన చేయడం మనం చూస్తాము.
శిష్యుల ఐక్యత
యేసు ప్రభువు చేసిన ఈ ప్రార్ధనను ప్రధాన యాజకుని ప్రార్దన. ఇక్కడ యేసు ప్రభువు లోకం కోసం ప్రార్ధన చేయలేదు. కానీ తన శిష్యుల కోసం మరియు ఈ శిష్యుల ద్వార శిష్యులు అయ్యే వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. యేసు ప్రభువు ఇక్కడ తన శిష్యుల ఐక్యత కోసం ప్రార్దన చేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రి దేవుడు ఏ విధంగా ఐక్యంగా ఉన్నారో, ఆ విధంగా ఐక్యంగా ఉండాలి అని ప్రార్ధిస్తున్నారు. ఈ ఐక్యత ఒక సాక్షీలా ఉంది. ఎందుకంటే శిష్యులు తమ ఐక్యత ద్వారా యేసు ప్రభువును ప్రపంచానికి తెలియచేయాలి. యోహను 17: 9-19 లో యేసు ప్రభువు తన శిష్యుల కోసం ప్రార్ధన చేయడం మనం చూస్తున్నాం. శిష్యులు ఈ లోకానికి సంభందించిన వారు కాదు. యేసు ప్రభువును తిరస్కరించినట్లుగా ఈలోకం ఆయన శిష్యులను కూడా తీరస్కరిస్తుంది. ఆయన వారిని లోకము లోనికి పంపిస్తున్నారు, ఆయనకు సాక్షులుగా ఉండటానికి కనుక ఆయన వలె జీవించవలసిన బాధ్యత వీరి మీద ఉంది. అంతే కాదు శిష్యుల ద్వార యేసు ప్రభువును నమ్మే వారికోసం కూడా యేసు ప్రభువు ప్రార్ధిస్తున్నారు. యోహను 17:20-26.
కడరా భోజనానికి మత పరమైన మరియు రాజకీయ పరమైన ప్రాముఖ్యత ఉంది. మత పరమైన ప్రాముఖ్యత ఎందుకంటే అది పాస్క ను గుర్తు చేసేటువంటిది, దేవుని మహిమను చాటె ఒక విందు. రాజకీయ ప్రాముఖ్యత ఎందుకంటే ఇక్కడ ఒక నూతన సమాజాన్ని చూసిస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూదయ ప్రజలు పిలువని వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. వారే సుంకరులు. అంటే నూతన సమాజానికి ఇది నాంది పలుకుతుంది.
దివ్య సత్ప్రసాద మరియు గురుత్వ స్థాపన
ఈరోజు మనం దివ్య సత్ప్రసాద స్థాపనను మహోత్సవాన్ని మరియు గురుత్వ స్థాపన జరుపుకుంటున్నాం. ఇది ప్రజల మీద దేవుని ప్రేమను తెలియజేస్తుంది. యేసు ప్రభువుకు తన ప్రజలతో ఉండాలి అనే కోరికను ఇది తెలియ జేస్తుంది. కడరా భోజన సమయంలో ప్రభువు దీనిని నా జ్ఞాపకార్దముగా చేయుడి అని అంటున్నారు. ఇది దేవుని ప్రేమను గుర్తుచేసుకునే రోజు. గురువుల ద్వార, దివ్య బలి ద్వార మరల యేసు ప్రభువుతో ఉండుట లేక ఆయన సాన్నిధ్యం పొందటం జరుగుతుంది. ప్రభువు మనతో లేడు అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే గురువుల ద్వారా వారు అందించే దివ్య సంస్కారముల ద్వారా ప్రభువును పొందటం, అయన సాన్నిధ్యం పొందడం జరుగుతుంది. గురుత్వ మరియు దివ్య సత్ప్రసాదం యేసు ప్రభువును మనం కలిసే విధంగా చేస్తున్నయి. కనుక ఇది కూడా దేవుని ప్రేమను సూచిస్తుంది.
ఈరోజు మనం మనలను ఒక ప్రశ్న అడగాలి అది ఏమిటి అంటే నా ప్రవర్తన ద్వార, నా ప్రేమ చూపించడం ద్వారా, ఇతరులు యేసుక్రీస్తును చూసే విధంగా, వినే విధంగా చేయగలుగుతున్నానా? లేక నేను కోరింథీ సంఘంలోని శిష్యుల వలె, లేక యేసు క్రీస్తును తెలియదు అని చెప్పిన శిష్యుల వలె, లేక ఆయనను పట్టించిన శిష్యుల వలె విఫలం అవుతున్నామా ?
ఈ ప్రశ్నకు జవాబు యేసు ప్రభువుతో ఒక వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సంభందం మీద ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువు అన్ని భరించ గలిగాడు, ఎందుకంటే తండ్రి తోటి ఆయనకు ఉన్నటువంటి బంధం అంత గొప్పది. ఆయన కోసం ఏమి చేయడానికైనా సిద్ధమైన బంధం. అందరు నిద్ర పోతున్నా యేసు ప్రభువు మాత్రం ప్రార్ధన చేస్తున్నారు. ఈ రోజు యేసు ప్రభువు వలె మనం కూడా ఆయనతో మన సంభందం అంతే ధృడంగా ఉండాలని ప్రార్ధన చేద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి