క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము
క్రిస్తునాదునియందు ప్రియ సహోదరులారా ఈ రోజు మనం క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము జరుపుకుంటున్నాం . ఇది దివ్యసత్ప్రసాధ దైవ సంస్కారానికి సంభందిచ్చినది . ఈ పండుగ యేసు ప్రభువుని దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించాలి, ఆయనను నేను నా లోనికి ఆహ్వానించి, నాలో ఉండేలా చేయాలనే కోరికతో ఈ పండుగను చేసుకోవడము జరిగినది.
ఈ పండుగలో మనము ముఖ్య ఉద్దేశం క్రీస్తుని అనుభవ పూర్వకంగా దివ్య సంస్కరము ద్వారా అనుభవించుడమే. కడర భోజన సమ యాన యేసు ప్రభువు రొట్టెను తీసుకోని ఇది నా శరీరము మీరందరు దీనిని తీసుకోని భుజించండీ అని చెపుతున్నారు. ఒకరకంగా ఆయన తన శిష్యులను దేవుని స్వీకరించడానికి అర్హులుగా చేసున్నాడు. కేవలము వారిని అర్హులుగా మాత్రమే కాక వారిని దేవున్నీ ఇతరులకు ఆందిచేవారిగా కూడా చేస్తున్నాడు. యేసు ప్రభువు వారి మద్య ఉండవలసీన అవసరం ఉంది, ఎందుకంటే వారు ఎక్కువ తెలివి గలవారో , ఇతరులను ప్రభావితం చేయగలవారో అని కాదు కానీ వారు చాలా బలహీనులు అని మాత్రమే. ఆయన వారితో ఉన్నట్లైయితే వారు మంచి వారీగా , చేడుకు దూరముగా అదే విధముగా దైవ నిబంధనలకు అనుకూలమైన వారీగా జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారి మద్య లేకపోతారో ,అప్పుడు వారు ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. వారు అందరు భయ భ్రాంతులకీ గురి అవుతున్నారు. పారిపోతున్నారు. అందుకే ఆయన వారి మద్యనే ఉండాలి. తన మరణము పునరుత్తనము తరువాత కూడా ఆయన వారి మద్యనే ఉండాలి దానిని సాద్యం చేస్తున్నారు. యేసు ప్రభువు దివ్య పూజ బలి ద్వారా, దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించడము ద్వారా ఈ పనిచేస్తున్నారు. అందుకే తన శిష్యులు ఇప్పటికి తన సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు . ఎమ్మావు మార్గాన పోయే శిష్యుల అనుభవం మనకు ఒక ఉదాహరణ యేసు ప్రభువు సాన్నిధ్యము వారి మధ్యనే ఉంది అని ఆయన రొట్టె విరిచినప్పుడు వారు ఆయనను కనుగొన్నారు.
క్రీస్తు పునరుత్తాణము తరువాత దైవ వాక్కు బొదిస్తూ, శిష్యులు కలిసి రొట్టె విరవడం మొదలు పెట్టారు, కనుకనే మొదటి క్రైస్తవులు ఒకే హృదయము మనసు కలిగి కలిసి ప్రార్దన చేసి ,భుజించి ఒకరిని ఒకరు మంచి మనసు కలిగి, వారిలోని పెదవారిని , అనారోగ్యులును ,అనాథలను విదవరాళ్లను ఆదరణతో చూసేరు.
శిష్యులు అనేక ప్రదేశాలకు వెళ్ళి వారు క్రొత్త క్రైస్తవ సమూహాలను ఏర్పాటు చేసేరు. వారు ఒంటరిగా వెళ్ళక వారితోపాటు యేసు ప్రభువును తీసుకొనివేళ్లారు. వారు ఆదిమ క్రైస్తవుల వలె చేశారు. ఎందుకు అంటే వారు యేసు ప్రభువు లేకుండా ఏమి చేయలేరు అని. యేసు ప్రభువును తీసుకెళ్ళడమూ అంటే ఈ కలిసి రొట్టెను విరుస్తూ ప్రార్థించటమే.
తీరుసభ పెరిగేకొద్ది దానితోపాటు దివ్యసత్ప్రసాధమునకు ప్రాముఖ్యత పెరుగుతూనే ఉన్నది . దివ్యసత్రపసాదము యేసు క్రీస్తుతోటి మనము ఏర్పాటుచేసుకునే వ్యక్తిగత సంబంధానికి పునాది. అంతే కాదు తిరుసభ కూడా యేసు క్రీస్తు శరీరం మనము తిరుసభ సభ్యులం . తిరుసభ సభ్యులుగా క్రీస్తు శరీర అంగాలుగా మనము జీవించాలి అంటే మనము ఈ దివ్యసత్ప్రసాధము లో ఉన్న యేసు ప్రభువుతో సంభదము కలిగి జీవించాలి. ఎందుకు యేసు ప్రభువు ఇక్కడ ఈ అప్పము ద్రాక్ష రసములో ఆయన ఉండాలి అని అంటే ఆయన నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని వాగ్దానము చేశాడు. అందుకే మనతో ఉండాలి అని మన కష్టాలు బాదలు అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. అంటే మనవునితో కలిసి ఉండాలి అని దేవుడు ఈ అప్ప ద్రాక్ష రూపములో యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన ఎందుకు మనతో ఉండాలి కేవలము మనతో వసించి మన బాదలు కష్టలు తెలుసుకోవడానికి మాత్రమే కాదు వాటినుండి మనలను బయటకు తీసుకురావడానికి .ఎందుకు ఆయన మన దగ్గరకు వచ్చి మన బాదాలను తెలుసుకొని మనలను వాటినుండి బయటకు తీసుకువచ్చేది అంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే నా శరీర రక్తాలను స్వీకరిస్తారో వారితో నేను జీవిస్తాను అని చెపుతున్నాడు.
కాథోలిక దేవాలయాలలో మనము దివ్యసత్ప్రసాధ ఆరాధనా , సహజముగా మనకు తెలిసినది. దానికి కారణము ఈ పండుగ. అక్కడ మనకు ఒక వెలుగుతున్న ఒక లైట్ ఉంటుంది. అది యేసు ప్రభువుని సాన్నిధ్యానికి గుర్తు గా ఉంది.
సు విశేషములో ఈ రోజు ఇది నా శరీరము దీనిని తీసుకోని భుజించండి అని చెపుతున్నారు. అంటే నేను ఆయనను స్వీకరించే వాడిని. అంటే నేను ఆయనను స్వకరించడానికి ఆర్హుడను. మనము ఎవరో తెలియ చేస్తుంది. అంటే మనము దేవుని మనలోకి ఆహ్యానించడానికి ,శక్తి కలిగి ఉన్నాము.
ఇక్కడ ముఖ్యమైన విషయము ఏమిటి అంటే దేవుణ్ణి స్వీకరించడము. దేవుని స్వీకరించే శక్తి నాకు ఉంది, ఆ శక్తిని నేను వాడుకోకపోతే నేను ఆయనను కోల్పోతాను అని పునీత అవిలా తెరాజమ్మ చెపుతారు. ఒకవేళ నేను ఆయనను స్వీకరించడానికి సిద్దపడకపోతే నేను ఆయనను కోల్పోతాను. ఆయన్ను ఎప్పుడు కోల్పోకుండా ఉండడానికి నేను సాధన చేయాలి. ఆ సాధన ఆయనను కోరుకోవడము. దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను కూడా ఆయనను కోరుకోవాలి. నేను ఆయనను కోరుకోకపోతే నాకు ఆయనలో స్థానము లేదు. ఈ పండుగ మనము ఎవరో చెపుతుంది. కనుక ఆయనను స్వీకరించి ఆయన వలే జీవిద్దాము. ఆమెన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి