పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవం
పేతురు గారు పవిత్ర గ్రంధంలో యేసు ప్రభువుని అపోస్తులులలో ప్రముఖమైన శిష్యుడు. ఈయన బెత్సయిదా నుండి వచ్చిన ఒక జాలరి. బెత్సయిదా అంటే చేపల ఇల్లు అని అర్ధం. తరువాత ఆయన కపర్నాములో తన నివాసం ఏర్పారుచుకున్నాడు. పేతురు గారి తండ్రి గారి పేరు యోనా, ఇతనికి ఆంద్రెయ అను సోదరుడు కలడు. వీరు ఇద్దరు జాలరులే. ఈయన మొదటిగా యేసు క్రీస్తును కలిసినది యోహను బాప్తిస్మం ఇస్తున్న యొర్ధాను నది తీరంలో ఉన్న బేతానిలో. పేతురు మరియు ఆంద్రెయ గార్లు బాప్తిస్మ యోహను గారి యొక్క శిష్యులు. ఆంద్రెయ గారు యేసు ప్రభువు గురించి మొదట పేతురు గారికి తెలియచేశాడు. పేతురు అంటే రాయి అని అర్ధం. ఈయన అసలు పేరు సిమోను. సిమోను అంటే రెల్లు కాడలాంటి వాడు అని అర్ధం. పేతురు గారు కూడా మొదటిలో అలానే ఉన్నాడు. ఎవరు ఏమి మాటలాడిన వారికి భయ పడిపోయారు. కాని యేసు ప్రభువు ఆయనను దృడంగా మారుస్తున్నారు. ఆయనను పేతురును చేస్తున్నారు. తన సంఘానికి పునాదిగా చెస్తున్నాడు.
పేతురు గారు విలక్షణ లక్షణాలు కలిగిన వ్యక్తి. ఈయన జీవితాన్ని అనేక కోణాలులో విశదీకరించవచ్చు. సహజ సిద్దముగా ఈయన అవేశపరుడు. మృదువర్తనుడు, ఆధ్యాత్మిక విషయాల్లో కొంత అవగాహన కలిగిన వ్యక్తి . తన విశ్వాస జీవితంలో తాను చేసిన తప్పును ఒప్పు కొనే ధైర్యం కలిగిన వ్యక్తి, మరియు సహజముగా పిరికివాడు. అపరాధ భావం కలిగినవాడు, తన తన ప్రభువు తెలియడు అని చెప్పాను అని , తన తప్పు గ్రహించ కలిగిన వ్యక్తి. తనను తాను త్యజించుకుంటున్నారు. కాని మరల ఈ లోక వస్తువుల మీద ఆశ కలిగి ఉన్న వ్యక్తి , ఈ విధముగా అనేక విరుద్ధ భావాలు, వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి.
ఈయన అపోస్తులులలో నాయకుడు. యేసు ప్రభువుని ముగ్గురు ముఖ్యమైన శిష్యులలో ఈయన ఒకడు. చనిపోయిన యాయిరు కుమార్తెను యేసు ప్రభువు మరణం నుండి లేపుతున్నప్పుడు పేతురుగారు ఉన్నారు. యేసు ప్రభువు రూపాంతరికరణ సమయంలో పేతురుగారు అక్కడ ఉన్నాడు . యేసు ప్రభువు ఓలివు తోటలో వేదన పొందుతున్నప్పుడు పేతురు గారు ఉన్నారు. ఇన్ని గొప్ప కార్యాలకు సాక్షిగా ఉన్న పేతురు పిరికివాడు. ఎటువంటి ఇబ్బంది సహించలేడు. తనకు ప్రభువు పట్ల ఎంతో ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలి అనుకునేవాడు. అందుకే ఏ చిన్న అవకాశం ఉన్న తాను ఎంతో ప్రేమిస్తున్నాను అని ప్రకటించుటకు సిద్దంగా ఉండేవారు. కాని కష్టం వచ్చినప్పుడు ఆయనను విడచి పెట్టుటకు ఎటువంటి వెనుకడుగేయలేదు. ఆయన ఎవరో కూడా నాకు తెలియడు అని చెబుతున్నారు.
ఇటువంటి పేతురు గారు అద్భుతాలు చేసేటు వంటి పరిచారకుడు అయ్యాడు. యేసు ప్రభువు ఈయనను ఒక గొప్ప వ్యక్తిగా మార్చుతున్నాడు. తనను శిష్యులకు నాయకునిగా ఎన్నుకుంటున్నాడు. అంతేకాదు ఈయన మీద తన సంఘంను నిర్మిస్తాను అని వాగ్ధానం చేస్తున్నాడు. ఆయనకు స్వర్గపు తాలపు చెవులను ఇస్తున్నాడు. స్వర్గపు తలుపులను ప్రజలకు తెరిచే అవకాశం ప్రభువు పేతురుకు ఇస్తున్నాడు.
కాని పేతరుగారు యేసు ప్రభువు శ్రమలను అనుభవిస్తున్న సమయంలో తన విశ్వాసం చూపించుటలో చాలా ఘోరముగా విఫలం చెందుతున్నారు. ఆయన మాత్రమే కాదు తనను గొప్ప వానిగా చెప్పిన ప్రభువును కూడా ఆయన ఒడిస్తున్నాడు. తాను ఆయన అనుచరుడును కాను అని చెబుతున్నాడు. కాని ప్రభువు ఆయనను వదల లేదు, తన పునరుత్థానం తరువాత మరలా పేతురు గారిని తన గొర్రెలను కాయమని, తన సంఘంను నడుపమని ప్రభువు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని పేతురు గారు ఎంతో గొప్పగా వినియోగించుకున్నాడు.
ఈయన పడి లేచిన మనిషి. పడి లేచిన తరువాత పడని మనిషి. ఎలా పడకుండ ఉండాలో నేర్పే మనిషి. తన గురువుకు ప్రామాణికంగా ఉండే మనిషి. తాను గొప్ప నాయకుడు అయ్యాడు. పసి సంఘాన్ని కంటికి రెప్పలా కాపాడాడు, గురువు యొక్క శిష్యునిగా పరిణితిని ప్రతి విషయంలో చూపించిన వ్యక్తి.
పెంతుకోస్తు పండుగ తరువాత మొదటగా యేసు ప్రభువు పసి సంఘాన్ని యెరుషలేములో పేతురుగారు నడపారు. తరువాత పాలస్తీనాలో కొంత కాలం సంఘాన్ని నడిపారు. ఈ సమయంలోనే పేతురు లిద్దా , యోప్పా ప్రదేశములలో ఉన్నాడు. ఈ సమయంలోనే కైసరియాకు ఈయన పిలువబడ్డాడు. ఇక్కడ కొర్నేలియసు ఇంటి వద్ద అన్యులకు సంఘ తలుపులను తెరిచాడు. అటు తరువాత సిరియాలో అంతియోకు కేంద్రంగా పనిచేశారు. అటుతరువాత రోము నగరానికి వెళ్ళాడు. అప్పటికి పౌలుగారు మొదటిసారి చెరసాల నుండి వదలి వేయబడ్డాడు. తరువాత అక్కడె ఆయన హింసించబడి మరణానికి గురయ్యాడు. అంతేకాదు తన ప్రభువు వలె సిలువ వేయబడటానికి ఆర్హుడను కాదని తనను తలక్రిందులుగా సిలువ వేయమని వెదుకొనుచున్నాడు. పేతురుగారు క్రీస్తు సంఘాన్ని నిర్మించాడు. ప్రభువు కోసం మరణించడం గొప్ప భాగ్యం అని చాటి చెప్పాడు. పిరికివాడు, ధైర్యంగా ప్రభువు సంఘాన్ని నడిపాడు. అద్భుతాలు చేశాడు. క్రీస్తు అనుచరునిగా జీవించాడు.
పౌలు
సంఘములను ఏర్పరచిన అపోస్తులుడు
పునీత పౌలును అన్యుల యొక్క అపోస్తులుడుగా దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఆదిమ క్రైస్తవులకు దశ దిశ తెలియచేసిన అపోస్తులుడు. ఈయన ఆదిమ సంఘ నిర్మాత. అంతేకాదు అనేక లేఖల ద్వారా దేవుని మార్గాన్ని అన్యులకు తెలియచేసిన గొప్ప దార్శనికుడు.
ఈయన సీలీషియాలోని తార్సు లో జన్మించాడు. ఆయన ఒక పరిసయ్యుడు, మరియు రోమా సామ్రాజ్య పౌరుడు. కఠినమైన యూద మత శిక్షణ పొందాడు. యూదయ బాలునిగా ఆయన ధర్మ శాస్త్రంను ఎప్పుడు మననం చేసుకుంటూ ఉన్నాడు. తాను అప్పటి గొప్ప గురువు అయిన గమాలియేలు తాత్వికుని దగ్గర శిష్యరికం చేశాడు. అప్పటి ఆలోచన విధానం , తాత్వికంలో ఆయనకు మంచి పట్టు ఉంది.
పునీత పౌలుగారు మొదట శ్రీసభ హింసకుడు. క్రైస్తవులను హింసించాడు. ఆయన ఎవరిని చంపినట్లు మనం చూడం కాని అతను క్రైస్తవులను చంపుతున్నప్పుడు సాక్షిగా ఉన్నాడు. క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు మార్గ మద్యంలో యేసు ప్రభువు, సౌలు సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు , అని మాట్లాడిన మాటలు ఆకాశం నుండి వింటున్నాడు. తాను దృష్టిని కోల్పోతున్నాడు. ఎవరు ప్రభువా మీరు అని అడుగగా నీవు హింసిస్తున్న క్రీస్తును నెనే అని ప్రభువు చెబుతున్నాడు. ఇక్కడ మారుతున్నాడు. హింసకుడు విశ్వాసిగా మారుతున్నాడు. ఆయన ఒక నూతన సృష్టిగా మారుతున్నాడు. పౌలుగారు తన మారు మనసు పొందిన విధానం, డమస్కస్ మార్గ మధ్యంలో జరిగిన సంఘటనను చెప్పడం ఎప్పుడు కూడా మరచిపోలేదు. ఆయన పది సంవత్సరాలు తను పరిచర్య చేయుటకు శిక్షణ పొందాడు. అరేబియా , డమస్కస్ , యెరుషలేము , సిరియా మరియు శీలిసియాలలో ధర్మ శాస్త్రంను అధ్యాయనం చేస్తూ , ప్రార్ధనలో జీవించాడు. తనను పిలిచిన దేవునికి సాక్షిగా జీవించడానికి సిద్దపడ్డాడు.
పునీత పౌలుగారు అనేక నూతన సంఘాలు ఏర్పాటుచేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. నూతన సంఘాలు ఏర్పాటు చేస్తూ అనేక ప్రదేశాలు తాను స్వయంగా ప్రయాణీంచాడు. ఆయన అన్నీ ప్రయాణాలలో కూడా పౌలుగారు తనను పంపిన దేవుని చిత్తమును నెరవేర్చడానికి అని కృతనిశ్చయంతో ఉన్నాడు.
పునీత పౌలు గారు గొప్ప బోధకుడు మరియు లేఖనకారుడు. నూతన నిబంధంలో 13 లేఖలు ఆయన రాశాడు. ఆయన రాసిన లేఖలు మనకు ఆయన వ్యక్తిత్వాన్ని , ఆయన విశ్వాసాన్ని , ఆయన నైతికతను తెలుపుతాయి. పౌలు గారు ఇతరులను క్రీస్తు అనుచరులుగా చేయడం కోసం బ్రతికాడు. ఆ పనిలోనే అమరుడయ్యాడు. తన కోసం ఏమి కోరుకోలేదు. కాని తనకు తెలుసు దేవుని ముందు మంచి జీవితం జీవించాడు అని. పౌలు గారు జీవితంలో పొందిన అనేక శ్రమలలో ఆయన ఎప్పుడు నిరాశ చెందలేదు. ఇంకా ఎక్కువగా ప్రభువు కోసం పని చేశాడు. సంఘాలను ప్రోత్సహించాడు. వారిని వదలి వేయకుండా తన లేఖల ద్వారా వారికీ మార్గ నిర్దేశం చేశాడు. అన్నీ వదలి పెట్టి దేవుని మీద ఎలా ఆదారపడి బ్రతకాలో పౌలు గారు చూపించారు. కాని తాను పని చేయడం మానలేదు. దేవుని యెడల ఒకే విశ్వాసం కలిగి ఉన్నాడు. అది "నీ కృప నాకు చాలును." మన విధులను మనం నెరవేరుస్తూ దేవుని కృప చాలును అని జీవిద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి