పేజీలు

15.5.23

అనుదిన ఆత్మీయ ఆహారం , యోహను 16:5-11

 

యోహను 16:5-11 

కాని, ఇప్పుడు  నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడు "నీవు ఎక్కడకు పోవుచున్నావు"? అని నన్ను అడుగుట లేదు. నేను మీకు ఈ విషయములు చెప్పినందున మీ హృదయములు దుఃఖముతో నిండి వున్నవి. ఐనను  నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్లనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపేదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకన వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకన , నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను. ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకన, ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది.  

యేసు ప్రభువు తన తండ్రి వద్దకు పోయేముందు, తన వీడ్కోలు ఉపదేశంను తన శిష్యులకు ఇస్తున్నాడు. ఈ సమయంలో శిష్యులు ఎవరు ఆయనను నీవు ఎక్కడకు వెళుతున్నావు? అని అడగలేదు. అందరు బాధలో ఉన్నారు, ఆయన వారిని వీడి పోతున్నారు కాని పూర్తిగా వారికి అక్కడ ఏమి జరుగుతుందో  తెలియదు. వారికి అర్ధం అయిన విషయం వారి గురువు వారి నుండి వెళ్ళిపోతున్నారు. అందుకు వారు బాధ పడుతున్నారు. యేసు ప్రభువు ఈ మాటలను మొదటి సారి చెప్పడం లేదు, అనేక సార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు చెబుతున్న మాటలు ఖచ్ఛితముగా వారిలో ఒక మార్పు తీసుకువస్తున్నాయి, ఎందుకంటే వారు, యేసు ప్రభువుకు వ్యతిరేకముగా జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన చేసుకుంటున్నారు. కనుక వారు ఏమి అడగడానికి సహసించలేదు. అంటే వీరికి పూర్తిగా ఆయనకు ఎటువంటి కష్టాలు వస్తున్నాయో తెలుసు అని కాదు అర్ధం. వారి దృష్టిలో ఇది వారికి అర్ధమయ్యే విషయం కూడా కాదు. కనుక దాని గురించి వారు ఏమి మాటలాడుటలేదు. 

నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం : యేసు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని చెబుతున్నారు. ఎందుకు శ్రేయస్కరం అంటున్నారు అంటే ఆయన వెళితే ఓదార్చువాడు అయిన పవిత్రాత్మ  వస్తాడు. ఆయన పాపము, నీతి , మరియు తీర్పు గురించి లోకామునకు నిరూపిస్తాడు. ఎందుకు వీటి గురించి లోకానికి తెలియచేయాలి? లోకం ప్రభువును తెలుసుకోవాలి, ఆయనను విశ్వసించాలి, పాపమును వదలి వేయాలి. లోకము యేసు ప్రభువును విశ్వసించక, అవిశ్వాసంతో జీవిస్తుంది. పాపము మానవున్ని ఏమి చేస్తుందో పవిత్రాత్మ తెలియజేస్తుంది. లోకం చేసిన తప్పు ప్రభువును విశ్వసించకపోవడం. నీతి గురించి లోకమునకు తెలియదు, నీతి లోకం దృష్టిలో క్షణికమైంది కాని నిజానికి అది శాశ్వతమైనది. అంతే కాదు పవిత్రాత్మ యేసు ప్రభువును నమ్మక , ఆయన చెప్పినట్లు జీవింపకపోతే వచ్చే తీర్పు గురించి తెలియచేస్తుంది. మనకు ప్రభువు నేర్పిన విషయములను అన్నింటిని గుర్తుకు తెస్తుంది.

 అంతే కాదు ప్రభువు నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరం అని శిష్యులకు చెప్పేది, ఇంకా ఎందుకంటే ప్రభువు మీదనే ఇంకా శిష్యులు ఆధారపడుతారు, కాని ప్రభువు వారి నుండి వెళ్ళిన తరువాత పవిత్రాత్మ సహాయంతో వారు లోకం అంతట ప్రభువు గురించి , దేవుని రాజ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడ శిష్యులు కేవలం స్వీకరించేవారు కారు, ఆయన వారి నుండి వెళ్ళిన తరువాత వారు  ప్రభువును పంచే వారు అయ్యారు. దానికి ప్రభువు వారి వద్ద నుండి వెళ్లారు. దీనికి పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుంది. యేసు ప్రభువు పాపము గురిచి చెబుతున్నారు,ముఖ్యంగా ఈ లోకం యొక్క ఘోరమైన  పాపం  ఏమిటి అంటే ఆయనను నమ్మక పోవడం, విశ్వసించక పోవడం. కొన్ని సార్లు మనం కూడా ఇలానే ఉంటూ వుంటాం. ఆయన చెప్పే మాటలను మనం పాటించక పోవడం.

 నీతి గురించి ప్రభువు చెబుతున్నారు, ఇక్కడ యేసు ప్రభువు గురించి ఈ మాటలు వున్నవి. ఆయన తండ్రి దగ్గరకు వెళుతున్నారు. ఆయన నిత్యం ఉండువాడు. తండ్రి దగ్గరకు వెళ్ళిన ఆయన జీవించువాడు. ఆయన ఎంతో నీతిమంతుడు, ఆయన చేసినవి అన్ని నీతితో కుడినవే. కానీ లోకం ఆయన నీతిని అంగీకరించలేదు. ఆయన్ను సాతాను సాయంతో సాతానును వెడలగొడుతున్నాడు అని అన్నది, ఆయన మంచిని లోకం అంగీకరించలేదు. సబ్బాతు రోజున ఆయన చేసే మంచి వద్దు అన్నది. ఆయన కరుణను అంగీకరించలేక పోయింది. యోహను తన సువిశేషం మొదటిలోనే చెప్పాడు ఈ విషయం. దేవుడు వెలుగుగా లోకమునకు వచ్చినప్పటికీ మానవుడు వెలుగు దగ్గరకు పోవుటకు ఇష్ట పడలేదు, ఎందుకంటే మానవుని పాపం, అవినీతి ఎక్కడ ఈ వేలుగులో కనపడుతుందో అని , చీకటినే ప్రేమించాడు మానవుడు. వెలుగు దగ్గరకు పోవడానికి భయ పడ్డాడు. మనం కూడా కొన్ని సార్లు ఇలానే జీవిస్తూ ఉంటాం. దేవుని దగ్గరకు పోతే ఎక్కడ మన నిజ జీవితాలు బయట పడుతాయో అనుకుంటూ వుంటాం. అందుకే పవిత్రాత్మ మనకు పాపం దాని పర్యవసానం గురించి తెలియ చేస్తుంది అని ప్రభువు పలుకుతున్నారు. 

మీరు నన్ను చూడరు,అని యేసు ప్రభువు చెబుతున్నారు.  శిష్యులు యేసు ప్రభువు యొక్క శిష్యులు ఆయన తండ్రి వద్దకు వెళ్ళిన తరువాత ఆయన వారికి  దూరం  అయి పోతారు. కాని వారికి ఆదరణ కర్తను పంపుతాను అని చెబుతున్నారు. ఈ అధరణ  కర్త కేవలం వీరికి వీటిని చెప్పడమే కాదు వీరికి సహాయ పడుతుంది. పాపం చేయడం ద్వారా మనం దేవుని నుండి మనం పొందే ఎడబాటు గురించి తెలియచేస్తుంది. అంతే కాదు యేసు ప్రభువు ఈ పాపన్ని జయించుటకు చేసిన అన్ని కష్టాలును తెలియజేస్తుంది. మరియు సాతాను ను జయించిన దానిని తెలియజేస్తుంది. మనం కూడా క్రీస్తు ను అనుసరించి , పవిత్రాత్మ సహాయంతో సాతానును జయించుదాం.

ప్రార్దన : ప్రభువా మీరు తండ్రి వద్దకు వెళ్ళుటకు ముందుగ మీ శిష్యులను మీ ఎడబాటును తట్టుకోవడానికి వారిని ముందుగానే సిద్ధం చేశారు. మీరు  మీరు ఎక్కడకి వెళుతున్నది, ఎందుకు వెళుతున్నది వారికి తెలియజేస్తున్నారు. మీ ఎడబాటులో  వారని ఆధారపడే వారి నుండి ఆదరించే వారిగా మారుతున్నారు. మీరు పంపిన పవిత్రాత్మ  వారిని ఇలా చేస్తుంది. మా జీవితంలో కూడా ప్రభువా మేము మాకు  తోడుగా ఉండుటకు మీ ఆత్మను పంపంచి, మమ్ములను ఎప్పుడు కూడా మా విశ్వాసమందు గట్టిగా ఉండేలా చేయండి.  మాకు ఎల్లప్పుడు కూడా  మీ ఆత్మ తోడుగా ఉండే విధంగా మమ్ము దీవించండి. మీ పవిత్రాత్మ ఏ విధముగా అయితే పాపం గురించి, నీతి గురించి మరియు తీర్పును గురించి తెలియజేస్తున్నదో అవి మేము తెలుసుకొని మిమ్ము విశ్వసించి, ఎప్పటికీ పాపములో పడకుండా, మేము నీతి వంతమైన జీవితం ప్రతి నిత్యం జీవించి, మీరు తీర్పు తీర్చుటకు వచ్చినప్పుడు మిమ్ములను చూచుటకు, మీతో పాటు వుండుటకు కావలనసిన అనుగ్రహం దయచేయండి. ఆమెన్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...