నిష్కళంక మాత మహోత్సవం
లూకా 1:26-38
తదుపరి ఆరవమాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఎలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవదూత "మరియమ్మా !భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ " నేను పురుషుని ఎరుగను కదా! ఈద్ ఎట్లు జరుగును?" ఆ దూతను ప్రశ్నించేను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీవపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను అవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను.
ఈరోజు నిష్కళంక మాత మహోత్సవం జరుపుకుంటున్నాము. ఏమిటి ఈ పండుగ అంటే మరియ మాత తన తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎటువంటి పాపం లేకుండ పుట్టింది. మరియమాతలో ఎటువంటి మలినం అనేది లేదు. మరియ మాతను పాపంలో పడకుండా తన వరప్రసాదాలు ముందుగానే ఇచ్చి తల్లి గర్భంలో పడినప్పటి నుండి పాప రహితురాలుగా ఆమెను చేశాడు అని అర్ధం.
ఈ ఆలోచన రెండవ శతాబ్దం నుండి తిరిసభలో ఉన్నది. కాని 4 శతాబ్దంలోనే ఒక పండుగలా చేయడం జరుగుతుంది. 1854 9 వ భక్తినాధ పోపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పండుగ మనకు మరియమాతకు తల్లి గర్భంలో పడతున్నప్పుడే, యేసు ప్రభువు శిలువ శ్రమలు , మరణం, పునరుత్థానల ఫలితాన్ని ముందుగానే ఇచ్చి ఆమెలో జన్మ పాపం లేకుండా ఆమెను రక్షించారు అని భోదిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు కాలనికి అతీతుడు. ఆయన అలా చేయగలడు. దీని అర్ధం మరియ మాతకు మెస్సీయ్యా అవసరం లేదు అని కాదు. ఆమెకు ఆయన రక్షణ ముందుగానే ఇవ్వబడింది.
పాపం లేకుండా ఎవరైన సృష్టించబడ్డారా? మొదట మానవుడు పాపం లేకుండానే సృష్టించబడ్డాడు. కాని తరువాత సాతాను మాటను స్త్రీ విని పాపం అంతకట్టుకున్నది. మొదటి స్త్రీ ఏవను, పడిపోయిన దేవదూత పాపం చేయడానికి ప్రోత్సహించినది. దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేపించి, పాపము చేసేలా చేసింది. మరియ మాత దగ్గరకు వచ్చిన దేవదూత పడిపోయిన దేవదూత కాదు, గాబ్రియేలు దేవ దూత , ఈ దూత ప దేవున్ని పూర్తిగా విధేయించిన దేవదూత. పడిపోయిన దేవ దూత వచ్చినప్పుడు దేవున్ని విధేయించ వద్దు అని ఏవకు చెప్పింది. కాని , గాబ్రియేలు దేవదూత వచ్చినప్పుడు దేవున్ని నమ్మమని. ఆయన ప్రణాళికకు సహకరించమని చెబుతుంది. మరియ మాత తన జీవితం మొత్తం అలానే , ఆ ప్రణాళికకు సహకరిస్తూ జీవించినది. అందుకే తిరుసభ పితరులు ఆమెను రెండవ ఏవ అని పిలుస్తారు. దేవుడు మన తల్లి తండ్రులను గౌరవించమని చెబుతున్నారు. ఇది దేవుని పది ఆజ్ఞలలో నలుగవది. యేసు ప్రభువు తన తల్లిని గౌరవించారు. మనం కూడా ఆమెను అలానే గౌరవించాలి.
మరియమాతకు ఈ అనుగ్రహం ఇవ్వవలసి అవసరం చాలా ఉంది, ఎందుకంటే ఈ లోకం రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం. అందుకు దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారో, ఆ పవిత్రుడను ఎవరు ఆహ్వానించగలరు. కేవలం ఎవరు అయితే ఏ పాపం లేకుండా ఉంటారో వారు మాత్రమే. అప్పుడే ఆయనకు ఏ మలినం అంటకుండా ఉంటుంది. అంటే ఆయన తల్లిలో ఏ పాపం ఉండకూడదు, ఆమె పవిత్రంగా ఉండాలి. అప్పుడే అది జరుగుతుంది. కనుక ముందుగానే మరియమాతను , తండ్రి దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా ఆమెను సిద్దపరుస్తున్నారు.
ఆదికాండం 3: 15 లో దేవుడు సర్పముతో " నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతటికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితుకగొట్టును. నీవేమో వాని మడమ కరిచేదవు." అని చెబుతున్నారు. ఇక్కడ సాతానుతో ఈ వైరం ఎప్పుడు ఉంటుంది. ఒక వేళ మరియ మాతలో పాపముకాని, లేక చిన్న మలినం ఉన్న , సాతానుతో సహకరించినది అవుతుంది. కనుక ఆమెలో ఏ పాపము ఉండకూడదు అందుకే ఆమెను దేవుడు జన్మ పాపము లేకుండా చేస్తున్నాడు. ఇవి అన్ని కూడా ఆమె కొరకు కాదు, ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నటువంటి తన కుమారుడు , పవిత్రుడు. ఆ పవిత్రుడు ఈ లోకములోనికి రావాలి అంటే, ఆయనను తీసుకు వచ్చే స్త్రీ కూడా పవిత్రురాలుగానే ఉండాలి. అపవిత్రతో ఈ ప్రభువును ముట్టుకొనుట అసాధ్యము. అపవిత్రంగా దివ్య మందసాన్ని తాకుతున్న వారు చనిపోతున్నారు. ప్రభువును ఈ లోకానికి తీసుకువచ్చే తల్లి పవిత్రంగా ఉండాలి కనుక ప్రభువు ఆమెను ఎటువంటి మలినం అంటకుండా చేస్తున్నారు.
మరియమాత జన్మపాపం లేకుండా జన్మించడం. ఆమె గొప్పతనం ఏమికాదు . ఆమె ఔన్నత్యము తరువాత ఆమె జీవించిన విధానం తెలుపుతుంది. తన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించినది. దేవుని దాసురాలిగా జీవించింది. ప్రభువును ధ్యానిస్తూ జీవించింది. తరువాత కూడా ఏ పాపము లేకుండ జీవించింది ఇక్కడ ఆమె ఔన్నత్యం తెలుస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి