పాస్క కాలపు నాలుగవ ఆదివారం (మంచి కాపరి)
యోహను 10:1-10
సువిశేషం : నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగ , దోపిడికాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. కావలి వాడు వానికి తలుపు తీయును: గొర్రెలు వాని స్వరమును గుర్తించును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి, బయటకు తొలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటిని బయటకు తొలుకొని వచ్చిన పిదప, వాడు వానికి ముందుగ నడచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును. కనుక, అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు. కనుక, అవి వాని వెంట వెళ్ళక దూరముగ పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కాని, ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేక పోయిరి. అందుచే యేసు మరల ఇట్లు చెప్పెను: "గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. నాకు ముందుగ వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి ఆలకింపలేదు. నేనే ద్వారమును! ఎవడేని నా ద్వార ప్రవేశించిన యెడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవుచు ఉండును. వానికి మేత లభించును. దొంగ వాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవము నిచ్చుటకు, దానిని సమృద్దిగ ఇచ్చుటకు వచ్చి యున్నాను.
యోహను 9 వ అధ్యాయంలో యేసు ప్రభువు ఒక గ్రుడ్డి వానిని యేసు ప్రభువు స్వస్థత పరుస్తున్నాడు. కొంత మంది ఇంకా ఆయనను సాతానుచే ఈ అధ్భుతాలు చేస్తున్నాడు అని అంటున్నారు, పరిసయ్యులు ఆయన మీద కోపంగా ఉన్నారు. పదవ అధ్యాయంలో యేసు ప్రభువు యూద నాయకులను దొంగలు దోపిడి వారు అని అన్నారు. 9 వ అధ్యాయం లో యేసు ప్రభువు నేనే లోకానికి వెలుగు అని చెబుతున్నారు. మరల ఒక గ్రుడ్డి వానికి చూపును ఇవ్వడం ద్వారా ఆయన ఈ లోకానికి వెలుగు అని చాటుతున్నారు. ఈ రెండు ఆధ్యాయాలలో యేసు ప్రభువు లోకానికి వెలుగు అవ్వడం ద్వార ఆయన చెంత ఉంటే మనకు ఏమి జరుగుతూంది అని తెలుస్తుంది. వెలుగు లోనే మనకు అంతయు స్పష్టముగా కనపడుతుంది. ఎవరు ఏమిటి అని తెలుస్తుంది. మనం నడిచే మార్గంలో ఉన్న అన్నీ మనం చూసి అటువంటి అపాయంకు గురికాకుండా వుంటాము అని ఈనాటి సువిశేషం తెలియ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగైన ప్రభువే మనకు కాపరి అని 10 వ అధ్యాయం తెలియచేస్తుంది.
10 వ అధ్యాయంలో కాపరి గురించి వింటున్నాం. ఇక్కడ నేను మంచి కాపరి అని చెపుతున్నారు. దీని ద్వారా మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. ఆయన వెలుగు నుండి మనం మన మార్గాన్ని చూడ గలిగి, ఆయన కాపుదలలో, గ్రుడ్డి వాని వలె తప్పి పోకుండా , సురక్షితమైన మార్గంలో, పచ్చికలలో ఉంటాము అని తెలియజేస్తున్నారు.
ప్రియ మిత్రులారా గ్రుడ్డి వానిని సరిగా చూడకుండా పరిసయ్యులు అతన్ని బయట పడవేశారు. నిజానికి పరిసయ్యులు అతనిని కాపరి వలె ఆయన బాగోగులు చూడాలి. కానీ వారు అదేమీ పట్టించుకోవడం లేదు. యోహను 9:34. కానీ యేసు ప్రభువు మంచి కాపరి వలె ఆయనకు చూపును ఇస్తున్నాడు. ఇక్కడ మనం యేసు ప్రభువు మరియు పరిసయ్యులు మధ్య వ్యత్యాసం చూడవచ్చు.
యేసు ప్రభువు ఒక మంచి కాపరి వలె అతని బాధను చూసి , తనకు అవసరాన్ని తీరుస్తున్నారు, కానీ పరిసయ్యులు కాపరులం, లేక మత పెద్దలం అని చెప్పుకుంటున్నారు కానీ తన కష్టాన్ని తీర్చడానికి ఏమి చేయడం లేదు. పరిసయ్యులు మంచి కాపరులు కాదు అని తెలుస్తుంది. పేరు చెప్పుకోవడానికి మాత్రమే వారు ఉన్నారు.
ఆ గ్రుడ్డి వాడు యేసు ప్రభువుని మాటలు వింటున్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల మాటలు కాదు ఎందుకంటే ఆ గ్రుడ్డి వానికి యేసు ప్రభువు మాత్రమే చూపును ఇవ్వగలడు అని తెలుసు. పరిసయ్యులు ఆ స్వస్థత పొందిన వ్యక్తిని అక్కడ నుండి బయటకు పంపుతున్నారు. ఆ వ్యక్తి యేసు ప్రభువు వద్ద ఉన్నాడు. ఆయనను ఎవరు ఏమి చేయలేరు. పరిసయ్యుల ఒత్తిడి పని చేయలేదు. ఆయన వారి మాట వినలేదు. కానీ యేసు ప్రభువు మాట వింటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును అని యేసు ప్రభువు చెబుతున్నాడు.
ఇక్కడ గొర్రెలు అంటే కేవలం మాట వినేవి లేక విశ్వాసించేవి అనేవి మాత్రమే కాదు. ఆయనకు చెందిన వారము. ఆయనకు చెందిన వారము, ఆయనను అనుభవించిన వారము కనుక ఆయన గురించి తెలిసిన వారము కనుక ఆయనను విశ్వసిస్తున్నాం. కానీ కొంత మంది ఆయనను విశ్వసించుట లేదు. అందుకే యేసు ప్రభువు అంటున్నారు , మీరు నా మందలోని వారు కారు కాబట్టి మీరు నమ్మరు అని అంటున్నారు.
మనం ఎలాగ ఆయనకు చెందిన వారము అవుతాము అంటే ఆయన మాట వినుట ద్వారా మరియు ఆయనను అనుసరించుట ద్వారా. అంటే నీవు ఆయన మాట వింటే , ఆయనను అనుసరిస్తే, నీవు ఆయనకు చెందిన వాడివి. యోహను 8:47. లో యేసు ప్రభువు "దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటలను ఆలకించును. మీరు దేవునికి సంబంధించినవారు కారు. కనుక , మీరు వాటిని ఆలకింపరు" అని పరిసయ్యులతో అంటున్నారు. నీవు వినుటలేదు అంటే ఆయనకు చెందిన వారు కాదు అని అర్ధం.
ఆయన స్వరమును ఆలకించు వారికి ఆయన ఏమి ఇస్తాడు?
నేను వారికి నిత్య జీవము ప్రసాదింతును , ఎవరు వానిని నాశనం చేయలేరు, అని ప్రభువు పలుకుచున్నారు. ఆయనకి చెందిన వారికి ఆయన ఇచ్చే బహుమానం ఏమిటి అంటే నిత్య జీవం. ఇది మనం మొదటి నుండి చూస్తూనే వున్నాం. మూడవ అధ్యాయం 16 వచనం. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి , తన ఏకైక కుమారుని ప్రసాదించేను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను." యోహను 6: 40"కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును. " ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం ఉంటుంది.
నా గొర్రెలు నా స్వరమను వినును, నేను వానిని ఎరుగుదును. ఈ మాటలను యేసు ప్రభువు ఎవరు అయితే అతనిని నమ్మటం లేదో వారికి చెబుతున్నారు. పరిసయ్యులకు చెబుతున్నారు. అంతకు ముందు యేసు ప్రభువు ఒక అద్భుతం చేశారు. వారు యేసు ప్రభువును నమ్మక వారి అపనమ్మకం వెల్లడి చేసి ఉన్నారు. యేసు ప్రభువు చేసిన పనుల బట్టి వారు ఆయనను నమ్మాలి. కానీ ఇక్కడ పరిసయ్యులు నమ్ముట లేదు ఎందుకు అంటే వారు వారే నాయకులు , కాపరులు అనుకుంటున్నారు, వారికి ఇతరులను నడిపే శక్తి, జ్ఞానం లేకుండానే. ఒక రకమైన అహం వారిని పీడిస్తుంది. దాని నుండి వారు బయటకు రావడం లేదు. ప్రజల సమస్యల ఎడల వారికి అవగాహన కూడా లేదు. అవగాహన లేకుండా ఏవిధంగా వారు ప్రజలను నడిపించగలరు?
యేసు ప్రభువును ప్రజలు నమ్ముతున్నారు, నిజానికి పరిసయ్యులు నాయకులే, కానీ వారిని ప్రజలు నమ్మడం లేదు అని తెలుస్తుంది. పరిసయ్యులు వారిని వారు కాపరులుగా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారిని కపట కాపరులుగా చెప్తున్నారు. అందుకే, నాకంటే ముందు ఉన్న వారు అందరు దొంగలు , దోపిడి చేసేవారు అని చెపుతున్నారు. వీరు కాపరులుగా నటించారు. నిజమైన కాపరులుగా వారు ప్రవర్తించలేదు. అనేక సార్లు స్వార్ధ కొరికలతో జీవించారు. యోహను 10: 8 "నాకు ముందుగా వచ్చిన వారందరు దొంగలు, దోపిడి గాండ్రు, గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు." వీరు ఇటువంటి వారు కాబట్టే ప్రజలు వారిని అనుసరించలేదు.
మనుష్య కుమారుడు ఎటువంటి కాపరి
యేసు ప్రభువు తన పాలన లేక ఏ విధముగా వారిని చూస్తారో చెప్తున్నారు, యేసు ప్రభువు ఈ ప్రజలు నా వారు అని చెబుతున్నారు. నేను వారిని ఎరుగుదును అని అంటున్నారు. వీరు నా వారు అంటున్నారు. ఎందుకంటే తండ్రి వాటిని నాకు ఇచ్చాడు, కానీ పరిసయ్యులు ఆ విధంగా చెప్పలేక పోయారు. కేవలం మేము ఎలా ఉండాలో మాత్రమే చెబుతాము అన్నట్లు ఉన్నారు. ఏమి తెలుసు యేసు ప్రభువుకి ఈ ప్రజల గురించి అంటే మనకు వాక్యం, ఆయనకు అంతా తెలిసే మన కోసం మరణించడానికి సిద్దపడ్డాడు అని చెబుతుంది. నీ సమస్యలు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ తప్పులు తెలుసు, నీ ఒప్పులు తెలుసు, నీవు బయట పెట్టని అన్నీ విషయాలు తెలుసు, నీవు ఆయన నుండి ఏమి దాచి ఉంచలేవు కానీ వానిని బట్టి నిన్ను శిక్షించక, రక్షించడం ఎలానో తెలుసు.
పరిసయ్యులకు నిజముగా తమ ప్రజలు ఎవరో తెలియదు, యేసు ప్రభువు నా ప్రజలు నాకు తెలుసు అని చెబుతున్నారు. యేసు ప్రభువుకు పరిసయ్యులకు ఉన్న తేడా ఏమిటి అంటే అంతకు ముందు ఒక గ్రుడ్డి వానిని స్వస్థ పరిచారు. ఆయనకు ఏమి కావాలో యేసు ప్రభువుకి తెలుసు.
వారు నన్ను అనుసరించును, ఎవరు వానిని నా నుండి అపహరింపలేరు. అని ప్రభువు పలుకుతున్నారు. నిజమైన క్రైస్తవుడు తండ్రి స్వరము తెలుసుకుంటాడు. వారు ఇతరులను అనుసరించరు. ఎలా మనకు తండ్రి స్వరం తెలుసు. ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. నీకు ఆయన ఎటువంటి కాపరి అని తెలుసుకుంటే నీవు ఆయన స్వరమును తెలుసుకోవచ్చు. ఈ రోజు ప్రతిదీ వినుటకు మంచిగా ఉన్నది, దేవుని నుండి అని పలుకుతున్నారు, ఇతరులును ఇబ్బంది పెట్టకుండా, జీవిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇతరులకు మంచి చేయడం, ఇబ్బంది పెట్టకపోవడమేకాదు, తప్పును ఖండిచడం కూడా , సౌలుకు దేవుడు చెబుతున్నారు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? అప్పుడు ఆయన అడుగుతున్నాడు ప్రభూ, నీవు ఎవరు? నీవు హింసించే యేసును. ఆ స్వరమును వినిన సౌలు మారిపోతున్నాడు.
ఎందుకు ఆయన స్వరాన్ని మనం వినాలి? నీవు ఎవరు, ఏమి చేస్తున్నావు,ఏమి చేయాలి అని తెలుసుకోవడానికి నీవు ప్రభువుని స్వరం వినాలి. లేక పోతే నీవు చేసేది మొత్తం మంచిది అని మనం అనుకుంటూవుంటాం. నిజం తెలుసుకోవడానికి నీవు ప్రభూని స్వరం వినాలి.
ఇంకా ఎందుకు మనం ఆయన స్వరం వినాలి? యేసు ప్రభువు చెబుతున్నారు నా గొర్రెలు నా స్వరమును వింటాయి అంటున్నారు, ఆయన స్వరము మనము వినకపోతే ఆయనను మనము తెలుసుకోలేము. నా గొర్రెలు నా స్వరమును వింటూనే వుంటాయి. ఆయన స్వరం వినకపోతే నీకు క్రైస్తవుడవు కాదు. ఆయన స్వరాన్ని వినకపోతే నీకు రోజు వచ్చే సాతాను శోధనలు నీవు జయించలేవు. సాతాను స్వరాన్ని కేవలం మనం ఎదుర్కొనేది తండ్రి స్వరము ద్వారానే. నీవు ఆయన స్వరం వినకపోతే నీవు ఆయనకు చెందిన వాడివి కాదు. ప్రభువు చెబుతున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును అంటున్నారు.
దావీదు సాతనును ఎలా ఎదుర్కొన్నాడు అని కీర్తనలలో వింటాము. కీర్తన 143:2-3 . చాల సార్లు నేను దేవుని వాక్కు మీద ఆదరపడి ఎదుర్కొన్నాను అని దావీదు 5 వ వచనం లో చెబుతున్నాడు. ఆయన స్వరమును నీవు వినకపోతే నీ పాపమును నీవు విడిచి పెట్టవు , ఆయన స్వరమును వినకపోతే నీకు ఆయన వాగ్ధానములు కోల్పోతావు. ఇంకా ప్రభువు వారు నాశనం చెందక జీవింతురు అని చెబుతున్నారు.
ఆయన స్వరమును వింటే ఆయన జీవితాన్ని ఇస్తాడు, నిత్య జీవితాన్ని ఇస్తాడు, అంతే కాదు ఎవరు వారిని నా నుండి తీసుకొని వెళ్లలేరు. అందుకంటే ఆయన లోనే వారికి రక్షణ , ఆశ్రయం ఉంది. ఆయన ఎవరిని ఆయన వద్ద వుండమని బలవంతం చేయలేదు. నీవు నన్ను అనుసరిస్తావా ? నీవు దేనికి బయపడనవసరం లేదు. కనుక ఆ విధంగా జీవిద్దాం.