పేజీలు

31.12.23

తిరు కుటుంబ మహోత్సవం

లూకా 2:22-40 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి.  ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. https://www.daivavaakkudhyaanam.com/2023/12/blog-post_52.html

ఈ రోజు పరిశుద్ద కుటుంబ పండుగను జరుపుకుంటున్నాము. కుటుంబమును చిన్న తిరుసభగా మనం గుర్తిస్తాం. ఈనాటి సువిశేషంలో ఒక కుటుంబం ఎలా ఉన్నట్లయితె దేవుని అనుగ్రహములు మనకు వస్తాయో చూస్తాము. నజరేతు చిన్న కుటుంబంద్వార ఇది మనం చూడగలుగుతాము.  ప్రతి మానవ కుటుంబానికి నజరేతు కుటుంబం ఒక ఆదర్శం.  ఈ పవిత్ర కుటుంబ ఐక్యత, పరస్పర ప్రేమ, మరియు వారి కుటుంబ ధ్యేయం, మన చూసినప్పుడు, ఎలా ఈ కుటుంబం మనకు మాతృక అనే విషయం తెలుస్తుంది. 

పవిత్ర కుటుంబం గురించి మనం తెలుసుకునేముందు, మానవ కుటుంబాలలో ఉండ కూడని కొన్ని లక్షణాలు మనం చూద్దాం. అవ్వ, ఆదాముల కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రభావితం చేయడానికి ప్రయత్నించుచున్నారు. అవ్వ తన  తప్పులో ఆదామును పాలుపంచుకునేలా ఆయనను ప్రభావితం చేసింది. దాని ద్వారా పాపమును లోకములోనికి వారు తీసుకొని వస్తున్నారు. కయ్యాను తన తమ్ముడు మీద అసూయ పొంధుతున్నాడు. అసూయ తోటి హత్య చేస్తున్నాడు. తన తమ్ముడు, దేవుని మెప్పు పొందుటను ఓర్వ లేకపోతున్నాడు. రెబ్కా తన కుమారులకు చూపిన ప్రేమలో ఉన్న వ్యత్యాసం వలన అన్నదమ్ములు విడిపోవవలసివచ్చింది.  తమ తండ్రి చిన్న వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని, ఆ చిన్న వాడినే చంపాలని ఒక ప్రణాళిక ఏసుకుంటున్నారు యాకోబు కుమారులు.  చిన్న వాడి మీద ప్రేమను కూడా ఓర్చుకోలేని భావాలు  మానవునిలో ఉన్నాయి. ,వాయి వరసలు లేని కామం కుటుంబ కీర్తని నాశనం చేస్తుంది. రూబెను అందరికంటే పెద్దవాడు అయినప్పటికీ ఎప్పటికీ ఆ పెద్దరికానికి నోచుకోలేకపోయాడు.  భర్తను అవమానించిన మీకాలు ఎప్పటికీ పిల్లలను కనకుండా ఉండిపోయింది. తండ్రిని అవమానించి, మాట వినని అబ్షలోము మరణాన్ని తెచ్చుకుంటున్నారు. ఇతర కుటుంబాన్ని విచ్ఛిన్న చేసిన దావీదు కుటుంబం చిన్నభిన్నం అవుతుంది. ఒకరి చెడు కోరికలను తీర్చుకోవడానికి ఒకరికొకరు సహకరించుకొవడం, ఒకరిని చేతకాని వారీగా చిత్రీకరిస్తుంది. ఎసెబేలు రాణి అలానే తన భర్తను చేస్తుంది. 

ఇప్పుడు మనం చూసిన ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు ఒకసారి మనం పరిశీలిస్తే అవి ఏమిటి అంటే, నా మాటే వినాలి అనే మనస్తత్వం. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అసూయ ఉండటం, ఒకరి ఉన్నతిని మరియొకరు ఓర్వలేక పోవడం, తల్లి దండ్రులు చూపే ప్రేమలో వ్యత్యాసాలు చూపించడం, తల్లి దండ్రులను అవమానపరచడం, వావివరసలు లేని కామం కలిగి ఉండటం, భర్త భార్యను, భార్య భర్తను అవమానించడం ఇవి అన్ని కూడా పవిత్ర గ్రంధంలో కొన్ని కుటుంబాలు వాటి గొప్పతనం, వారు సాధించిన ఘనతను కోల్పోవడానికి కారణం అయ్యాయి. వారు పొందవలసిన కీర్తిని వారు పొందలేక పోయారు. ఈ సమస్యలు అన్ని ఆనాటి కుటుంబాలలో మాత్రమే కాదు, ఈనాటి కుటుంబాలలలో కూడా ఉన్న సమస్యలే. అంత మాత్రము చేత ఇవి ఏమి  పరిష్కారం లేని సమస్యలు కాదు. ఈ సమస్యలకు సమాధానాలు ఉన్నట్లయితే అవి ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే, యేసుప్రభువు మరియమ్మ, యేసేపుల నజరేతు కుటుంబం. 

ఎందుకు మన కుటుంబాలలో ఉన్న ఈ సమస్యలు, ఆ కుటుంబంలో లేవు, దానికి కారణం ఏమిటి అంటే, ఆ కుటుంబములోని వారు అందరు జీవించే విధానం చాల ప్రత్యేకమైనది.వీరు ఒకరికొరకు ఒకరు జీవించారు. యోసేపు మరియమ్మలు యేసు ప్రభువు కోసం జీవించారు. ఒకరి మీద ఒకరికి వారికున్న ప్రేమ గొప్పది.  మొదటిగా యోసేపుగారు ఈయన దేవుని మీద అచంచలమైన భక్తి కలవాడు. దేవున్ని ఎంతగా నమ్ముతాడు అంటే కలలో దేవదూత కనపడి చెప్పిన ప్రతి విషయాన్ని ఎటువంటి అపనమ్మకం  లేకుండా అన్ని పాటించేవాడు. నీతిమంతుడు అయిన యోసేపు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇతరులకు ఇబ్బంది కలుగకూడదు అని కోరుకునేవాడు, కనుకనే తన భార్య తన ప్రేమేయం లేకుండా గర్బవతి అయ్యింది అని తెలిసిన కాని ఆమెను అవమానింప ఇష్టపడలేదు. ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న  తన కుటుంబాన్ని కాపాడుటకు అన్ని ప్రయత్నాలు చేశాడు. తన కుటుంబాన్ని కాపాడాడు. తండ్రిగా తన ప్రతి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎప్పుడు, ఎటువంటి అలసటను వ్యక్త పరచలేదు. దేవుని ప్రణాళిక నెరవేర్చడమే తన ధ్యేయంగా జీవించాడు. 

మరియమాత జీవితం  ప్రతి కుటుంబానికి ఆదర్శం. తన జీవితం మొత్తం కూడా తన కుమారుని కోసం జీవిస్తున్నారు.  చిన్నప్పటి నుండి వారు బాలయేసుకు కావలసిన ప్రతి దానిని చేకూర్చడమే కాకుండా, బాల యేసును చిన్నప్పటినుండి దేవుని ప్రణాళికకు అనుకూలంగా వారు పెంచుతున్నారు. ఆమె జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఎవరైన ఆపదలో ఉన్నట్లయితే వారిని ఆదుకోవడం. మరియు దేవుని వాక్కును  ధ్యానించడం. వీటితో పాటు దేవుని ప్రణాళిక ప్రకారం జీవిచడం. అందుకే ఈ కుటుంబానికి దేవుడే పునాది. అందుకే వారు అన్ని కష్టాలు పడిన ఆ కుటుంబం కీర్తిని పోగొట్టుకోలేదు, ఇంకా ఎక్కువగా పొందుతుంది. 

వీరిద్దరితోపాటు యేసు ప్రభువు ఆ కుటుంబం  జీవించారు. పవిత్ర గ్రంధంలో ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడని చదువుతున్నాము. ఆయన తన తల్లిదండ్రులకు  విధేయుడుగా జీవించాడు. దా ని ద్వారా , జ్ఞానమందు ప్రాయమందు ఎదిగాడు.ఆయన పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడు.  ఆ కుటుంబం అంతగా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చారు. యోసేపు మరియమ్మల జీవితం మొత్తం యేసు ప్రభువు కొరకే జీవించారు. మన కుటుంబాలలో కూడా దేవున్ని పునాదిగా చేసుకొని మన బిడ్డలకోసం జీవించుదాం 

29.12.23

దేవుని సన్నిదిలో జీవించే వారి జ్ఞానం

 లూకా 2:36-40 

అపుడు అచట అన్నమ్మయనెడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప ఏడు సంవత్సరాలు సంసారము చేసి, ఆ తరువాత ఎనుబదినాలుగు సంవత్సరాలుగా  విధవరాలై దేవాలయముచెంతనే ఉండిపోయను. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. 

ధ్యానం: అన్నమ్మ ఒక ప్రవక్తి , తన జీవితంలో ఎక్కువ సంవత్సరాలు ఆమె విధవరాలుగా, దేవలయంలోనే ఉన్నది. ఆమె ఫనుయేలు కుమార్తె అని చదువుతున్నాము.  అంటే తన భర్త పేరు కాకుండా తండ్రి పేరుతో ఆమెను పరిచయం చేస్తున్నారు అంటే ఆమె భర్త కన్నా ఆమె తండ్రి ఎక్కువ కాలం బ్రతికిఉంటాడు. ఆ రోజులలో యుక్త వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునేవారు కనుక ఆమె 15 సంవత్సరాల ప్రాయంలో పెళ్లి చేసుకొని వుండవచ్చు. ఆమెకు పెళ్లయిన ఏడుసంవత్సరాలకు ఆమె భర్త చనిపోయాడు. అంటే రెండు పదుల వయసులోనే ఆమె విధవరాలుగా మారింది. సుమారు 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నది. అప్పటి నుండి ఆమె దేవాలయంలోనే, దేవునికి సేవ చేస్తూ ఆమె జీవితాన్ని గడుపుతుంది.  ఆమె గురించి చెప్పిన మాటలు చాలా లోతైన భావాలు కలిగియున్నవి. ఆమె ఆషేరు వంశస్తురాలు. ఆషేరు అంటే భాగ్యం, సంతోషం అని అర్ధము. ఆమె పొందిన భాగ్యం ఏమిటి అంటే దేవుని సన్నిదిలో తన జీవితం మొత్తం కూడా గడపటం. అదే విధంగా ఆమె ఫనుయేలు కుమార్తె ఆదిఖాండంలో ఫేనుయేలు అని ప్రదేశం గురించి మనం వింటాము. పెనుయేలు అంటే దేవుని ముఖము అని అర్ధం. పనుయేలు అనే మాట దైవ సాన్నిద్ధ్యం అనే భావం వుంది. ఆ విధముగా ఆమె దేవుని సాన్నిధ్యంలో అనగా దేవాలయంలో తన జీవితాన్ని మొత్తం కూడా గడిపింది. 

ఆమె దేవాలయమును వదలలేదు, అంటే దేవాలయం తెరచినప్పటి నుండి మూసేవరకు దేవలయంలోనే ఉండేది. పాతనిబంధంలో యేస్సీయ్యా రాజుగా ఉండగా   ప్రవక్తీ గా ఉన్న ఉల్దకు దేవాలయంనే ఒక గదిని ఇవ్వడం జరిగినది. అటులనే అన్నమ్మకు కూడా ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఈమె రేయింబవళ్ళు ప్రార్ధన మరియు  ఉపవాసంతో ఆమె దేవున్ని  స్తుతించుచు బ్రతికినది. ఆమె దేవాలయమునకు వచ్చి దేవునికి వందనములు అర్పించి, యెరుషలెము విముక్తి కోసం ఎదురుచూచుచున్న వారికి యేసు ప్రభువు గురించి ఆమె చెప్పసాగిందంటే, ఎప్పుడు దేవాలయ పరిసరాలలోనే ఉండేది.  https://www.daivavaakkudhyaanam.com/2023/12/blog-post_29.html

ఆమె  ఆక్షణముననే దేవాలయమునకు వచ్చి, దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. యెరుషలెము విముక్తికై నిరీక్షించు వారు ఎవరు? ప్రార్ధనలు, ఉపవాసాలు చేస్తూ అనేక మంది మెస్సీయ్యా కొరకు నిరక్షించుచున్నారు. మెస్సీయ్యా రాక కోసం ఆనాటి యిస్రాయేలు ప్రజలు చాలామంది నిరీక్షించుచున్నారు. కొంత మంది ఎడారిలో ఉండి, కొంత మంది సమూహాలుగా ఉండి మెస్సీయ్యా కోసం ప్రార్దన, ఉపవాసంతోటి ఎదురుచూస్తున్నారు. వీరు అందరు పవిత్రతతో  ప్రత్యేక విధంగా మెస్సీయ్యా కోసం సిద్దపడుతున్నారు. సాధారణ ప్రజలు కూడా చాలా మంది మెస్సీయ్యా కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరకి మరియు యెరుషలెము విముక్తి గురించి ఎదురుచూచే వారికి మరియు రక్షణ కొరకు చూచే వారి అందరికీ కూడా అన్నమ్మ యేసు ప్రభువును గురించి చెబుతున్నది. వారి ఎదురుచూపులకు, వారికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా ,  సమాధనముగా దేవుడు ఇచ్చిన సమాధానం ఈ చిన్న బాలుడే అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. 

వారు ప్రభువు అజ్ఞానుసారము అన్ని విధులు  నెరవేర్చి, గలిలీయప్రాంతములోని  తమ పట్టణమగు నజరేతునకు తిరిగివచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై, పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై  ఉండెను. యోసేపు మరియమ్మల విశ్వాస జీవితం ఉన్నతమైనది. వారి జీవితంలో దేవుని ఆజ్ఞలకు ప్రధమ స్థానం వుంది. వారు ఇరువురు కూడా దేవుని చిత్తమును నెరవేర్చడానికి తమ జీవితాలను అంకితం చేసిన వారు. అందుకే వారి విధులను పూర్తిగా నెరవేర్చి తమ పట్టణానికి వెళుతున్నారు.  యేసు ప్రభువు గురించి వారికి తెలిసిన విషయాలు ఎలిశబేతమ్మ, జ్ఞానులు, సిమియోను, అన్నమ్మల నుండి వినినప్పుడు వారికి యేసు ప్రభువు మీద ఇంకా ఎక్కువ మక్కువ కలిగిఉండాలి. యేసు ప్రభువును చిన్నప్పటి నుండి దేవుని యందు, దైవ కార్యములందు నిమగ్నమయేలా వారి జీవితాలు ఉన్నాయి. వీరి పెంపకంలో పెరిగిన యేసు ప్రభువు దృడకాయుడై పరిపూర్ణ  జ్ఞాని అవుతున్నాడు. యేసు ప్రభువు జీవితమే పరిపూర్ణతను పొందుటకు ఆధారము. అటువంటి ప్రభువు పరిపూర్ణ జ్ఞాని అవుట సహజమే. దేవుని అనుగ్రహము ఆయన మీద ఎప్పుడు ఉంటుంది. ఆయనే దేవుడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ సన్నిదిలో ఉన్న అన్నమ్మ అనేక సంవత్సరాలు ప్రార్దనలతో ఉపవాసంతో జీవిస్తున్నారు. మీ సన్నిదిలో నివసించిన వారికి మిమ్ములను తెలుసుకునే భాగ్యమును అనుగ్రహిస్తున్నారు. మిమ్ములను తెలుసుకోవడమే కాకుండా మీగురించి ప్రకటించే అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మేము కూడా ఎల్లప్పుడు మీ సన్నిదిలో నివసించుటకు కావలసిన అనుగ్రహం ఇస్తున్నారు. ప్రభువా! మరియమ్మ యోసేపులు వారి జీవితం మొత్తం మీ చిత్తమును నెరవేర్చడానికి అంకితం చేశారు. ప్రభువా మీ చిత్తము నెరవేర్చుటకు వారు ఎన్నో కష్టాలు అనుభవించిన మీకు దూరంగా ఉండకుండా, మీకు ఎల్లప్పుడు సేవచేయుటకు మీకు దగ్గరగా ఉన్నారు. ప్రభువా మేము కూడా మీ చిత్తం నెరవేర్చుటకు, మా జీవితాలలో మీ పట్ల మేము చేయవలసిన బాధ్యతను నెరవేర్చునట్లు మమ్ము దీవించండి. మీ వలె జ్ఞానమందు ఎదిగే అనుగ్రహం మాకు దయచేయండి. ఆమెన్ 

యేసు ప్రభువును దేవాలయంలో ఆర్పించుట

 లూకా 2: 22-35 

మోషే చట్ట ప్రకారము వారు శుద్దిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలి చూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మ శాస్త్రములో వ్రాయబడియున్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరుషలేమునకు తీసికొనిపోయిరి. చట్టప్రకారము "ఒక జత గువ్వాలనైనను, రెండు పావురముల పిల్లలనైనను" బలిసమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యొరుషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు, దైవభక్తుడు  ఉండెను. అతడు యిస్రాయేలు ఓదార్పుకై  నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుడెను. ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచువరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అపుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచారవిధులు నిర్వర్తించుటకు బాల యేసును లోనికి తీసుకొనిరాగా, సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు."  బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు, తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ తల్లి మరియమ్మతో  ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. 

నిర్గమ ఖాండం 13 వ అధ్యాయంలో తొలిచూలు పుట్టిన కుమారుడు దేవునకి చెందిన వాడు. మొదట పుట్టిన కుమారుడు దేవాలయంలో సేవ చేయాలని నియమం ఉన్నది. కనుక ఆ బిడ్డను దేవునికి అంకితము  చేయడానికి దేవాలయమునకు  తీసుకొని వస్తారు. తరువాత ఆ బిడ్డకు బదులుగా సుమారు 5 తులముల వెండిని చెల్లించి ఆ బిడ్డను తీసుకొని వెల్లవారు సంఖ్యా 3:11-13. కుమారుడు  పుట్టిన తరువాత తల్లిదండ్రులు శుద్దికరణ నిమిత్తమైన లెవీయ ఖాండం 12:3-8  ప్రకారం వారు ఒక గువ్వను కాని దహన బలిగా ఒక గొర్రెను కాని అర్పించవలసినది. పేదవారు, అవి అర్పించలేనివారు రెండు గువ్వలను అర్పించాలి. అందుకే యేసేపు మరియమ్మలు రెండు గువ్వలను అర్పిస్తున్నారు. మరియమ్మ యోసేపులు పేదవారు అయినప్పటికీ దైవ భక్తి యందు వారు గొప్పవారు అందుకే దేవాలయమునకు వచ్చి ఇవి అన్నియు వారు  చేస్తున్నారు. యిస్రాయేలు చట్ట ప్రకారం  40 రోజులకు  శుద్దికరణ జరుగుతుంది.  మరియ మాత  యోసేపులు తమ తొలిచూలు బిడ్డను దేవాలయములో  దేవుని సేవకు అర్పించడానికి తీసుకొని వెళుతున్నారు. వారు దేవలయంలో ఉండగా పవిత్రాత్మ ప్రేరణతో  సిమియోను ప్రవక్త వారిని చూస్తున్నారు. సిమియోనుతో దేవుడు మెస్సీయ్యా గురించి అంతకు ముందుగానే మాటలడాడు. రానున్న మెస్సీయ్యా గురించి సిమియోను ఎదురుచూస్తున్నాడు. యేసు ప్రభువు దేవాలయం లోనికి రాగానే సిమియోను అక్కడకు వస్తున్నాడు.  

సిమియోను జీవితం 

సిమియోను అంటే వినుట అని అర్ధం. సిమియోను దేవుని మాటను విని ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తి. తన జీవితం మొత్తం మెస్సీయ్యా గురించి ఎదురుచూస్తున్న వ్యక్తి.రక్షకుని  చూచి మరణించాలని కోరుకున్న వ్యక్తి. సిమియోను నీతిమంతుడు అనే విషయం దేవుని వాక్కు ద్వారా తెలుస్తుంది. నీతిమంతుడు అంటే దేవుని చట్టమును తప్పక పాటించేవాడు. యోసేపును కూడా పవిత్ర గ్రంధం నీతిమంతుడు అని చెబుతుంది. యేసు ప్రభువును చూచి తండ్రితో తనను ఇక నిష్క్రమింపమనీ చెబుతున్నాడు. తాను చూడాలనుకున్న రక్షకుని చూసి తృప్తి పొందుతున్నాడు. 

దేవాలయములోనికి తీసుకొని వచ్చిన యేసు ప్రభువును  సిమియోను తన   హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధనముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు; నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు." యేసు ప్రభువు గురించి సిమియోను మాటలాడిన మాటలు ముఖ్యముగా "దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ"  అనే ఈ మాట చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు అందరికీ రక్షకుడు. యేసు ప్రభువు చేసిన పనులు చూసి ఈ మాట సిమియోను అనుట లేదు. పవిత్రాత్మ ప్రేరణతో బాల  యేసును తన చేతులలోనికి తీసుకొని అంటున్నాడు.  ప్రభువు అన్యులకు వెలుగుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే వారు వెలుగును చూస్తారు. వెలుగును చూచుట అంటే వారి జీవితమును తెలుసుకోవడం.  ఎటువంటి జీవితం జీవిస్తున్నది తెలుసుకోవడం. యేసు ప్రభువు వద్దకు వచ్చుట ద్వారా మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకుంటాము. యేసు ప్రభువు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు ఎందుకంటే దేవునికి దూరముగా ఉండి వారి మహిమను కోల్పోయారు, యేసు ప్రభువు ద్వారా యిస్రాయేలు మరల మహిమను పొందుతుంది. 

ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడియున్నాడు. అనేకుల మనోగతభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొనిపోనున్నది. యేసు ప్రభువు గురించి సిమియోను పలికిన ఈ మాటలు మొత్తం కూడా వేరుతున్నాయి. ఆయన అనేకుల ఉద్దరింపునకు కారణం అయివున్నాడు. ఆయనను అందరు అంగీకరించలేదు. అనేకుల మనోగతలను ఆయన బయలుపరిచాడు. ఎవరు ఎటువంటి వారు అనే విషయాలు ప్రభువు తెలియజేస్తున్నాడు. అంతేకాక అనేక గొప్ప కార్యలు చేసిన ప్రభువును తన తల్లి అందరు విడచివెళ్ళడం చూస్తుంది. సిలువ వేయడం, ఈటెతో పొడవడం, మరణించిడం చూస్తుంది. అందుకే నీ హృదయము నందు ఒక ఖడ్గం దూసుకొనిపోతుంది అని సిమియోను  చెబుతున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మిమ్ములను దేవాలయంలో మిమ్ము అంకితం చేసినప్పుడు సిమియోను ప్రవక్త మీ నిజ రూపాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఈ లోక రక్షణ అని మేము తెలుసుకుంటున్నాము. మీఋ అన్యులకు వెలుగు అని తెలుసుకుంటున్నాము. మీరు వెలుగు అని  మాకు మార్గదర్శి అని తెలుసుకొని వెళ్లప్పుడు మీ దగ్గర వుండి మీ వెలుగులో మమ్ములను మేము తెలుసుకొని, ఎప్పుడు ఆ వెలుగులో జీవించేలా చేయండి. ప్రభువా అనేక మంది ప్రజలు  ఉన్నప్పటికీ సిమియోనికి మాత్రమె  మిమ్ములను చూచి మీరే రక్షకుడు అని ప్రకటిస్తున్నారు. ఆయన భక్తి, నీతిమంతమైన జీవితం, పవిత్రాత్మ ప్రేరణ మిమ్ములను మీరు రక్షకుడు అని తెలుసుకొనుటకు ఉపయోగపడుతున్నవి. ప్రభువా ! మేము కూడా భక్తి వంతమైన జీవితం , నీతివంతమైన జీవితం జీవించేలా మీ అనుగ్రహం దయచెయండి. సిమియోను వలె మాకు కూడా మీ పవిత్రాత్మ అనుగ్రహాలు దయచేయండి. ఆమెన్. 

28.12.23

హెరోదు పదవి కాంక్ష - పసిబిడ్డల హత్యలు

 మత్తయి 2:13-18 

వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత  యోసేపునకు కలలో కనిపించి, "శిశువును చంపుటకు హెరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని  ఆదేశించెను. అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ఆ జ్ఞానులు  తనను మోసగించిరని హెరోదు భావించి మండిపడెను. కనుక జ్ఞానులు తెలిపిన కాలమును బట్టి బెత్లెహామందును, ఆ పరిసరములందును ఉన్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువులందరిని చంపుడని అతను ఆజ్ఞాపించెను.  

ధ్యానము: "ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువునకు చంపుటకు హెరోదు వేదకబోవుచున్నాడు" అని చెప్పాడు.  ఎందుకు హెరోదు యేసు ప్రభువును చంపుటకు  వేదకబోవుచున్నాడు? హెరోదు రాజుతొ  తూర్పునుండి వచ్చిన జ్ఞానులు, యూదుల రాజుగా  పుట్టిన శిశువు నక్షత్రం  చూచి, ఆయనను మేము  ఆరాధించుటకు వచ్చాము, ఆయన ఎక్కడ జన్మించారు అని  వారు  అడిగారు. హెరోదు రాజు తన అధికార వ్యామోహం కలిగినవాడు. తన సొంత కుమారులను కూడా అధికారం కోసం చంపించినవాడు, అందుకే ఆరోజులలో హెరోదు కుమారునిగా కంటే హెరోదు దొడ్డిలో పందిగా పుట్టటం మేలు అనే నానుడి ఉండేది.  తన అధికారమునకు అడ్డుగా ఎవరు వచ్చిన, దానిని సహించని వ్యక్తి హెరోదు. మరియొక రాజు పుట్టాడు అని తెలువగానే ఆ శిశువును, ఎలా అయిన చంపాలి అనే ఆలోచన హెరోదుకు వస్తుంది. మనుషుల అంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు హెరోదు చేయబోయే ఘోరాన్ని యోసేపుకు తెలియజేసాడు.

 "నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పు వరకు అచటనేయుండుము" అని యోసేపును దేవదూత   ఆదేశించెను. "అంతట యేసేపులేచి, ఆ బిడ్డను, తల్లిని తీసుకొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్ళి, హెరోదు మరణించునంత వరకు అచటనే  ఉండెను. " ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని" అని ప్రవక్త ద్వారా ప్రభువు పలికిన ప్రవచనము నెరవేరుటకు అట్లు జరిగెను. ప్రభువు దూత చెప్పినట్లుగా యోసేపు మరియమ్మను, బాల యేసును తీసుకొని ఐగుప్తుకు వెళుతున్నారు.  హెరోదు మరణించినంతవరకు పవిత్ర కుటుంబం  ఐగుప్తు లోనే ఉంటుంది.  ఈ ఇద్దరు కూడా తమ బిడ్డ కోసము పడిన కష్టం చాలా గొప్పది. వీరు ఇద్దరు కూడా తమ కుమారుని కొరకు జీవిస్తున్నారు. మనతో పాటు ఉన్న వారు అపాయములో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో వీరు చెబుతున్నారు. దేవుడు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళమని చెబుతున్నారు? కారణం ఏమి అయి ఉండవచ్చు అంటే, ఐగుప్తు  హెరోదు పరిదిలో లేదు,  అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు. మరల  హొషయ ప్రవక్త చెబుతున్నట్లుగా నేను నా కుమారున్నీ ఐగుప్తు నుండి పిలిచాను అనే ప్రవచనం వెరవేరుతుంది. 

యేసు ప్రభువును హెరోదు చంపించలేకపోయాడు. కాని తన అధికారమునకు ఎవరు ఆటంకంగా ఉండకూడదు అనుకునే హెరోదు, ఆ శిశువును ఎలాగైన చంపాలి అని బేత్లెహేము మరియు ఆ పరిసర ప్రాంతములో ఉన్న రెండేండ్లు మరియు అంతకంటే తక్కువ వయసు ఉన్న చిన్న బిడ్డలను చంపిస్తున్నాడు. ఎవరు ఈ చిన్న బిడ్డలు ? ఈ చిన్న బిడ్డలు అందరు కూడా ఎవరు కాపాడుటకు లేనివారు, ఏ మాలిన్యం లేని వారు. పవిత్రంగా ఉన్నవారు. యోసేపు, మరియమ్మ లాంటి వారు తోడు లేని వారు.

 అంతమంది చిన్న బిడ్డలను హెరోదు చంపనవసరం లేదు. కాని పదవి వ్యామోహం, అధికార దాహం అనేవి  మనలను ఎటువంటి హత్యలను, ఘోరాలను కూడా చేయుటకు ప్రేరేపిస్తుంది. వివేకము కోల్పోయేవిధంగా చేస్తుంది. ఆ చిన్న బిడ్డలు పెరిగి, అధికారానికి  రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంత కాలం హెరోదు బ్రతకడు అనే విషయం కూడా ఆలోచించలేక పోయాడు. మన ఆలోచనలను కూడా అధికారం వ్యామోహం చంపివేస్తుంది. 

 "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహారోదనము. రాహెలు తన బిడ్డలకొరకై విలపించుచుండెను. వారి మరణము వలన కలిగిన దుఃఖము నుండి ఆమె ఓదార్పు పొందకుండెను" అని యిర్మీయా ప్రవక్త పలికిన వాక్కు నెరవేరెను." ఎందుకు రాహెలు ఏడుస్తుంది అంటే,  రాయహేలును యాకోబు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. తన అక్కకు పిల్లలు పుట్టారు. పిల్లలు లేరు అనే బాధను ఆమె చాలా ఎక్కువగా పొందింది. పిల్లల కోసం చాల ఆశ పడింది.  ఆమె చనిపోయిన తరువాత రామా వద్ద సమాది చేశారు. ఇంత మంది చిన్న బిడ్డలను చంపినప్పుడు ఆ తల్లి బిడ్డలకోసము విలపిస్తుంది.ఆమెనుఓదార్చుటఅలవికానటువంటిది. https://www.daivavaakkudhyaanam.com/2023/06/blog-post.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా!  మీరు జన్మించినప్పుడు ఎంతో ఆనందపడిన యోసేపు, మరియ తల్లి మిమ్ములను అధికార దాహం, పదవి కాంక్ష కలిగిన వారి నుండి కాపాడుటకు ఎంతో కష్టపడ్డారు. మీరు మీ పరిచర్య మొదలు పెట్టిన తరువాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వారు, మిమ్ములను అనేక విధాలుగా కష్ట పెట్టుటకు ప్రయత్నించారు. ప్రభువా! మేము కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పదవి, అధికారం వంటి కోరికలకు, ఆశలకు లోనవుతాము. అటువంటి సమయాలలో నిజమైన జ్ఞానంతో ప్రవర్తిస్తూ, మిమ్ములను అనుసరించెలా చేయండి. యోసేపు మరియతల్లి మిమ్ములను కాపాడినట్లు  ఇటువంటి అపాయములకు లోనయె వారికి సహాయం చేసేలా మమ్ము దీవించండి. చనిపోయిన చిన్న బిడ్డలలో, వారి ఆలోచనలలోకాని, మాటల్లో కాని, పనులలో కాని ఎటువంటి చెడు లేకుండా, నిర్మలముగా ఉన్నారో అటువంటి మనసును మాకు దయచేయండి. అటువంటి బిడ్డలను రక్షించు అవకాశము మాకు అనుగ్రహించండి. ఆమెన్ 

27.12.23

సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు

 యోహాను 20: 2-8 

అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన  మరియొక  శిష్యుని  యొద్దకు పరుగెత్తుకొని పోయి,  "వారు ప్రభువును  సమాధినుండి  ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి,  సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను

ధ్యానం:  ఈ రోజు సువార్తకారుడు పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నాము. ఈ పునీతుని గొప్పతనం, యోహాను సువార్తను చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సువార్తను నలుగరు సువిశేషకారులు రాసినప్పటికి యోహాను సువిశేషం ఒక ప్రత్యేకత కలిగిఉన్నాది. యోహాను గారు యేసు ప్రభువు శిష్యులలో ఒకరుగా ఉన్నారు. ప్రతి సువిశేషమునకు ఒక గుర్తు ఉన్నది. యోహాను సువిషమునకు ఉన్న గ్రద్ద గుర్తుగా ఉన్నది. ఎందుకు గ్రద్ద గుర్తుగా ఉన్నది అని ఒక సారి మనం పరిశీలించినట్లయితే, ఒక విషయం మనకు తెలుస్తుంది. అది గ్రద్ద ఆకాశంలో ఎక్కడో విహరిస్తున్నప్పటికి భూమిమీద ఉన్న కీటకాన్ని కాని లేక అది ఏమి పట్టుకోవాలనుకున్నదో దానిని ఖచ్ఛితముగా ఎటువంటి పొరపాటు లేకుండా అది దానిని పట్టుకోగలదు. గ్రద్దకు ఖచ్చితమైన గురి ఉన్నది. యోహాను  సువిశేషంలో మొదటి నుండి యేసు ప్రభువు దేవుడు అనే విషయమును వెల్లడి చెస్తున్నారు. మిగిలిన సువిశేష కారులు యేసు ప్రభువు పుట్టుకతోటి, లేక ఆయన జ్ఞానస్నానంతో మొదలు పెడుతున్నారు. కాని యోహాను మాత్రం తన సువిశేషాన్ని యేసు ప్రభువు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడని మరియు ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి చెబుతున్నారు. 

యోహాను సువిశేషం, ఎందుకు యోహాను ఈ సువిశేషాన్ని రాశారో తెలియజేస్తుంది.   యోహాను మూడు సార్లు తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సువిశేష మొదటిలో , మధ్యలో మరియు చివరిలో ఎందుకు ఆయన సువిశేషం రాసినది తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ ఉద్దేశ్యం అంటే, యేసు ప్రభువును అందరు విశ్వసించాలి, ఆయనను విశ్వాసించిన వారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని తెలియజేయడమే ఈ సువిశేష ఉద్దేశ్యం. ఈ సువిశేషం రెండు భాగాలుగా చేసిన మొదటి భాగం 7 అద్భుతాలు యేసు ప్రభువు చేస్తున్నారు. ఈ ఏడు అద్భుతాలు కూడా దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు. ఎంతటి గొప్ప వారు అయినప్పటికీ  దేవుడు కాకపోతే ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసు ప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి తెలియజేస్తున్నాడు.  అవి ఏమిటి అంటే, యేసు ప్రభువు జీవ జలం, యేసు ప్రభువే జగజ్యోతి, యేసు ప్రభువే జీవహారం. యేసు ప్రభువే జీవ వాక్కు.యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము.  ఈ సువిశేష రెండవ భాగాన్ని మహిమ పుస్తకం అంటారు. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి పవిత్రాత్మలతో కలసి ఉన్నది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా తెలుసుకుంటాము. శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం నేర్చుకుంటాము. 

ఎవరు ఈ యోహాను? యేసు ప్రభువు శిష్యులలో ఒకడు. జబదాయి కుమారుడు. ఈయన కడరా భోజన సమయమున యేసు ప్రభువు హృదయమునకు దగ్గరగా ఉన్నాడు. ఆయన  యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుక దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని విషయాలను వివరిస్తున్నారు. హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు ప్రేమించబడ్డాడు. అంతేకాదు శిష్యులు అందరు యేసు ప్రభువును బంధించినప్పుడు వెళ్ళి పోయినను ఈ శిష్యుడు మాత్రము ఆయనను ఎవరికి తెలియకుండా అనుసరిస్తున్నాడు. సిలువ క్రింద మరియమాతతో పాటు ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగించాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు  దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు  దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్. 

25.12.23

పునీత స్తేఫాను

పునీత స్తేఫాను 


స్తేఫాను అంటే కిరీటం అని అర్ధం. ఈయన అపోస్తులులు ఎన్నుకొన్న ఏడుగురు డీకనులలో ఒకరు. డీకనుగా స్తెఫాను అక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయుటకు ఎన్నుకొనబడ్డాడు. స్తెఫాను జ్ఞానము కలిగి, పవిత్రాత్మతో నింపబడి, మంచి ప్రవర్తన కలవాడిగా అందరికీ తెలిసిన వ్యక్తి.  తన జ్ఞానం ద్వార దేవుని గురించి బోధించి, హింసించబడి చంపబడ్డాడు.  ఈయన భోదన యూదులను కోపమునకు గురిచేసింది. యూదులు ఆయన మీద చూపిన క్రోదాన్ని, ఆయనకు కీర్తిని తీసుకువచ్చేలా చేశాడు. 

స్తేఫాను విశ్వాసం చాలా గొప్పది. ఆయన యూదుల చేత హింసించబడుతున్న అటువంటి అపనమ్మకం లేకుండా దేవుని  ఘనతను గురించి వారికి బోధించాడు.   ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుని గురించి వివరిస్తూ ఎలా యూదులు తప్పుగా ఆలోచిస్తున్నారో వారికి తెలియజేయడంలో పూర్తిగా సఫలికృతం అయ్యారు. కాని ఆయనను వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు. యేసు ప్రభువు బోధనలు ఈయన పాటించిన తీరు అందరు నేర్చుకోవాలి. తనను చంపుతున్న వారి కొరకు ప్రార్ధిస్తూ, ఆ పాపాన్ని వారి మీద వేయకండి అని వేడుకున్నాడు. మరణించే ముందు దేవుని ఇంత కష్టానికి గురిచేశాడని నిందించక, దేవునికి తన ఆత్మను అప్పగించాడు. 

స్తెఫానును బంధించుట 

స్తేఫాను దైవనుగ్రహం, శక్తి కలిగినవాడై గొప్ప అద్భుతములు, సూచక క్రియలు చేసెడివాడు. కొంత మంది స్తెఫానుతో వాదించెవారు. అతను చూపిన జ్ఞానమును,  ఆత్మతో  ప్రేరేపించబడి వాదించుటను  వారు ఎదుర్కోలేకపోయారు. ఆయనను ఎలా అయిన శిక్షించాలి అని వారు  పన్నాగం పన్నారు. అబద్ద సాక్ష్యం చెప్పుటకు కొందరిన కూర్చుకొని వారిచేత స్తెఫాను మోషేమీద దేవుని మీద దూషణ వాక్యాలు పలికినట్లుగా చెప్పుటకు కొందరిని కుదుర్చుకున్నారు. స్తెఫానుకు వ్యతిరేకముగా ప్రజలను, పెద్దలను ధర్మ శాస్త్రబోధకులను వారు స్తెఫానుకు వ్యతిరేకముగా పురికోల్పోరు. వారు స్తెఫానును బంధించి న్యాయసభ ఎదుటకు  తీసుకొని వచ్చారు. వారు తీసుకొనివచ్చిన అబద్దసాక్షులు స్తెఫాను పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాటలాడుచున్నాడాని, యేసు దేవాలయమును కూల గోడుతాడని, మోషే నుండి వచ్చిన  పారంపర్యమును   మార్పుచేస్తాడని చెబుతున్నాడని, వారు న్యాయ సభముందు చెప్పారు. అది వినిన వారు స్తెఫాను వైపు చూడగా ఆయన ముఖం వారికి దేవదూత వలె కనిపించినది. ఆయన పవిత్రత అది వారికి గుర్తు చేస్తుంది. ఆయన ముఖంలో  భయం, అందోళన వంటికి కాకుండా ప్రశాంతత, దేవదూతలా  కనబడుటకు కారణం ఏమిటి అంటే ఆయనకు దేవుని మీద ఉన్న ప్రేమ, దేవునికి తన జీవితమును అర్పించిన విధానం, ఆత్మతో నింపబడిఉండటం, విశ్వాసంతో నిండి ఉండటం వలన ఆయన  అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన తన ప్రశాంతతను కోల్పోకుండా ఉన్నాడు. 

స్తెఫాను వాదన 
ప్రధానార్చకుడు స్తెఫానును వారు చెప్పేది నిజమేనా? అని అడిగాడు అందుకు స్తెఫాను వారితో తన వాదనను ఇలా వినిపించాడు. మహిమగల దేవుడు మనం పూర్వీకుడగు అబ్రహాముకు కనపడి నీవు నీ దేశమును, నీ బంధువులను వీడి నేను చూపింపబోవు దేశమునకు వెళ్ళమని చెప్పగా ఆయన అట్లే చేశాడు, దేవుడు అబ్రహామునకు సొంత భూమిగా ఒక అడుగైనను ఇవ్వలేదు. కాని ఆయన సంతానానికి ఇస్తాను అని వాగ్ధానం చేశాడు. అలానే నీ సంతతి వారు 400 సంవత్సరాలు విదేశములో బానిసలుగా బాదలకు గురవుతారని, వారిని బాధలకు గురిచేసిన వారిని  తీర్పుకు గురిచేస్తాను అని చెప్పాడు. అటుల అబ్రహాము నుండి మోషే వరకు, ఎలా దేవుడు వీరికి తోడై ఉన్నది చెప్పాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ ఎలా వారు దేవుని మాటలను వీడి జీవించినది కూడా వారికి తెలియజేశాడు. ఎలా వారు మోషేను దేవుడు పంపిన కాని తనని నాయకునిగా గౌరవించకుండా ఉన్నది వారికి తెలియజేశాడు.  మోషే నుండి దేవాలయం కట్టినప్పటి వరకు చెప్పి, ఎలా దైవ సమక్షము  గుడారములో ఉన్న విషయం చెప్పి, ప్రవక్త మాటలను వారికి చెబుతూ ఆకాశము దేవుని సింహాసనమని భూమి ఆయన పాదపీఠమని, సమస్తము దేవునిది అని చెప్పి దేవుని సందేశమును తిరస్కరించి, వారు హృదయమందు, చెవులయందు సున్నతి లేని వారి వలె ఉన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. వారి పూర్వుల వలె పవిత్రాత్మను ఎదురించుచున్న విషయాన్ని వారికి తెలియజేశాడు. ఎలా వారు ప్రవక్తలను హింసించింది వారికి చెప్పాడు.
 
ఆలయము యొక ప్రాముఖ్యత - పెద్దలకు, న్యాయ సభకు ఆలయం గొప్పది. వారి జీవితం మొత్తం దాని మీదనే ఆదరపడి ఉన్నది. కాని ఆ కట్టడానికి కాదు ప్రాముఖ్యత దానిలో ఉన్న దేవునిది. ఎందుకంటే దైవ సమక్షము ఆ కట్టడములో ఉన్నది. ఈ ఆలయమును కట్టకమునుపు వారికి దైవ సమక్షపు గూడారము ఉండేది. దావీదు కాలము వరకు ఈ దైవ సమక్షపు గుడారము ఉన్నది. అప్పుడు దావీదు ఒక దేవాలయము కట్టుటకు దేవుని అనుమతి అడిగాడు కాని సోలోమోనే దానిని కట్టించాడు. దేవునికి ఈ ఆలయము మాత్రమే ముఖ్యం ఆనుకొనుట సమంజసము కాదు. ఈ విషయములను వారికి వివరిస్తూ, వారి పితరులు ఎలా ఈ విషయములను చెప్పిన ప్రవక్తలను హింసించిన విషయం వారితో చెబుతూ వీరు కూడా పవిత్రాత్మను ఎదురించుచున్నారని, మెస్సీయ్యాను గురించి చెప్పిన, చూపిన వారిని చంపివేశారు అని , మరియు యేసు ప్రభువును వారు శత్రువులకుఅప్పగించిన విషయం చెప్పి, దేవదూతల ద్వారా పొందిన చట్టమును వారే పాటించుటలేదు అని వారి తప్పును బయట పెట్టడం జరిగింది. 

స్తెఫానుపై రాళ్ళ వర్షం 

ఆ న్యాయ సభలోని వారు వారందరు ఆయన మాటలకు కోపముతో మండిపడ్డారు. స్తెఫాను పవిత్రాత్మతో నిండి, పరలోకం వైపు చూడగా ఆయనకు దేవుని మహిమ ఆయన కూడప్రక్కన యేసు ప్రభువు నిలబడి ఉండటం చూశాడు. ఆ విషయం వారికి తెలియజేస్తుండగా వారు కేకలు వేస్తూ, చెవులు మూసుకొన్నారు. అందరు ముకుమ్మడిగా విరుచుకుపడి, నగరము బయటకు తీసుకుపోయి రాళ్ళతో కొట్టారు. వారు రాళ్ళతో కొట్టుచుండగా స్తెఫాను "యేసు ప్రభూ! నా ఆత్మను గైకొనుము" అని ప్రార్ధించాడు. తరువాత మోకరిల్లి "ప్రభూ ! ఈ పాపము  వీరిపై  మోపకుము" అని మరణించాడు. 

20.12.23

లూకా 1:39-45

లూకా 1:39-45

ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను. ఆమె జెకర్యా ఇంటిలో  ప్రవేశించి ఎలిశబేతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిశబేతమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిశబేతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు!" 

ధ్యానము: ఆ దినములలో మరియమ్మ   యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు  త్వరితముగా  ప్రయానమైపోయెను.  గాబ్రియేలు దేవదూత, ఎలిశబేతమ్మ గర్భము ధరించినదని చెప్పిన మాటలను విశ్వసించి, ఎలిశబేతమ్మను చూచి ఆమెకు తోడుగా ఉండుటకు, మరియమాత అక్కడకు వెళుతుంది. మరియమాత చేసిన ఈ ప్రయాణం చాలా కష్టమైనది. ఆమె నజరేతు నుండి ఒక పర్వత ప్రాంతం వైపు వెళుతుంది. ఈ ప్రయాణం, మరియమాత మరియు యోసేపులు జనాభా లెక్కలకు వెళ్లినంతటి కష్టమైనటువంటిది. ఎందుకంటే ఆమె పర్వతప్రాతంవైపు వెళ్ళాలి. అది ఒక రోజు కంటే ఎక్కువ ప్రయాణమే.  ఆ రోజులలోఅటువంటి  ప్రాతమునకు ఆ ప్రయాణం ఒక సాహసం లాంటిదే. ఎందుకు మరియమాత అటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే ఎలిశబేతమ్మ గర్భవతి అయిన విషయం అప్పటికి మరియమాతకు, జెకర్యాకు మాత్రమే తెలుసు. ఎలిశబేతమ్మ వారి చుట్టము, వయసు మళ్లిన వ్యక్తి. గర్భవతిగా ఉన్న ఆమెకు సహయం చేయుటకు వెళుతుంది. మరియమాత అవసరంలో ఉన్నవారిని ఆదుకోనుటకు ఎటువంటి కష్టము అయిన భరిస్తుంది. మరియమాతలో ఉన్న ఈ సుగుణం మనం ఇతర సమయాలలో కూడా చూస్తాము. కానా అనే ఊరిలో పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి సహాయం చేయుటకు ప్రభువుకు విన్నవిస్తుంది. శిష్యులందరు యూదుల భయంతో పై గదిలో ఉన్నప్పుడు వారితో కలిసి, వారికోసం ప్రార్ధన చేస్తుంది.  

మరియమాత మరియు ఎలిశబేతమ్మ మధ్య సంభాషణ ఇక్కడ యేసు ప్రభువు ఎవరు అనే విషయం తెలియజేస్తుంది. ఇక్కడ బాప్తిస్మ యోహను యేసు ప్రభువు సాన్నిధ్యాన్ని గాంచి ఎంత ఆనందించాడో మనకు తెలుస్తుంది. యోహాను తన తల్లి గర్భమున ఉండి కూడా, యేసు ప్రభువును గుర్తిస్తున్నాడు. గాబ్రియేలు దేవ దూత చెప్పినట్లుగా ఆయన తన తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మతో నింపబడ్డాడు. అందుకే ఆయన తల్లి గర్భమున ఉన్న గాని, యేసు ప్రభువును గుర్తించగలుగుతున్నాడు. గుర్తించడమే కాదు, యేసు ప్రభువు సాన్నిధ్యం ఎంత మధురమైనది అనె అనుభూతిని అనుభవించి  తల్లి గర్భములో ఉండి గంతులు వేయడం వలన తెలియజేస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా,  యేసు ప్రభువును గురించి తెలియ చేస్తుంది. ఆయన ప్రభువు అని గుర్తిస్తుంది. 

"స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను"  మరియ మాత స్త్రీలందరిలో ఆశీర్వదించబడినదని, ఆమెను గురించి ఎలిశబేతమ్మ పవిత్రాత్మ ప్రేరణతో చెబుతున్నది. మనలో ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. మరియమాతను ఎందుకు అంతా గొప్పగా ఆశీర్వదించారంటే, ఆమె దేవుని చిత్తమునకు తన జీవితాన్ని అంకితం చేసిన విధానం అంత గొప్పది. అందుకే తన కుమారున్నీ ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకువస్తున్నాడు. ఎలిశబేతమ్మకూడా దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఆమెకు ప్రభువును ఇతరులకు తెలియజేసే, ప్రభువును గుర్తుపట్టకలిగే, ఆయన సాన్నిధ్య మాధుర్యాన్ని అనుభవించ కలిగే కుమారున్నీ ఇస్తున్నాడు. ఆమెకు ఉన్న పేరును పోగొడుతున్నారు. వీరి ఇద్దరి కలయిక దేవుని శక్తిని శంకించని ఇద్దరి కలయిక. ఇక్కడ పరమ పవిత్రుడైన దేవుని సాన్నిధ్యాన్ని, పాప కళంకం లేని యోహాను ఆనందిస్తున్నాడు. 

ఎలిశబేతమ్మ ఒక ప్రవక్త వలె  పవిత్రాత్మతో ప్రేరేపించబడి, మరియమాత గర్భముతో ఉన్నానని చెప్పకపోయిన కాని మరియమాత గురించి నా ప్రభువుని తల్లి నా దగ్గరకు రావడం నాకు ఎలా ప్రాప్తించేను అని చెబుతుంది. ఆమె రావడం తనకు దేవుని అనుగ్రహంగా ఆమె చెబుతుంది. మరియమాత మరియు ఆమె గర్భ ఫలమగు యేసు ప్రభువును ఆశీర్వదింపబడినవారు అని చెబుతుంది. మరియమాత గర్భమున ఉన్న శిశువు తన ప్రభువు అని చెప్పడం వలన ఎలిశబేతమ్మ పవిత్రత కూడా మనకు తెలుస్తుంది.   మరియమాత  దేవుని కుమారుని తన గర్భమున మోసినందుకు మాత్రమే ధన్యురాలు కాదు, ఎలిశబేతమ్మ చెప్పిన విధముగా ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మినందుకు ఆమె ధన్యురాలు. ఎందరో గొప్పవారు కొన్ని దేవుని నుండి వచ్చిన ప్రవచనములను నమ్ముట లేదు. కాని దేవునికి వ్యతిరేకముగా మాటలాడకుండా వుండవచ్చు. కాని మరియమాత  ఒక సాధారణ యువతి దేవుని నుండి వచ్చిన ప్రతి మాట  నెరవేరుతుంది అని నమ్ముతుంది.  గాబ్రియేలు దూత ఎలిశబేతమ్మ గర్భం గురించి చెప్పగానే ఆమెకు సపర్యాలు చేయడానికి వెళుతుంది. మరియమాత విశ్వాసులందరికి తల్లి. ఎలా దేవుని విశ్వాసించాలో ఆమెను చూసి నేర్చుకోవాలి. దేవుని మీద ఆమె వలె నమ్మకం కలిగిఉండాలి. https://www.daivavaakkudhyaanam.com/2023/12/126-38.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా! మీ ప్రేమ ఎంత ఉన్నతము. మీ ప్రణాళికకు తన జీవితమును అంకితం చేసిన మరియమాతను ఎంతో మిన్నగా ఆశీర్వదించారు. మీరు చెప్పిన ప్రతి మాట జరుగుతుంది అని నమ్మిన మరియమాత జీవితం మాకు ఆదర్శం. మేము కూడా మీ ప్రణాళికకు మా జీవితాలను అంకితం చేసేలా చేయండి. మరియ మాతను ఆశీర్వదించిన విధముగా మమ్ము కూడా ఆశీర్వదించండి. ప్రభువా! మీ  సాన్నిధ్యాన్ని యోహాను ఎంతగానో ఆనందిస్తున్నాడు. మీ పవిత్రతను యోహాను తెలుసుకున్నట్లు మేము కూడా పవిత్రత కలిగి మీ సాన్నిధ్యా మాధుర్యం అనుభవంచే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుగ్రహాలు, ఆశీర్వాదాలు తెలుసుకొని వాటిని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలా మమ్ము దీవించండి. ప్రభువా! మరియమాత వలె మీ యడల ఎప్పటికీ సన్నగిళ్ళని విశ్వాసాన్ని ఇవ్వండి.   ఆమెన్. 


19.12.23

లూకా 1:26-38

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన  కన్యక యొద్దకు  పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు"అనెను. మరియమ్మ ఆ పలుకులకు  కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవ దూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని  అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవుని కుమారుడు' అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినదిగదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవమాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును  లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట ఆ దూత వెళ్ళి పోయెను

ధ్యానము:   పవిత్ర గ్రంధంలో గాబ్రియేలు దేవదూత, జెకర్యా, మరియమ్మ మరియు పాత నిబంధనలో దానియేలుకు దర్శనం ఇస్తున్నాడు. ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారీ ఒక ముఖ్యమైన సందేశమును తీసుకొని వస్తున్నాడు. ఈ సువిశేషభాగంలో నజరేతునగరంలో ఉన్న మరియమాత వద్దకు వస్తుంది. నజరేతు ఒక వ్యాపార నగరం, రోమా సామ్రాజ్యం నుండి వర్తకానికి అనుకూలంగా ఉండే   నగరం.  ఇది మరియమ్మ, యోసేపుల నగరం. అక్కడ మరియ తల్లికి దేవదూత దర్శనం ఇస్తున్నాడు. మరియమ్మ కన్య మరియు యవనప్రాయంలో  ఉన్నది, పెళ్లి కాలేదు. నిశ్చితార్ధం జరిగినది.  దేవుడు ఒక గొప్ప కార్యనికి ఆమెను ఉపయోగించుకొనుటకు, ఆమెలో వున్న ప్రత్యేకత ఏమిటో ఆమె దేవదూతతో మాటలాడిన మాటలు తెలియజేస్తాయి. ఆమెకు ఉన్న పేదరికం, చిన్న వయస్సు ఇవి అన్ని కూడా దేవుని కార్యములో పాలుపంచుకొనుటకు ఆటంకం కాలేదు. దానికి ఆమె వ్యక్తిత్వం ఎంతగానో ఉపయోగపడింది. దేవున్ని మనం విశ్వసిస్తె మనకు ఉన్న బలహీనతలు ఏమి కూడ, దేవుని అనుగ్రహం పొందుటకు ఆటంకం కావు అని తెలుస్తున్నది. దేవుని అనుగ్రహం మనకు వెంటనే కీర్తిని తీసుకురాకపోవచ్చు. మరియమాత దేవునికి ఇచ్చిన మాట ఆమెకు వెంటనే కీర్తిని తీసుకురాలేదు. ఆమెకు అవమానాలు, తిరస్కారాలు కూడా తీసుకువచ్చింది. దేవుని ప్రణాళికకు ఆమే సహకారం, దేవునికి ఆమె విధేయత, దేవుని చిత్తమె ఆమె జీవితంలో జరగాలి అనే ఆమె కోరిక అన్ని కూడా ఆమె గొప్ప తనాన్ని చాటుతున్నవి. నేను దేవుని దాసురాలను అనే ఆమె మాట, ఆమెకు వ్యతిరేక  పరిస్థితిలో కూడా దేవుని ప్రణాళికా జరగాలి అనే ఆమె నిశ్చయించుకుంది. దేవుని ప్రణాళికకు ఆమె విధేయించడం వలన యేసు ప్రభువు ద్వారా రక్షకుడు ఈ లోకానికి మనలను రక్షించుటకు వస్తున్నారు. 

 యేసు అంటే దేవుడు రక్షించును అని అర్ధం. యేసు ప్రభువు తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తారు. యోహోషువా యిస్రాయేలు ప్రజలను వాగ్ధాన భూమికి తీసుకుపోతున్నాడు. యేసు ప్రభువు నిత్య జీవానికి తీసుకెళుతారు. అందుకే యేసు ప్రభువు పేరు మీద ప్రజలు స్వస్థత పొందుతున్నారు. ఒక కన్యకకు  యేసు ప్రభువు పుట్టుక ప్రజలకు నమ్ముటకు కష్టముగా ఉండవచ్చు. విశ్వాసము మనకు ఈ విషయముల మీద వెలుగును ఇస్తుంది. గాబ్రియేలు దేవదూత ఈ విషయం వివరిస్తుంది. అది ఏమిటి అంటే దేవునికి అసాధ్యం అనేది ఏమి లేదు. యేసు ప్రభువు, మరియతల్లి కన్య గర్భము ద్వారా,  పాపమలినం సోకకుండా ఈ లోకమునకు వస్తున్నాడు.

మరియమాత ఔన్నత్యం ఏమిటి?  మరియమాత దేవుని ప్రణాళిక జరుగుటకు ఏమి చేసినదో ఆలోచిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, అని పలికిన మరియమాత చేసిన సాహసం చాలా గొప్పది. ఆమె పురుషుని ప్రమేయం లేకుండ బిడ్డను కన్నది అంటే, ఎవరు నమ్మక పోవచ్చు. తన భర్త తనను అర్ధం చేసుకోక, తనను విడిచిపెట్టిన, తను  ఘోరమైన  అవమానం పొందవచ్చు. తన తండ్రి, తల్లి పట్టించుకోక పోవచ్చు. అప్పుడు ఆమె ఒక అనాధలా మారిపోవచ్చు. యోసేపు ఈ విషయమును మత పెద్దల వద్దకు తీసుకువెళితే, ఆమెకు మరణ శిక్ష విధించె అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చే అవకాశం ఉన్న కూడా దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి అని ఆమె నిర్ణయించుకున్నది. 

దేవునికి అసాధ్యం అయ్యేది, ఏది లేదు అని గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటలు మరియమాత నమ్మింది. సారా పెద్దావిడ అయినప్పటికీ ఆ వయసులో ఆమె గర్భం దాల్చబడుతుంది అన్ని చెప్పినప్పుడు, ఆమె దేవుని నమ్మక నవుతుంది. జెకర్యా దేవుని మాటను నమ్మక,  ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు.మరియమాత మాత్రం, పురుషుని ప్రమేయం లేకుండా ఎలా సాధ్యం అనే  సందేహం వెల్లడిచేసిన, దేవునికి అసాధ్యం అయ్యేది ఏమి లేదని, ఎటువంటి అపనమ్మకం లేకుండా, నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక అని, నేను దేవుని దాసురాలనని, తాను దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏమి చేయడానికైనా సిద్ధం అని తెలియజేస్తుంది. దేవుని నమ్మే ప్రతి వ్యక్తి కూడా  ఇలా చేసినట్లయితె వారు గొప్ప వారిగా మిగిలిపోతారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు ఎంత ప్రేమమయులు, మీరు మమ్ములను రక్షించుటకు, మీ దూతను, మీ దాసురాలీ  దగ్గరకు పంపి, మీ ప్రణాళికను తెలుపుతున్నారు. మీరు ఎప్పుడు మానవుడు రక్షించబడాలి, ఉన్నత జీవతం జీవించాలని కోరుకుంటున్నారు. ప్రభువా! మీరు ఎప్పుడు మరియమాతతో ఉన్నారు. ఆమెతో ప్రతిక్షణం మీరు ఉన్నారు. ఆమెతో మీరు ఉండుట వలన ఎటువంటి తప్పు లేకుండా జీవించకలిగి, మీకు ఇష్టమైన జీవితం జీవించినది. ప్రభువా! మరియమాతతో ఉన్నట్లు మాతో కూడా ఎల్లప్పుడు ఉండండి. మేము కూడా మీకు ఇష్టమైన జీవితం జీవించేలా చేయండి. ప్రభువా! దేవదూత మరియమాత దగ్గరకు వచ్చి అనుగ్రహపరిపూర్ణురాల అని చెబుతుంది. ఆమె ఎలా అనుగ్రహ పరిపూర్ణురాలు అయ్యిందో, మమ్ములను కూడా మీ అనుగ్రహములతో నింపండి. ప్రభువా! మరియమాత,  గాబ్రియేలు దేవదూతతో, "నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెబుతుంది. ఆ తల్లి దేవుని చిత్తము తన జీవితంలో జరుగుటకు తనను తాను, దేవుని దాసురాలుగ మార్చుకుంది. మీ చిత్తం చేయడమే తన జీవితంలా అనుకున్నది. మేము కూడా మీ చిత్తం నెరవేర్చడానికి, మమ్ములను మేము మీ దాసులుగా చేసుకునేలా చేయండి. ఆమెన్.  

13.12.23

మత్తయి 11:11-15

 మత్తయి  11:11-15

"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. యోహాను కాలమువరకు ప్రవక్తలందరు దీనినే ప్రవచించిరి. ధర్మ శాస్త్రము దీనినే బోధించెను. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో, రాబోవు ఏలియా ఇతడే. వినులున్నవాడు వినునుగాక!

ధ్యానం :"మానవులందరిలో స్నాపకుడగు  యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." యేసు ప్రభువు బాప్తిస్త యోహాను గురించి మాటలాడుతున్నారు. కాని ఆయనను అప్పటికే అక్కడ లేరు, ఆయనను హెరోదు బంధించి చెరసాలలో ఉంచారు. ఆయన చేసిన నేరం ఏమి లేదు, కేవలం హెరోదు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించడమే, ఆయనను బంధించబడేలా చేసింది. మానవుని గొప్పతనాన్ని దేవుడు గణించినప్పుడు యోహాను కంటే గొప్ప వారు ఎవరు లేరు,  ఆయన ప్రభువుని ముందుగా వచ్చి ప్రభువును ప్రజలకు చూపించాడు. ప్రవక్తలు, పితరులు నాయకులు, న్యాయాదిపతులు వీరి అందరి కంటే యోహాను గొప్పవాడు. మానవులందిరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఆయన ప్రభువును ఈ లోకానికి ఆహ్వానించడానికి, ఎంతో కఠినమైన నిష్టతో జీవించాడు. అతను తాను హింసించబడతాడని, తెలిసికూడా న్యాయానికి కట్టుబడ్డాడు. అబ్రహాము కూడా ప్రాణానికి భయపడి భార్యను సోదరి అని చెప్పాడు. యోహాను యొక్క జీవితం ఎంత గొప్పది అంటే మెస్సీయ్యా ఎవరో ఆయనికి మాత్రమే తెలుసు. ఆయన ఎక్కడ ఉన్నాకాని గుర్తు పట్టగలరు. ఆయన పవిత్రత అందుకు దోహద పడింది. ప్రభువే పవిత్రత కాబట్టి, యోహాను పవిత్రత ప్రభువును కనుకొనడానికి దోహదపడింది.  ఆయనలో ఉన్న వినయం ఎంత గొప్పది అంటే తన కంటే చిన్నవాడు, తన చుట్టమైన యేసు ప్రభువును ఈ లోకానికి రానున్న మెస్సీయ్యాగా ప్రకటించడానికి సందేహించలేదు. తన పవిత్రత గురించి  కాని, తన కఠినమైన నిష్టతో జీవించిన  జీవితం గురించి కాని, గర్వం ఏ కోశన లేని వాడు.

అయినను పరలోక రాజ్యమున అత్యల్పుపుడు అతనికంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. ఇంత గొప్ప వాడు అయిన యోహాను కూడా పరలోక రాజ్యంలో అత్యల్పుడు. పరలోక రాజ్యం లోని పవిత్రత, ఆ ఆనందం, ఆ అనుగ్రహం ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. మలాకి ప్రవక్త 4 వ అధ్యాయం 5 వ వచనంలో "ఆ దినము రాక మునుపే ఏలియా ప్రవక్తను మీ వద్దకు పంపుదును" అని ప్రవచిస్తున్నాడు. అందుకే యిస్రాయేలు ప్రజలు వారి అన్ని ముఖ్యమైన  పండుగలకు, వారితో పాటు ఒక ఆసనాన్ని ఖాళీగా ఏలియా కోసం అంటిపెడుతారు. మలాకి మాటల అర్ధం లూకా సువార్త మొదటి అధ్యాయం 17 వ వచనంలో చూస్తాము. "అతడు ఏలియా ఆత్మయును, శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడచును. తల్లి దండ్రులను, బిడ్డలను సమాధానపరచును. ఆవిధేయులనౌ నీతిమంతుల  మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్దులైన  ప్రజలను సమాయత్త పరచును"

స్నాపకుడగు యోహాను కాలమునుండి నేటివరకును పరలోక రాజ్యము హింసకు గురియగుచున్నది. మరియు దుష్టులు దౌర్జన్యముతో కబలింప యత్నించుచున్నారు. పరలోక రాజ్యం హింసకు గురి అవడం యోహాను దాని గురించి భోదస్తున్నప్పటి  నుండి మొదలయింది. కొంత మంది దానిని బలవంతముగా లాక్కోవాలని చూస్తున్నారు. ఈ మాటల అర్ధం యోహాను ఈ దేవుని రాజ్యం గురించి మాటలాడుతున్నందుకు ఆయనను బంధించారు. యోహానుద్వారా  జ్ఞానస్నానం పొంది, ఈ దేవుని రాజ్యంలో చేరాలని యూదాయ, గలీలియ ప్రజలు అందరు, తండోపతండాలుగా ఆయన వద్దకు వచ్చి, జ్ఞానస్నానం పొందాలని ఆయనకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు, కాని ఇలా చేయడం వలన వారు పరలోక రాజ్యంలో చేరరు, వారు మారు మనసు పొందాలి. ప్రవక్తలు, ధర్మ శాస్త్రం మొత్తం కూడా ఈ ప్రభువును ఎలా స్వీకరించాలో చెబుతున్నారు. కాని ప్రజలు త్వరగా దానిని అనుభవించాలి అని ఆయనను ఇబ్బంది పెట్టారు. యేసు ప్రభువు ఈ మాటల ద్వారా తాను రాబోయే రక్షకుడునని, ఏలియా యోహాను రూపంలో వీరి మధ్యకు వచ్చి , ప్రభువును వారికి చూపించిన విషయం తేటతెల్లం చేస్తూ, ఆయనను వారి వారి జీవితలలోనికి ఆహ్వానించవలసిన అవసరం ఏమిటో చెప్పినట్లయింది. యోహానే ఏలియా అని గ్రహించిప్రభువునుమనజీవితాలలోనికి ఆహ్వానిద్దాం. https://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_84.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు  మానవునిగా పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవారు లేరు అని పలుకుతున్నారు. యోహన అంతటి ఘనతను కేవలం మిమ్ములను కనుకొనుట ద్వారానే మాకు తెలుస్తుంది, మీరు మరియ తల్లి గర్భంలో ఉండగా మీ రాకను చూసి, తన తల్లి గర్భంలో ఉండి ఆనందంతో గంతులు వేశాడు. ఈ యొక్క రాకను అందంతో ఆహ్వానించాడు. ప్రభువా మేము కూడా యోహాను వలె మీరు ఎక్కడ ఉన్న తెలుసుకొనే అనుగ్రహం దయచేయండి. అలానే యోహాను వలె మేము కూడా మిమ్ము నిష్టతో, పవిత్రతతో మా జీవితాలలోనికి ఆహ్వానించే విధంగా చేయండి. ప్రభువా! యోహాను, ఏలియా అని మీరు ప్రకటించుచున్నారు. మెస్సీయా వచ్చే ముందు ఏలియా వస్తారు అని పవిత్ర వాక్యం ప్రకటిస్తుంది, ఆ ఏలియా యోహాను అని మీరు ప్రకటిస్తున్నారు. యోహాను మిమ్ములను మెస్సీయా  అని యోహాను గుర్తించారు. మేము కూడా మీరు రక్షకుడు అని గ్రహించి, యోహాను మిమ్ములను ఇతరులకు చూపిన విధముగా, మేము మిమ్ములను అందరికీ తెలియజేసే అనుగ్రహం చేయండి. 

కార్మెల్ శోభ : పునీత సిలువ యోహను

కార్మెల్ శోభ : పునీత సిలువ యోహను: పునీత సిలువ   యోహను పునీత సిలువ యోహనుగారు   ఒక తిరు సభ పండితుడుగా , ఆధ్యాత్మిక జీవిత మార్గ చూపరిగా అందరికి సుపరిచితులే . కానీ ఆయ...

12.12.23

మత్తయి 11:28-30

మత్తయి  11:28-30

భారముచే అలసిసొలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు  విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలన, నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. 

ధ్యానం : "భారముచే అలసిసోలసియున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" యేసు ప్రభువు చెబుతున్న ఈ భారము ఏమిటి ? నా యొద్దకు రండు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువు ప్రజలకు ఒక ఆహ్వానం ఇస్తున్నారు. ఆ ఆహ్వానం ఎందుకు? ఎందుకు ప్రభువు తన యొద్దకు  రమ్మంటున్నారు? ఆయన ఏమి ఇస్తాను అంటున్నారు? ప్రజలు ఎందుకు అలసిసోలసియున్నారు? నా కాడి మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. ఆయన కాడి అంటే ఏమిటి? నేను సాదుశీలుడననియు, వినమ్రహృదయుడననియు అని నా నుండి నేర్చుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ఆయన నుండి ఏమి నేర్చుకోమని ప్రభువు చెబుతున్నారు? నా కాడి సులువైనది, నా బరువు తెలికైనది అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి  ఆయన కాడి? ఆయన బరువు ఎలా తేలికగా ఉంటుంది? ఈ సువిశేష భాగం చాలా చిన్నది అయిన మనకు చాలా  ప్రశ్నలు, జవాబులు ఇక్కడ దొరుకుతాయి. 

ప్రజలు భారముచే అలసిసొలసి ఉన్నారు. ఏమిటి ఈ భారము? పరిసయ్యులు , ధర్మ శాస్త్ర భోదకులు ఎలా ప్రజల మీద మోయలేని భారమును మోపుతున్నరో మనం పరిశుద్ద గ్రంధంలో చూస్తాము. మోయలేని భారం వారు ప్రజల మీద మోపుతున్నారే కాని, వారికి సహాయ పడుటకు వారి చిటికిన ఏలును కూడా వారు కదపరు అని ప్రభువు పలుకుతున్నారు. ఇక్కడ భారము అంటే వారి సాంప్రదాయాలు, నియమాలు మాత్రమే కాదు. వారి జీవితములో వారు అనుభవిస్తున్న అనేక మైన జీవిత బాధలు కూడా ఉన్నవి. ఇక్కడ ఇంకొక అర్ధం కూడా ఉన్నది, వారు అవలంభిస్తున్న తోరా , పవిత్ర గ్రంధం లోని మొదటి ఐదు గ్రంధాలు. వీటిని పాటిస్తున్నాము అనే అపోహలో, వారికి ఉన్న నియమాలను, అలివికాని విధంగా  అనేక రేట్లు పెంచుకుంటూ పోయారు. ఈ భారము కూడా ఈ ప్రజల మీద ఉంది. ఈ భారములతో ప్రజలు అలసి పోయారు. అందుకే ప్రభువు భారముచే అలసిసోలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకి రండి అంటున్నారు. 

"నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతి నొసగెదను" ఇది ఒక గొప్ప ఆహ్వానము, ఎవరికో ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి ఈ ఆహ్వానం ఇస్తున్నారు. ఇది సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంధంలో, వివేకవంతురాలైన స్త్రీ ఇచ్చిన, విందుకు ఆహ్వానం ఇచ్చినట్లుగా ఉన్నది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన వారు, ఇప్పటివరకు పొందిన భారాన్ని వారు తొలగించుకోవచ్చు. అది ఎటువంటి భారం అయిన కావచ్చు. పాపం భారంతో ఉన్నవారు, ఆయన వద్దకు వస్తే వారి పాపముల భారం తొలగిస్తారు. ధర్మ శాస్త్ర భోదకుల నియమాలతో వారి చెప్పిన వాటిని చేయలేక నిరాశ, నిస్పృహలో ఉన్న వారు  ఆయన వద్దకు వచ్చి సేదతీరవచ్చు. దేవుని అనుగ్రహం కోసం వెదకి వేసారిన వారికి ఇది ప్రభువును కనుకగొని ఆయనతో ఉండుటకు ఇది గొప్ప అవకాశం. 

నా కాడిని మీరు ఎత్తుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. కాడి అంటే రెండు ఎద్దులను లేక పశువులను పొలం దున్నటకు లేక ఏమైనా మోయుటకు జత చేస్తూ ఉపయోగించేది. బండి బరువు మొత్తం కూడా కాడి మీదనే ఉంటుంది. యేసు ప్రభువు నాకాడి  మీరు ఎత్తుకొనుడు అని అంటున్నప్పుడు, వారు ఎటువంటి కాడిని మోస్తున్నారో ఆయనకు తెసులు. కాడి దించేది కేవలం వారి గమ్యం చెరినప్పుడే. ఈ ప్రజలు సాంప్రదాయాలు, నియమాలు, బలులు అన్ని  పాటిస్తున్నప్పటికి వారి గమ్యం అయిన దేవున్ని చేరడం లేదు. ఈ కాడి చాలా భారంగా ఉన్నది. ఇటువంటి కాడి కంటే యేసు ప్రభువుని కాడిని ఎత్తుకొనమని ప్రభువు చెబుతున్నారు.  నా కాడి  సులువైనది, నా బరువు తెలికైనది. అని ప్రభువు చెబుతున్నారు. ఎందుకు ప్రభువు కాడి సులువైనది? ఎందుకంటే ప్రభువు దేవుని ఆజ్ఞలను పెంచి ప్రజలకు ఇవ్వడంలేదు. వారిని కఠిన విధానాలు పాటించమని చెప్పడంలేదు. ప్రభువుని విధానం చాలా సులువైనది. సాంప్రదాయాలు, నియమాలు, బలులు, వీటి అన్నింటి కంటే సులువైనది. ఎందుకంటే ఆయన విధానం ప్రేమ, కరుణ, క్షమాపణ, మారు మనసు. ఈ కాడిని ఎత్తుకుంటే గమ్యం చేరడం సులభం. గమ్యం వారి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే ఆయనే ప్రతిఒక్కరి చివరి గమ్యం. 

 సాదుశీలుడనియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి మీరు నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. యేసు ప్రభువు దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి  ఆయన ఎంత కరుణామయుడు అనే విషయం తెలుస్తుంది. యేసు ప్రభువు ఉపమానాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన వద్దకు వచ్చిన వారిని, ఆయనను కాదు అన్నవారిని, ఆయనను కొట్టిన వారిని, ఆయనతో తిరిగి ఆయన ఎవరో తెలియదు అనిన వారిని, ఆయన క్షమించిన విధానం, వారికి ఆయన చూపించిన ప్రేమ, ఆయన సాదుశీలుడని, వినమ్రహృదయుడని తెలియజేస్తుంది. యేసు ప్రభువు మనలను ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోమంటున్నారు. తెలుసుకోవడమే కాక నేర్చుకోమంటున్నారు.  ఇది మనం యేసు ప్రభువు వద్దకు వెళ్ళితే జరుగుతుంది. అపుడు మన ఆత్మల యందు విశ్రాంతి పొందుతాము అని చెబుతున్నారు. అంటే ఆయన దగ్గరకి వెళితే మనం నిశ్చింతగా ఉండవచ్చు.                       https://amruthavellaturi.blogspot.com/2022/11/blog-post.html

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు ఎంత కరుణామాయులు, అనేకమంది మిమ్ములను అవమానించిన కాని, వారిని క్షమించారు. మీ కారుణ్యం ఎంతో గొప్పది. మేము అనేక సమస్యలతో, బాధలతో ఉన్నాము. వాటి నుండి సేదతీరాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాము. సేద తీరాలని, విశ్రాంతి పొందాలని మేము చేసిన అనేక ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజమైన విశ్రాంతి మేము పొందలేకపోతున్నాము. ప్రభువా! నేను మీ ఆహ్వానాన్ని స్వీకరించి మీ వద్దకు వస్తున్నాను. మీ నుండి వినమ్రతను, సాదుశీలతను నేర్చుకొనే ఆవకాశం ఇవ్వండి. ప్రేమ, కరుణ, క్షమాపణ అనే మీ కాడిని మేము కూడా నేర్చుకొని అనుకరించేలా చేయండి. ప్రభువా మీరు చెబుతున్న ఆత్మ యందు విశ్రాంతిని మాకు చేయండి. ఆమెన్ 

11.12.23

మత్తయి 18:12-14

మత్తయి  18:12-14

ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబదితొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయమముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశమగుట పరలోకమదుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు. 

ధ్యానము:  యిస్రాయేలు ప్రజలు దేవున్ని వారి కాపరిగా చూస్తున్నారు. ప్రవక్తలు ముఖ్యంగా ఏహెజ్కెల్, యోషయా మరియు యిర్మీయా ప్రవక్తలు అనేక పర్యాయాలు దేవున్ని కాపరి అని సంబోధిస్తున్నారు. కాపరి తప్పిపోయిన గొర్రెలను వెదకి  మరల తన మందలోనికి  తీసుకొని వస్తాడు. మెస్సయ్యా తప్పిపోయిన వారిని మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తాడు అని వారు నమ్మేవారు. యేసు ప్రభువు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభువు మాత్రమే కాపరి కాదు, తప్పి పోయిన వారిని తిరిగి యేసు ప్రభువు వద్దకు తీసుకువచ్చే వారు అందరు కాపరిగా ఉంటారు. యేసు ప్రభువు తప్పిపోయిన వారిని వెదకి వారి, సమస్యలను తీర్చి మరల వారిని తండ్రి దగ్గరకు తీసుకురావడానికి, ఒకరి వద్దకు కాదు ప్రతి వ్యక్తి వద్దకు వస్తున్నారు. అందరినీ తండ్రి దగ్గరకు తీసుకురావడానికి చేయవలసినవి అన్ని కూడా చేస్తున్నారు. 

ఎవరు తప్పి పోయారు? నీతిని తప్పిన ప్రతి వ్యక్తి , పరలోక రాజ్యానికి దూరంగానే ఉన్నారు వారు అందరు తప్పి పోయిన వారే.  అటువంటి వారి అందరినీ ప్రభువు తన వద్దకు తీసుకు వస్తున్నారు, పరలోక రాజ్యంలో స్థానం కలిపిస్తున్నారు. వీరు నీతిని తప్పుటకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సార్లు ఇలా జరుగుటకు యిస్రాయేలు నాయకులే కారణం అయ్యారు. ఎందుకు వారు తప్పి పోయారు అని ప్రశ్నించినప్పుడు అనేక సమాధానాలు మనకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అనేక మంది అవకాశం లేని వారు వున్నారు.  వారని దేవునికి సంబంధించిన అన్ని విషయాలలో దూరంగా పెట్టడం జరిగినది. కొంతమంది వారి స్వల్ప ఆనందం కోసం వెళ్ళి తిరిగి రాలేక తప్పి పోయిన వారు ఉన్నారు. ఎటువంటి కారణాలతో వారు దూరంగా ఉన్న,  వారిని యేసు ప్రభువు మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ఎవరిని కోల్పోవడం ప్రభువుకు ఇష్టం లేదు. అందుకె యేసు ప్రభువే తండ్రితో నీవు నాకు ఇచ్చిన వారిని, ఎవరిని కొల్పోననీ అంటున్నారు. వారి కోసం ప్రార్ధన చేస్తున్నారు. 

యోషయ 40: 11 లో "ఆయన కాపరివలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్మునయనించుకొని మోసికొనిపోవును."కాపరి వలె ఆయన తన మందను మెపును, ఆయన తన గొర్రె పిల్లనను తన వడిలో ఆడించును. యెహెజ్కెల్ 34:1 "యిస్రాయేలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొర్రెలమందలను మేపుటలేదు…  తప్పిపోయిన వానిని వెదకి తొలుకొని వచ్చుట లేదు పైగా వారి పట్ల క్రూరముగా , కఠినముగా ప్రవర్తించుచున్నారు." నా గొర్రెల కోసం వెదుకుదును.   ప్రభువే నా కాపరి అనే కీర్తన అందరికీ ఇష్టం ఎందుకంటే ప్రభువు మనలను ఎంత కాపాడుతాడో ఎటువంటి బయళ్ళు దగ్గరకు తీసుకుపోతారో చూస్తాము. ప్రభువు మనకు కాపరి అయితే మనలను ఆయన ఏ బాటలో తీసుకుపోతున్న చింత లేకుండా ఉండవచ్చు. కాని యిస్రాయేలు కాపరులు అలా లేరు అనే విషయం యెహెజ్కెల్ గ్రంధంలో చూస్తాము. తప్పిపోయిన వారి పట్ల ఈ కాపరులు కఠినముగా వ్యవహరించారు. వారిని సమాజంలో తక్కువగా చూడటం మొదలపెట్టారు, అగౌరపరిచారు. వారిని అపవిత్రులుగా చేశారు. ఇటువంటి కారణాలే యేసు ప్రభువు సమయంలో కూడా ఉన్నాయి. 

ఒక వ్యక్తిని కోల్పోవడం  కూడా యేసు ప్రభువుకి  ఇష్టం లేదు. అనేకమంది కాపరులు వారి గౌరవం గురించి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాపరిగా ఉండటాన్ని అంత గొప్ప పనిగా చూసేవారు కాదు. కాని యేసు ప్రభువు మంచి కాపరిhttps://amruthavellaturi.blogspot.com/2023/03/blog-post_48.html. ఒక గొర్రె మంద నుండి బయటకు పోతే మంద మొత్తము పోయినట్లుగా ఆయన బాధపడుతారు. అది దొరికినంత వరకు ఆయన దాని కోసం వెదకుతారు. దొరికినంత వరకు వేదకుతానే ఉంటారు. ఎందుకు ప్రభువు అంతగా వెదకుతున్నారు? ఒక వ్యక్తి  తప్పిపోయిన సమాజం మొత్తం దాని బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా దేవుని సృష్టే. దేవుని బిడ్డే. కొన్ని సార్లు ఒక వ్యక్తి తప్పు చేయడం వలన సమాజం మొత్తం పర్యవసానం అనుభవిస్తుంది.  యిస్రాయేలు నాయకులు తప్పు చేసినప్పుడళ్ల అనేక బాధలు ప్రజలు అనుభవించారు. 

  యేసు ప్రభువు చెప్పిన ఈ  ఉపమానం చిన్న పిల్లల మీద, బలహీనులుగా ఉన్న మీద ప్రభువు కరుణ ఎలా ఉన్నదో మనం తెలుసుకోవచ్చు.   అధికారులు, నాయకులు  ఎవరు కూడా ఈ చిన్న బిడ్డలను కోల్పోవడానికి కారణం కాకూడదు అని ప్రభువు కోరుతున్నారు.  ఈ తప్పిపోయిన వారిని ఎలా మరలా సంఘం లోనికి తీసుకొని రావాలి. వారిని మరల తీసుకొనివచ్చినప్పుడు  ఎవరు అడ్డుకోవలదు అని ప్రభువు  చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువు తప్పి పోయిన వారి వద్దకే వెళుతున్నారు, పాపులు, సుంకరులు మొదలగువారితో మాటలడుతున్నారు. వారిని అడ్డుకోవాలనుకున్న వారిని ముఖ్యముగా పరిసయ్యులను, ధర్మ శాస్త్ర బోధకులను  వారిస్తున్నారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా ! మీరు మంచి కాపరి. మీరు తప్పి పోయిన మమ్ములను వెదకి మరలా తండ్రి వద్దకు చేర్చుటకు చాలా కృషి చేశారు. ప్రభువా నేను తప్పి పోవుట మీకు ఇష్టం లేదు అని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభువా మీరు ఎలా అయితే ఎటువంటి కారణాలతో తప్పిపోయిన మమ్ము చీదరించుకోకుండా మేము మీతో ఉండాలిన కోరుకుంటున్నారు. కొన్ని సార్లు మా స్వార్ధం కోసం, అవసరాల కోసం కూడా మేము దూరంగా వెళ్ళి పోతున్నాము, అటువంటి సమయాలలో మీ ప్రేమను గురించే అనుగ్రహం మాకు దయచేయండి. మీ ప్రేమను గుర్తించి, మీ వద్దకు తిరిగి వచ్చే వారిని మేము ఎప్పుడు అడ్డుతగలకుండా ఉండే మంచి మనసు మాకు దయచేయండి. ఎవరు మీ నుండి తప్పి పోవుటకు మేము కారణం కాకుండా మా జీవితాలను మలచండి. ప్రభువా తప్పి పోయిన వారిని తిరిగి పొందినప్పుడు మీకు ఉండే ఆనందంలో మమ్ములను కూడా భాగస్వాములను చేయండి. ఆమెన్ 

లూకా 5:17-26

లూకా 5:17-26 

ఒకనాడు ఆయన బోధించుచుండగా యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును ఆయన ఎదుట కూర్చుండియుండిరి. స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. అపుడు కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. అందుకు పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు "దైవ దూషణములు పలికెడి ఇతడెవరు?దేవుడు తప్ప మరెవ్వరు పాపములు క్షమింపగలరు?' అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి "మీ హృదయములలో ఏల తర్కించుకొనెదరు? ఏది సులభ్యతరము? నీ పాపములు క్షమింబడినవి అనుటయా? కాని, భూలోకమునయ మనుష్యకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును"అని చెప్పి, పక్షవాత రోగితో "నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను" అని పలికెను. ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి, పడకను తీసుకొని దేవుని స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను. వారందరు ఆశ్చర్యచకితులై భయపడుచు "నేడు మనమెట్టి వింతలను చూచితిమి" అని దేవుని పొగడిరి. 

పరిశీలన : యేరుషలేము, గలిలీయ, యూదయాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసయ్యులును, ధర్మశాస్త్ర బోధకులును  యేసు ప్రభువు ఎదుట ఆయన బోధించుచుండగా కూర్చొని ఉన్నారు. ఎందుకు వీరు అక్కడ కూర్చొని ఉన్నారు? ఆయన బోధనలు ఆలకించడానికే వీరు వచ్చారా? ఈ ప్రశ్నలు మనం అడిగినప్పుడు మనకు వచ్చే సమాధానం ఏమిటి అంటే ఆయన మాటలు వినడానికి వారు రాలేదు. వీరు మతపరమైన నాయకులు. వీరు ఎక్కువ సమయాన్ని వారి నియమాల గురించి సంప్రదాయల గురించి మాటలాడేవారు. వారు మనిషి చేసిన నియమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. కాని దేవుని వాక్కుకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. యేసు ప్రభువు బోధనలను వారికీ వ్యతిరేఖముగా ఉన్నవి అని వారు అనుకునేవారు. యేసు ప్రభువు బోధనలను వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం వారని ఒక రకమైన భయం లోనికి నెట్టింది. కనుక వారు యేసు ప్రభువు మాటలను తప్పు పట్టడానికి, ఎవరెవరు ఆయన మాటలను వింటున్నారని తెలుసుకోవడానికి వస్తున్నారు.  

స్వస్థతనిచ్చు ప్రభుశక్తి ఆయనయందుండెను. యేసు ప్రభువు చేసిన అన్ని  పనులు  దేవుని తోడ్పాటుతో జరుగుతున్నావి. ఆయన చేసిన పనులు మాత్రమే కాదు, ఆయనతో తండ్రి, పవిత్రాత్మ ఎప్పుడు తొడుగానే ఉన్నారు. ఆయన చేసిన ప్రతి పని ఆయన శక్తినే కాదు, దేవుని శక్తి తెలియజేస్తుంది. అందుకే ఆయన చేసే పనులు దైవ కార్యములే. ఆయన మాటలు కూడా దైవ మాటలే. అందుకే ఆయన ఒక మాట చెప్పగానే అది జరుగుతుంది. ఇది ఆదిలో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇలానే జరుగుతుంది. 

కొందరు పక్షవాత రోగినొకనిని పడకపై మోసికొని వచ్చి, ఇంటిలోపల బోధించుచున్న ఆయనచెంతకు చేర్చ ప్రయత్నించిరి. ఆ ఇల్లు జనసమూహముచే క్రిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అపుడు వారు ఇంటిపైకి ఏక్కి, కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందుట దించిరి. ఆనాటి కాలంలో యిస్రాయేలు ప్రజలు ఇళ్ల కప్పును మట్టి మరియు ఎండిన గడ్డితో కలిపిన మిశ్రమంతో చేసేవారు. ఆ కప్పును తీసివేసి పక్షవాత రోగిని ప్రభువు ముందు తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభువు ఒక బోధకునిగా వారికి దేవుని గురించి, దైవ రాజ్యం గురించి చెబుతున్నారు.  ప్రజలు అందరు ఆయన బోధనల యందు ఎంత ఆశక్తి కలిగి ఉన్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి కూడా అంతే  ఆసక్తి కలిగి ఉన్నారు. కారణం ఏమిటి అంటే మెస్సీయ్యా కాలంలో జరుగుతుంది అని వారు వినిన అన్ని స్వస్థతలు యేసు ప్రభువు ద్వారా జరుగుతున్నవి. 

యేసు వారి విశ్వాసమును చూచి, "ఓయీ! నీ పాపములు క్షమింపబడినవి" అని అతనితో చెప్పెను. యేసు ప్రభువు ఆ పక్షవాత రోగి విశ్వాసము చూసి కాదు, అతనిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసము చూచి ఆ వ్యక్తితో నీ పాపములు క్షమించబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక మాట అంటున్నారు అంటే అది వెంటనే జరుగుతుంది. ఆయన మాట్లాడిన వెనువెంటనే అది కార్య రూపం దాల్చుతుంది. కనుక ఆ వ్యక్తి పాపములు క్షమించబడినవి. 

ఈ మాటలను వినిన ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు, ఖచ్ఛితముగా ఇటువంటి మాటలు ఆయన నుండి వచ్చిన వెంటనే ఆయనను తప్పు పట్టాలని అనుకుంటున్నారు. ఇప్పుడు వారికి  యేసు ప్రభువును తప్పు పట్టుటకు ఒక అవకాశం దొరికింది కనుకనే వారు, ఇతను ఎవరు పాపములు క్షమించడానికి, అది దేవుడు మాత్రమే చేయగలడని, దేవుడు చేసే పని, ఇతను తాను చేస్తాను అని అంటున్నాడు అంటే ఇది దైవ దూషణం అని వారు వారిలో వారు తర్కించుకొంటున్నారు. అది గ్రహించిన యేసు ప్రభువు తనకు ఉన్న శక్తిని గురించి చెప్పడమే కాదు. ఆయనకు మానవుని పాపములను క్షమించే అధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. అది ఎలా అంటే, ఆ వ్యక్తి పాపము వలనే ఆ సమస్య వచ్చినట్లయితే, పాపము తొలగిన వెంటనే తన ఆరోగ్యం పొందగలుగుతాడు.  ఆ వ్యక్తి పాపముల క్షమించబడితేనే  స్వస్థత పొందుతాడు. అందుకే యేసు ప్రభువు "నీ పడకను ఎత్తుకొని ఇంటికి వెళ్లిపో" అని చెబుతున్నాడు. ఆయన చెప్పినట్లే ఆయన చేస్తున్నాడు. దీని ద్వారా యేసు ప్రభువు, దేవుడు చేసిన పనులు చేస్తాడని ఆయన దేవుడని మనకు అర్ధం అవుతుంది. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మొదటి నుండి మీ దైవత్వాన్ని చూపిస్తున్నకాని మేము మాత్రం అనేక అనుమానలతో , అపనమ్మకంతో మీ మిమ్ములను అగౌరపరిచాము. మీమాటలకు, చేతలకు తేడా లేకున్న మేము మాత్రము మీ మాట వెంటనే కార్య రూపం దాల్చుతున్నది అని గ్రహించడంలో విఫలం అయ్యాము. ప్రభువా ధర్మ శాస్త్ర భోదకులు , పరిసయ్యుల వలె, సాంప్రదాయాలకు , మనిషి చేసిన నియమాలకు ప్రాముఖ్యత ఇచ్చి దైవవాక్కును అశ్రద్ద చేశాము. ప్రభువా పక్షవాత రోగిని క్షమించినట్లు, మమ్ములను కూడా క్షమించండి. మేము మీ దైవత్వాన్ని ఎప్పుడు అనుభవిస్తూ మీ అనుగ్రహాలు పొందేలా మమ్ము దీవించండి. ఆమెన్ 

9.12.23

ఆగమనకాలపు రెండవ ఆదివారం, మార్కు 1: 1-8

మార్కు 1: 1-8

దేవుని కుమారుడు యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. యెషయా ప్రవక్తవ్రాసిన విధమున: "ఇదిగో నీ మార్గమును సిద్ధమొనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. 'ప్రభు మార్గమును సిద్ధమొనర్పుడు. ఆయన  త్రోవను  తీర్చిదిద్దుడు'అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను." ఆ ప్రకారము పాపక్షమాపణ పొందుటకు ప్రజలు  హృదయపరివర్తనము అనెడు బప్తిస్మము పొందవలెనని ఎడారియందు యోహాను ప్రకటించు చుండెను. యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. "నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను.  

మార్కు సువార్త బాప్తిస్త యోహానుగారి పరిచర్యతో మొదలవుతుంది. మార్కు సువిశేషకుని ప్రకారం  యేసు ప్రభువుని బాప్తిస్మము తోటి ఆయన పరిచర్య  మొదలవుతుంది. యోహాను ఇచ్చేటువంటి బాప్తిస్మము మారుమనసు కొరకు.  అంటే ఒక వ్యక్తి తన పాపములు తెలుసుకొని , ఇకనుండి అటువంటి పనులు చేయకుండా మారడం.  పరలోక రాజ్యం స్థాపన అనేది మానవుని మారు మనసుతొటి మొదలవుతుంది. 
 యోహాను ఎడారిలో ఎలుగెత్తి   ప్రభుని మార్గాన్ని సిద్దం చేయమని చాటుచున్నాడు. ఎడారి నివాస యోగ్యం కాని ప్రదేశం. ఎడారి అంటే ఎటువంటి పంటలకు అనుకూలంగా లేని ప్రదేశం.  ఎడారి అనేది మతపరమైన పనులకు  వాడబడుతుంది.   ఆరోజులలో  యోహను యూదయ దేశపు  ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము  సమీపించినది. మీరు హృదయ పరివర్తన చెందుడు చెబుతున్నాడు. . యోహను ఎందుకు ఏడారికి వెళ్ళాడు? ఆయన అక్కడ ఏమి చేస్తున్నారు? ఏడారికి దేవుని అనుగ్రహం పొందటానికి వెళుతుంటారు, దేవునితో మాటలాడటానికి  మరియు శోధించబడానికి వెళుతుంటారు. పరీక్షింపబడటానికి వెళుతుంటారు. బైబుల్లో అనేక మంది ఇటువంటి ఉద్దేశ్యములతోనే ఏడారికి వెళుతుంటారు. యోహను ఎడారిలో దేవుని అనుగ్రహం పొందివున్నాడు. అక్కడ ప్రజల కొరకు  ఒక  సందేశం దేవుని నుండి పొందుతున్నాడు. అదే ప్రభువు మార్గమును సిద్దము చేయడం. హృదయ పరివర్తన పొందటం.  దానికి గుర్తుగా ఆయన బాప్తిసం ఇస్తున్నాడు. యోహాను ఇచ్చే బాప్తిసం మారుమనస్సు పొందుటకు అని మనకు తెలుస్తుంది. ఇది పశ్చాత్తాపాన్నీ తెలుపుతుంది.

హృదయ పరివర్తనకు   పశ్చాత్తాపం మొదటి మెట్టు. పశ్చాత్తాపం మనకు ఎప్పుడు కలుగుతుంది?.   ఎప్పుడైతే మనం చేసిన పని, లేక చెప్పిన మాట, లేక ఆలోచించిన ఆలోచన పొరపాటని లేక తప్పు అని గ్రహించి, ఆ విధంగా చేయడం వలన,  మనలను ప్రేమించిన వ్యక్తి ని బాధ పేడుతున్నామని తెలుసుకొని ఆ మార్గము నుండి మరలినప్పుడు మాత్రమే అది పశ్చాత్తాపం అవుతుంది. పరివర్తనకు మార్గం అవుతుంది. 

ఈ పరివర్తన గురించి మనం పాత నిబందనలో కూడా   చూస్తాము. 1. సొదొమ , గోమర్రోలకు ప్రకటించిన హృదయ పరివర్తన, 2. నినేవేకు ప్రకటించిన  హృదయ పరివర్తన. ఇక్కడ మనం చూసేది వారు హృదయ పరివర్తన చెందినచో వారు క్షమించ బడుతారు. అందుకే నినివే ప్రజలు  బూడిద మీద పోసుకొని , గోనె తాల్చి వారు పశ్చాత్తాపం ప్రకటించారు, రక్షించబడ్డారు. కాని ఇక్కడ యోహను ప్రకటించే హృదయ పరివర్తన కేవలం గోనె తాల్చడం, బూడిద మీద పోసుకోవడం గురించి కాదు. వారు  చేసేపనులు పశ్చాతాపన్ని తెలియచేయాలని చెబుతున్నాడు. 

ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని  ఎడారిలో  ఒక వ్యక్తి ఎలుగెత్తి  పలుకుచుండెనని  ఈ యోహనును గూర్చియే యోషయా ప్రవక్త  పలికింది. యోహను హృదయ పరివర్తన గురించి మాటలాడుతున్నాడు అంటే వారు కేవలం బప్తిస్మం తీసుకోవడం మాత్రమే కాదు, వారు చేయవలసిన పనులను గురించి చెబుతున్నాడు. ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు అని అంటున్నాడు. ఏడారిలో మార్గమును సిద్ధం చేయడం ఏమిటి? ఎందుకు అంటే? ఎడారి అనేది ఒక గమ్యం అంటు లేకుండా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మార్గమును సిద్ధం చేయడం అంటే అగమ్యగోచరంగా ఉన్న మన జీవితాలకు ఖచ్ఛితముగా మార్గాన్ని అలవరచుకోవడం అవసరం అని తెలుపుతుంది.  ఎప్పుడైతే  మన జీవితాలకు ఒక నిర్ధిష్టమైన మార్గంను సిద్ధం చేయగలుగుతామో, అప్పుడు మనం యేసు ప్రభువును ఆహ్వానించవచ్చు. 

యోహాను ఒంటె రోమముల వస్త్రమును, నడుమునకు తోలుపట్టిని కట్టుకొని, మిడుతలను భుజించుచు, పుట్టతేనెను త్రాగుచు జీవించుచుండెను. కొన్ని వందల సంవత్సరాల తరువాత యిస్రాయేలు ప్రజలు ఒక ప్రవక్తను చూస్తున్నారు. వారు  ప్రవక్తల గురించి విన్నారు కాని ప్రవక్త ఎలా ఉంటారో చూడలేదు. ఇప్పుడు వారు యోహను రూపంలో ఒక ప్రవక్తను చూస్తున్నారు. మనం ఏలియా ప్రవక్త ఎలా ఉండేవాడో వింటాము. అదే విధంగా యోహనును చూడటం ద్వారా ఒక ప్రవక్తను వారు తెలుసుకున్నారు. యోహనులో మనం చూసేదీ కేవలం ఒక ప్రవక్తను మాత్రమే కాదు. దేవునికోసం పూర్తిగా సంసిద్ధంగా ఉన్న వ్యక్తిని. తన యొక్క వస్త్రధారణ , తన ఆహారం అన్నీ కూడా తాను ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. 

యూదయా దేశస్థులందరు, యెరూషలేము పురవాసులెల్లరు అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండ, యొర్దాను నదిలో యోహాను వారికి జ్ఞానస్నానము ఇచ్చుచుండెనుమనం అందరు తప్పు చేయడం గురించి తెలుసు, మనం ఏమైనా పొరపాటు చేసినప్పుడు ఎవరిని అయిన బాధ పెట్టి ఉండవచ్చు. అది ఎప్పుడైతే మనకు అర్ధం అవుతుందో మనము బాధ పడుతుంటాము. నిజానికి అటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే మనం పశ్చాతాపం కలిగిఉన్నట్లు. యోహాను దగ్గర జ్ఞాన స్నానం పొందడానికి వచ్చిన వారు అందరూ వారి వారి పాపాలను తెలుసుకొని, దేవున్ని వారి పనుల ద్వారా బాధ పెట్టము అని తెలుసుకొన్నవారు. మారు మనస్సు పొందుటకు సిద్దంగా ఉన్నవారు. యోహాను ఇచ్చిన బాప్తిసం ద్వారా వారి పాపాలు తీసివేయబడటం లేదు. కానీ దేవునికి వారి మారు మనస్సు తెలియజేస్తున్నారు. వారి పాపాలు ఎలా క్షమించబడతాయి? దాని గురించి యోహాను చెబుతూ యేసు ప్రభవు రాకను ప్రకటిస్తున్నాడు. 

"నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షలవారును విప్పుటకైనను యోగ్యుడనుకాను. నేను మిము నీటితో స్నానము చేయించితిని. కాని అయన మిమ్ము పవిత్రాత్మతో స్నానము చేయించును" అని యోహాను ప్రకటించుచుండెను. యేసు ప్రభువు దైవత్వం గురించి యోహాను వివరిస్తూ ఎలా ఆయన మన పాపములను తీసివేయబోతున్నాడో వివరిస్తున్నారు. యోహాను గొప్ప ప్రవక్త అయినప్పటికీ ప్రభువు ముందు తాను ఏమిటో తెలిసిన యాదార్ధవాది. ఎప్పుడు తన వాస్తవ స్థితిని తెలుసుకొని జీవించిన వ్యక్తి. ఆయనే ప్రభువు గురించి " నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని చెబుతున్నారు. ఎంతో నిష్టతో,  పరిశుద్దత కోసం కఠినమైన దీక్ష జీవితం జీవిస్తున్న ఆయనే, ప్రభువు పాదరక్షల వారును కూడా విప్పుటకు నేను యోగ్యుడను కాను అంటున్నారు. 

ఇంత మహోన్నతుడైన ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏమి చేయబోతున్నాడు? మనకు పవిత్రాత్మతో జ్ఞాన స్నానం ఇస్తాడు. మన పాపములను ఆయన పవిత్రాత్మతో ఇచ్చే జ్ఞానస్నానం తీసువేస్తుంది. అంతే కాక పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటుంది. పవిత్రాత్మ ప్రభావం వలన మనిషి పూర్తిగా మారిపోయి ప్రభువు చెప్పినట్లు జీవిస్తూ, పాప క్షమాపణ పొంది, ప్రభువు కోసమే జీవించేలా మారుతారు. 

మత్తయి 9:35-10:1,6-8

  మత్తయి 9:35-10:1,6-8

యేసు అన్ని పట్టణములను, గ్రామములను తిరిగి, ప్రార్ధనామందిరములలో బోధించుచు, పరలోకరాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధిబాధలనెల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలే చెదరియున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు, వారికి అధికారమును ఇచ్చెను. కాని, చెదరిపోయిన గొర్రెలవలెనున్న యిస్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి, పరలోకరాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్టురోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. 

ధ్యానం: నిన్ననే మనం నిష్కలంక మాత పండుగను జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా  ఈ లోకానికి దేవుడు చెప్పిన  మొదటి సువార్తను గురించి ధ్యానిస్తుంటాము. ఏమిటి ఈ మొదటి సువార్త అంటే స్త్రీ కి పుట్టబోయే మెస్సీయా. ఈ మెస్సీయ్యా ద్వారా మనం రక్షించబడుతాము. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించేది ఆయన గురించే. ఆయన గురించి ఆయన చెప్పే మాటలు వట్టి మాటలు కాదు, ఎందుకంటే ఆయన ద్వారా అందరు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త అంటే? అప్పటివరకు  యిస్రాయేలు ప్రజలు మెస్సీయాను గురించి ఎదురుచూస్తున్నారు , ఇప్పుడు మెస్సీయా వారి దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు, ఆయనే మెస్సీయా అని  నిరూపిస్తున్నవి. అవి ఆయన మెస్సీయ్యా అనుటకు గుర్తుగా ఉన్నాయి. 

యేసు ప్రభువుకు, ఆయన పనిలో పాలుపంచుకొనే వారు కావలి. ఆయనను అనుసరిస్తూ ఆయన వలె జీవించేవారు కావలి. వారు ప్రజల బాధలను చూసి , యేసు ప్రభువు ఎలా స్పందిచారో అలానే స్పందించే మనస్సు కలిగిన వారు అయిఉండాలి. ఇది కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే కాదు, ఆయన అనుచరులు అందరు చేయవలసిన పని. ఎవరు అయితే ప్రభువుచేత అనుగ్రహాలు పొందుతున్నారో, స్వస్థతలు పొందుతున్నారో, వారు ఇతరులకు  యేసు ప్రభువు చూపించిన ప్రేమను చూపించాలి. మనము ప్రభువు నుండి పొందిన దానికి ఇతరులతో పంచుకోవడానికి వెనుకడుగువేయకూడదు. 

ప్రజలను చూచినప్పుడు యేసు ప్రభువు చాలా బాధ పడ్డారు. ఆ కారుణమయుని కడుపు తరుక్కు పోయింది అని చదువుతున్నాము.  ప్రజలకు సరైన కాపరులు లేరు అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ప్రభువు తన శిష్యులను ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఎలా కాపరులుగా ఉండాలో నేర్పుతున్నారు. ఏహెజ్కెలు ప్రవక్త కూడా యిస్రాయేలు ప్రజలు కాపరి లేని వారి వలె ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు కేవలం కాపరిగా మాత్రమే రాలేదు. ప్రభువు మంచి కాపరి. ప్రభువే "నేను నా మంద కోసం నా ప్రాణామును కూడా ధారపోయుదును" అని చెబుతున్నారు. ఆయన ఎటువంటి కాపరి అనేది మనం ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. ప్రభువు కేవలం వారి అనారోగ్యాన్ని మాత్రమే చూడటం లేదు. వారి  సమస్యలను చూసి, ప్రభుని కడుపు తరుక్కు పోయింది. అంటే ప్రభువు ప్రజల అన్ని సమస్యలను చూస్తున్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి సంబంధాలు, వారి సమస్యలు అన్నింటినీ ప్రభువు చూస్తున్నారు. వాటి ద్వారా  వారు పొందే అనేక బాధల నుండి వారిని కాపాడాలని ప్రభువు కోరిక. ఒక మంచి కాపరి మాత్రమే వారిని ఈ సమస్యల నుండి బయటకు తీసుకురాగలరు. ఆ కాపరి ప్రభువు వలె ఉండాలి. ప్రభువు వలె చూడాలి. ప్రభువు వలె వినాలి. ప్రభువు వలె వారి జీవితాలలో పాలుపంచుకోవాలి. 

ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అనేక మంది సిద్దముగా ఉన్నారు. కాని వారికి ప్రభువు మాటలను ఎవరు చెబుతారు. ఎవరు ప్రజలను తన సొంత వారినిగా చూస్తారు. ప్రభువు వలే ఎవరు తన మందను కాపాడుతారు. అందుకే యేసు ప్రభువు కోతగాండ్ర కోసం పార్థన చేయమని అడుగుతున్నారు. దేవున్ని, కోతగాండ్రును పంపించమని ప్రార్ధించమంటున్నారు. అంటే కోతగాండ్ర పని యేసు ప్రభువు వలె ఉండటం. ఇది ఈ లోకంలో ప్రతి కైస్తవుని పని. అప్పుడె లోకం నిజమైన కాపరులు కలిగి ఉంటుంది. అందుకె యేసు ప్రభువు తన శిష్యులను పిలుస్తున్నారు. వారికి అన్ని అధికారాలు ప్రభువు ఇస్తున్నారు. వారు చేయవల్సిన అన్ని పనుల గురించి ప్రభువు వారికి చెబుతున్నారు. వారికి  ప్రజలను , అన్ని రకాలైన సమస్యలనుండి కాపాడే శక్తి ఇస్తున్నారు. . 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన : ప్రభువా! మీరు  మా పరలోక రాజ్యమని మేము తెలుసుకున్నాము. మీరు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వారి వ్యాధులను, తీసివేస్తూ, స్వస్థతనుఇవ్వడం వలన మీరు మెస్సీయ్యా అని మేము గుర్తిస్తున్నాము. ప్రభువా! ప్రజల బాధలు తట్టుకోలేక మీ కడుపు తరుక్కుపోయింది, ప్రభువా , ఆ ప్రజలను చూసినట్లు మమ్ములను కూడా ఒకసారి చూడండి. మాలో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి. ప్రభువా మీ మాటలను పాటించుచు ఎల్లప్పుడు, మీమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుచరునిగా, మీ వలె జీవిస్తూ , ఉండుటకు సిద్దంగా ఉన్న మమ్ము , మీ శిష్యుల పంపినట్లుగా  మీ సందేశాన్ని ఇస్తూ, ప్రజల అవసరాలలో బాధలలో పాలుపంచుకొంటూ, ఎప్పుడు ప్రజలను మీ వైపు తీసుకువచ్చే కాపరులుగా మమ్ము మలచండి. ప్రభువా! ప్రజల సమస్యలు మీ సొంతవి అన్నట్లు  మీరు భావించారు అందుకే , మీ కడుపు తరుక్కు పోయింది, తండ్రిని కాపరుల కోసం ప్రార్ధించమని చెబుతున్నారు.  ఇతరుల పట్ల , మీరు కనపరచిన  మనస్తత్వం, మాకు దయచేయండి. ఆమెన్.  

8.12.23

నిష్కళంక మాత మహోత్సవం

నిష్కళంక మాత మహోత్సవం

లూకా  1:26-38

తదుపరి ఆరవమాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక  యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికివచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఎలినవారు నీతో ఉన్నారు" అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవదూత "మరియమ్మా !భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ " నేను పురుషుని ఎరుగను కదా! ఈద్ ఎట్లు జరుగును?"  ఆ దూతను ప్రశ్నించేను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీవపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను అవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు  దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిశబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు  మళ్ళినది గదా! గొడ్రాలైన  ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము. ఏలయన, దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు" అంతట మరియమ్మ "ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!" అనెను. అంతట  ఆ దూత వెళ్ళి పోయెను.

ఈరోజు నిష్కళంక మాత మహోత్సవం జరుపుకుంటున్నాము. ఏమిటి ఈ పండుగ అంటే మరియ మాత తన తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఎటువంటి పాపం లేకుండ పుట్టింది. మరియమాతలో ఎటువంటి మలినం అనేది లేదు. మరియ మాతను  పాపంలో పడకుండా తన వరప్రసాదాలు ముందుగానే ఇచ్చి తల్లి గర్భంలో పడినప్పటి నుండి పాప రహితురాలుగా ఆమెను చేశాడు అని అర్ధం. 

ఈ ఆలోచన రెండవ శతాబ్దం నుండి తిరిసభలో ఉన్నది. కాని 4 శతాబ్దంలోనే ఒక పండుగలా చేయడం జరుగుతుంది. 1854 9 వ భక్తినాధ పోపు గారు ఈ పండుగను విశ్వవ్యాప్తం చేశారు. ఈ పండుగ మనకు  మరియమాతకు  తల్లి గర్భంలో పడతున్నప్పుడే, యేసు ప్రభువు శిలువ    శ్రమలు ,  మరణం, పునరుత్థానల ఫలితాన్ని ముందుగానే  ఇచ్చి ఆమెలో   జన్మ పాపం లేకుండా ఆమెను రక్షించారు అని భోదిస్తుంది. ఇది ఎలా సాధ్యము అంటే దేవుడు కాలనికి అతీతుడు. ఆయన అలా చేయగలడు. దీని అర్ధం మరియ మాతకు మెస్సీయ్యా అవసరం లేదు అని కాదు. ఆమెకు ఆయన రక్షణ ముందుగానే ఇవ్వబడింది.

పాపం లేకుండా ఎవరైన సృష్టించబడ్డారా? మొదట మానవుడు పాపం లేకుండానే సృష్టించబడ్డాడు. కాని తరువాత సాతాను మాటను స్త్రీ విని పాపం అంతకట్టుకున్నది.  మొదటి స్త్రీ ఏవను,  పడిపోయిన దేవదూత పాపం చేయడానికి ప్రోత్సహించినది. దేవుడు చేయవద్దని చెప్పిన పనిని చేపించి, పాపము చేసేలా చేసింది.  మరియ మాత దగ్గరకు వచ్చిన దేవదూత పడిపోయిన దేవదూత కాదు, గాబ్రియేలు దేవ దూత , ఈ దూత ప దేవున్ని  పూర్తిగా విధేయించిన దేవదూత. పడిపోయిన దేవ దూత వచ్చినప్పుడు దేవున్ని  విధేయించ వద్దు అని ఏవకు చెప్పింది. కాని , గాబ్రియేలు దేవదూత  వచ్చినప్పుడు దేవున్ని నమ్మమని. ఆయన ప్రణాళికకు సహకరించమని చెబుతుంది. మరియ మాత   తన జీవితం మొత్తం అలానే , ఆ ప్రణాళికకు సహకరిస్తూ జీవించినది. అందుకే తిరుసభ పితరులు ఆమెను రెండవ ఏవ అని పిలుస్తారు. దేవుడు మన  తల్లి తండ్రులను గౌరవించమని చెబుతున్నారు. ఇది దేవుని పది ఆజ్ఞలలో నలుగవది. యేసు ప్రభువు తన తల్లిని గౌరవించారు. మనం కూడా ఆమెను అలానే గౌరవించాలి. 

మరియమాతకు ఈ అనుగ్రహం ఇవ్వవలసి అవసరం చాలా ఉంది,  ఎందుకంటే ఈ లోకం రక్షించబడాలి అనేది దేవుని సంకల్పం.  అందుకు దేవుని  కుమారుడు ఈ లోకానికి రావాలి.   ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వస్తారో, ఆ పవిత్రుడను ఎవరు ఆహ్వానించగలరు. కేవలం ఎవరు అయితే  ఏ పాపం లేకుండా ఉంటారో వారు మాత్రమే.  అప్పుడే  ఆయనకు ఏ మలినం అంటకుండా ఉంటుంది.  అంటే ఆయన తల్లిలో ఏ పాపం ఉండకూడదు, ఆమె పవిత్రంగా ఉండాలి.    అప్పుడే అది జరుగుతుంది. కనుక ముందుగానే మరియమాతను , తండ్రి దేవుడు  తన కుమారున్ని  ఈ లోకానికి తీసుకురావడానికి ఆమెలో ఎటువంటి పాపము లేకుండా ఆమెను  సిద్దపరుస్తున్నారు. 

ఆదికాండం 3: 15 లో దేవుడు సర్పముతో " నీకును, స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతటికిని మధ్య వైరము కలుగ చేయుదును. ఆమె సంతతి నీ తల చితుకగొట్టును. నీవేమో వాని మడమ కరిచేదవు." అని చెబుతున్నారు. ఇక్కడ సాతానుతో ఈ వైరం ఎప్పుడు ఉంటుంది.  ఒక వేళ మరియ మాతలో  పాపముకాని, లేక  చిన్న మలినం ఉన్న , సాతానుతో సహకరించినది అవుతుంది.  కనుక ఆమెలో ఏ పాపము ఉండకూడదు అందుకే ఆమెను దేవుడు జన్మ పాపము లేకుండా చేస్తున్నాడు. ఇవి అన్ని కూడా ఆమె కొరకు కాదు,  ఆమె ద్వారా ఈ లోకానికి వస్తున్నటువంటి తన కుమారుడు , పవిత్రుడు.  ఆ పవిత్రుడు ఈ లోకములోనికి రావాలి అంటే,  ఆయనను తీసుకు వచ్చే స్త్రీ కూడా పవిత్రురాలుగానే ఉండాలి. అపవిత్రతో ఈ ప్రభువును ముట్టుకొనుట అసాధ్యము. అపవిత్రంగా  దివ్య మందసాన్ని తాకుతున్న వారు చనిపోతున్నారు. ప్రభువును ఈ లోకానికి తీసుకువచ్చే తల్లి పవిత్రంగా ఉండాలి కనుక ప్రభువు ఆమెను ఎటువంటి మలినం అంటకుండా చేస్తున్నారు. 

మరియమాత జన్మపాపం లేకుండా జన్మించడం. ఆమె గొప్పతనం ఏమికాదు . ఆమె ఔన్నత్యము తరువాత ఆమె జీవించిన విధానం తెలుపుతుంది. తన జీవితాన్ని మొత్తాన్ని దేవునికి అర్పించినది. దేవుని దాసురాలిగా జీవించింది. ప్రభువును ధ్యానిస్తూ జీవించింది. తరువాత కూడా ఏ పాపము లేకుండ జీవించింది ఇక్కడ ఆమె ఔన్నత్యం తెలుస్తుంది. 


6.12.23

మత్తయి 7:21,24-27

 మత్తయి 7:21,24-27

"ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. " నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలై పారి, పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాది పై నిర్మింపబడుటచే కూలి పోలేదు. నా బోధనలను ఆలకించి  పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్దిహీనుని పొలియున్నాడు. జడివానలు కురిసి, వరదలు వెల్లువలైపారి, పెనుగాలులు వీచినపుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాల ఘోరమైనది." 

ధ్యానం: "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో  ప్రవేశిండు! కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. యేసు ప్రభువుని మాటలు జీవమై ఉన్నవి అని మనకు తెలుసు. ఈ ప్రభువు మాటలు ఒకసారి ఆలోచిద్దాం. ప్రభూ ప్రభూ అని నన్ను పదే  పదే సంబోధించే వారు పరలోక రాజ్యములో ప్రవేశించారు అని ప్రభువు చెబుతున్నారు. మరి ఎవరు  పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నారు. ఏమిటి పరలోక మందున్న తండ్రి చిత్తము? దీని కోసము ఎవరు ఎవరు ఏమి చేశారు? ఒక సారి పవిత్ర గ్రంధం పరిశీలించినట్లయితే కుమారుని ఔన్నత్యం ఆయన ఈ తండ్రి చిత్తము నెరవేర్చిన విధానం ద్వారానే  తెలుసుకుంటాము. అంతేకాక అనేక మంది ప్రవక్తలు, గొప్ప భక్తులు వారి జీవితాలను, పూర్తిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి  అంకితం చేశారు. ఈ విషయంలో కుమారుడు అయిన యేసు ప్రభువు ప్రతి మానవునికి ఆదర్శం అవుతారు. 

క్రైస్తవులు ఎక్కువగా ప్రార్ధించే ప్రార్ధన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్దన.  ఈ ప్రార్ధనలో , "మీ  చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక" అని ప్రార్ధిస్తున్నాము. మరల యేసు ప్రభువు తాను గెత్సమేను తోటలో ఉన్నప్పుడు "తండ్రి నేను పానము చేసిననే తప్ప , నా నుండి తొలగిపోవ సాధ్యము కాని యెడల మీ చిత్తమునే నెరవేరనిమ్ము అని ప్రభువు చెబుతున్నారు. అంతకు ముందుకూడా ప్రభువు అంటున్నారు "ఈ పాత్రను నా నుండి తొలగించు కానీ నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరనిమ్ము" అని అంటున్నారు.  యేసు ప్రభువుకు తాను ఈ దైవ చిత్తము నెరవేర్చడం అంటే, తాను అనేక కష్టలు పొంది మరణశిక్ష పొందడం అని తెలిసి కూడా, మీ చిత్తమె నెరవేరనిమ్ము అని చెబుతున్నాడు. యేసు ప్రభువుకు తన తండ్రి చిత్తము నెరవేర్చడమును తన ఆహరంగా మార్చుకున్నారు. అందుకే ఆయన అంత కష్టమైన పనిని కూడా చేస్తున్నారు. 

 యేసు ప్రభువు  తండ్రి చిత్తాన్ని ఎవరు పాటిస్తారో , వారు ఎలా దేవునికి కుటుంబంలో వారు అవుతారో చెబుతారు. అది తెలియజేయడానికి, పరలోక మందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చు వాడే , నా సోదరి , సోదరుడు నా తల్లి అని ప్రభువు చెబుతున్నారు. ఈ పసి బాలురలో ఏ ఒకడైన నాశనమగుట మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు అని ప్రభువు చెబుతున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చువాడే పరలోకమున ప్రవేశించును అని ప్రభువు చెబుతున్నాడు. దైవ చిత్తము మన జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఇది మనలను దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను సాధిస్తుంది. యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయుట లేదు. మరియమాత తాను దేవుని దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరగాలి అని తన జీవితాన్ని పూర్తిగా దైవ చిత్తానికి అర్పిస్తుంది. యోసేపు, తండ్రి ప్రణాళికా జరుగుటకు తన జీవితాన్ని అర్పిస్తున్నారు. మన జీవితాలలో దేవుని ప్రణాళికా తెలుసుకొని అది జరుగుటకు మన వంతు బాధ్యత మనం ఎప్పుడు చెయాలి. అప్పుడు మనం దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాము. 

నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతిపునాదిపై తన యిల్లు కట్టుకొనిన బుద్దిమంతుని పొలియున్నాడు అని ప్రభువు చెబుతున్నాడు. యేసు ప్రభువుని మాటలు ఆలకించుట అంటే ఒకడు తన జీవితాన్ని, పరలోకరాజ్యంలో స్థానాన్ని పదిలపరుచుకున్నట్లే. పరలోక రాజ్యం అంటే సకల సౌక్యాల కంటే, సకల సంతోషాల కంటే గొప్పది. అది  ఎప్పుడు ఆ ప్రభువుతో కలసి ఉండటము. అది కేవలం ప్రభువుని మాటలను ఆలకించి దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించిన వారికి మాత్రమే ఉంటుంది. ఒక వేళ యేసు ప్రభువు మాటలను పట్టించుకోకుండా, తండ్రి చిత్తాన్ని చేయకుండా ఉన్నట్లయితే వారు తమ ఇంటిని ఇసుక మీద కట్టుకున్న వారి వలె ఉంటారు  అని  ప్రభువు చెబుతున్నారు. ఇసుక మీద కట్టిన ఇల్లు చిన్న కుదుపులను కూడా తట్టుకోలేదు అటువంటిది పెద్ద పెద్ద తుఫానులను ఎలా తట్టుకుంటుంది. యేసు ప్రభువు మాటలను అనుసరించినట్లయితే, వారు యేసు అనే పునాది మీద తమ జీవితాన్ని కట్టుకున్నట్లు, వారు ఎటువంటి కుదుపులకు తొనకరు. మన పునాది క్రీస్తు అని మనం ఎప్పుడు గుర్తించుకొని జీవించాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మీ తండ్రి చిత్తము గురించి, దాని ప్రాముఖ్యతను గురించి చెబుతున్నారు. మీ మాటలను వినమని తండ్రి చెబుతున్నారు. మీరు తండ్రి చిత్తము నెరవేర్చడానికి మీ ప్రాణమును కూడా త్యాగం చేశారు. ప్రభువా , మీరు తండ్రి చిత్తము చేయుట ఎంత కష్టమైన, అది చేయనని తండ్రికి చెప్పలేదు, వీలైతే దీనిని నా నుండి తొలగించండి అని అడుగుతున్నారు. అప్పటికి నా ఇష్టం కాదు మీ ఇష్టమునే నెరవేరనిమ్ము అని చెబుతున్నారు. ప్రభువా నేను నా జీవితంలో సౌక్యాలు పొందాలని,  చిన్న చిన్న ఆనందాల కోసం కూడా తండ్రి చిత్తాన్ని పాటించకుండా ఉన్నాను. అటువంటి పరిస్థితులలో నన్ను క్షమించండి. నేను ఎట్టి పరిస్థితిలో కూడా మీ వలె  ఎల్లప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఎటువంటి కష్టమునైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా నన్ను చేయమని, నా జీవితానికి మిమ్ములను పునాదిగా చేసుకునే భాగ్యం నాకు దయచేయండి. ఎల్లప్పుడు తండ్రి చిత్తాన్ని పాటిస్తూ, మీతో పాటు కలిసి జీవించుటకు అర్హతను దయచేయండి. ఆమెన్. 

5.12.23

మత్తయి 15:29-37

మత్తయి 15:29-37

యేసు అక్కడ నుండి గలిలీయ సముద్ర తీరమునకు వచ్చి, కొండపైకి  ఎక్కి కూర్చుండెను. అపుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగగును అనేకులను తీసికొనివచ్చి, ఆయన పాదసన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థ పరచెను. అపుడు మూగవారు మాటాడుటయు, వికలాంగులు అంగపుష్టి  పొందుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి, విస్మయమొంది, యిస్రాయేలు దేవుని స్తుతించిరి. అనంతరం యేసు తన శిష్యులను పిలిచి, "ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. అపుడు శిష్యులు, "ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచటనుండి. కొనిరాగలము?" అని పలికిరి. అంతట యేసు "మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి?" అని వారిని అడిగెను. "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి" అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ ఏడు రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి, త్రుంచి, తన శిష్యులకు ఈయగా వారు ఆ జనసమూహమునకు పంచి పెట్టిరి. వారు అందరు భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను ఏడు గంపల నిండ ఎత్తిరి. 

ధ్యానం: యేసు ప్రభువు గలిలీయా ప్రాంతానికి వస్తున్నాడు. ఆయన అంతకు ముందు కననీయ స్త్రీ విశ్వాసము గురించి చెప్పి ఆమె కుమార్తెను కాపాడాడు. అది చూసిన ప్రజలు, యేసు ప్రభువు అద్భుతాల గురించి తెలిసిన ప్రజలు ఆయనను వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు అక్కడ నుండి గలిలీయా ప్రాంతానికి వచ్చి, అక్కడ  కొండను ఎక్కి కూర్చొని ఉన్నారు. ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన మాటలను విన్నవారు అందరు ఆయనను వెంబడిస్తున్నారు. అద్భుతాలు చూసిన వారు అనేక మందిని గ్రుడ్డివారిని , కుంటివారిని, మూగవారిని, వికలాంగులను తీసుకొని వస్తున్నారు. ఎందుకు వారందరిని తీసుకొని వస్తున్నారు? వీరు అందరిని తీసుకొనిరావడానికి గల కారణం ఏమిటి అంటే వారు అందరు స్వస్థత పొందాలని, యేసు ప్రభువుని శక్తి తెలుసుకొని వారు ఆయన ద్వారా స్వస్థత పొంది మంచి జీవితం వారు పొందాలని, వారిని తీసుకొని వస్తున్నారు. కేవలం యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొందాలని మాత్రమే కాదు, ఆయన మాటలను వినాలని వారు అందరు వస్తున్నారు. ఆయన చేసే అధ్భుతాలు మాత్రమే కాక ఆయన మాటలు జీవమైన మాటలు, అంతకు ముందు వారు ఇటువంటి జీవమైన మాటలు  వినలేదు. శిష్యులు , యేసు ప్రభువు మాటలు వినిన వారు, అధ్బుతాలు చూసిన వారు,  మిగినలిన వారందరు అక్కడకు రావడానికి ఉపయోగపడ్డారు. మనం కూడా ఆయన అనుచరులుగా కష్టాలు, బాధలలో ఉన్నవారిని, రోగులను, జీవవాక్కు అవసరంలో ఉన్నవారిని ప్రభువు ప్రభువు దగ్గరకు తీసుకొని రావాలి. అది వారు బాగుపడుటకు, పరిపూర్ణులు అవుటకు ఉపయోగపడుతుంది. 

వారి అందరిని ప్రభువు స్వస్థ పరిచారు. యేసు ప్రభువు అక్కడకు వచ్చిన ప్రతి వ్యక్తిని స్వస్థపరుస్తున్నారు. ఇక్కడ స్వస్థ పరచడం అంటే వారిలో ఉన్న లోపాలను తీసువేసి వారిని  పరిపూర్ణమైన వ్యక్తులుగా మారుస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి, ఆయన అనుగ్రహం పొంది వెళుతున్నారు అంటే, అతను పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నారు అని మనకు అర్ధం అవుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలను చూస్తున్న, యిస్రాయేలు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నారు. ఇది కేవలం అప్పటి ప్రజలు మాత్రమే కాదు, యేసు ప్రభువును నమ్మిన వ్యక్తులు జీవించే జీవితవిధానం కూడా, ఇతరులను  దేవున్ని స్తుతించేలా చేస్తుంది. అపోస్తులుల కార్యాలలో ఇది మనం చూస్తాము. అంతే కాదు ఇది  క్రీస్తు ప్రభువు అనుచరుల జీవిత విధానం, వీరి ప్రార్ధన ద్వారా ఇతరులు పొందే స్వస్థత కూడా మిగిలినవారు  దేవున్ని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. అది చేయవలసిన బాధ్యత ప్రభువు అనుచరులుగా మన మీద ఉన్నది. 

"ఈ జనులు  మూడు దినములనుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమియులేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసి సోలసి పడిపోవుదురేమో! వీరిని పస్తుగా పంపి వేయుట నాకు యిష్టము లేదు" అనెను. యేసు ప్రభువు మన ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాదు, ఆయన మానవుల  భౌతిక అవసరాలను గురించి  కూడా ఎంతగానో శ్రద్ద కలిగి ఉంటారు. యేసు ప్రభువు అంతమందిని స్వస్థ పరచడం ఇది మనకు తెలియజేస్తుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు అందరు మూడు రోజుల నుండి ఉన్నారు. వారు ఏమి తినలేదు. ఒకవేళ వారు అక్కడ నుండి వెళితే, మార్గ మధ్యలో శక్తిలేక పడి పోతారు ఏమో అని ప్రభువే వారికి భోజన వసతిని కలిపిస్తున్నారు. వారిని అలా పంపించి వేయడం ప్రభువుకు ఇష్టం లేదు అంటే మనం లేమితో ఉండాలి అని ప్రభువు కోరుకోవడం లేదు. ప్రభువునకు మనం అంటే చాలా ఇష్టం అందుకే మానవునికి సంభందించిన ప్రతి చిన్న విషయమును కూడా ప్రభువు అంత శ్రద్ద తీసుకుంటున్నారు. మన తల్లి, తండ్రి వలె ప్రభువు మనలను చూస్తున్నారు. 

అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి ఐదు రొట్టెలను చేపలను తీసుకొని దేవునికి అర్పించి వాటిని అందరికీ పంచుతున్నారు. ఇక్కడ మనం చూసే ఈ అధ్భుతం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. మన దగ్గర ఉన్నది అందరం పంచుకుంటే, దేవుని దీవెన అక్కడ ఉంటుంది. అక్కడ ఎవరికి కోదువ ఉండదు.మరియు ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారు. యేసు ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యమును, మొదటి క్రైస్తవ సంఘము అవలంభించినది. వారి వద్ద ఉన్నదానిని వారు తీసుకొన వచ్చి, పంచుకొని బ్రతికారు, అందరికీ సమృద్దిగా లభించినది. ఎవరికి తక్కువ కాలేదు. ఇది మనం ప్రభువు వద్ద నుండి నేర్చుకోవాలి. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ఓ ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు. అనేక మందిని వారికి ఉన్న వైకల్యం నుండి బయటకు తీసుకువచ్చి వారిని పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తున్నారు. వారిలో ఏ లోపం లేకుండా వారిని అందమైన దేవుని సృష్టిగా చేస్తున్నారు. మీ ఓర్పుకు, అనేక రకాలైన లోపాలతో బాధ పడేవారిని, పరిపూర్ణ వ్యక్తులుగా చేసిన మీ మంచి హృదయానికి కృతజ్ఞలు తెలుపుతున్నాను ప్రభువా. ప్రభువా! నాలో  కూడా అనేక లోపాలు ఉన్నవి, అవి మిమ్ములను చూచుటకు, మీ మాటలను వినిపాటించుటకు ఆటంకముగా ఉన్నవి, నాలో ఉన్న ఆ లోపాలను తీసివేయండి. నన్ను కూడా పరిపూర్ణమైన  వ్యక్తిగా మార్చుము. అలానే నేను కూడా మీ వద్దకు ఇతరులను తీసుకువచ్చేలా , ముందు నన్ను మీ నిజమైన అనుచరుడను చేయండి.  ప్రభువా! మీకు ప్రజలు పస్తులు ఉండి మీ వద్ద నుండి వెళ్ళడం ఇష్టం లేక వారికి కావలసిన అహరం ఇవ్వడానికి మీరు సిద్దపడ్డారు. వారికి కావలసిన అహరం వారికి ఇచ్చారు. ప్రభువా! నా జీవితంలో అనేక విషయాలలో మిమ్ములను నమ్మి మీ మాటలను వినాలని,  మీతో ఎప్పుడు ఉండాలని కోరికతో ఉన్నాను. ఆ ప్రజల ఆకలి తీర్చిన విధంగా నాకు ఏమి అవసరమో మీరే ప్రసాదించండి. ఆమెన్. 


లూకా 10:21-24

 లూకా 10:21-24

ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు  నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి  నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును   తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని  వినజాలకపోయిరి" అని పలికెను.  

ధ్యానం: యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నారు. యేసు  ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల  కారణం ఏమిట అంటే? ఆధ్యాత్మిక విషయాలు  దైవ రాజ్యం  కేవలం తెలివిగలవారికో, జ్ఞానులకో, పండితులకొ  కాకుండా చిన్న పిల్లలకు , సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకు తండ్రికి, ప్రభువు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యూదయా మత నాయకులు కాని, ఈ లోకంలోని ఆధ్యాత్మిక వేత్తలుకాని  దేవుడు వారి సొత్తు అన్నట్లు మాటలాడటం సర్వసాధారణం. కాని యేసు ప్రభువు,  దేవున్ని, దైవ జ్ఞానాన్ని   సాధారణ మనుషులకు తెలియజేస్తున్నారు. అందుకె యేసు ప్రభువు  దైవ జ్ఞానాన్ని అందరికి పంచి దేవునికి ప్రతి వ్యక్తి ముఖ్యమే అని తెలియజేస్తున్నాడు. 

ఈ విషయాల యేసు ప్రభువు పుట్టుకలో కూడా  జరుగుతున్నాయి. యేసు ప్రభువుని జననం మొదటిగా తెలుసుకున్నది గొర్రెల కాపరులు, ఎవరు ఈ గొర్రెల కాపరులు అంటే వీరు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంకు గొర్రెలను మేపుకుంటూ , పొలాలలోనే తిరుగుతూ ఉండే ప్రజలు. సహజంగా ఊరికి చివర పొలాల్లో ఉండేవారు. వీరిని దొంగలుగా భావించి ఎటువంటి శుభకార్యములకు ప్రజలు వీరిని పిలిచేవారు కాదు. ఇటువంటి వారికి రక్షకుని జనన విషయము మొదటిగా తెలియయజేయడం జరిగినది. యేసు ప్రభువు శిష్యులు కూడా ఎవరు పండితులు కాదు. సాధారణం వ్యక్తులు, జాలరులు, సుంకరులు. ఇటువంటి సాధారణ వ్యక్తులను యేసు ప్రభువు తన శిష్యులుగా ఎన్నుకుంటున్నారు. ప్రభువుతో కలిసి జీవించే అవకాశం ఇటువంటి సాధారణ వ్యక్తులకు ఇవ్వడము దైవ జ్ఞానాన్ని పామరులకు ఇవ్వడం ఇవ్వన్నీ కూడా మనకు ఇవ్వబడ్డ గొప్ప వరాలే.  ఎవరు కూడా ఇది కేవలం పండితులు మాత్రమే పొందుతారు అని అనుకొనవసరం లేదు. 

యేసు ప్రభువు తండ్రి గురించి తెలియపరచిన తరువాత మనం ఎవరుకూడా పరిసయ్యుల వలె దైవ జ్ఞానం, లేక దైవ రాజ్యం , ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంటుంది. ఇతరులు దానిని పొందలేరు అనే గర్వం, అజ్ఞానం ఉండకూడదు అని తెలుసుకోవాలి. యేసు ప్రభువుతో కలిసి జీవించే గొప్ప అనుభూతి శిష్యులకు, చిన్న పిల్లకు ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఇవి అన్ని సాధారణ ప్రజలకు తెలియజేయడం తండ్రి సంకల్పం అని  ప్రభువు తెలియ జేస్తున్నాడు. ఇది తండ్రి సంకల్పం అయితే తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్ధమవుతుంది. 

నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈ మాట మరియొక చోట కూడా ప్రభువు చెబుతున్నారు. తండ్రి సమస్తం ఆయన కోసమే చేశాడు, ఆయనకే సమస్తాన్ని  అప్పగించి యున్నాడు. సమస్తము మీద ప్రభువుకే అధికారము కలదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, కుమారుడికి మాత్రమే తండ్రి తెలుసు మరియు తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు. తండ్రి గురించి మనకు అనేక మంది చెప్పారు కాని వాస్తవంగా ఈ లోకంలో ఎవరికి పూర్తిగా తెలియదు. అనేక మంది తండ్రి గురించి చెప్పారు. వారిలో ప్రవక్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కాని ఎవరు కూడా తండ్రిని పూర్తిగా ఎరుకపరుచలేదు. యేసు ప్రభువు మాత్రమే తండ్రిని, ఆయన యొక్క ప్రేమను, కరుణను, తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువు తండ్రిని అందరికీ తెలియజేస్తున్నాడు. లోక మత పెద్దలు వలె కేవలం కొద్ది మందికి మాత్రమే దైవజ్ఞానం అని కొంతమందిని వేరుచేయడం లేదు. యేసు ప్రభువు శిష్యులకు వారు అనుభవిస్తున్న గొప్ప భాగ్యం గురించి తెలియజేస్తున్నాడు. అది ఏమిటి అంటే ప్రవక్తలు, రాజులు అనేక గొప్ప వ్యక్తులు క్రీస్తును చూడాలి అని అనుకున్నారు, కాని శిష్యులకు మాత్రమే ఇది ఇవ్వబడింది.   అదేవిధంగా తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు అందుకే తండ్రి , యేసు ప్రభువును గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. అంతేకాక ఈయన చెప్పినట్లు చేయుడు అని చెబుతున్నాడు. ఆదే  విధంగా  కుమారుని జననం గురించి కూడా తండ్రి తన దేవదూతల ద్వారా తెలియజేస్తున్నాడు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు దైవ జ్ఞానాన్ని సాధారణమైన వ్యక్తులకు తెలియజేయటను మీరు ఎంతగానో ఆనందించారు. మీరు ఈవిషయమై  పవిత్రాత్మ యందు కూడా ఆనందిస్తున్నారు. మాకు దైవ జ్ఞానాన్ని  ఇచ్చి , మా మీద ఉన్న ప్రేమతో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభువా! మీరు తండ్రిని మాకు అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభువా ఎవరికి తెలియని విషయాలు ,గొప్ప వారు అందరు తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు తెలియ పరస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి గురించి మాకు తెలియజేయడం తండ్రి అభీష్టం అని తెలియజేస్తున్నారు,  అందుకు కృతజ్ఞతలు. ప్రభువా ,మీ అనుచరులుగా ఉన్న మేము, ఎప్పుడు కూడా  మీ గురించి మాకే తెలుసు ఇతరులకు తెలియదు, తెలియకూడదు అనే గర్వం మాలో ఉండకుండా మమ్ములను శుద్దిచెయ్యండి. ప్రభువా! అందరికీ దైవ జ్ఞానం ఉండాలనే కోరిక మీ వలె మేము కూడా ఉండేలా చేయండి. ప్రభువా ఎల్లప్పుడు మేము మీతో ఉండే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

2.12.23

మార్కు 13:33-37 ఆగమన కాలపు మొదటి ఆదివారం

 మార్కు 13:33-37 

ఆ సమయము ఎపుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును: ఒకానొకడు దేశాటనము వెళ్లుచు, తన సేవకులను, ఆయాకార్యములందు నియమించి, మెలకువతో ఉండమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సంధ్యాసమయముననో, అర్ధరాత్రముననో, కోడికూయు వేళనో , ప్రాత:కాలముననో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక మేలుకొని ఉండుడు. ఒక వేళ అతడూ అకస్మాత్తుగా వచ్చి మీరు నిదురించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పునే అందరికి చెప్పుచున్నాను. జాగరూకులై ఉండుడు. 

పునీత సిలువ  యోహను గారు, "మరియమాత దైవ వాక్కును మోసుకుంటూ   ప్రయాణిస్తుంది. ఆమెను మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నవా? అని అడుగుతారు?" ఈ ఆగమాన కాలంలో మనలో ఉండవలసిన ఒక ఆలోచన ఇదే. నేను యేసు ప్రభువును నా ఇంటిలోనికి ఆహ్వానిస్తున్ననా ? లేదా? ఒక వేళ నేను ఆహ్వానించినట్లయితే నా జీవితం ఏ విధంగా ఉండాలి అని ఈనాటి సువిశేషం చెబుతుంది. 

ఈనాటి సువిశేషంలో మనకు ముఖ్యమైన మాటలుగా స్పురించే, జాగరుకులై యుండుడు, మేల్కొని యుండుడు, సిద్ధముగా ఉండుడు అనే మూడు మాటలను   ప్రత్యేకంగా ధ్యానించాలి. ఎందుకు జాగరుకులై ఉండాలి? దేనికి మేలుకొని ఉండాలి? ఎవరి కోసం మనం సిద్ధంగా ఉండాలి. జాగరుకులై ఎందుకు ఉండాలి అంటే మన దగ్గరకు వచ్చేది  స్వయంగా దేవుని కుమారుడు. ఆయన కోసం మనం చూడకపోతే ఆయన తన దారిన తాను వెళ్ళిపోతాడు. దైవ సాన్నిధ్యం ఎల్లప్పుడు అలానే ఉంటుంది. యేసు ప్రభువు తన బోధనలో కూడా ఈ విషయం వెల్లడి చేస్తున్నారు. మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు మిమ్ము ఆహ్వానించకపోయినచో మీరు మీ కాలి దూలిని అక్కడనె విదిల్చి వెళ్ళండి అని చెబుతున్నారు. ఆయన నీ దగ్గరకు వస్తారు, నీ తలుపు తట్టుచున్నాడు. ఖచ్ఛితముగా నీవు జాగరూకత కలిగి ఉంటేనే ఆయనను ఆహ్వానించగలవు. 

 ఎవరి కోసం మనం ఎదురుచూస్తున్నాము.  నీవు క్రీస్తు కోసము ఎదురు చూసినటులయితే నీవు ఎటువంటి జీవితం జీవించాలి అని మనం ఆలోచించాలి. నీవు ఎల్లప్పుడు సిద్దముగా ఉండాలి అని ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. ఆయన ఏ ఘడియలో వచ్చునో నీకు తెలియదు కనుక ఎల్లప్పుడు సిద్ధముగానే ఉండాలి.  ఎవరు ఈయన నీవు ఎదురు చూడటానికి ? ఈయన రక్షకుడు, రాజు, ప్రభువు, దేవుడు నీ నిజ స్థితిని తెలియజేసేవాడు. నిన్ను మరల ఈ నిజ స్థితిని కలిగి జీవించేలా చేసేవాడు.  కనుక నీవు ఎదురు చూడాలి. ఆయన అవసరం అవసరం నీకు  ఉంది కనుక ఎదురు చూడాలి. నీవు నిజముగా రక్షణ పొందాలి అని కోరుకున్నట్లయితే నీవు ఎదురు చూడాలి.  నీ జీవితములో ఆయన లేకుంటే  జీవితం పరిపూర్ణం కాదు. ఆయన నీతో ఉన్నట్లయితే నీ జీవితం  పరిపూర్ణత సంతరించుకుంటుంది.   

 ప్రతి సంవత్సరం ఆగమనకాలం వస్తుంది. కాని నిజానికి ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాదారణ ప్రక్రియ కాదు. ప్రతి సారి  దీనికి ఒక గొప్ప అర్ధం వుంది, ప్రతి ఆగమానం మనలను యేసు ప్రభువును ఆహ్వానించడానికి, స్వీకరించడానికి ఇది నాంది పలుకుతుంది. ఎల్లప్పుడు  ఆయనతో ఉండటానికి అది ఉపయోగ పడుతుంది. అది మన జీవితాన్ని ప్రతి నిత్యం మార్చుకుంటూ ఉండటానికి ఉపయోగ పడుతుంది.  

దేవుని రాకడ లేక ఆగమానం  - ఆయన మరల వస్తారు అని మనం ఎదురు చూస్తున్నాము.  ఆయన కోసం మనం ఎదురు చూడటం మాత్రమే కాదు,  ఆయనను ఆహ్వానించాలి. యేసు ప్రభువును నీ జీవితం లోనికి ఆహ్వానించాలి. ఆయన నిన్ను ఆహ్వానించాలి అని అనుకోకూడదు. మన కోసం తన మొత్తాన్ని వదులుకొని మనతో ఉండాలి అని మన దగ్గరకు వస్తున్నారు.  దేవుడు తీసుకొచ్చే సంతోషం: ఆగమనకాలం ఏదో బాధలతోనో లేక ప్రాయశ్చితంతోనో గడిపేది కాదు, ఇది ఆనందించే సమయం ఎందుకంటే మన దగ్గరకు రాబోతున్నది స్వయానా దేవుడే. ఆయన మన దగ్గరకు వస్తున్నాడు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఆనందించాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధముగా ఉండాలి. అది కేవలము ఆయనను ఆహ్వానించడమే కాదు ఆయనతో నడవడం అని మనం గ్రహిస్తాం.  

  తీరు సభ మొదటి నుండి కూడా ఆగమన కాలం జరుపుకోలేదు. ఇది నాలుగవ శతాబ్ధం నుండి మనం జరుపుకుంటున్నాం. చాలా విషయాలు మీరు ఈ పండుగ పూర్వాపరాలు గురించి విని వుంటారు. కాని యూదయ పండుగలలో హనుక్క అనే పండుగ వస్తుంది. అది కిస్లేం అనె నెల 25 వ రోజున వస్తుంది, క్రిస్టమస్ కూడా డిసంబర్ 25 న వస్తుంది. ఏమిటి ఈ హనుక్క పండుగ అంటే అది యెరుషలేము దేవాలమును అంటియొకస్ ఎఫిఫనుస్ ద్వంసం చేసిన తరువాత,  మక్కబియుల గ్రంధంలో  వారు మరల దానిని కట్టి దేవునికి పునఃరంకితం చేసిన రోజునే హనుక్క అనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ఎనిమిది రోజుల ముందు నుండి సిద్ధపడుతూ ప్రతి రోజు ఎనిమిది రోజులు కూడా ఒక్కో క్రొవత్తిని వెలిగించేవారు. ఇక్కడ ఆగమన కాలంలో మనం ప్రతి వారం, వారానికి ఒక క్రొవత్తిని వెలిగించే దానికి మూలం. ఇక్కడ నుండే వస్తుంది. ఇది ఒక రకముగా మనం సిద్ధ పడటం. లేక పునఃరంకితం చేసుకోవడం. మన జీవితం చెడు మార్గమున ఉండి ఉండవచ్చు, లేక మనం పాడుచేసుకొని ఉండవచ్చు అయిన కాని దానిని మరల దేవునికి పునఃరకితం చేయవచ్చు అని అది తెలుపుతుంది హనుక్క అనే పండుగ. ఈ ఆగమానకాలం మరియు క్రిస్మస్ దీన్ని పరిపూర్తి చేస్తుంది. 

ఆగమన కాలం ఆనందించే కాలం, ఇది దేవుడు మన వద్దకు వచ్చే రోజును  తెలుసుకొని దానికి ఆనందంతో ఎదురు చూసేకాలం. ఈ సిద్దపాటు కూడా మనము ఎవరము? మనము ఎవరి వలె ఉండటానికి పిలవబడ్డాము అని తెలుసుకొనుటకు మరియు మరల దేవుని అలయముగా మారిపోవుటకు, మనము ఈ ఆగమన కాలాన్ని ఉపయోగించుకోవాలి, ధ్యానించుకోవాలి. '

 యేసు ప్రభువు ప్రధమ ఆగమమున దిన మానవ రూపం ధరించి తండ్రి ప్రణాళికా నెరవేర్చి  నిత్య రక్షణ ద్వారము మరల  తెరిచారు. ఆయన మరల వచ్చినప్పుడు ఆయన  వాగ్ధానం చేసిన రక్షణ బాహుమనం మనం పొందుతాము అనే ఆశతో , మేలుకువతో ఉత్సాహముతో నిరీక్షించించె మనం ఆయన అపారమైన  ప్రేమను పొందుటకు ఎల్లప్పుడు సిద్దంగా ఉండాలి. 

 క్రీస్తు ప్రభువు తన జనమునకు సిద్ధ పడుచున్న  మనలను ఆనందంతో నింపుతున్నాడు.  అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మనం, మెళుకువ కలిగి ప్రార్ధించుటలోను అతని స్తుతులను పాడుటలోనూ నిమజ్ఞులమై యేసు ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి.  అంటే మనం  దేవుని వాక్కు అవతరంగా  మారిపోగలగాలి.

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...